Return of the bookies – రెండో భాగం!

మొన్నొకరోజు పుస్తకం.నెట్ పని చేయట్లేదనీ, కొన్నాళ్ళలో తిరిగొస్తామనీ చెప్పి రాసానా….అలా రాసానో లేదో..ఇలా వచ్చేశాం! 😉

అవునండీ, మళ్ళీ వచ్చేశాం!! (గతం తెలీని వారి కోసం నవంబర్లో సైట్ ఒకసారి డౌన్ అయినప్పుడు రాసిన టపా ఇదిగో)

* ఓపిగ్గా ఎదురుచూసిన వారికీ
* ఏమైందని ఈమెయిల్స్ చేసిన వారికీ
* సైటుని మళ్ళీ నిలబెట్టిన వారికీ (అంటే నాకేం సంబంధం లేదు. మా రాక్-స్టార్స్ – అనగా పూర్ణిమా, పొద్దు బృందం కలిసి నిలబెట్టేశారు).
* వ్యాసాలు పంపేశాక సైట్ డౌన్ అవడంతో ఎదురుచూస్తున్న వ్యాసకర్తలకూ
* అతి బలీయమైన విధికీ! 😉

కొంతమందికి వెంటనే సైటు తెరుచుకోకపోవచ్చు. బ్రౌజర్ కాషింగ్ వల్ల కావొచ్చు, మరేదన్నా కారణం ఉండొచ్చు. కానీ, రిఫ్రెష్ చేసి చూడండి ఓసారి. ఎడిటర్@ అన్న ఈమెయిల్ తాత్కాలికంగా పని చేయడంలేదు. కనుక, ఏ ఈమెయిల్కి మెయిల్ చేయొచ్చు? అనేది సైటులోకి వెళ్ళి చూడండి 😉

తక్కిన వారి సంగతి ఏమైనా, నేను మాత్రం పుస్తకం.నెట్ని చాలా మిస్సయ్యాను.
కానీ, పునరపి జననం, పునరపి మరణం – అంటే ఇదే కాబోలు అనిపించింది ఇవ్వాళ!! 😛

Published in: on May 7, 2012 at 8:01 am  Leave a Comment  

పుస్తకం.నెట్ గురించి….

దాదాపు పదిరోజులుగా పుస్తకం.నెట్ పని చెయ్యడంలేదు అని చెప్పి కొందరైనా గమనించే ఉంటారు. కొందరు ఈమెయిల్స్ లో ఎంక్వైర్ చేసారు కూడా. (విధి వక్రించి) కొన్ని సాంకేతిక ఇబ్బందుల్లో చిక్కి, ప్రస్తుతం సైట్ డౌన్ అయ్యింది. అఫ్కోర్సు, అందులో మా నిర్లక్ష్యం కొంత ఉన్నా కూడా…ఇప్పుడు ఆ పోస్ట్ మార్టెం అనవసరం. ప్రస్తుతం మళ్ళీ సైట్ పనిచేయించడానికి ప్రయత్నిస్తున్నాము. ఇంకొన్ని రోజుల టైము ఇస్తే, మళ్ళీ తిరిగొచ్చి, ఎప్పట్లాగే కొనసాగుతాము…. అని ప్రస్తుతానికి ఆశ. ఇతి వార్తాహ.

Published in: on May 4, 2012 at 11:30 am  Comments (4)  

సొంతడబ్బా – నవతరంగం :)

ఈ ఏడు నవతరంగం.కాం లో నేను రాసిన వ్యాసాల లిస్టు. నార్సిసిజం ఎక్కువైన రోజుల్లో చూసి మురిసిపోవడానికి పనికొస్తుందని, పోస్ట్ చేస్కుంటున్నాను 🙂

కథ-స్క్రీన్‍ప్లే-దర్శకత్వం భానుమతి

చివరకు మిగిలేది (1960)

వందేమాతరం (1939)

బంగారు పాప (1954)

కృష్ణలీలలు (1959)

ఇంగ్మార్ బెర్గ్మాన్ సినిమా “ది సైలెన్స్”

చిల్లర్ పార్టీ

ఒరు చెరు పుంచిరి – నా అభిప్రాయాలు

మైనే గాంధీ కొ నహీ మారా

Bose: The Forgotten hero (2005)

“అము” (2005): ఒక పరిచయం

మహానగర్

తెలంగాణ చరిత్ర చిత్రాలు : వీరతెలంగాణ (2010), మాభూమి(1979))

సత్యజిత్ రాయ్ ‘హిరాక్ రాజర్ దేశ’

Published in: on December 31, 2011 at 7:00 am  Leave a Comment  

నా నవతరంగం అప్డేట్స్

గత రెణ్ణెల్ల లో నవతరంగంలో మళ్ళీ తరుచుగా రాయడం మొదలుపెట్టాను (సినిమాలెక్కువై!). ఆ వ్యాసాలకి లంకెలు –

చిల్లర్ పార్టీ
ఒరు చెరు పుంచిరి – నా అభిప్రాయాలు
మైనే గాంధీ కో నహీ మారా
Bose: The Forgotten hero
“అము” (2005): ఒక పరిచయం
మహానగర్
తెలంగాణ చరిత్ర చిత్రాలు : వీరతెలంగాణ (2010), మాభూమి(1979))

Published in: on November 28, 2011 at 3:35 pm  Leave a Comment  

మళ్ళీ వచ్చేశాం! (Return of the bookies)

మళ్ళీ వచ్చేశాంఓచ్!!
పుస్తకం.నెట్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసింది. ఇంకా కొత్త రూపును “చెక్కుతూ” ఉన్నాము కానీ, ముందైతే మళ్ళీ అందరికీ కనబడ్డం ముఖ్యమనీ… 🙂

ఇన్నాళ్ళలోనూ ఓపిగ్గా ఎదురుచూసిన వారికీ, బాగోగులు విచారించిన వారికీ, తమ రచనలు పంపి మేము సమస్య వివరించగానే అర్థం చేసుకుని ఎదురుచూస్తున్న వ్యాసకర్తలకూ, ఓపిగ్గా సమయం వెచ్చించిన పొద్దు బృందానికీ – అందరికీ ధన్యవాదాలు.

ఇక, సరిగ్గా ఈ టైంలోనే, నేనెంత బిజీగా ఉన్నానంటే – అంత బిజీగా ఉన్నా 😉 అందువల్ల, నేను సరిగ్గా చెయ్యీ, కాలూ, తలా, నోరూ ఏదీ వెయ్యలేకపోయినా నిభాయించుకున్న పూర్ణిమ రాళ్ళే!! 🙂

వారం దాటినట్లుంది పుస్తకం.నెట్ మూతబడి. రోజూ లేవగానే చేసే మొదటి పని – పుస్తకం.నెట్లో అడ్మింగా లాగిన్ అయ్యి ఏం జరుగుతోందో చూడ్డం…. తక్కినవన్నీ చక్కగా జరిగిపోతూ ఉన్నా కూడా గింజుకుంటూనే ఉన్నా వారం బట్టీ! ఎట్టకేలకు మనశ్శాంతి.

మళ్ళీ అంతా ఎప్పట్లాగే సైటుకి దయచేయండి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ!

Published in: on November 14, 2011 at 1:17 am  Comments (2)  

కొత్తపల్లి పత్రికలో ఒక శీర్షిక

కొన్నాళ్ళ క్రితం మాటల సందర్భంలో కొత్తపల్లి పత్రికలో పిల్లల కోసం నెలనెలా ఎవరన్నా ప్రతిభావంతులైన పిల్లల గురించి వ్యాసాలు రాస్తే బాగుంటుంది కదా అని లలిత గారికి సూచించాను. అప్పటి ఉత్తర ప్రత్యుత్తరాల తరువాత, నేనే నిర్వహణ బాధ్యతలు తీసేస్కున్నాను అనమాట. 🙂

అలా, అక్టోబరు నుంచి ఈ పరిచయాలు మొదలుపెట్టాము.

అక్టోబరు నెల్లో విలియం కంకంబ్వా గురించి ఇక్కడ చదవొచ్చు.
నవంబరు నెల్లో రూత్ ఏమోస్ గురించి ఇక్కడ చదవొచ్చు.

అలా, నాకు ఎవరి గురించన్నా తెలుస్తూ ఉన్నన్నాళ్ళూ కొనసాగాలని నా ఆలోచన. అందరి గురించీ నేనొక్కదాన్నీ తెలుసుకునేయడం సాధ్యం కాదు కనుక, ఈ టపా చదువుతున్నవారికి విజ్ఞప్తి ఏమిటంటే, ఇలా మీరు ఎక్కడన్నా ఎవరన్నా పిల్లల గురించి వార్త చదివితే, ఇక్కడ ఒక చిన్న వివరం వదలండి. నేను ఇరవైలోపు వయసు ఉన్న వాళ్ళ కోసం వెదుకుతూ ఉంటాను సాధారణంగా. కానీ, పిల్లలకి స్పూర్తివంతంగా ఉండే, అ-ప్రముఖుల కథలు ఏవన్నా ఉంటే చెప్పండి.. పుణ్యం మూటగట్టుకోరు గానీ, పాపం కూడా మూటగట్టుకోరుగా 🙂

Published in: on November 12, 2011 at 1:47 pm  Comments (6)  

గూగుల్ ట్రాన్స్లేట్ కూడా వాడేస్కుంటున్న స్పామర్లు!!

ఇవ్వాళా, స్పాం సెక్షన్ లో ఒక కామెంట్ ఉంది పుస్తకం.నెట్ లో.

“మీరు నన్ను చాలా సహాయపడింది ధన్యవాదాలు” అని.

seoatom.ru అట వెబ్సైటు…సదరు “అణు”బా(ం)బు ది. ఇంకా వివరాలు ఉన్నాయి కానీ, మనకి ఇక్కడ అనవసరం. .రూ వి అన్నీ మామూలుగా స్పామువే వస్తాయి కానీ, తెలుగులో ఉండటం విడ్డూరంగా అనిపించింది. వెంటనే, గూగుల్ ట్రాన్స్లేట్ లో “You have helped me a lot, thank you” అని ఇచ్చి చూశాను. విషయం అర్థమైంది.

ఏమైనా, స్పామర్లు కూడా ట్రాన్స్లేట్ వాడడం మహదానందం కలిగించే విషయం! కానీ, దాని ఎఫీషియన్సీ గురించి వాళ్ళకి చెప్పేదెవరు పాపం… అలాంటి స్పాం వల్ల పక్కనోళ్ళ చెప్పు తీస్కుని మరీ తమను తామే కోట్టుకుంటున్నట్లు అవుతుందని ఎప్పుడర్థమౌతుందో స్పామర్లకి!! 😛

Published in: on September 15, 2011 at 1:29 am  Leave a Comment  

On Michael Hart

As soon as I woke up today morning, I read this message from Purnima that Michael Hart (of Project Gutenberg) passed away. For a moment, I stared at that message, unable to comprehend what happened.

Flashback to 2010: In Jan 2010, call it stupidity, audacity or whatever, I emailed Greg Newby (The other man behind Project Gutenberg) on behalf of pustakam.net, asking him for an interview about Project Gutenberg. I was so embarrassed to even tell someone that I actually emailed them, for I thought I’d be mocked at. I thought I won’t get a reply, given the fact that mine might have been one of the 100s of emails they receive. But, hardly a day after I sent my email, Greg replied, cc-ing to Michael, giving a “go ahead”. Now, there began two strands of emails – one with Hart and Newby asking them our questions…one with Purnima and others, preparing those questions.

Purnima and I were amazed at their friendly, quick and elaborate responses. Well, we were just “amazed” to say the least. Like a friend commented back then, those emails are indeed something to be cherished. The interview, ofcourse, (IMHO), is one of the best we did in the past 2.5 years. (The text of the e-mail interview can be accessed here, with an intro in Telugu)

I found him a very inspiring person, during the whole process of exchange between us. The passion with which he works is one thing, for which he will remain my inspiration forever. I guess I am not alone in thinking so!

Published in: on September 8, 2011 at 2:57 pm  Comments (1)  

On Ingmar Bergman’s “The Silence”

ఇంగ్మార్ బెర్గ్మాన్ స్వీడిష్ చిత్రం “ది సైలెన్స్” పై నేను నవతరంగంలో రాసిన వ్యాసం ఇదిగో, ఇక్కడ చదివి, మీ అభిప్రాయాలు చెప్పండి.

చాలా నెలల తరువాత నవతరంగంలో రాసానేమో, నాకు నేనే ప్రచారం ఇచ్చుకుంటున్నా 😛

Published in: on September 6, 2011 at 1:36 pm  Comments (2)  

ఈ రోజు సాక్షి ఫన్‌డే లో నా వ్యాసం

ఇవ్వాళ్టి సాక్షి పత్రికలో నేను జూన్ లో చేసిన నార్వే పర్యటన గురించి రాసిన ట్రావెలాగ్ వేసుకున్నారు. మీరూ చదివి మీ అభిప్రాయాలు చెప్పండి. వ్యాసం వేసుకున్నందుకు సాక్షి గారికి ధన్యవాదాలు.

Published in: on September 4, 2011 at 7:54 pm  Comments (6)