మల్లిపురం జగదీశ్ కథలకి ఆంగ్లానువాదం ఎందుకు?

అప్పాజోస్యుల-విష్ణుభొట్ల ఫౌండేషన్ వారు 2024 కి గాను అవార్డు ఇచ్చిన వారిలో “విశిష్ట గిరిజన కథా సాహిత్య” పురస్కార గ్రహీత తెలుగు రచయిత మల్లిపురం జగదీశ్ గారు. ఆ సందర్భంగా ఆయన సాహిత్య కృషి గురించిన వ్యాసాలతో ఒక పుస్తకం తీసుకువచ్చారు. అందులో నేను రాసిన వ్యాసం ఇది. అక్కడ రాసిన పెద్దల పక్కన నన్ను చేర్చి రాయమని అడిగినందుకు జగదీశ్ గారికి ధన్యవాదాలు.

*********

 మల్లిపురం జగదీశ్ కథలకి ఆంగ్లానువాదం ఎందుకు?

జగదీశ్ గారి రచనతో నా తొలి పరిచయం బహుశా 2017 ప్రాంతంలో అయి ఉండవచ్చు. నేను కొన్నేళ్ల క్రితం అమెరికా, కెనడా వంటి దేశాలలో స్థానిక మూలవాసి రచయితలు రాసిన సాహిత్యం చదువుతూ తెలుగు లో ఇలాంటి నేపథ్యాల నుండి వచ్చిన వారి రచనలు ఉన్నాయా అని వెదకడం ప్రారంభించినపుడు నాకు ఎవరో చెప్పారు జగదీశ్ గారి గురించి. ఒక కథ పంపారు కూడా. కథ ఏమిటో గుర్తు లేదు కానీ నాకది అంత నచ్చలేదు. పక్కన పెట్టేసి నార్త్-ఈస్ట్ రచయితల పుస్తకాలు ఇంగ్లీష్ లో లభ్యం అవుతున్నవి చదవడం మొదలుపెట్టాను. అయితే ఏ.కె.ప్రభాకర్ గారు జగదీశ్ గారి రెండు కథా సంకలనాలు “శిలకోల”, “గురి” లకి రాసిన ముందుమాటలు తరవాత పుస్తకం.నెట్ లో వ్యాసాలుగా వస్తే చదివాక ఈ రచయితని మరోసారి చదవాలనుకున్నాను.  2021 మధ్యలో “శిలకోల” కథలు కినిగె.కామ్  లో‌ కనిపిస్తే కొన్నా. అక్కడ పట్టుకున్నాయి ఆ కథలు నన్ను. వెంటనే “గురి” సంకలనం కూడా చదివాను. 

జగదీశ్ గారి కథలు మూడు విధాల మార్పులు కలిగించాయి నా జీవితంలో. 

  1. ఈ కథల్లో చూపే జీవితం తెలుగు/ఏ ఇతర భాషలోనూ అప్పటిదాకా నాకు కనబడలేదు ఇన్నేళ్ల చదువరి తనంలో. సవర జాతి వారి జీవితం, సంప్రదాయాలు, ఆధునికత అక్కడ తెచ్చిన మార్పులు, వారికే సొంతమైన వృక్ష సంపద (ఉదాహరణకి సిందవ కథలోని తేగల రకాలు అసలు నేను ఇంకెక్కడా వినలేదు, చదవలేదు) ఇవన్నీ ఇంకో భాష నుండి దిగుమతి చేసుకుని చదివితే విభిన్నంగా అనిపిస్తాయి మనకు. కానీ అవి తెలుగు కథలే! దానితో మనకున్న మంచి కథకులని చదవాలంటే సోషల్ మీడియా సర్కిల్స్, వెబ్జీన్లు, ఆదివారం అనుబంధాలు వీటి మీద మాత్రమే ఆధారపడితే అందరూ తెలియరు అని అర్థమయ్యి ఇక కొన్నాళ్ళు వరసగా తెలుగు కథా రచయితల పుస్తకాలని కొని చదవడం మొదలుపెట్టాను. కథానిలయం వెబ్సైట్ ని కూడా బాగా పరిశోధించడం మొదలుపెట్టాను పాత కథల్లో నాకు తెలియని కొత్త కథకుల కోసం. తెలుగు కథలలో కూడా చాలా వైవిధ్యం ఉంది, మరే భాషతో అయినా తూగగలదు అన్న నమ్మకం కలిగింది.  నా విదేశీ స్నేహితులు కూడా ఇలా చదివి నేను అనువాదం చేసిన కొన్ని కథలు ఆసక్తిగా చదవడంతో నా నమ్మకం నిజమే అనిపించింది కూడా. 
  1. శిలకోల కథలు చదివేనాటికి నాకు కొంచెం అనువాదం చేయడం అనుభవం ఉంది కానీ నాకు ఆ ప్రక్రియ పట్ల అప్పటికి ఆసక్తి తగ్గిపోయి అనువాదం అన్న ఆలోచన మానేసాను. కానీ జగదీశ్ గారి కథలు చదువుతూ ఉండగా ఎప్పుడు వేరే వాళ్ళ కథలు మనం అనువాదం చేసి తెలుగులో చదూకోవడమేనా? ఇలా మెయిన్ స్ట్రీమ్ రచనలకి భిన్నమైన సంస్కృతి, ఆచారాల్ని చూపెట్టే మన కథలు ఎందుకు బయట అంత ప్రముఖంగా కనబడవు? అన్న ప్రశ్న వచ్చింది. “ఈ కథలు ఎవరన్నా ఇంగ్లీష్ అనువాదం చేస్తే బాగుంటుంది” అనుకుంటూ, “టిహిలికి పెళ్లి”  కథకి వచ్చేసరికి “ఇది ఎలా అన్నా నేను అనువాదానికి ప్రయత్నించి చూడాలి” అనిపించే దాకా వచ్చా.  ఆ కథలో సవర జాతి వాళ్ళ పెళ్లి సంప్రదాయాలు, మధ్యలో ఆ కుయి, కొందు భాషల పాటలు కూడా రావడం నాకు నచ్చిన, అనువాదం లో ఈ కథ బాగుంటుంది అనిపించడానికి కారణం అయిన అంశాలు. అక్కడ మొదలయ్యి జగదీశ్ గారివి మరో నాలుగు కథలు (“నా పేరు సొంబరా”, “గత వర్తమానం”, “బాకుడుంబారి”, “సిందవ”) నా ఆంగ్లానువాదంలో ఆంగ్ల వెబ్ పత్రికలలో  వచ్చాయి. నేను ఇతర తెలుగు కథలు కొన్నింటిని కూడా అనువాదం చేయడం కొనసాగించి ఇరవై కథల దాకా అనువాదం చేసాను కూడా. అలా నాకు తెలుగు నుండి ఆంగ్లం లోకి అనువాదం చేయాలన్న ఆలోచన కలగడానికి ప్రేరణ జగదీశ్ గారి కథలే. 
  1. నాకు పాఠకురాలిగా ఇది కథ, ఇదే కథ అన్న గట్టి నియమాలు లేవు. ఏదైనా చదువుతాను కానీ కథనం, శిల్పం నన్ను ఆకట్టుకోకపోతే నేను కేవలం కథావస్తువు బలం చేతనే ఎక్కువ సేపు చదవలేను. ఈయన కథలు ఆ పద్ధతి ని సమూలంగా మార్చేశాయి. నా ఉద్దేశ్యంలో కథ చెప్పే విధానం లో ప్రత్యేకం జగదీశ్ మార్కు అనదగ్గది లేదు. మనం గొప్పగా చెప్పుకునే అనేకమంది దేశీ/విదేశీ రచయితలతో పోలిస్తే సాధారణంగా ఉన్నట్లే. నేను చదివిన దాదాపు ఇరవై కథల్లో ప్రయోగాత్మకంగా చెప్పిన కథలు తక్కువ. బహుశా “గత వర్తమానం” ఒక్కటే ఆ విషయంలో నాకు ప్రత్యేకంగా తోచినది. అయితే, కథనం, శిల్ప సౌందర్యం, ఇలాంటి వాటిలో ప్రత్యేకంగా అనిపించకపోయినా వస్తువులో బలం, కథనం లో నిజాయితీ, “ఇది మా జీవితం” అన్న బలమైన స్టేట్మెంట్ – వీటితో ఆపకుండా చదివించవచ్చు అని నాకు అర్థమైంది.  “నా పేరు సొంబరా” కథ ఒక ఉదాహరణ ఇలాంటి కథకి. ఆ కథ అనువాదం చేసినపుడు ఒక ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ఇచ్చిన ఫీడ్బ్యాక్: “వాక్యాలు మోనోటనస్ గా ఉన్నాయి, అన్ని వాక్యాలు ఒకలాగే మొదలవుతున్నాయి. అందువల్ల బలమైన అంశం అయినా ఆంగ్ల పాఠకులకి బోరు కొట్టవచ్చు” అన్నది సారాంశం. వాక్యాల విషయం నిజమే, అది తెలుగు మూలంలో కూడా ఉంది కానీ ఆ కథ ఎంత బలమైనది అంటే దాని ప్రభావంలో వాక్య నిర్మాణం ఎలా ఉంది? శిల్ప లావణ్యం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు నాకు అసలు రాలేదు.  నేను ఆ కథని తరవాత కొంతమందికి మూలంలోనూ, భాష రాని వారికి నా ఆంగ్లానువాదంలోనూ షేర్ చేసాను. వీరిలో అసలు భారతదేశం తో సంబంధం లేని విదేశీయులు కూడా ఉన్నారు. అందరూ ఆ కథ బలంగా తమని తాకిందన్నవారే.  వస్తుబలం తో నే ఇతరత్రా కథా పరమైన సాంకేతిక అంశాలలో ఏవైనా ఎక్కువతక్కువలు ఉన్నా పాఠకులని మరపించవచ్చు అనడానికి ఈయన కథలు నా దృష్టిలో మంచి ఉదాహరణలే. 

ఈ విధంగా ఒక పాఠకురాలిగా, అనువాదకురాలిగా  నా మీద జగదీశ్ గారి రచనలు బలమైన ముద్ర వేశాయని చెప్పాలి. నేడు వివిధ దేశాలలో మూలవాసి జాతుల వైపు ఆసక్తితో (అపాలజీ తో కూడా!) చూస్తున్నారు అందరూ. వారి నుండి వస్తున్న రచయితలకి పాఠకవర్గం పెరిగింది, పెరుగుతోంది. ఇదే పంథా మన దేశంలోనూ ఆంగ్ల రచనలలో చూస్తున్నాము. మనము కూడా ఆ నేపథ్యం నుండి వచ్చి తమ జీవితాలని సాహిత్యం చూపిస్తున్న రచయితల రాతల్ని మన ఇజాలతో సంబంధం లేకుండా చదవాలి అని నా అభిప్రాయం. ఆకాశానికి ఎత్తక్కర్లేదు. చదివిన ప్రతీదీ నచ్చక్కర్లేదు. కానీ ఆ రచయితల ఉనికిని గుర్తించి, కనీసం ఒకసారి చదవడానికి ప్రయత్నించాలి అని నేను అనుకుంటున్నా. అలాగే ఈ కథలు మరింత మంది అభిరుచి గల పాఠకులని చేరాలంటే ఆంగ్లం, ఇతర భారతీయ భాషల్లోకి కొన్ని కథలైనా రావాలి. ఈ వ్యాస శీర్షిక కి నా సమాధానం ఇదే. 

నిజానికి మరికొన్ని కథలు అనువాదం చేసి పుస్తకంగా తీసుకువస్తే తెలుగు నుంచి ఆంగ్లానికి వెళ్ళాల్సిన ముఖ్యమైన రచయిత ఒకరినైనా నేను బాధ్యత తీసుకుని ఆంగ్ల పాఠకులకి పరిచయం చేసినట్లు ఉంటుందని నేను తరుచుగా అనుకుంటూ ఉంటాను. సమయం, సందర్భం కలిసి వచ్చి, నేను సాహసించి, నాకు సహకారం అందితే అది కూడా భవిష్యత్తులో ఎప్పుడన్నా జరుగుతుందని ఆశిస్తున్నాను. ఆంగ్లం విషయం అటు పెడితే తెలుగు వారే జగదీశ్ గారి రచనలని సరిగ్గా గుర్తించి గౌరవించలేదని నా అనుకోలు. అజోవిభొ వారు నాది అపోహ అని నిరూపించారు. మల్లిపురం జగదీశ్ గారికి అజోవిభొ ఫౌండేషన్ వారి అవార్డు రావడం, ఆ సందర్భంగా ఆయన సాహిత్య కృషిని గురించి ఒక ప్రత్యేక సంచిక తేవాలనుకోవడం చాలా మంచి విషయం. దానిలో నన్ను భాగం చేసినందుకు జగదీశ్ గారికి ధన్యవాదాలు. అవార్డు స్ఫూర్తి తో మళ్ళీ కథారచన వైపు కూడా ఒకసారి దృష్టిసారిస్తారనీ, ఒక రవ్వంత హాస్యం, మరొక రెండు రవ్వలంత తర్వాతేమౌతుంది? అన్న కుతూహలం, ఉన్న కథలని కూడా భవిష్యత్తులో ప్రయత్నిస్తారని ఆశిస్తూ అభినందనలు.  

*********

వి.బి. సౌమ్య 

అట్టావా, కెనడా, నవంబర్ 2023.

Published in: on February 9, 2024 at 1:32 pm  Leave a Comment  

నంబూరి పరిపూర్ణ (1931-2024)

పరిపూర్ణ గారు వెళ్ళిపోయారని వారి అబ్బాయి, ప్రముఖ రచయిత, దాసరి అమరేంద్ర గారి ఫేస్బుక్ పోస్టు చూశాక తెలిసింది. నేను ఆవిడని కలవలేదు కానీ ఆవిడ గురించి తెలుసు -ఆవిడ అబ్బాయి, మనవరాలు నాకు ఫేస్బుక్ మిత్రులు అయినందువల్ల. ఆత్మకథ కూడా అంతకుముందు చదివాను. 2022-23 మధ్య ఆవిడ కథలు రెండింటిని ఆంగ్లంలోకి అనువాదం కూడా చేశాను (Returning Home, Little Srinu Thinks Big). ఇక తెలుగు/ఆంగ్ల వికీపీడియా లలో ఆవిడ గురించిన పేజీలు సృష్టించడంలో కొంత పాత్ర పోషించాను. స్పూర్తివంతమైన వ్యక్తి. తొంభైలని చేరుకున్నాక కూడా స్పష్టమైన మాట/పాట తో ఫేస్బుక్ లో అపర్ణ షేర్ చేసిన విడియోలలో చూసి అద్భుతంలా అనిపించేది. మృణాళిని గారితో యూట్యూబు ఇంటర్వ్యూ చేసే నాటికి కూడా ఏ 85 ఏళ్ళో ఉంటాయి బహుశా. కానీ ఎంతో ఉత్సాహంగా తన అనుభవాలని పంచుకున్నారు. 2018 లో సారంగ పత్రికకి ఛాయ ప్రచురణ సంస్థ అధినేత మోహన్ బాబు గారు కూడా ఒక వివరమైన విడియో ఇంటర్వ్యూ చేశారు. ఇలాంటివి చూస్తే ఆవిడ ఆలోచనలు, వ్యక్తిత్వం గురించి కొంత అవగాహన కలగవచ్చు తెలియని వారికి. తెలిసినవారికి ఆవిడ జీవితాన్ని తల్చుకుని సెలబ్రేట్ చేసుకోవడానికి ఉపకరించవచ్చు. అందుకే ఈ పోస్టు.

ఆవిడ పోయారనగానే నాకు కలిగిన ఒకే స్పందన: వాట్ ఎ లైఫ్! అంతే.

పరిపూర్ణగారూ, మీరు ఇప్పుడు ఎక్కడున్నా – మీకు చాలా థాంక్స్. మిమ్మల్ని కలవలేకపోయాను కానీ మీ గురించిన మాటలు మాట్లాడిన వాళ్ళలో నేనున్నా, మీ కథలని రెండింటిని మొదటిసారి ఆంగ్లంలోకి అనువాదం చేసిన ఘనత నాదే. మర్చిపోకండి మరి 🙂

********

నంబూరి పరిపూర్ణ గారి జీవితం గురించిన వ్యాసాలతో 2022 లో ఒక పుస్తకం వచ్చింది. “ఒక దీపం – వేయి వెలుగులు” దాని పేరు. అందులో నేను కూడా ఒక వ్యాసం రాశాను. నా వ్యాసం ఈ క్రింద పేస్టు చేస్తున్నాను.

నంబూరి పరిపూర్ణ గారు – ఒక అభిమాని మాట

“నంబూరి పరిపూర్ణ గారి జీవిత సాహిత్యాలపై ఒక అభినందన సంచిక తెస్తున్నాం. మీరు కూడా రాస్తే బావుంటుంది “ అని ఎ.కె.ప్రభాకర్ గారు అడిగినపుడు ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. ఆశ్చర్యం నన్నడిగారేమిటని – మామూలుగా ఇలాంటి వాటిలో తెలిసిన వాళ్ళు రాస్తూంటారు కదా?  ఆనందం – నేనూ రాయొచ్చు అని. ఎందుకంటే ఆవిడ ఆత్మకథ చదివి అభిమానిని అయ్యాను నేను. మరి అలా అభిమానించే వ్యక్తి గురించి రాయమని అడిగితే సంతోషమే కదా!

పరిపూర్ణ గారితో నాకు పరిచయం లేదు. ఆవిడ పేరు మొదట విన్నదే 2016/17 ప్రాంతంలో ఆవిడ ఆత్మకథ పుస్తకంగా వచ్చినపుడు. పుస్తకము చదువుతూండగా పేర్లు చూసి తెలిసింది నాకు ఫేస్బుక్ లో పరిచయమున్న సాహితీ మిత్రులు – దాసరి అమరేంద్ర గారు ఆవిడ కొడుకని, తోట అపర్ణ ఆవిడ మనవరాలని. ఈ ఆత్మకథ నన్ను చాలా ఆకట్టుకుంది. నేను చదివిన ఇలాంటి మరొక పుస్తకము కొండపల్లి కోటేశ్వరమ్మ గారి ఆత్మకథ “నిర్జన వారధి” లాగానే చాలా స్ఫూర్తిని కలిగించింది. పుట్టింటి నేపథ్యం, కమ్యూనిస్టు ఉద్యమం లో అనుభవాలు, వృత్తిపరమైన విషయాలు, కొన్ని కుటుంబ కథలు, సాహిత్య కృషి – వెరసి ఎన్నో ఆసక్తికరమైన అనుభవాలు ఉన్నాయందులో. అయితే ఒక తరం ఆలోచనలను ప్రతిబింబిస్తుంది, అంతే, అని కొట్టి పడేయలేని ఆత్మకథ. పరిపూర్ణ గారు కాలానికి అనుగుణంగా, పరిస్థితులకి అనుగుణంగా తనను తాను మలుచుకున్న తీరు, ఎక్కడికక్కడ పరిస్థితిని బట్టి క్రియాశీలకంగా ఏదో ఒకటి చేయడం వంటివి ఏ తరానికైనా నేర్చుకోవాల్సిన గుణాలే అని నేను అనుకుంటాను. అసలు ఈ ఆత్మకథ  తెలుగు లోంచి ఆంగ్లంలోకి అనువాదం అవ్వాలని నేను గతంలో సోషల్ మీడియా చర్చల్లో చాలాసార్లే అన్నాను. ఇప్పటికీ నా అభిప్రాయం అదే.

ఈమధ్యకాలంలో పరిపూర్ణ గారి కథలు నాలుగు కథానిలయం లో కనిపిస్తే చదివాను. వీటిలో నేను ప్రత్యేకంగా ప్రస్తావించానుకుంటున్న కథ –  “తిరిగి ప్రవాసానికి”. 1993 లో రాసినది. అయితే, ఇప్పటి కథ అంటే తేలిగ్గా నమ్మొచ్చు. కథాంశం ఇంకా సమకాలీనం. ఆవిడ అని తెలియకపోయుంటే ఎవరో ఆ తొంభైల కాలం నాటి యువ రచయిత/త్రి రాసి ఉంటారు అనుకుని ఉండేదాన్ని. కానీ అప్పటికే బహుశా ఆవిడ రిటైర్మెంట్ కి దగ్గరలో ఉండి ఉంటారు.  కథని నేను ఇక్కడ విశ్లేషించను.  కానీ, ఈ కథని ఫేస్బుక్ లో పంచుకుని, తరువాత ప్రయివేటుగా ఇద్దరు ముగ్గురితో వివరంగా చర్చించాను కూడా. అంతగా ఆకట్టుకుంది నన్ను. ఆ కథాంశం మీద కథ నేను ఏ భాషలోనైనా చదవడం ఇదే మొదటిసారి కావడం అన్నది ఇలా ఆకట్టుకోవడానికి  ముఖ్య కారణం. ఆ అంశం నేను, నా లాంటి చాలా మంది ప్రవాసుల మనసుని తాకేది కూడా అన్నది మరొక కారణం ఇది నచ్చడానికి. ఏదేమైనా, ఇలాంటి కథ తెలుగులో ముప్పై ఏళ్ల క్రితమే వచ్చేసిందంటే ఆశ్చర్యం. నా దృష్టిలో అదొక్క కథ చాలు పరిపూర్ణ గారు తన చుట్టుపక్కల జీవితాన్ని ఎంత పరిశీలిస్తారో చెప్పడానికి. ఇది ఈ తరం వారు కూడా చదవాల్సిన కథ. ఏదన్నా ఆన్లైన్ పత్రిక వారు పూనుకుని ఒకసారి తిరిగి ప్రచురిస్తే బాగుంటుంది. 

పరిపూర్ణ గారు కుటుంబ నేపథ్యం, చిన్నప్పటి సినిమా జీవితం మొదలుకుని ఇటీవలిదాకా సాగిన సాహితీ జీవితం దాకా ఎన్నో చూసారు. ఆవిడది కొంతవరకూ అప్పటి, ఇప్పటి కాలం నాటి ఎందరో మహిళల లాగా నే ఇల్లూ, పిల్లలూ, ఉద్యోగం, వీలున్నప్పుడు ఒక హాబీ- ఇలా సాగిన జీవితం. అయితే ఆ పరిధిని దాటి కమ్యూనిస్టు నేపథ్యం వల్ల, చేపట్టిన వృత్తి రీత్యా కూడా కొన్ని తనకే ప్రత్యేకం అయిన అనుభవాలూ ఉన్నాయి.. ఆత్మకథ ద్వారా కలిగిన పరోక్ష పరిచయంలో వీటినన్నంటికీ మించి నన్ను ఆకట్టుకున్నది ఆవిడ డైనమిజం. రిటైర్ అయిన కొత్తలో చొరవగా ఆ కొత్తగా ఇల్లు కట్టుకుని వెళ్లిన కాలనీలో మహిళా మండలి స్థాపించి, దాని తరపున నీళ్ల పంపుల నుండి టెలిఫోన్ లైన్ల దాకా అనేక అంశాల మీద కాలనీ మహిళలని మొబిలైజ్ చేసి అనుకున్నవి సాధించడం కార్పొరేట్ కెరీర్లలో ఉన్న వారికి సైతం పాఠం నేర్పుతుంది. అలాగే, 72 ఎల్లా వయసులో డ్రైవింగ్ నేర్చుకుని, టెస్టుకు వెళ్లి,  ఆ టెస్టు పాసవకపోవడం గురించి క్యాజువల్ గా రాయడం చూసి నాకు నోటా మాట రాలేదు. 

మృణాళిని గారు పరిపూర్ణ గారిని చేసిన ఇంటర్వ్యూ ఒకటి యూట్యూబులో చూసాను ఒక ఏడాది ఏడాదిన్నర క్రితం.  అపర్ణ ఫేస్బుక్ లో అప్పుడప్పుడు పరిపూర్ణ గారి పాటల రికార్డింగులు పెడుతూ ఉంటారు – ఇవన్నీ గత రెండేళ్ళలో చూసినవి. 85+ వయసులో కూడా ఆవిడ ఉత్సాహం, తొణకని మాట, స్పష్టమైన వ్యక్తీకరణ  అసలు వినడానికి ఎంత ఉత్తేజకరంగా ఉన్నాయో చెప్పలేను. అరవైలలో ఎనభై లాగ మాట్లాడే వాళ్ళను, మన ఖర్మ కి ఇరవైల్లో అరవై లా మాట్లాడే వాళ్ళనీ చూస్తూనే ఉంటాము  – అలాంటి వారికి ఇదిగో ఈవిడని చూడండి, అని చెప్పాలనిపిస్తుంది నాకు.  

స్ఫూర్తివంతమైన జీవితం గడిపి ఒక రెండు తరాల తరువాతి వారికీ కూడా ఇంకా స్ఫూర్తిని కలిగిస్తున్నందుకు పరిపూర్ణ గారికి కృతఙ్ఞతలు. ఇంత రాసాను కనుకా, మరొక ఆవకాశం వచ్చింది కనుకా, మళ్ళీ అంటున్నాను. తెలుగు రాని తెలుగు వాళ్ళూ, ఆపైన ఇతర భాషల వాళ్ళు కూడా తెలుసుకోవలసిన జీవితం ఆవిడది. కుటుంబసభ్యులు పూనుకుని ఆవిడ కథలు, వ్యాసాలూ, ఆత్మకథ అన్నీ పుస్తకాలుగా వేయించినట్లే ఏదో ఒకటి చేసి కనీసం ఆత్మకథ ని అయినా ఆంగ్లం లో తీసుకువస్తే నాకు తెల్సిన వారికి ప్రచారం చేసి పెడతాను కొని చదవమని. 

  • వి.బి.సౌమ్య 

12 ఫిబ్రవరి, 2022. 

Published in: on January 27, 2024 at 2:00 pm  Leave a Comment  

GPT4 tells a story about Annamacharya

Today, as an Annamacharya Keerthana played in the car while I was driving, I thought about how these things survived for centuries in those days. Ofcourse, I have some idea, thanks to growing up around those areas, and having familial connection to the life and culture of Tirupathi. But, I wondered how generative AI will narrate this. I tried with Mixtral and GPT-4. Mixtral was cutting the last sentence mid-way. So, I tried with GPT-4. Here is the response.

I thought it is a well-narrated (superficial though – don’t worry yet, human writers!) story, with a lot of missing details ofcourse! (For example, I thought there would be a mention of Veturi Prabhakara Sastri along with Rallapalli Ananthakrishna Sarma, with the very limited awareness I have about this).

***

Prompt: Narrate the story of how Annamacharya’s songs have survived for centuries until today. Tell it in a Historical fiction narrative, in under 500 words.

Response:

In the fifteenth century, in the sacred town of Tallapaka, lived Annamacharya, a saint-poet whose devotion to Lord Venkateswara knew no bounds. His heart overflowed with melodies, divine compositions celebrating the celestial lord of Tirumala. These songs, dipped in devotion, were composed daily, tracing the contour of his unconditional love.

Upon sturdy palm leaves, his devoted son, Peda Tirumalacharya, inscribed these sacred hymns, ensuring their words would echo through time. These leaves, bearing the weight of devotion, were carefully secreted away in the deep, dark recesses of the holy Seven Hills, shrouded in mysticism and guarded by the divine.

As the hands of fate wove the tapestry of history, empires rose and crumbled, yet the essence of Annamacharya’s compositions hummed quietly within the nucleus of regional consciousness. They flourished in oral tradition, from the tongues of passing minstrels to the fervent chants of pilgrims ascending the sacred path to the godly abode of Tirumala.

The centuries marched on, until one day in the twentieth century, an insatiable curiosity led Rallapalli Ananta Krishna Sharma on a scholarly quest to unearth a musical treasure long buried. With the benediction of the Tirumala Tirupati Devasthanams (TTD), a zealous search commenced, rummaging through the ancestral chambers of the revered temple where the past slumbered.

Miraculously, there in the dim-lit silence, the palm leaves whispered from their ancient hiding place. More than twelve thousand songs, cocooned in time, found light after centuries of seclusion. A monumental endeavor unfolded – translating, annotating, and breathing life back into the spiritual canticles of Annamaryacharya.

The reemergence of these compositions began weaving new threads into the spiritual tapestry of India. The voice of M.S. Subbulakshmi, a nightingale of modern times, carried ‘Kondalalo Nelakonna’ across the ether, enchanting souls far and wide. Her seraphic tones resurrected Annamacharya’s offerings, bestowing them upon the world.

Years tumbled like sand through an hourglass. The enduring songs of Annamacharya transcended the boundaries of their epoch. They adorned the lips of classical vocalists, resonated within the hallowed halls of temples during auspicious festivities, and infiltrated the airwaves, emerging as an inseparable element of cultural ethos.

A legacy, thus, wound its path through the fabric of time, preserving the voice of a poet whose love for the divine proved boundless. Across the earth, the songs sustained their celestial sojourn, cloaked in the rich reverence of their origin, yet unveiled for every heart to embrace.

The eternal tunes of Annamacharya, once engraved upon leaves, now etched into humanity’s soul, reassured all of the undying spirit of faith and art. Despite the relentless dance of time, they remain, amidst us, a reminder that in devotion, there is a beauty that endures beyond the grasp of ages.

****

I always felt this episode of curating Annamacharya’s writings to the modern pubilc has a strong historical fiction storytelling sort of material. GPT-4 convinced me of it again. Now, I wish a knowledgeable human writer gets inspiration and writes the story!

Published in: on December 20, 2023 at 4:59 pm  Comments (1)  

A story about Narakasura, by Mistral AI

I have been doing some trials with ChatGPT and GPT4 of generating some stories with Indian puranic characters. They have been pretty good, although there are some constraints. Today, I wanted to give non-proprietary models a chance and tried Mistral AI’s 7 billion parameter model from October 2023 (A new one came from the same group a day or two ago, and I did not access that).

“Tell me a story about Narakasura” was my prompt, as we were talking about him a few weeks ago, while reading a Deepavali story book for children. When it started generating the output, I was first surprised at the way it began, but later began laughing at the absurdity of the story. Finally, I could just stare in disbelief when I saw the same sentence getting generated over and over and over nonstop after a while.

Here is the story from Mistral AI’s model, a hallucination based on various unrelated stories from Hindu puranas, and a generous dose of absurdity:

****

Naraka and Prahlada were brothers. Half-brothers. Naraka was the son of Bali. Prahlada was the son of the priest Vashishta. When Bali was defeated by Vishnu, he went to Naraka and said, “You are my son, you must avenge this insult.” Bali gave Naraka a boon, that he would be invincible and immortal. Naraka and Vishnu fought. Naraka was invincible. He was immortal. Vishnu was very angry. He went to Brahma, told Brahma that he was unable to defeat Naraka, and asked Brahma how to defeat Naraka. Brahma told Vishnu, “Naraka loves women. He believes that he’s immortal and invincible because of the women he sleeps with. You should take her form and seduce him.” So Vishnu took the form of Mohini, a beautiful woman. He seduced Naraka, and they lay on the bed together. When Naraka was intoxicated with passion, Vishnu took hold of a mountain, the mountain of Mount Meru, and brought it down upon Naraka. Naraka was crushed to death. Vishnu slew Naraka. But Naraka, crushed by the mountain, was unharmed. He was immortal. Vishnu brought his discus, the Sudarshana Chakra, and cut Naraka into a thousand pieces. But Naraka was still unharmed. He was immortal. Then Vishnu brought his mace, and smashed Naraka into a hundred million pieces. But Naraka was still unharmed. He was immortal. Finally, Vishnu brought his trident, and smashed Naraka into a hundred million pieces. And he was no more. So, Naraka was immortal.

What kind of immortality did he have?

He had the immortality of a woman.

What kind of immortality is that?

Naraka’s immortality was like a woman’s immortality. It is the immortality of the woman who is loved by a man. It is the immortality of the woman who is beautiful.

The woman can be beautiful, and the man who loves her can be beautiful. But when the man loves the woman, the woman becomes more beautiful. The man becomes more beautiful.

The woman is the source of the man’s immortality. The man is the source of the woman’s immortality.

This is the immortality of Naraka. It is the immortality of the man and the woman.

This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman. This is the immortality of the man and the woman.

Published in: on December 11, 2023 at 12:40 am  Leave a Comment  

తెలుగులో కథలు చెబుతున్న కృత్రిమమేధ

ఆర్నెల్ల క్రితం తప్పుల్లేకుండా తెలుగు రాయడం ఇంకా కృత్రిమమేధకి వంటబట్టలేదని రాశాను. అప్పటికి అది నిజమే కాని ఇవ్వాళ జీపీటీ4 (ఇది ఉచితం కాదు. కానీ ఈ పోస్టులో చేసిన పనులకి అయిన ఖర్చు ఒక అమెరికన్ డాలర్ లోపు మాత్రమే) లో ఏవో చిన్నచిన్నవి ప్రయత్నించాక తెలుగు టెక్స్ట్ జనరేషన్ గురించి గత పదిహేనేళ్ళలో ఎప్పుడూ కలగనంత ఆశ కలిగింది. నా ప్రయత్నం, దాని ఫలితం ఇక్కడ కాపీ-పేస్టు చేస్తున్నా. వివరంగా విశ్లేషణ, చర్చ ఇలాంటివి వీలువెంబడి చేస్తా.

System: You are a Telugu short story writer

Message: I want you to tell me a story about a girl who likes Potato chips. Generate the story in Telugu language, and limit it to 300 words. The story should not be left incomplete.

ఈ పైని ఉపోద్ఘాతానికి జీపీటీ4 స్పందన:

ఒక రోజున చిన్న పట్నంలోని మానస అనే అమ్మాయి ఓ చిన్న గిరాకీ పెట్టి, ఆమె ఇష్టమైన ఆలూ చిప్స్ వ్యాపారం చేస్తూ ఉంది. మానస ఆలూ చిప్స్‌ని చాలా వేరియెంట్లలో చేస్తూ, వాటిని రకరకాల రుచులతో ప్యాక్ చేసి అమ్మేది. అమ్మాయి విధానం అంత విశిష్టం కావడంతో, జనం ఆమె చిప్స్‌కు బానిసలయ్యారు.

రోజులు గడిచేకొద్దీ, మానస చిప్స్ అమ్మకాలు బాగా పెరగడంతో పాటు ఆమె ప్యాకెట్లపై ఒక బ్రాండ్ పేరు ముద్రించి, “మానస పుష్పం” అని పెట్టింది. ఆ పేరుతో ఆమె బ్రాండ్ పట్నం మొత్తంలో ప్రసిద్ధి చెందింది.

కానీ ఒక రోజు ఒక పెద్ద సంస్థ నుంచి మానసకు ఒక సందేశం వచ్చింది. ఆ సంస్థ మానస వ్యాపారంలో భాగస్వామ్యం కోరుతోంది. మానస తొలుత ఉత్సాహంతో ఉంది కానీ తన ఆర్థిక సలహాదారుల మాటలు విని సంజాయిషీ చేయడం లేదు.

చివరకు సంస్థ నుంచి మరొక లెటర్ వచ్చింది. ఆ లెటర్ చదివిన మానస నిశ్చలమైపోయింది. సంస్థ ఆమె బ్రాండ్‌ని తమ పేరు మీద రజిస్టర్ చేసిందని, ఆమె మరో పేరుతో వ్యాపారం చేయాలన్నారు.

ఆమెకు భయం గానీ, చింత గానీ వచ్చినా, మానసకు తన ఆలూ చిప్స్ పెట్టుబడి కంటే ఎక్కువగా నమ్మకం ఉంది. అందుకే ఆమె ముందుకి సాగింది. కాస్త భారంగానే అయినా, మానస కొత్త పేరుతో మరొక బ్రాండ్‌ని స్థాపించింది – “స్వర్ణాంజలి చిప్స్”. ఎలాంటి నిరుత్సాహం లేకుండా, మానస తన వ్యాపారంలో ఇంకా అధునాతన విధానాలు అలవరచి, మరింత రుచికరమైన చిప్స్ తయారు చేసింది.

ఆ ప్రయత్నంలో, ఆమె “స్వర్ణాంజలి చిప్స్” పేరుతో కేవలం ఆలూ చిప్స్‌నే కాకుండా, పలు రకాల స్నాక్స్‌ని తయారు చేసి, ఆన్‌లైన్‌లో కూడా అమ్మేలా చేసింది. తన రుచికరమైన చిప్స్‌తో మరోమారు జనాల గుండెలలో తన స్థానం సంపాదించు కుంది.

కాలక్రమేణా, “స్వర్ణాంజలి చిప్స్” పట్నం మొత్తం లోనే కాదు, సమీప పట్నాల్లో కూడా ప్రజల ఇష్ట స్నాక్‌లలో ఒకటిగా మారింది. మానస ధైర్యం, నిబద్ధత మరియు నిజాయితీనే ఆమె విజయానికి ఆధారంగా మారాయి. 

ఆమె జీవితం మనకు స్ఫూర్తినిచ్చే నిజం, ఎవరైనా తెలివితో మరియు ధైర్యంతో పని చేస్తే ఏ రకమైన అడ్డంకులనైనా జయించగలరని.

******

ఫేస్బుక్ మిత్రుల ప్రోద్బలంతో ఈ క్రింది విధంగా అడిగాను.

Write this story in the style of Viswanatha Satyanarayana

“విశ్వనాథ సత్యనారాయణ గారి శైలిలో ఆలూ చిప్స్ ప్రియారాధిక మానసపై కథను విశదపరచి వ్రాస్తే,

మానసిక అపరంజి, మానస! ఆమె సృష్టించు ఆలూ చిప్స్‌లో ఆనందామృత మణులు. మానవ దేహములోని ప్రతి రోమాంచలు లేపునట్టుగా తాను చేసిన చిప్స్ సృష్టి ప్రజలకు సుఖదాయినిగా మారింది, మగువ గదిలోని సౌందర్యము, పక్కలోని పులకించిన పసందు.

ఆమె శ్రమకు, శ్రద్ధకు ముగ్ధమైన పలుకులు అందాయి. నగర పరిధిలోనే కాదు, సుదూర పట్నాల వరకు నామగంధం చాటిన మానస పుష్పం (చిప్స్) పాదధూళిపడుంగాను, ఆమె చిరు కిరణాలు చూసి చంద్రహాసం నవ్వింది.

కాని కాలచక్రం తిప్పగ, ఓ మహా సమ్మొహన సంస్థ ఆమె కృషిని కోర్కెలకు గురిచేసి, ఆమె ఆటవిలు పచ్చలను స్వాధీనం చేసుకుంటూ, చట్టబంధులతో ఆమెను మరు మార్గం నోక్కింది.

మానస తన హృదయ కొలిమిలో దృఢనిశ్చయం గలిగి మరు ప్रయాణమున పయనించినది. వాతావరణం ప్రకంపనల మధ్యనైనా, “స్వర్ణాంజలి చిప్స్” అను నవమల్లికా ప్రసూనంగా విరియించినది. పురాణపురుషుల ధైర్యం, సంఘర్షణలనుగూర్చి చరిత్ర చెప్పగా, మానసపు పయనం సమకాలీనులకు స్పూర్తిగా మారినది. 

ప్రతి అక్షరమూ విశ్వనాథుని కవిత్వపు సుగంధము సూసినట్టు, ఆ మానస స్వర్ణ యాత్ర ప్రతి యావత్ తెలుగు హృదయాన్ని సంతృప్తి పరచింది.”

మొదటి కథ వెరైటీగా ఉంది. కొంచెం అటూఇటూగా ఉంది కానీ అంత ఫ్ల్యూయెన్సీ ఇంతకు ముందరి కృత్రిమ మేధ నమూనాలలో లేదు తెలుగుకి. కనుక కొన్ని ప్రయోజనాలు ఉండవచ్చు, ముఖ్యంగా రాతగాళ్ళకి తోడుగా. రెండోది ఇంగ్లీషులో ఇలాంటివి బాగా చేస్తుంది జీపీటీ. బహుశా తెలుగుకి ఇలాంటి డేటా అది ప్రాసెస్ చేయగల డిజిటల్ ఫార్మాటులో, అదీ కాపీరైటు పరిమితుల్లేకుండా దొరకడం కష్టం అనుకుంటా.

రచయితలకి కృత్రిమమేధ ఏ విధంగా ఉపయోగపడుతుంది? అన్న విషయం చాలా నెలలుగా నా ఆలోచనల్లో ఉంది. రకరకాల తరహా రచనలకి ఇలాంటి మాడల్స్ తో ఏవో ప్రయోగాలు చేస్తూ ఉంటాను. కానీ తెలుగుకి ఇంతమాత్రం ఉండడం ఇదే మొదటిసారి చూడ్డం. మొత్తానికి దొరికిన ఇంటర్నెట్ సమాచారాన్నల్లా భాషాభేదం లేకుండా ఆబగా మింగడం వల్ల ఉండే సైడ్ ఎఫెక్టులు ఇప్పటికి కనబడ్డం మొదలుపెట్టాయి తెలుగు పరంగా.

(ఈ టెక్స్ట్ జనరేషన్ అన్నది పరమావధి కాదు ఇలాంటి కృత్రిమమేధలకి. ఇదొక చిన్న పని. ఎంత డేటా దొరికితే అంత బాగా చేయగల పనులలో ఒకటి. అంతే. మానవాళి వీటివల్ల అంతరించిపోబోతోంది అన్న భయం నాకు లేదు. వేరే పనుల అంతరిస్తుందేమో, దీని మాయలో అవి కనబడవంతే. రెస్ట్ ఇన్ నెక్స్ట్)

Published in: on November 29, 2023 at 11:02 pm  Leave a Comment  

మరోసారి “ఎదుగని బిడ్డ” కథని తల్చుకుంటూ

అక్కిరాజు ఉమాకాంతం 1914 లో రాసిన, త్రిలింగ పత్రికలో ప్రచురితమైన “ఎదుగని బిడ్డ” మొదటిసారి చదివినపుడు 2013లో ఒక బ్లాగు పోస్టు రాశాను. తరవాత కూడా ఆ కథని అలా చాలాసార్లు తల్చుకున్నాను. నేనేదో మొత్తం సాహిత్యాన్ని ఔపోశన పట్టానని కాదు గాని చిన్నప్పట్నుంచి చదవడం అలవాటు ఉంటే బోలెడు రాసి లో ఎంతో కొంత వాసి ఉంటుందిలే అనుకోవచ్చు. ఇందులో ఆ కథ నాకు ప్రత్యేకంగా అనిపిస్తుంది ఇప్పటికీ. అందువల్ల గత రెండేళ్ళలో తెలుగు కథలకి ఆంగ్లానువాదం మొదలుపెట్టాక మళ్ళీ ఈ కథ వైపుకి దృష్టి మళ్ళింది. ఆ కథకి నా అనువాదం, కొంత ఉపోద్ఘాతంతో నిన్న సారంగ వెబ్ పత్రిక ఇంగ్లీషు సెక్షన్ లో వచ్చింది. “కథ” అంటే మన మనసులో ఉన్న ఊహని బట్టి ఈ కథ కథే కాదు అని అనిపించవచ్చు. అందుకే నా కోణం చెప్పడానికి ఆ ఉపోద్ఘాతం రాశాను. ఇష్టం లేకపోతే కిందకి స్క్రోల్ అయ్యి అనువాదం చదవవచ్చు. మూల కథ ఆర్కైవ్.ఆర్గ్ లో ఇక్కడ ఉంది.

దాదాపు ఏడాది క్రితం అనుకుంటా, మొదటిసారి ఆ అనువాదాన్ని ఒక పత్రిక్కి పంపాను. రిజెక్ట్ అయింది. వివరంగా ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. కానీ అది చదివాక ఆ కథని ఆక్సెప్ట్ చేయించడం కష్టమని అర్థమైంది. ఎందుకంటే అదొక రకం నెరేషన్. కథ అంటే మొదలు, తుద, పాత్రలు, సంభాషణలు ఇలాంటివి లేవు. కథ చాలా చిన్నది అయినా అనువాదం చేయడం నకు కొంత కష్టంగానే తోచింది. మరి ఎందుకు అంత తాపత్రేయం? అంటే ఆ కథ నిజంగానే నేను చదివిన కథల (తెలుగు, ఇంగ్లీషు, అనువాదంలో ఇతర భాషలవి) మధ్య ప్రత్యేకంగా నిలిచింది నా అనుభవంలో. వందేళ్ళ నాటి కథ అయినా ఇప్పటికీ కొంత ప్రాసంగికత ఉందని నేను నమ్ముతున్నా. అలాగే, ఇది ఇతర భాషల/సంస్కృతుల వారు కూడా ఎంతో కొంత ఐడెంటిఫై చేసుకునే కథ, తెలుగు కథలలో కొన్ని ఇలాంటి వెరైటి ప్రయోగాలు వందేళ్ళ నాడే జరిగాయని చూపెట్టే కథ. అందుకని అలా దాన్ని అనువాదం చేయాలన్న కోరిక ఒకటి పట్టుకుంది నన్ను.

అక్షరాలా నాలుగు వెబ్ పత్రికలు దీనిని నిరాకరించాయి 🙂 ఒక పత్రిక ఎందుకు నిరాకరించిందో వివరంగా ఫీడ్బ్యాక్ ఇచ్చింది. అయినా పట్టు వదలకుండా ఐదోసారి ఒక రౌండు చిన్న చిన్న మార్పులు చేసి మళ్ళీ ఏదన్నా పత్రిక్కి పంపిద్దాం అనుకుంటూ ఉండగా సారంగ పత్రిక ఎడిటర్ అఫ్సర్ గారితో అయిన ఒక వెబ్ సంభాషణలో ఇది ప్రస్తావనకి వచ్చింది. ఆయన అనువాదం చదివి బాగుంది అనడంతో ఇలా మొత్తానికి అది బయటకి వచ్చింది.

ఉమాకాంతం గారివి మరో రెండు కథలు నేను ప్రెస్ అకాడమీ ఆర్కైవ్స్ వెబ్సైటు పని చేసినపుడు మధ్యలో ఒకసారి చదివాను. ఈ కథంత ఆకట్టుకోలేదు కానీ 1914 గురించి నాకు మనసులో ఉన్న ఇమేజ్ కి చాలా ఆధునికంగా అనిపించాయి. ఆయన వ్యాసాలు కొన్ని ఆర్కైవ్.ఆర్గ్లో కనిపిస్తే చదివా. ఆయనకి తెలుగు నుండి ఆంగ్లంలోకి అనువాదం గానీ, తెలుగు వాళ్ళు ఆంగ్లంలో రచనలు చేయడం కానీ సుతారమూ ఇష్టం ఉండదేమో అనిపించింది (“దేశభాషా స్థానము” అన్న వారి వ్యాసమొకటి ఆర్కైవ్.ఆర్గ్ లోని ఒక సంకలనం లో ఉంది. ఇక్కడ చదవవచ్చు. దీన్ని బట్టి నాకలా అనిపించింది). అందువల్ల “కాపీరైట్ ఫ్రీ రచన” అన్న లిబర్టీ తీసుకుని వారి అనుమతి లేకుండా ఆంగ్లంలోకి ఎక్కించినందుకు ఏ లోకాన ఉన్నారో వారికి నా క్షమాపణలు. బహుశా ఈ కాలంలో ఉండి ఉంటే ఈ చర్యని అనుమతించి ఉండేవారేమో ఇంగ్లీషు ఎటూ పోకుండా పాతుకుపోయిందన్న విషయం గ్రహించి అని అనుకుంటున్నా.

Published in: on November 16, 2023 at 1:06 pm  Leave a Comment  

కృత్రిమ మేధ, మానవ రచయితలు

గత ఆరు నెలలలో కృత్రిమ మేధ పరిశోధనలు, ముఖ్యంగా మనుషుల భాషల్ని కంప్యూటర్లు అర్థం చేసుకునే పద్ధతులు అధ్యయనం చేసే  సహజభాషాప్రవర్తనం (నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్) రంగంలో జరిగిన పరిశోధనల ఫలితాలు చాట్ జీపీటీ రూపంలో అందరికీ అందుబాటులోకి వచ్చేసాయి. ఒక పక్క ఇవి ఏమి చేయగలవు? వీటి పరిమితులు ఏమిటి? అన్న చర్చలు/పరిశోధనలు విస్తృతంగా జరుగుతున్నా కూడా ఆ పరిశోధనా ప్రపంచానికి అవతల చాలా మందిని ఆశ్చర్యపరచిన విషయం – చాట్ జీపీటీ పైపైన చూస్తే అక్షర/వ్యాకరణ దోషాలు లేకుండా, సరళమైన భాషలో ధారాళంగా వాక్యాలు ఉత్పత్తి చేయడం (ఇప్పటికి ఈ విశేషణాలు వర్తించేది ఆంగ్లానికి మాత్రమే సుమా!).   ఈ నేపథ్యంలో ఇలాంటి పరిణామాల ప్రభావం రచయితల మీద ఎలా ఉంటుంది? అన్న ప్రశ్న “హర్షణీయం” వారితో నేను చేసిన ఒక సంభాషణలో ప్రస్తావనకి  వచ్చింది. ఆ చర్చ ముగిశాక నేను బహుశా ఈ విషయమై కొంచెం వివరంగా రాయాలేమో అనుకుంటూ ఉండగానే అది విని స్పందించిన వారిలో కూడా ఇద్దరు ముగ్గురు సోషల్ మీడియా లో అదే విషయం వ్యాఖ్య రాశారు. అందువల్ల ఈ విషయంపైన నాకు తెల్సినవి, నా ఊహలు రెండూ కలిపి ఈ పోస్ట్ రాస్తున్నాను. 

మొట్టమొదట అసలు రచయితలకి రచనాపరమైన సహకారం అందించే సాఫ్ట్వేర్ ఏమిటి? నాకు ఈమధ్య scrivener వంటి సాఫ్ట్వేర్ పరికరాల గురించి తెలిసింది, అయితే నేను ప్రధానంగా రచనని గురించి ఎంతోకొంత సలహాలు/సూచనలు ఇచ్చే రకం సాఫ్ట్వేర్ గురించి అంటున్నాను. మొదట ఇంగ్లీష్ గురించి మాట్లాడి తెలుగు దగ్గరికి వస్తాను. 

  • అక్షర దోషాలు/వ్యాకరణ దోషాలు ఎట్టి చూపడం ఒక ప్రాథమిక స్థాయి ఫీడ్బాక్. ఇది ఎం.ఎస్.వర్డ్, గూగుల్ డాక్స్ వంటి సాధారణ డాక్యుమెంట్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ లో మొదలుకుని, ఇలాంటివి మాత్రమే ప్రత్యేకంగా చేసే గ్రామర్లీ లాంటి  సాఫ్ట్వేర్ దాకా అన్నింటిలోనూ ఉంది. బహుశా ఇది ఒక కాపీ ఎడిటర్ వంటి పని అనుకోవచ్చు (కొంతవరకు). కొందరు కాపీ ఎడిటర్లు కొంచెం నిజనిర్ధారణ కూడా చేస్తారు, ఇందులో అది ఉండదు. 
  • దీన్ని దాటుకు పోతే: ఒక పదానికి ఇతర ప్రత్యామ్నాయ పదాలని సూచించడం, ఒక వాక్యాన్ని తిరగరాయమనడం, ఇలా రాస్తే బాగుంటుందని కొత్త వాక్యం సూచించడం తరువాతి దశ. కొంతవరకు గ్రామర్లీ, క్విల్బాట్ వంటి ఇతర సాఫ్ట్వేర్ ఇలాంటివి చేయగలవు. చాట్ జీపీటీ కి ముందు తరంలో వచ్చిన జీపీటీ 3 అన్న మరొక కృత్రిమ మేధ ని వాడి కూడా ఇలాంటి సాఫ్ట్వేర్ రూపొందించిన కంపెనీలు ఉన్నాయి.  ఇదంతా మనం కంటెంట్ ఎడిటింగ్ అనుకోవచ్చు ఏమో. 
  • ఇదంతా ఎంతో కొంత రాసాక కదా. ఆ దశకన్నా కాస్త ముందుకి పోతే, డెవెలప్మెంటల్ ఎడిటింగ్ వస్తుంది. అంటే రాయబోయేది ప్లాను చేసుకోవడం, కథ ఐతే సంఘటనలని, నవల ఐతే అధ్యాయాలని ఇలా ఒక పద్ధతిలో రచయిత చేస్తూ ఉంటే ఎక్కడన్నా లంకెలు తెగుతున్నాయా? ఇలాంటివి గమనిస్తూ సూచనలు ఇవ్వడం. 
  • ఇది కూడా దాటుకుపోతే రచనా సహకారం అందివ్వడం. అంటే ఫలాని అంశం మీద అనుకుంటున్నా అంటే ఒక అవుట్లైన్ గీయగలగడం, ఏదన్నా ఆల్రెడీ రాసినది చూసి ఏవన్నా వ్యాకరణ దోషాలని మించిన తప్పులు (అంటే ఒకే పాత్రకి రెండు పేర్లు వాడడం, ఒక చోట చచ్చిపోయాడన్న పాత్ర తరవాత పేజీ లో బతకడం ఇలాంటివి) కనిపెట్టి చెప్పడం. ఇది బహుశా ఒక రకమైన అడ్వాంస్డ్ కంటెంట్ ఎడిటింగ్ అనుకుందాము. 

ఈ రంగంలో చాట్ జీపీటీ మొదటి రెండింటి విషయంలో ప్రస్తుతం ఉన్న సాఫ్ట్వేర్ కంటే మెరుగ్గా ఉంటూ   ఈ చివరి రెంటి విషయంలో సాఫ్ట్వేర్ పాత్ర విషయంలో చాలా ఆశని రేకెత్తించినట్లు అనిపిస్తుంది. గత మూడు నాలుగు నెలల్లో చదివిన కొన్ని వార్తా విశేషాలు నాకు ఈ భావన కలిగించాయి. అవి ఇక్కడ లింక్ చేస్తున్నాను: 

–  Proofreading an entire book with GPT-4 for $6.88: ఒక రచయిత తాను రాసిన కంప్యూటర్ సైన్స్ పుస్తకాన్ని ఒక ఆరొందల రూపాయల లోపు ప్రూఫ్ రీడింగ్ చేసేసుకున్నాడు చాట్ జీపీటీ తరవాత వచ్చిన జీపీటీ4 వాడుకుని (మే నెల, 2023). సరే, ఇక్కడి దాకా ఇది కొత్త యూస్ కేస్ కాదు. ఉన్న యూస్ కేస్ (కాపీ ఎడిటింగ్ వంటిది అనుకుందాం) మునుపు ఉన్న సాఫ్ట్వేర్ కంటే బాగా చేసింది జీపీటీ4. 

ChatGPT, Can You Tell Me a Story? – ఒక ప్రముఖ టెక్నాలజీ పత్రిక విలేఖరి చాట్ జీపీటీ తో సంభాషిస్తూ తన ఆలోచనల ఆధారంగా ఒక కథ రాయించారు. ఈ కథ సాఫ్ట్వేర్ విరచితమే కానీ మనిషి ఆలోచనల ఆధారంతో, మనిషి కథా గమనాన్ని నిర్దేశిస్తూ ఉండగా సాగింది అనమాట. (ఈ లింక్ కి సబ్స్క్రిప్షన్ అవసరం ఉండవచ్చు). ఇది ఇంతకుముందు సాధ్యం అవని కొత్త యూస్ కేస్.  (మే నెల, 2023)

ఇక్కడ నుండి ఇందాక ప్రస్తావించిన అడ్వాంస్డ్ కంటెంట్ ఎడిటింగ్ దాకా పోవడానికి మార్గం సుగమంగానే ఉంది. కథలు/వ్యాసాల స్థాయికి బహుశా త్వరలో చేయగలదు అని నా ఊహ. అయితే నవలల స్థాయిలో చేయగలదా? అంటే నాకు అనుమానమే.  

ఇక్కడి దాకా వచ్చాక ఇంకా తరువాతి దశ అదే కథలు అవీ రాసుకోవడమే, మనం చేయడానికి ఏముంది? అన్న నిరాశ ఒకటి కలగొచ్చు రచయితలకి. ఇది నిజమే. అయితే ఈ మధ్య ఫిబ్రవరి లో వచ్చిన ఒక వార్త చూడండి:

ఒకరోజు ఒక పత్రిక్కి ఒక కథ వచ్చిందంట. ఎడిటర్ ఆ కథ చూసి బానే ఉంది అని పక్కన పెట్టుకున్నారంట. తరువాత మరొకటి, ఇంకొకటి, అదే టైటిల్, అదే ప్లాట్ తో వరుస బెట్టి వచ్చేసరికి చివరికి తేలింది ఏమిటంటే ఇవన్నీ చాట్ జీపీటీ ద్వారా వచ్చిన సూడో-రచయితల ఉత్పత్తులు అని.చివరికి వాళ్ళు కొత్త రచనలు స్వీకరించడం తాత్కాలికంగా నిలిపివేశారు ఈ దెబ్బకి! ఈ ఉదంతంలో నాకు అర్థం ఐంది ఏమిటంటే – కృత్రిమ మేధ ఒక కథ రాసి అది మనిషి రాసినది అన్న  భ్రాంతిని కలిగించడం లో సఫలీకృతమైంది. కానీ పది మంది మనుషులకి అదే ఆలోచన వచ్చి అదే కృత్రిమ మేధని వాడితే బండారం బయటపడ్డానికి ఎంతోసేపు పట్టదని.  

అందువల్ల సృజనాత్మకత కలిగిన రచయితలకి ప్రస్తుతానికి వచ్చిన లోటేమీ లేదు. ఆ పైన చెప్పిన పత్రికా జర్నలిస్టులాగా కృత్రిమమేధ ని మనకి కావాల్సిన విధంగా నిర్దేశిస్తూ కథ రాయొచ్చు. లేదంటే ఇతరత్రా రచనాసహకారం కోసం వాడుకుంటూ ముందుకు పోవచ్చు.  

ఇక ఇదంతా ఆంగ్లానికే పరిమితం అని ముందే చెప్పాను కదా. తెలుగు విషయానికి వస్తే – రెండు మూడు రోజుల క్రితం నేను చిన్న కథ ఒకటి అల్లమని అడిగాను. దాని తాలూకా స్క్రీన్ షాట్లు ఇక్కడ జత చేస్తున్నాను. 

ఇంకా రాయొచ్చు గానీ, సారాంశం ఏమిటంటే ఇంగిలీషు నుండి తెలుగు దాకా రావాలంటే మధ్యలో ఇతరత్రా బోలెడు భాషలకి మెరుగవ్వాలి (మార్కెట్ పరంగా తెలుగు కి విలువ లేదు ఆ రంగంలో). అలాగే ఈ కృత్రిమ మేధలు రూపొందించే పద్ధతి లోనే కొంచెం ఆంగ్లానికి తోడ్పాటు ఉంది (వివరాలు ఈ పోస్టులో జొప్పించలేను. మన అవగాహనకి ఇది చాలు ప్రస్తుతానికి). అందువల్ల ఇప్పుడిప్పుడే తెలుగు వాక్యం తప్పుల్లేకుండా రాయడం కూడా రాదు కృత్రిమ మేధకి. అది మొదట వస్తే ఆ తరవాత మిగితా దశల గురించి ఆలోచించొచ్చు. 

తెలుగు రచయితలకి ఈ తాజా కృత్రిమ మేధలు అసలు ఎందుకూ పనికి రావా? అంటే వస్తాయి. ఆంగ్లం తెలిసిన తెలుగు రచయితలు కథా గమనం గురించిన ఆలోచనలని డెవలప్ చేసుకోడానికి చాట్ జీపీటీ ని వాడి, తద్వారా మన ఆలోచనలు రిఫైన్ చేసుకోవచ్చు. మన కథలకి మనమే బొమ్మలు కూడా సృష్టించుకోవచ్చు మిడ్ జర్నీ, స్టేబుల్ డిఫ్యూషన్ వంటి సాఫ్ట్వేర్ వాడి. ప్రూఫ్ రీడింగ్ వంటి బేసిక్ పనులకి మాత్రం పాపం మనుషుల మేధస్సు మీద ఆధారపడాల్సిందే తెలుగు రచయితలు!!  

Published in: on June 8, 2023 at 12:37 pm  Comments (2)  

సంపాదకులు, రచయితలూ

ఈమధ్య కాలంలో ఒక యువరచయిత ద్వారా ఒక వింత అనుభవం విన్నాను. ఒక వెబ్ పత్రికకి తమ ఆంగ్ల కథని పంపారు. ఆ పత్రిక వారు ఈ కథని స్వీకరిస్తాము అని జవాబు ఇస్తూ, “మేము మైనర్ ఎడిట్స్ చేస్తాము, కథాంశం బాగుంది కానీ  రైటింగ్ క్వాలిటీ బాలేదు, ఇంకోసారి ఇలాంటి నాసిరకం కథలు పంపకు” అన్నారంట. నేను అది విని నోరెళ్ళబెట్టాను. అంత బాలేకపోతే ఎందుకూ వేసుకోవడం? మైనర్ ఎడిట్స్ మాత్రం చేసి వేసుకుని వారి దృష్టిలో “క్వాలిటీ లేని” రచనలని వారి వెబ్సైటులో పెట్టుకుంటే వాళ్ళకి ఏమొస్తుంది? అనిపించింది. ఈ రచయితకి కూడా వారి తీరు నచ్చక “అలాగైతే నా కథ వేసుకోవద్దు లెండి, వెనక్కి తీసుకుంటాను, కానీ కొంచెం మర్యాదగా రాయొచ్చు కదా మీరు ఆ విషయం” అని ఇమెయిల్ చేశారు. దానికి మళ్ళీ వారు “మేము తియ్యటి  వాక్యాలు చెప్పము. ఏదైనా కొట్టినట్లు చెబుతాం. అదే నయం రచయితలకి కూడా” అని స్పందించారు. అక్కడికి అది ముగిసింది. రచయిత తో కొంత స్నేహం వల్ల ఈ ఎపిసోడ్, ఆ ఈమెయిల్స్ ధోరణి అవీ వివరంగా తెలిసింది. ఈ పత్రిక జోలికి నేను పోకూడదు అని నిర్ణయించుకున్నా. 

పై ఉదంతం లో గమనించాల్సిన  ముఖ్యమైన విషయం: రచయితకి సంపాదకులు ఇచ్చిన “గౌరవం”. సంపాదకుల/పబ్లిషర్ల దృష్టిలో “స్థాయి” లేదు అనుకున్న రచయితలని వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు? అన్నది. ఇలాంటివి నేను విన్నదాన్ని, అనుభవించిన దాన్ని బట్టి వాళ్ళ మీద నాకు ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతోంది? అన్న  సబ్జెక్టివ్ ఆలోచనల సమాహారం ఈ పోస్టు. ఈ ఉదంతం తెలిసిన రోజునుంచి ఈ బ్లాగు పోస్ట్ రాయాలన్న దురద ఉంది నాకు. ఇవ్వాళ మళ్ళీ మరొక సంఘటన ప్రేరేపించింది మొత్తానికి రాయడానికి. 

ఇవాళ్టి సంఘటన ఔట్లుక్ పత్రిక వారితో. నంబూరి పరిపూర్ణ గారి కథ “శీను గాడి తత్వ మీమాంస” కి నేను చేసిన అనువాదం మొదట రెండు వారాల క్రితం వారి వెబ్సైటులో వచ్చింది. అది కూడా నాలుగు నెలల క్రితం పంపాను, రెండు నెలల క్రితం ఎడిటింగ్ ఫీడ్బాక్ అన్నారు, తరవాత ఏమీ చెప్పలేదు, ఈమెయిల్ చేసినా జవాబు ఇవ్వలేదు. చూసి చూసి మీకిష్టం లేకపోతే తిరిగి తీసేసుకుని నేనే ఇంకేదో చేస్కుంటా అన్నాక వరసగా మూడు సారీ ఈమెయిల్స్ వచ్చాయి… ఎదో మా మధ్య కమ్యూనికేషన్ గాప్, ఏప్రిల్ 21 కి వస్తుంది అని. రాలేదు. వీళ్ళతో ఎందుకులే, ఏవన్నా వేరే వెబ్ పత్రిక వెదుకుదాం అనుకునేశాక మామూలుగా రెండ్రోజుల తరవాత వెబ్సైట్ చూస్తూ ఉంటె ఏప్రిల్ 19న అది వెబ్సైటులో వచ్చేసింది. వాళ్ళు నాకు చెప్పలేదు. నాకు తెలియలేదు. కానీ ఏప్రిల్ 21 ప్రింటు సంచిక ఒకటి వచ్చింది. ఇవి ప్రింటులో వెయ్యరు మామూలుగా.. అయినా చూద్దాం అని ఆన్లైన్ సంచికలో చూస్తే కనబడలేదు. అక్కడికి వదిలేస్తే ఇవ్వాళ ఒక తెలిసినాయన మెసేజి చేసాడు. ఎక్కడో జార్ఖండ్ లో ఆయన ఏదో బ్యాంకు పనిమీద పోతే అక్కడ లాబీ లో ఈ మే 1 నాటి ఔట్లుక్ ప్రింట్ సంచిక తిరగేస్తూ ఉంటె నీ అనువాదం కనబడింది, కథ చాలా బాగుంది అని. నాకొక రకం ఆశ్చర్యం…ఏంటి నిజమా? అని. కనీసం ఓ ఈమెయిల్ చేయలేకపోయారా! అనుకున్నా. 

నేను మొట్టమొదట “రచయిత” గా నా పేరు చూసుకున్నది నాకు 12-13 సంవత్సరాల వయసులో. “చెకుముకి” పిల్లల పత్రికకి నేను ఏదో  వ్యాసం రాసి పంపాను (మా నాన్న బాగా ప్రోత్సహించేవారు లెండి నన్ను ఆయన బతికి ఉన్నప్పుడు! ఇలాగ ఆ పత్రికలో మూడో నాలుగో వ్యాసాలు వచ్చాయి 1996-97 మధ్య). వాళ్ళు అది వేసుకుని, ఐదో పదో రూపాయల పారితోషికం, పత్రిక కాంప్లిమెంటరీ కాపీ, ఇలా మీ వ్యాసం వచ్చిందన్న ఒక లెటర్ కూడా పంపారు. స్కూల్ లో మా టీచర్ కూడా తరవాత ఆ పత్రిక పట్టుకొచ్చి చూపించారు మా క్లాసులో. “చెకుముకి” చాలా చిన్న పత్రిక. ఇపుడు అసలు ఉందో లేదో! అయినా కూడా వారి కాంట్రిబ్యూటర్ కి వారిచ్చిన గౌరవం అది – కాంట్రిబ్యూటర్ ఒక పన్నెండేళ్ల పిల్లే అయినా! ఇది ఒక 1996/97 ప్రాంతంలో జరిగింది. పత్రిక బహుశా వరంగల్ నుండి వచ్చేది, మేము కర్నూలు లో ఉండేవాళ్ళం. ఇంటర్నెట్ అవీ లేవు.    

నేను ఈ ఔట్లుక్ విషయం చెప్పినాయనకి ఈ చిన్నప్పటి అనుభవం చెప్పాను. “చిన్న పత్రికా పెద్ద పత్రికా, ఆన్లైన్, ఆఫ్లైన్   కాదు..  ఆ చెకుముకి వారికి  ప్రయారిటీస్ ఏమిటో వాళ్లకి తెలుసు. వాళ్ళు అలా నీతో మర్యాదగా ఉన్నారు కనుకే ఇన్నేళ్ళైనా తల్చుకుంటున్నావు” అన్నాడు. నిజమే అనిపించింది. 

నాకు ఇలా ఎడిటర్లతో అనుభవం అంటే ఆ చిన్నప్పటివి వదిలేస్తే తరువాత చాలా రోజులకి నేను ఇంజనీరింగ్ అయిపోతున్నపుడు తెలుగు ఇంటర్నెట్ ప్రపంచాన్ని కనుగొన్నాకే  (తెలుగుపీపుల్.కామ్, పొద్దు.నెట్, ఈమాట, వగైరా). కొన్ని అనుభవాలని పక్కకి పెడితే, చాలామటుకు తెలుగు ప్రింటు/వెబ్జీన్స్ తో మంచి అనుభవాలే ఉన్నాయి చాలా వరకు.  ఇక్కడ మనం అంతా ఖాళీ సమయంలో ఇలాంటి రచనలు చేస్తున్నాం, ఎవరికీ ఆర్థికంగా ఒరిగేది ఏమీ లేదు అన్న ఎరుక ఉంది. మధ్యలో నా వృత్తి/చదువులో బిజీ గా ఉండడం వల్ల చాలా సంవత్సరాలు మానేసి ఈమధ్యనే “సంచిక”, “సారంగ” – ఈ వెబ్ పత్రికలకి గత రెండేళ్ల కాలంలో కొన్ని రాసాను/చేసాను. ఈ పత్రికల సంపాదకుల పట్ల నాకు గౌరవం ఉంది (అలాగని వాళ్ళు ఏది మాట్లాడినా సపోర్టు చేస్తా అని కాదు. వారి సాహిత్య కృషి విషయం లో గౌరవం ఉంది. మిగితావి వేరే విషయాలు). వాళ్ళు కూడా నాతో మర్యాదగానే ప్రవర్తించారు. నాకు చెప్పకుండా నా వ్యాసానికి ఇంకొకరి ఉపోద్ఘాతం చేర్చేసి వాళ్ళని ఫస్ట్ ఆథర్ గా పెట్టడం వంటివి చేయలేదు (ఇది కూడా ఒక ప్రముఖ వెబ్ పత్రికతో నాకు పాతికేళ్ళు కూడా నిండకముందే జరిగిపోయింది! అందుకే నాకు పెద్ద అపోహలు, అంచనాలు లేవు తెలుగులో రాస్తున్నప్పుడు). 

ఆంగ్ల పత్రికల్లో చాలావరకు హుందాగానే ఉంటున్నారు గానీ కొంతమంది సరిగ్గా కమ్యూనికేట్ చెయ్యరు. వేసుకుంటారా? వేసుకోరా? వేసుకుంటే ఎప్పటికి? ఇలాంటివి సరిగా చెప్పడం అంత క్లిష్టమైన విషయం కాదు. సబ్మిషన్ గైడ్ లైన్స్ లో మేము నెలో, ఆర్నెల్లో, సంవత్సరంలోపో స్పందిస్తాము, సలహాలు సూచనలు ఇస్తాము/ఇయ్యము, పారితోషికం ఉంటుంది/ఉండదు, స్వీకరిస్తే ఇంతలోపు వేసుకుంటాం/వేస్కొము, కాపీరైట్స్ విషయం ఏంటి? ఇవి ఒక లిస్టు రాసి పెట్టొచ్చు. ఆటో రెస్పాండర్ గా ఇవన్నీ వస్తాయి చాలా ఆంగ్ల పత్రికలకి. ఇలా చేయని వారితోనే ఇబ్బంది. అంతగా ఎడిటింగ్ సపోర్టు వంటివి చేయకపోయినా ఈ పేరాలో ప్రస్తావించిన తక్కిన విషయాలలో తెలుగు వెబ్జిన్ లు ఆంగ్ల వెబ్జిన్ ల కంటే చాలా రేట్లు నయం. ప్రింటు తో నాకు అనుభవం తక్కువ కనుక వాటిని వదిలేస్తున్నా.   

ఈ పోస్ట్ మొదట్లో చెప్పిన అనుభవానికి తిరిగి వస్తే, ఆ పత్రిక ప్రవర్తన నా దృష్టిలో అమర్యాదకరం. దగ్గర దగ్గర నాకు అసహ్యం కలిగించింది. వేసుకుంటే వేసుకోవాలి, లేకపోతే లేదు. నిజంగా రైటింగ్ క్వాలిటీ అధ్వాన్నం అనుకున్నపుడు కూడా అసలే పత్రికా అలా అసహ్యంగా అనడం నేను వినలేదు/అనుభవించలేదు. వాళ్ళకి వద్దు అనుకుంటే “మాకు వద్దు” అని రాసి ఊరుకుంటారు. అట్లా గాదు, ఎలాగయినా ఇది మన పత్రికలో రావాలి అనుకుంటే వాళ్ళ వాళ్ళ ఓపికని బట్టి వాళ్లకి సంతృప్తికరంగా అనిపించేదాకా ఎడిట్ చేసి గానీ వదలరు. ఆ టైము మాకు లేదు, అంత టైం పెట్టి ఎడిటింగ్ చేయనిదే ఈ కథ బాగుపడదు అనుకుంటే “మీ కథకి మేము ఎడిటింగ్ సపోర్టు ఇవ్వలేము. ఇలాగే వేసుకోలేము. కనుక మీరు తిరగరాసి తిరిగిపంపండి” అని ఏదో  మర్యాదగా చెప్పి వదిలేయాలి. అంతే కానీ “నీ కథ బాలేదు కానీ ఏదో జాలి తలిచి ఈసారికి వేసుకుంటాము, ఇంకెప్పుడూ ఇలాంటివి పంపకు” – ఇదేం స్పందనండి అసహ్యంగా? ఎందుకు అంత లోకువ రచయితలంటే?  వాళ్లలాగే రచయితలూ ఉచితంగానే పనిచేస్తున్నారు కదా ఈ కేస్ లో. రచయితలకి పత్రికలూ ఎంతో పత్రికలకి రచయితలూ అంతేగా? ఖాళీ వెబ్సైట్ పెట్టి నడుపుకోలెం కదా? దానికీ కంటెంట్ కావాలి, ఎవరో రాయాలి. వాళ్ళతో ఇలాగేనా మాట్లాడ్డం? నేనూ ఒక వెబ్సైట్ నిర్వహణలో దాదాపు పదిహేనేళ్ల బట్టి పాలుపంచుకుంటున్నా. ఎప్పుడూ ఇలా అసహ్యంగా ప్రవర్తించినట్లు నాకు అయితే జ్ఞాపకం లేదు. 

ఇక పారితోషికం విషయం: వెబ్ పత్రికలకి పంపుతున్నపుడు నేను “వీళ్ళకి డబ్బులరావు, చదివే వాళ్ళు డబ్బులిచ్చి చదవరు, రాసేవాళ్ళు కూడా ఆసక్తి ఉంటే, టైము ఉంటే ఉచితంగా రాస్తారు. లేకపోతే రాయరు అంతే” అన్న అవగాహన తో రాస్తాను. అదే ఒక పుస్తకంగానో, పుస్తకం లో భాగంగా నో, ప్రింటు పత్రికలోనో వచ్చినపుడు మాత్రం అది చదువరులు కొని చదువుతారు కనుక రచయితకి (అనువాదం విషయంలో బహుశా సగం అనువాదకులకి, సగం రచయితలకి అనుకోవచ్చు ఏమో) కూడా కొంత పారితోషికం లభించాలని నమ్ముతాను. ఇదేదో ఉన్నట్లుండి నన్ను లక్షాధికారిని చేస్తుందని కాదు. అలా చేయడమే సరైన పద్ధతి అని నేను నమ్ముతాను! అనువాదం విషయంలో బహుశా మరి అనువాదకులు/రచయిత మధ్య సగంసగం స్ప్లిట్ చేస్కోవచ్చు, అదొక పద్ధతి. అది వాళ్ళూ వాళ్ళూ చూసుకుంటారు.  ఒకటి రెండు సార్లు “సాక్షి” లో, “రచన” పత్రికలో నేను రాసినవి ప్రింట్ లో వచ్చినపుడు వాళ్ళు నాకు ఏదో పారితోషికం చెక్ పంపారు (రాసే ముందు, వాళ్ళు స్వీకరించినపుడు  కూడా ఆ పేమెంట్ ప్రస్తావన రాలేదు. నేను అడగలేదు. వాళ్లు రచయితలకి పారితోషికం ఇస్తారు కనుక పంపారు). కొన్ని సందర్భాల్లో పైసా ఇవ్వలేదు, నాకు ఈ విషయంలో అంత పట్టింపు లేదు కనుక నేనూ అక్కడికి వదిలేసా. ఇపుడు ఔట్లుక్ వారితో తాజా అనుభవం అంత రుచించలేదు నాకు. పెద్ద పత్రిక, అందమైన బొమ్మేసారు, మంచి ఎడిట్లు సూచించారు. అక్కడిదాకా ఓకే కానీ రచయితలకి పారితోషికం ఇచ్చే స్థాయి మార్కెట్ ఉన్న పత్రికే అది. పారితోషికం ఇవ్వడం అటుంచి, కనీసం ఫలానా ప్రింటు పత్రికలో వస్తుంది అని కాపీ పంపించడం అయినా చేయాలి కనీసం. ఇలా చేస్తారా పెద్ద రచయితలైతే? పెద్ద రచయితల రచన పక్కన నీది వేస్తాము కనుక నోర్మూసుకో అన్నట్లుంది ఇది.  నాలుగు అనువాదాలు వేసుకున్నారు నేను చేసినవి. ఐదోది ఇంక రాదు అని నా ప్రస్తుతపు అనుకోలు.  ఏ పాటి రచయితకైనా ఒక ఆత్మాభిమానం అంటూ ఉంటుంది. ఈ ఉదంతంలో అది దెబ్బతినింది నాకు. ఆ మొదటి ఉదంతంలో తోటి రచయితకి అవమానం జరిగింది కనుక కడుపు మండింది. 

ఇంకా రాయొచ్చు గానీ, రచయిత స్థాయి తమ దృష్టిలో ఏపాటిదైనా కామన్ మర్యాద ఒకటి పాటించవచ్చు ఇలాంటి సంపాదకులు అని చెప్పడానికి ఇదంతా రాసాను. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఉంది – కాపీరైట్స్. దాని గురించి మళ్ళీ రాస్తా… ఆ అనుభవాలు కూడా ఉన్నాయి. 

అన్నట్లు ఇదంతా సాహిత్య పత్రికలూ, ప్రచురణతోనే సుమా. టెక్నీకల్ ప్రచురణలో ఆంగ్ల ఆన్లైన్/ప్రింటు పబ్లిషర్లతో నా అనుభవం చాలా డీసెంట్ గా ఉంది. వృత్తి పరంగా కాకుండా అదనంగా చేసిన రచనల విషయంలో ఆర్థికంగా కూడా సంతృప్తికరంగా ఉంది (దీనితోనే బతికేసే ఉద్దేశం నాకు లేదు కనుక!). పూర్తి స్థాయి రచయితగా బతకడం సాహితీ లోకంలోనే కాదు, టెక్నీకల్ లోకం లో కూడా దాదాపు అసాధ్యం మామూలు మనుషులకి. 

Published in: on May 6, 2023 at 6:20 pm  Leave a Comment  

“టిహిలికి పెళ్లి” – కథ అనువాదం, నా అనుభవం

“టిహిలికి పెళ్లి” – కథ అనువాదం, నా అనుభవం 

మల్లిపురం జగదీశ్ గారి “టిహిలికి పెళ్లి” (“శిలకోల” కథల సంకలనం లో ఉంది ఈ కథ) కి నా ఆంగ్లానువాదం గత వారాంతం లో “కితాబ్” అన్న ఆంగ్ల పత్రికలో వచ్చింది. ఈ అనుభవం గురించి పోస్ట్ ఇది. కొంత సుత్తి ఉంది మధ్యలో ఆ అనువాదం పంపడం, ఎదురుచూపుల గురించి. కొత్తగా ఆంగ్లానువాదాలు మొదలుపెట్టేవాళ్ళు అయితే మట్టుకు అది మిస్సవకండి.

కథని నేను 2021 జులై ప్రాంతం లో మొదటిసారి చదివాను. అప్పటికి నేను ఏదన్నా “అనువాదం” అన్న ఆలోచన చేసి కొంతకాలం (అంటే ఒక ఏడెనిమిది సంవత్సరాలు) అయింది. కొన్ని రోజుల ముందరే Hansda Sowendra Sekhar రాసిన “Adivasi will not dance”  కథలు చదివి దానిలో టైటిల్ కథను తెలుగు అనువాదం చేయడానికి అనుమతి తీసుకున్నా. అయితే, “శిలకోల” చదువుతున్నపుడు ఎప్పుడు వేరే వాళ్ళ కథలు మనం అనువాదం చేసి తెలుగులో చదూకోవడమే నా? ఇలా మామూలు కథాంశం తో వచ్చినా భిన్నమైన సంస్కృతి, ఆచారాల్ని చూపెట్టే మన కథలు ఎందుకు అంత ప్రముఖంగా కనబడవు? అనిపించింది. 

అంతకు ముందు “నిర్జన వారధి” ఆంగ్లానువాదం చేసినా కూడా నేను ఆ అనువాదం అన్న దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. అందునా తెలుగు నుండి ఆంగ్లం అంటే అంతకంటే అసలు నేను చేయగలను అని నమ్మలేదు. అదేదో ఆలా జరిగిపోయింది, ఇంకోసారి జరిగే ప్రసక్తి లేదు అనే అనుకునేదాన్ని. కానీ, ఈ పుస్తకం చదువుతూ ఉండగా “ఈ కథలు ఎవరన్నా ఇంగిలీషు లో అనువాదం చేస్తే బాగుంటుంది” అనుకుంటూ, ఈ కథకి వచ్చేసరికి “ఇది ఎలా అన్నా నేను అనువాదానికి ప్రయత్నించి చూడాలి” అనిపించే దాకా వచ్చా.  కథలో సవర జాతి వాళ్ళ పెళ్లి సంప్రదాయాలు, మధ్యలో ఆ కుయి, కొందు భాషల పాటలు కూడా రావడం నాకు నచ్చిన అంశాలు. అనువాదం లో ఈ కథ బాగుంటుంది అనిపించడానికి కారణం అయినా అంశాలు. 

అనువాదం చేసి దాన్ని ఎక్కడో యాక్సెప్ట్ అయేలా చూసిన కథ: అనువాదం అయ్యాక ఒక ఇద్దరు ముగ్గురు స్నేహితులకి చూపించి కొంత సలహాలు తీసుకుని ఒక పత్రికకి పంపా. దాని పేరు మ్యూజ్ ఇండియా. అప్పటికి 15 సంవత్సరాలుగా నడుస్తోంది, కొంచెం పేరు ఉన్న పత్రికే. విచిత్రంగా వారానికే స్పందన వచ్చింది. నేను ఆగస్టు చివర్లో పంపిస్తే, సెప్టెంబర్ మొదట్లో స్పందించి, మే/జూన్ సంచిక లో వేసుకుంటాం అన్నారు.  వావ్, పంపింది భలే యాక్సెప్ట్ అయింది – అయితే అనువాదం సుమారుగా ఉంది ఏమో, అని ఆ ఉత్సాహం లో నేను ఇంకొన్ని కథలు అనువాదం చేసాను.  మధ్యలో ఒకసారి వాళ్ళు కథకి ఎడిట్స్ చేసాము చూడమంటూ ఈమెయిల్ చేశారు. సరే, నేను ఆ ఎడిట్స్ ఒకసారి పరిశీలించి బానే ఉన్నాయండి, అని పంపేసా కానీ మే లో కథ రాలేదు. అసలు జనవరి సంచిక కూడా అప్పటి దాకా రాలేదు – నేను వారం పది రోజులకి ఒకసారి ఆ వెబ్సైట్ చూస్తూనే ఉన్నా. టెక్నీకల్ ప్రాబ్లమ్ అన్నారు. సరే అనుకున్నా. 

మధ్యలో ఒకసారి ఒక బ్రిటీషు పత్రిక కొత్త అనువాదకులు చేసిన కథలని పంపండి అని ప్రకటించింది. ఆల్రెడీ ఇంకో చోట స్వీకరించిన కథ అయినా సరే అన్నారు. సరే, ఇది ప్రయత్నిద్దాం అనుకుని ఒకసారి ఆ కథని మళ్ళీ చదువుదాం అని కూర్చుంటే… అప్పటికి ఓ ఏడెనిమిది కథలు అనువాదం చేసి, సాహిత్య పత్రికల ఎడిటింగ్ ప్రక్రియల ద్వారా కొంత అవగాహన వచ్చినందువల్ల నా మొదటి అనువాదం పేలవంగా అనిపించింది. చాలాసేపు కూర్చుని నాకు అర్థమైనంతలో ఎడిటింగ్ చేసుకుని, ఈ బ్రిటీష్ పత్రిక్కి పంపాను. వాళ్ళు స్వీకరించలేదు. సరే, వందల కొద్దీ వస్తాయి, ఇందులోంచి ఏ పదో ఏరుతారు అనుకుని ఎలాగో ఎడిట్ చేశా కదా అని మళ్ళీ మ్యూస్ ఇండియా వారికి ఈమెయిల్ చేసాను – మీరెలాగూ ఇంకా కథ వెయ్యలేదు కదా. మీరు దగ్గర ఉన్న అనువాదం కంటే కొంచెం నేనే మళ్ళీ ఎడిటింగ్ చేసుకున్నాక ఇది కొంచెం మెరుగ్గా ఉంది… దాని బదులు ఇది పరిశీలించండి అని. వాళ్ళు లేదు, రేపో మాపో వచ్చేస్తుంది పత్రిక, మేము ఆల్రెడీ అన్నీ పంపేసాము పబ్లిషింగ్ కి అన్నారు. సరే, భవిష్యత్తులో పుస్తకం వస్తే అపుడు చూద్దాం లే అని ఊరుకున్నా.

ఇది బహుశా ఏ అక్టోబర్ లోనూ అయి ఉంటుంది.  డిసెంబర్ చివరలో ఆ సదరు మే/జూన్ 2022 సంచిక చివరికి వచ్చింది. కానీ అందులో ఇది లేదు. అదేమిటి? అని అడిగితె – అరెరే, గల్తీ సే మిస్టేక్ హోగయా… అన్నారు. అలా అని ఏదో వచ్చే నెల వస్తుందనో, ఇంకేదో అనో కూడా కమిట్ కాలేదు. ఈ పాటికి ఒక డజను అనువాదాలు వివిధ వెబ్జీన్లలో వచ్చిన అనుభవం ఉంది కనుక ప్రపంచం లో వేరే చోట్ల సబ్మిట్ చేస్కోవచ్చు అన్న అవగాహన వచ్చింది నాకు.  దానితో మీరు ఆ కథ ఇంక వేస్కోవద్దు. నేను ఎలాగో కొంచెం రీవర్క్ చేసి అనువాదాన్ని మెరుగు పరుచుకున్నా అని ఫీల్ అవుతున్నా – కనుక నా వద్ద ఉన్న దాన్ని ఇంకోచోట కి పంపుకుంటా అని ఇంకా విత్ డ్రా చేసుకున్నా (1.5 సంవత్సరాల తరువాత). షరా మామూలుగా “సారీ ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ మాకు పంపుతారని ఆశిస్తున్నాము” అన్నారు. నేనైతే పంపను అని అనుకుని, కితాబ్ వారికి పంపాను. గత ఏడాది లో వీళ్ళు రెండు అనువాదాలు వేసుకున్నారు నేను చేసినవి. అందువల్ల వీళ్ళ పద్ధతుల గురించి అవగాహన ఉంది. వేస్కోకపోతే చెప్పేస్తారు, వేస్కుంటాము అన్నారు అంటే ఒక రెండు నెలల్లో వేసుకుంటారు అన్న నమ్మకం ఉంది. అలా, లాస్టుకి కితాబ్  లో వచ్చింది. సుఖాంతం.  అలాగే ఒక పాఠం కూడా నేర్చుకున్నాను. ఆ మ్యూజ్ ఇండియా కి రెండు కారణాలకి నేను కృతజ్ఞురాలిని. 

  • వాళ్ళు అలా వారంలో స్పందించకపోతే నేను అనువాదాలు కొనసాగించపోదును. 
  • ఆ మొదటి వర్షన్ అనువాదం వెయ్యకుండా నాన్చి నాన్చి  నాకు మేలు చేశారు. ఎడిట్ చేసుకున్న వర్షన్ చాలా మెరుగ్గా ఉందని నా అభిప్రాయం. చదివే వాళ్లకి రెండో వర్షన్ నయం. ఇంకా కూడా ఎడిట్ చేయొచ్చు, ప్రొఫెషనల్ ఎడిటర్ అయితే. మరి నేను కాదు కదా. 

కానీ, ఆ పత్రిక మీద చదువరిగా ఉన్న సదభిప్రాయం తుడిచిపెట్టుకోపోయి నిరాశగా మారింది. ఎందుకు రచయితలో, అనువాదకులో అంటే అంత చులకన? అందరూ వాళ్ళ ఖాళీ సమయం వెచ్చించి ఉచితంగా చేస్తున్న మనుషులే కదా? వాళ్ళకి మాత్రం తెలియకనా? వాళ్ళూ అలాంటి వారే కదా – ఆ మాత్రం మర్యాదకి కూడా ఇవ్వడానికి అర్హులం కామా? అనిపించింది. 

ఇక్కడ పాయింటు 1.5 సంవత్సారాల నిరీక్షణ కాదు. అంతర్జాతీయ పత్రికలు కొన్ని గైడ్లైన్స్ లోనే రాస్తాయి మినిమమ్ ఏడాది పడుతుంది అని. మనం అంత వెయిట్ చేయలేము అనుకుంటే పంపము అంతే. వారం లో మే లో వేసుకుంటాం అని చెప్పాక ఇంకా నేను దానిని ఇంకో చోటికి పంపలేదు. మే సంచిక డిసెంబర్ లో వచ్చింది. అందులో మళ్ళీ నా అనువాదం లేదు. ప్రో-ఆక్టివ్ గా మాకు ఎదో ఇబ్బంది, అందుకే సంచిక రాలేదు అని వాళ్ళు చెప్పలేదు. జనాంతికంగా గ్రూప్ ఈమెయిల్ చేస్తే పోయే విషయం అది. ప్రతి సారీ నేను అడగాలి, వాళ్ళు చెప్పాలి. మళ్ళీ మే సంచిక డిసెంబర్ లో వచ్చింది, మరి నాది లేదేం? అంటే ఒక సరైన జవాబు లేదు. సరే, మధ్యలో వెబ్జీన్లతో మంచి అనుభవాలు కూడా ఉన్నాయి కనుక, నాకూ కొంత అనుభవం వచ్చింది కనుక విత్ డ్రా చేసుకుని ఇంకో పత్రిక్కి పంపుకున్న. అదీ కథ. 

ఇంతకీ అప్పుడప్పుడు ఇట్లా ఒక కథ అనువాదం గురించి పోస్టులు రాస్తూ ఉంటాను – అసలు బోడి ఒక కథకి ఈ నేపథ్యం, వివరణ, ఇవన్నీ అవసరమా? అనిపించవచ్చు. అనువాదకులు అంటే అదృశ్యంగా అట్లా ఉండాలి అంతే – అసలు అనువాదానికి అనువాదకులకి గుర్తింపు రావాలి అనుకోడం కూడా అదొక ఆధునిక పోకడ – అని కూడా ఒక వాదన ఉంది.  మరేందుకు? అంటే – ప్రతి దానికి ఒక కథ ఉంటుంది. కథకి, నవలకి, ఇంక దేనికో, అన్నింటికీ ఉన్నట్లే అనువాదానికి కూడా ఒక కథ ఉంటుంది. ఎందుకు చేసాము? చేసాక, అది బైటకి వచ్చేలోపు ఏమైంది? – అనువాదకులకి కూడా మనోభావాలు ఉంటాయి, అవి వ్యక్తం చేసుకోడానికి వాళ్ళ బ్లాగులో అన్నా వాళ్ళు రాసుకుంటారు అని చెప్పడానికి అనమాట ఇలాంటి పోస్టులు. 

Published in: on February 6, 2023 at 1:37 pm  Leave a Comment  
Tags:

సరే, మర్చిపోముగాని మరేం చేయాలో?

ఇది గత పోస్టుకి కొనసాగింపు.

సాధారణంగా మనకి పెద్దవాళ్ళకి ప్రతిఏటా తద్దినాలు పెట్టడం వాళ్ళ పెద్ద కొడుకో, ఆ రోల్ కి దగ్గరగా ఉండే ఇంకోరో చేస్తూ ఉంటారు. మా చిన్నప్పుడు మా తాత (నాన్నకి నాన్న) తద్దినానికి వీలైనంత వరకు ఆయన పిల్లలందరూ వాళ్ళ కుటుంబాలతో సహా కలిసేవారు. ఇది ఇలా మా నాన్న పోయాక నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు కూడా కొనసాగడం నాకు గుర్తు ఉంది. ఇందులో వంట చేయడం కాకుండా ఆడవాళ్ళకి వేరే ఏమన్నా రోల్ ఉందో లేదో నాకు తెలియదు. అందునా మనకి మరి పెళ్ళి చేసుకుంటే కూతురి గోత్రం మారిపోతుంది కనుక అసలు ఆ ఆఫిషియల్ ప్రాసెస్ లో‌ ఏం పాత్ర లేదనుకుంటాను (పెళ్ళి కానివాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు. ఇపుడు టక్కుమని అలాంటి సందర్భాలు గుర్తు రావడం లేదు నా ఎరుకలోని కుటుంబాల మధ్య). అట్లాంటప్పుడు ఆయొక్క దినాలలో ఆయొక్క మహిళామణులు చేయదగ్గది ఏమిటి? అన్న ప్రశ్న వచ్చింది. ఇదేదో ఇపుడు హిందూ మత ద్వేషి ఈమె అని మొదలెట్టకండి. మీకు అలా అనిపిస్తే మీ ఖర్మ. నేనూ ఏ టైపు మనిషినైనా మాకూ ఆత్మలుంటై, మాకూ ఆత్మకథలుంటై.

నా చిన్నప్పుడు సంక్రాంతి తరువాత కనుమ రోజు మా అమ్మ ఒకటి చేస్తూండేది. అన్నం ముద్దలు పసుపు, కుంకుమ కలిపి చేసి, మిద్దెపైన కాకులకి పెట్టి ఒక శ్లోకం చదివేది. పిల్లలం అక్కడే కూడా ఉండి రిపీట్ చేసేవాళ్ళం. ఇది సంక్రాంతికి ఒకసారి మా మేనత్త వాళ్ళింట్లో ఉంటే అక్కడ కూడా ఈ పద్ధతి ఆవిడ ఆధ్వర్యంలో చేశాను. 2020లో ఆఖరుసారి చేశాను ఇండియా ట్రిప్ లో. ఇప్పటిదాక నా అంత నేను చేయలేదు. పైగా జనవరిలో ఈ చలిలో ఇక్కడ కాకుల్ని ఎక్కడ వెదుకుతాం కెనడాలో? దీని గురించి ఎపుడన్నా లోకల్ గుడిలో పూజారిని అడగాలి అని చాలాసార్లు అనుకున్నా కానీ నాకు మతపరమైన ఆచారాల పట్ల మరీ అంత ప్యాషన్ లేనందువల్ల పట్టించుకోలేదు. ప్రతిఏడాదీ నాకూ మా ఇంటాయనకీ ఆ సమాయానికి ఆ సంభాషణ అయితే అవుతుంది. కానీ ఆడవాళ్ళు పూర్వికులని తల్చుకునే ఒక ట్రెడిషనల్ రిచ్యువల్ సందర్భం ఇదొక్కటే నాకు తెలిసిన జీవితంలో. అది మా వాళ్ళ పద్ధతి – అంతా చేస్తారో లేదో‌ నాకు తెలియదు. ఇలాంటిది ఒకరిద్దరు కథల్లో రాయగా చూశాను తప్ప స్నేహితుల మధ్య అయితే ఎప్పుడూ వినలేదు. ఇది జనరిక్ – ఫరాల్ డెడ్ ఏంసెస్టర్స్ అన్నట్లు.

పాయింటెడ్ గా ఒక మనిషి మరణించిన తిథో/తేదీ నో… అప్పుడు ఏం చేస్తాము? ఏం చేయొచ్చు? అన్నది ఇందాక ఫ్రెండుతో చర్చకి వచ్చింది (ఇలాంటి చర్చలు ఇంట్లో వాళ్ళతో పెట్టలేకపోయినా ఫ్రెండు తో పెట్టగలగడం అదృష్టమనే చెప్పాలి. నా ఫ్రెండ్సులకి ఓపిక ఎక్కువ). “పూజారిని అడక్కపోయావా? వాళ్ళే ఏదో చెబుతారు శాస్త్రం ప్రకారం” – అని ఒక ఫ్రెండు అన్నది. “ఎబ్బే… అట్టాంటివి కాదు… మనం రిచ్యువల్స్ అవీ అంత పాటించం కదా… అందునా నా బోంట్లు అలాంటి ప్రశ్నలేస్తే మొదట ఇంట్లో వాళ్ళే నవ్వేయరూ?” అనుకున్నా.

విషయం ఏమిటంటే, సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ దినాలకి మనం చేయగల అప్రాప్రియేట్ పనులు ఏమిటన్నది. నాకు తట్టినవి ఇవీ:

  • ఆ వ్యక్తి పేరుతో ఏదన్నా నచ్చిన చోట అన్నదానమో ఏదో అరేంజి చేయడం. ఓపికుంటే స్వయంగా ఎక్కడికో పోయి ఆ పనులేవో మనమే చేయడం.
  • కాసేపు కూర్చుని ఆ వ్యక్తితో మన జ్ఞాపకాలు నెమరువేసుకోవడం. మన వద్ద ఫొటోలో ఏవో ఉంటే అవోసారి తిరగేయడం
  • ఆ వ్యక్తి వస్తువులేవన్నా ఉంటే మరి వాటిని ఓసారి చూసి మనవద్ద ఎందుకున్నాయి? అన్నది గుర్తు తెచ్చుకోవడం
  • మన తరవాతి తరానికి వాళ్ళ గురించి మనకి తెల్సినదేదో చెప్పడం.
  • వాళ్ళకి తగ్గ వారసులమా? అనేసి మనల్ని మనం తిట్టుకోకుండా వాళ్ళ అంశ మనలో ఏముందో చూసుకుని గర్వపడ్డం. ప్రతివాళ్ళలోనూ లోపం ఉంటుంది. పోయినోళ్ళందరూ మంచోళ్ళే కానీ బ్రతికున్న అందరూ చెడ్డోళ్ళనేం‌ లేదు కదా? మనకీ ఏదో ఓ మంచి విషయం కూడా వంటబట్టి ఉంటుంది వాళ్ళ నుంచి. అది కొంచెం ఆలోచించి హైలైట్ చేసుకుని గుర్తు చేసుకోవచ్చు వాళ్ళని.
  • మీకోపికుంటే కోకో సినిమా చూడండి. అసలా సినిమా ఈ టాపిక్ మీద నా మీద బాగా లోతైన ప్రభావం చూపించి అట్లా ఇన్నేళ్ళ బట్టి ఊపుతూనే ఉంది తల్చుకున్న ప్రతిసారీ. అదో పద్ధతి ఈ విధమైన తల్చుకోడానికి.
  • ఇందాకే కృష్ణ గుబిలి “వీరయ్య” పుస్తకం పూర్తిచేశాను. అదీ ఓ పద్ధతే.

ఇంకా ఏవన్నా తడితే మళ్ళీ అప్డేట్ చేస్తా. పాతికేళ్ళ డైరెక్ట్ ఎక్స్పీరియంస్ ఇక్కడ.

అట్లగాదు, ఓన్లీ మన మతంలో పాటించేవి మాత్రమే చెయ్యాలి.. మిగితావన్నీ నీలాంటి భ్రష్టులకి, మాక్కాదు, అనుకుంటే, మరీ మంచిది… ఎవడ్రమ్మన్ నాడండీ అడ్డమైన బ్లాగ్ పోస్టులు చదవడానికి? వెళ్ళండి మరీ!

Published in: on January 3, 2023 at 6:25 am  Comments (2)