గబ్బిలం పద్యాలు

జాషువా గారి “గబ్బిలం” ఈమాటలో కనిపిస్తేనూ… అలా చూడ్డం మొదలుపెట్టాను..అర్థమైనంత మేరకు చదవ ప్రయత్నిద్దాం అని. అదేమిటో గానీ, కళ్ళు మొదట్లోనే వచ్చిన ఈ రెండు పద్యాల దగ్గరా ఆగిపోయి, అక్కడక్కడే చక్కర్లు కొడుతున్నాయి. ఏముంది వీటిలో?? అన్నది మాత్రం చెప్పలేకపోతున్నాను.

*************

పామునకు పాలు చీమకు పంచదార
మేపుకొనుచున్న కర్మభూమిం జనించు
ప్రాక్తనంబైన ధర్మదేవతకు కూడ
నులికిపడు జబ్బు కలదు వీడున్న చోట

వాని నుద్ధరించు భగవంతుడే లేడు
మనుజుడెట్లు వాని కనికరించు
వాడు చేసికొన్న పాపకారణమేమొ
యింతవరకు వాని కెరుక లేదు

********************

అక్కడి నుంది ముందుకు వెళ్ళిన కొద్ది నిముషాలకే నన్ను మరోటి పట్టి ఆపేశింది.

ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించు గాని దుః
ఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్‌
మెతుకు విదల్ప దీ భరతమేదిని ముప్పదిమూడు కోట్ల దే
వత లెగవడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుత్తు లారునే

ఇక్కడికి ఇవ్వాళ్టికి ఆపుతాను.

కర్మసిద్ధాంతమున నోరు కట్టివేసి
స్వార్థలోలురు నా భుక్తి ననుభవింత్రు
కర్మమననేమొ దానికీ కక్ష యేమొ
యీశ్వరుని చేత ఋజువు చేయింపవమ్మ

ఆలయంబున నీవు వ్రేలాడువేళ
శివుని చెవి నీకు కొంత చేరువుగ నుండు
మౌని ఖగరాజ్ఞి పూజారి లేనివేళ
విన్నపింపుము నాదు జీవితచరిత్ర

– కెవ్వు అనుకున్నా. ఇంతకీ, సభకు విన్నపం ఏమనగా, ఎవరో ఈ “గబ్బిలం” చదివిన వారు, కాస్త వివరంగా దీన్ని పరిచయం చేయగలరు (పుస్తకం.నెట్ లో చేస్తే మరీ మంచిది!)
ఈ కవితలు ఎవరో ఒకరు ఓపిగ్గా ఆంగ్లానువాదం కూడా చేస్తున్నారు. ఇదిగో లంకె.

Published in: on December 17, 2011 at 7:00 am  Comments (10)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2011/12/17/gabbilam/trackback/

RSS feed for comments on this post.

10 CommentsLeave a comment

 1. ఆలయంబున నీవు వ్రేలాడువేళ
  శివుని చెవి నీకు కొంత చేరువుగ నుండు
  మౌని ఖగరాజ్ఞి పూజారి లేనివేళ
  విన్నపింపుము నాదు జీవితచరిత్ర

  Thanks Allot for this

  very nice

  ?!

 2. సౌమ్య గారూ,
  గుర్రం జాషువా గారు పంచముడిగా పడరాని కష్టాలు పడ్డారు జీవితం లో. కులవివక్ష వల్ల అతను ఎదుర్కోని సమస్యలేదు. ఉత్తరోత్రా నిర్లక్ష్యంచెయ్యలేని అతని కవితాశక్తికి తిరుపతి వెంకటకవులలో ఒకరైన చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రిగారు అతని పాదాలకి స్వయంగా స్వర్ణ కడియం తొడిగినా, అది చిన్న ఊరట మాత్రమే. కాళిదాసు మేఘసందేశ కావ్య స్ఫూర్తితో, గబ్బిలాన్ని దూతగా కవి పంపిస్తున్నాడు అతని మొర ఆలకించమని చెప్పడానికి కాశీ విశ్వనాధుడి దగ్గరకి (అతను భూత నాధుడు కదా, కాటికాపరికి దగ్గర బంధువు అన్న భావన.) నాకు తెలిసినంత వరకు మీరు ఉదహరించిన పద్యాల భావం ఇది:
  1,2: కర్మ భూమిగా ప్రసిధ్ధిచెందిన ఈ దేశంలో, పుణ్యం పేరుతో పాములకు పాలు పోస్తారు (నాగుల చవితి) చీమలకు పంచదార పోస్తారు (పంచదార + గోధుమ రవ్వగాని, బియ్యపురవ్వగాని వేస్తారు కొందరు భూత తృప్తికి అన్ని కాలాల్లోనూ. ఇంటిముందు పిచ్చికలకు కొత్త వరి కంకులు కట్టడం, ఇంటిముందు చీమలకు ఆహారంగా పనికివస్తుందని బియ్యపుపిండితోనే ముగ్గులెయ్యడం ఈ కోవలోకి చెందిన పురాతనంగా వస్తున్న ఆచారాలు). అంత చిన్న జీవరాసులకు గూడా గుర్తింపు ఉందిగాని, సాటి మనిషికి గుర్తింపులేదే అని వేదన. అదేం ఖర్మమో గాని, అతను చేసుకున్న పాపానికి కారణం కూడా తెలియదు. ధర్మదేవత ఉలికిపడుతుందట, ఎక్కడనిలదీస్తాడో అని. అతన్ని ఉధ్ధరించే దేవుడే లేనపుడు, మనిషి ఎలా కరుణిస్తాడు?
  3: ఈ భారతదేశం లో ప్రతిమలకు (దేవుని ఉత్సవ విగ్రహాలకు) పెళ్ళిళ్ళుచెయ్యడానికి వేలకు వేలు ఖర్చుపెట్టడానికి వెనుదియ్యరు ప్రజలు. కానీ, అదే ఒక పేద ఫకీరు, తినడానికి తిండిలేక అన్నమో రామచంద్రా అన్నా, అతని ఖాళీ గిన్నెలో ఒక్క మెతుకు రాల్చడానికి వెనుకాడతారు. 33 కోట్ల దేవతలున్న ఈ దేశం లో అందరూ ఏదో ఒక దేవుడిని పట్టుకు వేలాడి తమ మోక్షం గురించి పాకులాడతారు. వాళ్లు ఆ దేవుళ్ళకు కళ్యాణాలూ, కైంకర్యాలూ ఇస్తారు గాని వీళ్ళని పట్టించుకోరు. అలాంటప్పుడు, నిర్భాగ్యులకి ఆకలిబాధ (క్షుద్బాధ ) ఎలా తీరుతుంది?
  చివరి పద్యాలు: నా తిండి లేకపోవడానికి నేను పూర్వజన్మలో చేసిన కర్మమే కారణమని ఒక కర్మ సిధ్ధాంతం చెప్పి, స్వార్థపరులు నాకు చెందవలసిన తిండిని అనుభవిస్తున్నారు. కనుక కర్మమేమిటొ, దానికి ఈ కక్ష ఎందుకో ఈశ్వరుడినే ఋజువుచెయ్యమని చెప్పు అని అడుగుతున్నాడు కవి. ఆలయంలో తను వేలాడేటప్పుడు (గబ్బిలం తలక్రిందులుగావేలాడుతుంది.అంటే కఠోరమైన తపస్సుచేస్తున్నదన్నమాట. అదిమౌనంగాకూడ ఉంటుంది. ఖగరాజ్ఞి అని పొగుడుతున్నాడు.తనకి దూత కదా. కొంచెం పొగడాలి.) శివుడి చెవిలో (వేలాడుతుంది కనుక మనకంటే తనకి దగ్గరగా శివుడి చెవి ఉంటుందని చమత్కారం) పూజారి లేని వేళలో చెప్పమంటున్నాడు తన బాధని. ఎందుకంటే, దేముడు వరమిచ్చినా పూజారి వరమివ్వడని సామెత. అంటే, దేముడు ఒక వేళ మొర ఆలకిద్దామనుకున్నా, పూజారి విననీయడని భావం.సిధ్ధాంతం చెప్పి, స్వార్థపరులు నాకు చెందవలసిన తిండిని అనుభవిస్తున్నారు. కనుక కర్మమేమిటొ, దానికి ఈ కక్ష ఎందుకో ఈశ్వరుడినే ఋజువుచెయ్యమని చెప్పు అని అడుగుతున్నాడు కవి. ఆలయంలో తను వేలాడేటప్పుడు (గబ్బిలం తలక్రిందులుగావేలాడుతుంది.అంటే కఠోరమైన తపస్సుచేస్తున్న దన్నమాట. అదిమౌనంగాకూడ ఉంటుంది. ఖగరాజ్ఞి అని పొగుడుతున్నాడు.తనకి దూత కదా. కొంచెం పొగడాలి.) శివుడి చెవిలో (వేలాడుతుంది కనుక మనకంటే తనకి దగ్గరగా శివుడి చెవి ఉంటుందని చమత్కారం) పూజారి లేని వేళలో చెప్పమంటున్నాడు తన బాధని. ఎందుకంటే, దేముడు వరమిచ్చినా పూజారి వరమివ్వడని సామెత. అంటే, దేముడు ఒక వేళ మొర ఆలకిద్దామనుకున్నా, పూజారి విననీయడని భావం.

 3. sunamu gariki: మీ వివరణకి ధన్యవాదాలు. నాకు అర్థం కాక ఆగిపోలేదండీ. అవాక్కై ఆగిపోయాను. మామూలుగా గబ్బిలం గురించి చెప్పినందుకు ధన్యవాదాలు.

 4. I like the way he deliberately chose to parody a popular romantic story (మేఘసందేశం) to convey the heart wrenching emotions of indignation, anger. Makes anyone lose all the respect one had for the ancient traditional system which inflicted (and continues to inflict) so much pain on people, just based on the class in which they were born.

 5. an interesting commentary I found on the wiki:
  http://bit.ly/xWLIeU

 6. NARUNI KASTAPETTI NAARAAYANUNI GOLCHU DHARMASHEELURUNNA DHARANIMEEDA !!!! GABBILAM LO NENU CHADIVINA SENTENCE

 7. సాహిత్యం జీవించి ఉంది..మహానుభావులు..అందరికి వందనాలు…

 8. let us selabrate jashura jayanthi on sep’28

 9. hello sir/madam i need full book of gabbilam in telugu plz ping me on 9550765156 ty .

 10. ఉదయమాది రక్తమోడ్చి కష్టము జేసి


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: