Scribbles on Scribbles

Once, something catches your attention. You live with it. You go about telling everyone about it. It suddenly vanishes in to the bylanes of memory. You start having those sudden bursts of past experiences followed by a stream of continuous calm and you learn to live with it. Then, it comes back to stay, again 🙂

The “something” in this story is “Scribbles on Akka“, a 2001 musical documentary by Madhusree Dutta, on Akka Mahadevi, a 12th century Kannada bhakti-poet. I have to confess that I never had the opportunity to see the full film. But, the amazing six songs from this documentary are available on youtube. They are the ones that never left me after the first hearing 🙂

Here is a trailer of the film for starters.
(there are nude looking paintings. So, someone who thinks they can’t “see” such things on screen can just listen to the songs by looking somewhere else :P… as I couldn’t find an audio-only link so far!)

All the song videos on youtube can be accessed here. They are short but left a lasting impression on me. I don’t know how people sing Akka Mahadevi vachanas usually, but I like this Ilayaraja and Bombay Jayashree touch 🙂

A review about this film in “the music magazine”, here…and an interview with the film maker, in the same magazine, here.

I found six songs on youtube and most of them (according to me) leave you in deep thought, if you watch the video coupled with audio… or listen to the audio coupled with video!

My favorite from among them remains – “Onthalla, Iradalla“. It completely occupied my imagination for several days after I first heard it and still does whenever I listen to it.

Kaisiri Agandhava“, according to me, is an amazing visual interpretation (watch the video and listen to the song!). “Enakegayya” was the toughest song for me to understand/watch but then, I felt that the video and the chorus has had more more impact on me than everything else in this album (everything including my favorite..onthalla, iradalla). “Indra neelada” was another very interestingly picturised song in the initial parts. I loved listening to the song more than watching it though. “Kamanathaliya Korithu” also was visually very interesting although I did not understand this despite the subtitles, despite watching it a few times.

Bettathu Mele manaiya“, the last song of the album, did not not have too much of video attached to it, except for the initial few seconds. But, although I loved the lyrics (this was the only one which I understood directly without subtitles, when I heard for the first time!), what caught my attention more were the end credits 😛

Here is what the film maker says about these songs:

” Six songs are composed for a one hour non-fiction film. We picturised them on assorted images of contemporary women creating small spaces, making small transgressions, initiating minor revolts. In Bombay suburban train a woman commuter balances her limbs and cuts vegetables, in a Karnataka village a feudal housewife reads a forbidden text after the whole world falls asleep, in a gothic church an ordinary woman puts her wedding ring on herself – she marries Christ. They are different women, ordinary women – through whom Akka survives. But they should be played by one actress. The actress is Seema Biswas. “

(Link to full article here)

I wish I would one day be able to see the film. Until then, my scribbles on the scribbles are only about the short video songs 🙂

Published in: on March 10, 2013 at 7:00 am  Comments (6)  
Tags:

గాలి భాష, మనసు భాషా…ప్రేమ భాషానూ!

నాలుగైదేళ్ళ క్రితం Mozhi అని ఒక తమిళ సినిమా వచ్చింది. అప్పట్లో నేనొక ఐదారు మంది తెలుగు వారికన్నా కూర్చోబెట్టి మూకీసినిమాల కాలంలో తెర పక్కనే ఉండి వ్యాఖ్యానం చేసేవాళ్ళలా సంభాషణలు వివరిస్తూ ఆ సినిమా చూపించి ఉంటాను. ఆ సినిమా పాటలు కూడా చాలా బాగుంటాయ్. అప్పట్లో కొంచెం కష్టపడి, కొంచెం తమిళ స్నేహితుల్ని వేధించీ రెండు మూడు పాటల అర్థాలు కూడా కనుక్కుని మరీ పదే పదే విన్నా. ఇవ్వాళ ఒక స్నేహితురాలు ఏదన్నా సినిమా సూచించమంటే ఇది చూడమన్నా. తనకి సబ్టైటిల్స్ తో దొరక్క విరమించుకుంది కానీ, నేను చూడ్డం మొదలుపెట్టా. అలాగ… ఇవ్వాళ సినిమా చూస్తూ… ఈ Kaatrin Mozhi పాట వినడం మొదలుపెట్టాను. అక్కడ ఆగిపోయి మళ్ళీ మళ్ళీ వింటున్నా. ఒక వాక్యం చాలాసార్లు రిపీట్ అవుతుంది పాటలో…దానర్థం ఇదీ –

ప్రకృతిలో ఉన్న భాషలను తెలుసుకో – మనుషుల భాషలతో పని ఉండదు
హృదయాల భాషలు తెలుసుకో – మనిషికి భాషతోనే పని ఉండదు

ఇప్పుడా పాట ఆసక్తిగలవారి చేత బలవంటంగా వినిపించేందుకే ఈ టపా.

తమిళ పాట – రాగా.కాం లో ఇక్కడ వినవచ్చు.
ఆంగ్ల లిపిలో సాహిత్యం, దానర్థం ఇక్కడ చదవవచ్చు.
యూ ట్యూబులో చూడాలంటే ఇక్కడ.

ఈ సినిమాని “మాటరాని మౌనమిది” పేరుతో తెలుగులోకి డబ్ చేసారట. తెలుగు సినిమాకి రాగా.కాం ఆడియో లంకె…ఇక్కడ. ఈ పాట తెలుగు వర్షన్ ఇక్కడ.

Published in: on May 21, 2012 at 7:38 pm  Comments (3)  

నలదమయంతి, Kamal, Stranded on the streets :)

“నలదమయంతి” సినిమా చూశాను. సినిమా నాకు నచ్చేసింది కానీ, సినిమాకంటే ఎక్కువగా కొన్ని పాటలు నచ్చాయి. అందునా, కమలహాసన్ పాడగా, మాధవన్ వీథుల్లో అయోమయంగా తిరుగుతూ ఉండగా వచ్చిన “Stranded on the streets” పాట మరీనూ. పాటకి రెండు వర్షన్లు ఉన్నట్లు ఉన్నాయి. రాగా.కాం తెరిచి చూస్తే, పూర్తి ఇంగ్లీష్ వర్షన్ ఒకటి కూడా ఉంది. ఈపాట మరీ నచ్చింది. దీన్నే “బ్లూస్” అంటారేమో అని నాకు సాహిత్యాన్ని బట్టి అనిపించింది. బ్లూస్ సంగీతాన్నే అంటారనుకోండీ… కానీ, “బ్లూస్” కి, “డిప్రెషన్”కి, ఈ పాటకీ ఉన్న సంబంధం వల్ల అలా అనిపించింది. మాధవన్ మొహంలో కనబడే అయోమయం, దిగులూ, ఫ్రస్ట్రేషన్ తో కూడిన భయం – అన్నీ ఆ పాట లిరిక్స్ లో కూడా సాక్షాత్కరించాయి నాకు. సినిమాలో వచ్చిన సందర్భం యూట్యూబ్ వీడియో ఇక్కడ.

కమల్ పాడిన ఇంగ్లీషు వర్షన్ (మొదట కొన్ని తమిళ్ లైన్లు వదిలేస్తే), రాగా.కాం లో ఇక్కడ వినండి.

కమల్ కథను అందించిన ఈ సినిమాలో కమల్ నటించలేదు కానీ, ఉన్నట్లుండి క్లైమాక్స్ లో విచ్చేసిన (ఊడిపడిన) కమలహాసన్ ని చూసి- “అరే! “విరుమాండి” (అలియాస్ పోతురాజు) గెటప్ లో ఉన్నాడే” అని నేను ఆశ్చర్యపోయేంతలో – “నేను సండీయార్ (విరుమాండి కి ముందు అనుకున్న పేరట) షూటింగ్ నుంచి వస్తున్నా” అంటూ కమల్ హాసనే చెప్పేశాడు. అప్పట్లో చూళ్ళేకపోయాను…ఇన్నాళ్ళకి చూడగలిగాను నలదమయంతి సినిమాని. మీరూ చూడకపోతే, ఏదో అలా సరదాగా నవ్వుకోవడానికి, అక్కడక్కడా కొంచెం కదిలిపోవడానికీ, తప్పకుండా చూడండి!:)…. ఈపాటలన్నా వినకుండా ఎలా మిస్సయ్యానో అప్పుడు! 😦 ఈ సినిమా తెలుగులోకి డబ్ అవ్వలేదా???

Published in: on January 7, 2012 at 9:55 pm  Leave a Comment  

The “Ekla Cholo Re” post :)

I have mentioned before that the Hindi version of “Ekla Chalo” is one song that has been a source of “sanity” and inspiration over the past few months (years). I did listen to the Telugu and Bangla versions before – but none of them really affected me. Bangla -because I don’t know the language, Telugu – perhaps because I need more background music than that song has.

But, this post, on the Telugu version made me go back to Balantrapu Rajanikantha Rao’s composition/lyrics again. For whatever reason (although the lyrics in the blog seem to be different from the actual Telugu song), this time… the “okkadave okkadave okkadave..okadave padavoy” part seemed more forceful than before. I suspect that I even did some sleep-talk about that Telugu version….or….was it in my dream??

After that “surreal” experience, I listened to the Bangla versions by Kishore Kumar and Shreya Ghoshal respectively for some time. Later, I listened to “Bose” version again. I continued moving between “Bose” and Balantrapu Rajani Kantha Rao’s versions for the rest of the day! 🙂

Here are some versions of the song, in Bangla, Hindi and Telugu:


* In Kishore Kumar’s voice (Bangla)

* In Shreya Ghosha’s voice (Bangla)
* From the movie “Bose: The forgotten hero” by Shyam Benegal, music by ARR (Hindi-Bangla).
* A Telugu version written by Balantrapu Rajanikantha Rao (and I don’t really know who sung this). Thanks to Sreenivas garu for sharing this, a while ago!

* Bangla Lyrics and English Meaning

Conclusion: Although I like the Hindi version the best (I am listening to it for six years now, and not bored yet!), I can say that in any language, this song is a source of great personal motivation…

Published in: on December 26, 2011 at 1:51 pm  Comments (4)  

On “Bose”, again!

I was reading an article on Patriotic songs in Telugu, by Budaraju Radhakrishna and stopped at his mention of “Kadam Kadam Badaye Ja”. Now, it was a real surprise. I thought it was written for the movie! (If you read my blog occasionally, you must have understood by now that I am talking about “Bose:The Forgotten Hero” by Shyam Benegal, Nth time!). It seems “Kadam kadam…” was one of the INA anthems, along with “Hum Dilli Dilli Jayenge”. While I still don’t know who wrote this song, Raaga.com decided that it was Javed Akhtar. Imagine Akhtar sab working with Netaji! 😉 I love that song. So, irrespective of the history and its mis-representation by raaga, I will continue listening to it 🙂

I found a somewhat informative article on rediff.com pages, on Bose’s songs and their origins.
(More gyaan from the link: “Ghoomparani…” is also an old Bengali lullaby :)..although the song in the film might not exactly be.)

Here, I also found this nice review on “this neglected gem”, as the reviewer calls the movie. Indeed!!

(Enough of Bose-ing for today!) Jai Hind! 😉

Published in: on December 19, 2011 at 3:11 am  Leave a Comment  

ఒరు చిరి కందాళ్ – అదొక నిరాశ!

నాకు కొన్నేళ్ళుగా ఒక మళయాళప్పాట అంటే చాలా ఇష్టం. అది ఇళయరాజా పాటనే కాదు కానీ, ఆ పాడిన వాళ్ళ గొంతుకలు కూడా నాకిష్టమే. కళ్ళుమూసుకుని పాట వినకుండా తగుదునమ్మా అని వీడియోలు చూడ్డం దేనికి? ఏళ్ళ తరబడి ఇళయరాజా పాటలు వినేసి వావ్.. అనుకోవడము…వీడియోలు వెదుక్కుని ఏ విజయకాంతో, సత్యరాజో, ఇంకెవరో విచిత్రమైన రంగుల బట్టల్లోనో, అంతకంటే విచిత్రమైన నటనతోనో డాన్సులు గట్రా వేస్తే చూసి (ఉదా: చూడుడు) “హతవిధీ!!” అనుకోవడం – లెక్కలేనన్ని సార్లు జరిగింది. మనకి బుద్ధొస్తుందా? రాదు. నాకీ శాస్తి జరగాల్సిందే. విధి మహా బలీయమైనది.

(అన్నట్లు, ఈ పాట వీడియోకి గానీ, సత్యరాజ్ కి గానీ, విజయకాంత్ కి గానీ మీరు అభిమానులు అయిఉంటే, మీ మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమించండి.)

Published in: on December 18, 2011 at 1:44 am  Comments (4)  

దొంగరాముడి కోసం ఎదురుచూస్తున్న సావిత్రి భలే ఉందోచ్!

ఏవిటో, ఈ మధ్య అన్నీ భలే భలే వీడియోలు కనిపించేస్తున్నాయ్ యూట్యూబులో 🙂
డాన్సులు అవీ భలే నవ్వు తెప్పించాయి కానీ, సావిత్రి పరవశం మాత్రం నాకు తెగ చూడబుద్దేశింది.

“వాడు నీకన్న సోకైన వాడు” అని ఒకసారి, “వాడు నీకన్నా చల్లని వాడు” అని ఒకసారి (అంటే “He is cool” అని భావమన్నమాట) అన్నప్పుడు, అసలుకి ఆ దొంగరాముడి కోసం ఎదురుచూస్తూ రెడీ అవుతున్నప్పుడూ సావిత్రి పరవశం చెబితే అర్థం కాదు (నాకు చెప్పడం చేతకాదని చదవండి) చూస్తేనే అర్థమవుతుంది అనమాట 🙂

(ఏమైనానూ, కొన్ని సినిమాలతో పోల్చుకుని చూస్తే సన్నగా ఉన్న సావిత్రి అలా చెంగు చెంగుమని తిరుగుతూ ఉంటే చూడ్డంలో ఉన్న ఆనందాన్నే అలౌకికానందం అంటారు కాబోలు! హీహీహీ)

Published in: on December 16, 2011 at 1:21 am  Comments (2)  

కాశీకి పోయాను…

నో…నో… నేనెక్కడికీ పోలేదు. రేలంగి వెళ్ళారంట.

ఇవ్వాళ గృహపౌరులకి నవ్వులు విరబూయించే పనిలో పడి ఇక్కడ తేలాను. ఇంజినీరింగ్ చదివే రోజుల్లో దాదాపు రోజూ సాయంత్రం ఇంటికి రాగానే పెట్టుకు వినే పాటల్లో ఇదీ ఒకటి. ఇవ్వాళ చాన్నాళ్ళకి గుర్తొచ్చింది.

రేలంగి, గిరిజల హావభావాలు, ఆ పాట సాహిత్యం – రెండూ కలిపితే గొప్ప కాంబినేషన్!!

Published in: on November 6, 2011 at 1:45 pm  Comments (4)  

Two songs that keep me sane :)

For all the irreligious-ness of mine, one song, that kept me away from an angry outburst, from time to time in the past few months, is a devotional song! 🙂

Since it is Sanskrit, irrespective of the fact that its from a Tamil movie, everyone (read, every Indian) can try to understand. For all the haphazardness of my vocabulary in any language, I am still in the process of understanding it fully.

Its “Om Sivoham” from “Naan Kadavul”.
Music: Ilayaraja
Listen here
***************
There is also this song “Ekla Chalo” from “Bose:The Forgotten Hero”. I keep getting hypnotized every time I listen!

I never understood what those Bengali words in the beginning of the song meant. But, since it comes so many times in the movie, I thought they must be from some famous poem. On googling I found out that they were from a Tagore poem “Ekla Chalo Re“.

Listen to the song here.
Music: A.R.Rahman

I do remember writing about “Herr Bosey”‘s songs (That’s how the Germans call him in the movie!) in this blog a while ago. But, this one remains my all-time favorite!

Published in: on October 15, 2011 at 7:00 am  Comments (9)  

శ్రీరామరాజ్యం ఆడియో – నా అభిప్రాయాలు

నాకు రాముడంటే ఏ భావమూ లేదు కానీ, రాముడిపై రాసిన పాటలంటే ఇష్టం. బాపు గారంటే ఇష్టం. రాజా అంటే ఇష్టం. ఆ ఇష్టంలో భాగంగా, నిన్న ఆడియో రిలీజ్ వీడియోలు చూసి -“అయ్యో! ఏమిటీ పరిస్థితి” అని నిట్టూర్చాక, పొద్దున్న ఆఫీసుకి వస్తే, రాగా లంకె తో ఒక మెసేజ్…రామరాజ్యం పాటలు మొత్తం రాగా.కాం లో పెట్టేసారు విను అని. విన్నాను. నాకు దాదాపు అన్నీ నచ్చాయి. అయితే, సంగీతానికి, కథకి మధ్య ఏదో గ్యాప్ ఉన్నట్లు అనిపించింది. ఆ సంగీతం చూస్తే “అమ్మ రాజీనామా” మొదలుకుని “ఆవకాయ బిర్యాని” దాక రకరకాల తరహా చిత్రాలకు సూట్ అయ్యేలా ఉంది కానీ, పౌరాణికంలో ఊహించుకోలేకపోతున్నాను. ఆ అయోమయావేశంలోనే ఈ టపా.

(మీకీ టపా మరీ పట్టపగ్గాల్లేకుండా అనిపిస్తే క్షమించండి. ఎవ్వరినీ అగౌరవ పరచడం నా ఉద్దేశ్యం కాదు. పై ఇద్దరూ నా లోకపు దేవుళ్ళు. కనుక, వాళ్ళని ఒక్క మాట అనే ఆలోచన నాకు కల్లో కూడా రాదు!)

జగదానంద కారకా : పాటలో భక్తి పారవశ్యం లేదు కానీ, “ఊపు” ఉంది. నామట్టుకు నాకు వినేందుకు బాగుంది.

శ్రీరామ లేరా: ఏమిటో, బొత్తిగా ఇప్పటి సినిమాల తరహా సంగీతం. “శివమణి” సినిమాలో “రామా..రామా..రామా..” అంటూ పాట పెడితే బాగుంటుంది కానీ, ఒక పౌరాణిక చిత్రంలో ఈ సంగీతం ఏమిటి? అనిపించింది. కానీ, సినిమాలో మిగితా పాటలు కూడా అలాగే అనిపించడంతో, బహుశా మరో తరహాకి అలవాటు పడిపోయి, ఇది కొత్తదనం వల్ల ఇలా అనిపిస్తుందేమో అనిపించింది వినేకొద్దీ!!

ఎవడున్నాడు: వాల్మీకి చెప్పే కథగా వస్తుంది పాట (లవకుశులతో కాబోలు!). రాముడి పొగడ్త. బాగుంది. 🙂

సీతారామ చరితం: బాగుంది. ఇప్పటి పిల్లలకి రాముడి కథ క్లుప్తంగా, చక్కటి తెలుగులో, విజువల్ గా చెప్పేందుకు పనికొస్తుందనుకుంటాను.

దేవుళ్ళే మెచ్చింది : మళ్ళీ, ఈకాలం పాటలా ఉంది.అద్భుతంగా పాడారు అనిపించింది. సినిమాలో లవకుశుల కథని కొంచెం ఆధునికంగా చెప్పబోతున్నారని అనిపిస్తోంది, ఈ పాటల ధోరణి చూస్తూ ఉంటే. (వినుడి వినుడి రామాయణ గాథా..పాట బదులు ఈ పాటేమో ఈ సినిమాలో..)

గాలీ, నింగీ నీరు..భూమీ నిప్పూ మీరు..రామా వద్దనలేరా ఒకరూ : “ఏ నిముషానికి ఏమి జరుగునో” సందర్భం అనుకుంటా. సాహిత్యం నాకు బాగా నచ్చింది, పౌరాణికాలకి వెరైటీ సాహిత్యమే…నేను విన్నంతలో. పాట సంగీతం కూడా… గాయం-2 సినిమాలో “కలగనే కన్నుల్లో…” అన్నట్లు, మాడర్న్ విషాద గీతంలా ఉంది 🙂

రామాయణము : మళ్ళీ రామ గాథ. నాకు పౌరాణికం ఫీలింగ్ రాలేదు కానీ, పాట బాగుంది. దృశ్యం కళ్ళకు కట్టించింది.

దండకం: హమ్మయ్య, ఒక్కటి పౌరాణికంలా అనిపించిందోచ్!!

సీతా సీమంతం: “మావయ్య అన్న పిలుపు” అన్న ఒకప్పటి బాలకృష్ణ పాట మాడరన్ వర్షన్ లా ఉంది :). మైథలాజికల్ లా లేదు. వినడానికి బానే ఉంది కానీ, రామాయణం సెటప్ లో ఊహించడం కష్టంగా ఉంది!! సాహిత్యం బాగుంది.

రామ రామ రామ అనే రాజమందిరం: జానపదం లా ఉంది. బహుసా సినిమాలో కూడా అదే సీన్ లో వస్తుందేమో. నాకు చాలా నచ్చిన పాటల్లో ఇదొకటి, ఈ ఆల్బంలో. ఇందులో ఆ “పారవశ్యం” ఎలిమెంట్ ఇందులో అనుభవించాను, ఇది జానపదం తరహాలో ఉన్నప్పటికీ.

ఇది పట్టాభి రాముని ఏనుగురా, శంకు చక్రాల..: ఊపు ఉంది పాట(ల)లో. నాకు నచ్చింది. సినిమాలో ఎక్కడ వస్తుంది అన్న దాన్ని బట్టి ఉంటుంది ఇంపాక్ట్. కానీ, నాకు ఈ పాట చాలా నచ్చింది. అర్జెంటుగా ఈ పాట మాత్రం కోనేస్కుని లూప్ లో పెట్టుకుని వినాలి అనిపించింది.

ఇవి కాక, ఒకట్రెండు బిట్ సాంగ్స్ ఉన్నాయి.

ఈ సినిమా సంగీతానికి నేను “కన్ఫ్యూజ్ద్ మ్యూజిక్” అని పేరు పెట్టదలుచుకున్నా. పాటలు నాకు చాలా నచ్చాయి కానీ, అవన్నీ ఒక పౌరాణిక చిత్రంలో ఊహించలేకపోతున్నాను. మన పౌరాణిక సంగీతం ఒక విధమైన పారవశ్యం కలుగజేస్తుందే… అలాంటి పారవశ్యం నాకు కలగలేదు. కానీ, పాటలుగా వినడానికి బానే ఉన్నాయ్. నా స్నేహితుడితో అంటూ ఉంటే అతను ఇలా అన్నాడు – “ట్యూన్స్ బాగున్నాయి కానీ, సౌండ్స్ డల్ అనిపించట్లేదూ?” అని. ఇక్కడ నేనూ ఏకీభవించాను. “సౌండ్స్ డల్” అనడంలో మా భావం – ఆ పారవశ్య భావనే. ఒక “నాన్ కడవుళ్”లో “ఓం శివోహం” లాగా పూనకం పుట్టించడం కానీ, ఒక “షిర్డీ సాయిబాబా మహత్యం”లో “మా పాపలు తొలగించి…”పాటలో లాగ (రెంటికీ ఇళయరాజానే), భక్తీ పారవశ్యం కలిగించడం గానీ, ఈ పాటలు చేయలేదు. కానీ, ప్రతి పాటా వింటూంటే లవకుశులు కథ చెప్పడం, మామూలు జనం తల ఊపుతూ విని ఆనందించడం మాత్రం కనబడ్డది నా మనోఫలకమ్లో. అందుకే జానపదం అన్నది.

నాకు చివరిగా చెప్పాలి అనిపిస్తున్నది ఏమిటి అంటే – నేను ఈ పాటలు చాలా మట్టుకు, పల్లెల్లో పాడుకునే జానపద పదాల్లా ఊహించుకుంటున్నాను. ఈ పిల్లలు – అదే లవకుశులు ఒక ఎనభైల నాటి మాములు పల్లె జనాలకి రాముడి కథ చెప్తున్నట్లు ఊహించుకుంటే, అంతా కళ్ళకి కట్టినట్లు కనిపిస్తుంది. అలా కాకుండా రామాయణకాలంలో రామకథ గానం లా ఊహించుకుంటే, కాస్త కొత్తగా (కొండకచో వింతగా) అనిపిస్తే అది మీ తప్పు కాదు. ఆపై మరో మాట – ప్రతిసారి ఇళయరాజా తన బెస్ట్ ఇవ్వాలి అని ఆశించకూడదు. ఆయన కూడా మనిషి అన్న విషయం కూడా దృష్టిలో ఉంచుకోవాలి.

నేనూ సాహిత్యం పై ఎక్కువ ధ్యాస పెట్టలేదు కానీ, పట్టించుకున్నంతలో నాకు చక్కగా అనిపించాయి కొన్ని భావనలు. బహూశా కొన్నాళ్ళాగాక మళ్ళీ రాస్తానేమో.

Published in: on August 16, 2011 at 3:34 pm  Comments (30)  
Tags: