తొలి రక్తరసదానం అనుభవం

రక్తదానం తెలుసు, ఈ రక్తరసం ఏమిటో?

ప్లాస్మా. టీవీ కాదు. బ్లడ్ ప్లాస్మా.

ఇవ్వాళ నేను కెనడియన్ బ్లడ్ సర్వీసెస్ వారి సెంటర్ ఒకదానిలో (మొదటిసారి) ప్లాస్మా దానం చేసొచ్చాక ఆ అనుభవం రాసి, ప్లాస్మా దానం అవసరం గురించి కూడా చెబుదామనుకున్నాను. అందుకే ఈ బ్లాగు పోస్టు.

తెలుగులో ప్లాస్మా ని ఏమంటారో?‌ అని వెదికితే రక్తరసం, రక్తజీవద్రవ్యం, నెత్తురు సొన అన్న పదాలు కనబడ్డాయి. రక్తదానం మనలో చాలా మందికి పరిచయం ఉన్న పదమే. తరుచుగా బ్లడ్ డొనేషన్ కాంపులు అవీ చూస్తూ ఉంటాము, కొంచెం పరిసరాలు గమనించే అలవాటు ఉంటే. నేను నాకు ఇరవై ఏళ్ళ వయసప్పటి నుండి సగటున ఏడాదికీ, రెండేళ్ళకీ ఒకసారి రక్తదానం చేశాను (దీని గురించి గతంలో రాశాను). ఇన్నిసార్లలో ఎప్పుడూ నాకు ఇలా ప్లాస్మా సపరేటుగా తీసుకుని మళ్ళీ మన రక్తం మనకి తిరిగి ఎక్కించేసే పద్ధతి ఒకటుందని తెలియదు (ఇలాంటిది బాలకృష్ణ సినిమాలో జరుగుతుందని చెబితే నమ్మి ఉందును). ప్లాస్మా, ప్లేట్లెట్ డొనేషన్ సపరేటు అని విన్నా కానీ వివరాలు తెలుసుకోలేదు. ఒక ఆర్నెల్ల క్రితం అనుకుంటా, మా ఇంటి నుండి ఒక కిలోమీటరు దూరంలో కొత్త ప్లాస్మా సెంటర్ తెరిచారు. అప్పట్నుంచి వాళ్ళ రక్తదాతల డేటాబేస్ లో ఈ ఏరియాలో ఉన్న అందరికీ వరసగా మెసేజిలు, ఫోన్ లు వీటిద్వారా కాంపైన్ మొదలుపెట్టారు. అప్పుడే నాకు మొదట ఎందుకు ఇంతలా చెబుతున్నారు? అన్న ప్రశ్న కలిగింది.

అసలేమిటీ ప్లాస్మా డొనేషన్?

మన రక్తం లో 55% ఉంటుందంట ఈ ప్లాస్మా అనబడు పాలిపోయిన పసుపు రంగులో ఉండే పదార్థం. మామూలుగా రక్తదానం చేస్తే అందులో ఎర్ర రక్త కణాలు, ప్లాస్మా, ప్లేట్లెట్స్ – ఈ మూడు సెపరేట్ చేసి వాడొచ్చంట (అంతా అలాగే కలిపి ఉంచేసి కూడా వాడతారు అనుకుంటా). ప్లాస్మా డొనేషన్ అంటే రక్తంలోంచి ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు అనమాట. తీసుకుని మిగితా రక్తం తిరిగిచ్చేస్తారు (ఇదే నాకు బాలకృష్ణ సినిమాలా అనిపించిన అంశం). ఈ ప్లాస్మా ని ప్రాణాలు కాపాడేంత ప్రభావం గల వివిధ రకాల మందుల్లో వాడతారంట. అలాగే, కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో నేరుగా పేషంట్లకి కూడా ఇస్తారంట రక్తం ఇచ్చినట్లు (ఈ పేజిలో ప్లాస్మా తో ఏంచేస్తారన్న విషయం క్లుప్తంగా తెలియజేస్తూ రెండు చిన్న విడియోలు ఉన్నాయి). మరి నేను కెనడాలో చేశాను కనుక ఇక్కడి విషయం తెలుసు – ప్లాస్మా డొనేషన్ ద్వారా వచ్చే దానితో పోలిస్తే దాని అవసరం ఇంకా ఎక్కువ ఉందంట. అందువల్ల యూఎస్ నుంచి కొంటూ ఉంటారంట ఇక్కడ. కొన్ని ప్రాంతాల్లో ప్లాస్మా ఇచ్చిన వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తారంట (నేను వెళ్ళింది మామూలు రక్తదానం/ప్లాస్మాదానం చేసే ప్రదేశం. నీళ్ళు, జూస్ లాంటివి ఇస్తారు దాతలకి).

ఎందుకీ ప్లాస్మా డొనేషన్? రక్తదానం చాలదా? ప్లాస్మా అవసరం విపరీతంగా ఉంది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా. కోవిడ్ కొంత కారణం సప్లై తగ్గిపోడానికి అని ఇక్కడ అన్నారు. పూర్తి రక్తదానం తో పోలిస్తే ప్లాస్మా ఎక్కువసార్లు ఇవ్వొచ్చంట. పైగా పైన రాసినట్లు ప్రాణాంతకమైన వ్యాధులు కొన్నింటి ట్రీట్మెంట్లో ప్లాస్మా చాలా విలువైనది. కోవిడ్ పేషంట్లకి కూడా ప్లాస్మా ఉపయోగం ఉంది. కనుక పూర్తి రక్తదానం ఎంత ముఖ్యమో, ప్లాస్మా దానం కూడా అంతే విలువైనది అని వీళ్ళ కాంపైన్ లో చెబుతున్నారు ఇక్కడ.

ఇదంతా కొంచెం తెలుసుకున్నాక కూడా నేను వెంటనే ఈ కాల్ కి స్పందించలేదు. మార్చి చివర్లో ఒకసారి రక్తదానానికి పోతే అక్కడ హిమోగ్లోబిన్ లెవెల్ చూసి, చాలా తక్కువుంది, తీసుకోము అన్నారు. ఇలా జరగడం ఇదే మొదటిసారి. మూడు నెలలక్రితం చాలా మైల్డ్ గా కోవిడ్ పలకరించి పోయింది. దాని ప్రభావమో ఏమిటో? అంటే కావొచ్చు అన్నారు. కానీ, మరీ తక్కువగా ఉంది. ఒకసారి డాక్టర్ తో మాట్లాడు. ఫలానా ఫలానా బాగా తిను. ఐరన్ సప్లిమెంట్ తీసుకో, ఇలా జాగ్రత్తలు చెప్పి పంపేశారు. అసలు నా జీవితంలో ఇలా హిమోగ్లోబిన్ తక్కువ అవడం ఇదే మొదటిసారి. ఖంగారుతో కూడిన డిప్రెషన్ కొంతా, ఇలా ఇంట్లో వాళ్ళని చూస్కోడం‌కాదు, మనల్ని మనం కూడా చూసుకోవాలి అన్న జ్ఞానం వల్ల కొంతా… ఇక కొన్నాళ్ళు నేను ధైర్యం చేయలేదు. తరవాత జులై లోనో ఎప్పుడో‌ మళ్ళీ వెళ్ళా, ఈ సారి ప్లాస్మా దానం ప్రయత్నిద్దాం అని.

అప్పటికి రక్తం మళ్ళీ సర్దుకున్నట్లు ఉంది. కానీ, సరిగ్గా వాళ్ళకి ఒక కటాఫ్ ఉంటుంది దాతల నుండి ప్లాస్మా తీసుకోవడానికి. అంతే ఉంది. అందుకని కొన్నాళ్ళాగమన్నారు. కానీ, ఫోనులు, ఈమెయిల్ కాంపైన్ మాత్రం ఆగలేదు. సరే, ఈమధ్య ఆరోగ్యం బానే ఉంది కదా, ఈ వారం కాస్త పని తక్కువగా ఉందని మళ్ళీ ధైర్యం చేసి చూశా. లాస్టుకి ఇవ్వాళ ఈ‌ ప్రొసీజర్ అయింది. వాళ్ళకి ఏవో కొన్ని పరిమితులు ఉంటాయి. కొన్ని మందులు వాడే వాళ్ళవి తీసుకోరు. రక్తహీనత ఉంటే ఎలాగో తీసుకోరు. ఇంకా పెద్ద లిస్టు ఉంది. మామూలుగా ఆరోగ్యంగా ఉన్న వారు ఒకసారి వెళ్ళి వాళ్ళని సంప్రదిస్తే మనం వాళ్ళకి సరిపోతామో లేదో చెబుతారు. సీనియర్ సిటిజెంస్ కూడా కనిపిస్తూ ఉంటారు వెళ్ళిన ప్రతిసారీ. వీలు/అర్హత ఉన్న అందరం భయపడకుండా, అపోహలు పెట్టుకోకుండా, చేయాల్సిన పని ఇది అనిపించింది వెళ్ళొచ్చాక.

విధానం: మన బరువు, ఎత్తు బట్టి ఎంత తీసుకోవాలో నిర్ణయిస్తారంట. అది అయాక ఒక అరగంట-ముప్పావు గంట పడుతుంది అన్నారు. మామూలు రక్త దానం లాగే సూది గుచ్చి తీసుకున్నారు గానీ, మళ్ళీ ప్లాస్మా తీసుకుని రక్తం వెనక్కి పంపించేస్తారంట. ఆ కాస్త దానిలో అంతా ఎర్రగా ఉంటుంది కనుక పోతోందో వస్తుందో కనబడదు అనుకోండి, స్క్రీన్ మీద మాత్రం ఎప్పుడు ఏం జరుగుతోందో కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకున్న కోడ్ ప్రకారం (ఒక సింబల్ కి రక్తం బైటకి పోతుందని, ఒక సింబల్ కి లోపలికొస్తోందని అర్థం). నాకు ఈ ప్రొసీజర్ ఇరవై నిముషాలకే ముగిసింది. నేను ఇలాంటివి చేసే ముందు నీళ్ళు బాగా తాగుతా, కాఫీ ఒక నాలుగైదారు గంటల ముందే మానేస్తా (అందుకే మధ్యాహ్నం అపాయింట్మెంట్లు తీసుకుంటా) – రెండూ‌ మంచి ప్రాక్టీస్ అని, తొందరగా ఐపోవడానికి దోహదం చేసేవే అని అక్కడున్న నర్సు చెప్పింది ఒకసారి బ్లడ్ డొనేషన్ లో. ఆరోజు రక్తదానం కూడా ఆరు నిముషాలలో ముగిసింది.

ఆ సొంత సుత్తి అటు పెడితే, మొత్తానికి నేను చెప్పేది – నాకు అర్థమైనది ఏమిటంటే:

  • ప్లాస్మా అవసరం పూర్తి రక్తం కంటే కూడా ఒకోసారి ఎక్కువగా ఉంటుంది. కోవిడ్ వల్ల డిమాండు ఇంకా ఎక్కువైంది (ఇది వేరే దేశాల్లో కూడా జరిగింది)
  • కొన్ని రోగాల ట్రీట్మెంట్ కి ప్లాస్మా తోనే పని
  • ప్లాస్మా ఉపయోగించి కొన్ని మందులు కూడా తయారుచేస్తారు
  • ప్లాస్మా దానం ప్రతి పదిహేనురోజులకోసారి చేసినా కూడా మామూలుగా ఆరోగ్యవంతులుగా ఉండేవారికి వచ్చే నష్టం లేదు.
  • మామూలుగా రక్తదానం చేశాక నీరసం లాంటివి అనుభవించకపోతే ప్లాస్మా దానం తర్వాత కూడా ఏం అవ్వదు.

వెరసి మామూలు మనుషులు అతి సులభంగా, అదీ మళ్ళీ మళ్ళీ తరుచుగా చేయగలిగే గొప్ప పని ప్లాస్మా దానం. వాళ్ళన్నారని రెండు వారాలకోసారి వెళ్ళిపోయే ఉద్దేశ్యం, టైము నాకు లేవు. అయితే, రక్తదానం ఏడాదికోమాటు చేస్తే చాలు అనుకునేదాన్ని నేను (వాళ్ళు మూణ్ణెల్లు, ఆర్నెల్లు అంటారు కానీ, ఆడమనిషిగా, తల్లిగా, ఉద్యోగినిగా, గృహిణిగా అంత తరుచుగా చేసి నిభాయించుకోలేను అనుకుంటున్నా). ప్లాస్మా కి వీలు ఉండి, రక్తహీనత లాంటివి, ఇతరత్రా అనారోగ్యాలేవీ పట్టుకోకపోతే మూడు, నాలుగు నెలలకొకసారైనా చేయాలి అనుకుంటున్నా. పైగా, అట్లా ఓ ఐదునిముషాలు పోతే ఆ సెంటర్ వచ్చేస్తుంది. చేయననడానికి నాకు కారణాల్లేవు. నా స్నేహితురాలు ఒకామె బిడ్డకి జన్మనిచ్చి ఆర్నెల్లు కూడా కాకుండానే వెళ్ళి ప్లాస్మా ఇచ్చొచ్చింది ఈమధ్యనే. ఆమే నాకు స్పూర్తి ప్రస్తుతానికి.

ఇకపోతే, ఈ పోస్టు రాయబోతూ రక్తం బదులు ప్లాస్మా ఎందుకు దానం చేయాలి? అన్న సందేహం కలిగి కాసేపు అవీ ఇవీ చదివా. కొన్ని బ్లడ్ బాంక్ వెబ్సైట్లలో ఫలానా బ్లడ్ గ్రూపు వారు ప్లాస్మా, ఫలానా వాళ్ళు ప్లేట్లెట్, ఫలానా వాళ్ళు రక్తం/ప్లాస్మా/ప్లేట్లెట్ చేస్తే అందరికీ మోస్ట్ బెనెఫిట్ కలుగుతుంది అని రాశారు. ఇది మరి ఆయా దేశాలలో ఉన్న జనాల బ్లడ్ గ్రూపుల డిస్ట్రిబ్యూషన్ బట్టి ఉంటుందో ఏమో అర్థం కాలేదు. ఒక డాక్టర్ మిత్రుడిని వాకబు చేస్తే ఇదే వినడం ఈ మాట, చదివి చెబుతానన్నారు. ఆ విషయం ఆయన చెప్పేది నాకు అర్థమైతే తర్వాత రాస్తా.

Published in: on October 22, 2022 at 1:11 am  Comments (1)  

రక్తదానం – వివిధ దేశాలలో నా అనుభవాలు

ఇవ్వాళ ఇక్కడ రక్తదానానికి వెళ్ళొచ్చాను. చివరిసారిగా రక్తం ఇచ్చి పదేళ్లు దాటింది. కానీ అప్పట్లో తరుచుగా ఇచ్చేదాన్ని. అందుకని ఓసారి గతం గుర్తు తెచ్చుకుందామని పోస్టు.

నాకు చిన్నప్పట్నుంచీ రక్తదానం అంటే చాలా గొప్ప అన్న భావన ఉండేది.  నాకు ఊహ తెలిసేనాటికి పత్రికల్లో టీవీల్లో రక్తదానం ప్రకటనలవీ చూసీ మనం కూడా ఇయ్యాలి… తగిన వయసు టక్కుమని రావాలి అని ఎదురుచూస్తూ ఉన్నా. మొదటిసారి రక్తదానం ఇంజనీరింగ్ లో ఉండగా కాలేజి లోనే ఒక బ్లడ్ డొనేషన్ క్యాంపు పెడితే అక్కడ ఇచ్చా. ఇండియా లో ఉన్నపుడు దాదాపు ప్రతి ఆర్నెల్లకూ ఇచ్చేదాన్ని – ఆఫీసులోనో, ఫ్రెండు వాళ్ళ సేవా సంస్థలోనో, ఎక్కడో ఓ చోట క్యాంపులు పెట్టేవాళ్ళు. వాటిలో ఇచ్చేదాన్ని. ఓసారి 2006 లో  అనుకుంటాను – పేపర్లో నా గ్రూపు రక్తం కావాలన్న ప్రకటన చూసి కదిలిపోయి, మా అమ్మ పర్మిషన్ తీసుకుని NIMS ఆసుపత్రికి పరిగెత్తి ఇచ్చొచ్చా. ఎవరో ఒక నా ఈడు మనిషికే ఇచ్చా, ఆ మనిషి వెంట చాలా పెద్దామె ఎవరో మాత్రమే ఉంది. వాళ్ళు జూసిచ్చారు, ఆమె దండం‌ పెట్టింది. నేను మొహమాటపడి తిరిగి దండం పెట్టి గబగబా బైటకొచ్చేశా. 

అప్పట్లో ఒక బ్లడ్ డోనర్ కార్డు (రెడ్ క్రాస్ అనుకుంటా), ఒక ఐ డోనర్ కార్డు (ఎల్ వీ ప్రసాద్ వారి దగ్గర రిజిస్టర్ అయితే ఇచ్చారు), ఒక ఆర్గన్ డోనర్ కార్డు (మోహన్ ఫౌండేషన్ అనుకుంటాను, గుర్తులేదు)  ఇన్ని పెట్టుకు తిరిగేదాన్ని పర్సులో. మనమసలే విచ్చలవిడి టూ వీలర్ డ్రైవర్లం… ఏదన్నా అయితే కనీసం ఇంకోళ్ళకి ఉపయోగపడతాం అని (ఇంట్లో వాళ్ళకి తెలుసు లెండి. ఏదీ రహస్యంగా చేయలేదు). కానీ, అదంతా అక్కడితోనే పోయిందని తెలియలేదు నాకప్పుడు. 

దేశం దాటాక అదేమిటో ఇలాంటి రక్తదాన శిబిరాలు ఇప్పటిదాకా చూడలేదు. జర్మనీ వెళ్ళిన కొత్తల్లో ఓ స్నేహితురాలిని అడిగాను – ఇక్కడ రక్తదానం చెయ్యాలంటే ఏం‌చెయ్యాలి? అని. ఆమె ఆశ్చర్యంగా చూసి ఎందుకన్నది. “ఎందుకేమిటి? మామూలుగా బ్లడ్ బ్యాంకులకి రక్తం అవసరం ఉంటుంది కదా. అందుకని ఇద్దామనుకుంటున్నా” అన్నా. “ఇక్కడ అలా ఊరికే పోతే తీసుకోరు అనుకుంటాను, మీ ఇండియాలో ఎవరి బ్లడ్డన్నా అలా తీసేసుకుంటారా?‌” అని ఆశ్చర్యపోయింది. ఊరికే తీస్కోర్లేవమ్మా, ప్రశ్నలన్నీ వేసే తీసుకుంటారని చెప్పా కానీ, జర్మనీ లో ఎలా ఇవ్వాలన్నది మాత్రం అర్థం కాలేదు మొత్తం ఐదేళ్ళలో. భాష సమస్య ఒకటి కూడా కారణం అయుండొచ్చు నాకు.

కట్ చేస్తే యూఎస్ లో అసలు ఊపిరి సలపని ఉద్యోగం. దానికి తోడు కొంత వ్యక్తిగత ఇబ్బందులు. ఎక్కడా శిబిరాలు కానీ, ఇవ్వమని పిలుస్తూ ప్రకటనలు కానీ కనబడలేదు యూనివర్సిటీలో ఉన్నా కూడా – దానితో నేనూ ఎక్కడా ప్రయత్నించలేదు. 

కెనడా వచ్చాక కూడా చాలా రోజులు ఇలాగే కొనసాగింది… పైగా రాంగానే కొన్ని నెలల్లోనే ప్రెగ్నంసీ, పాప పుట్టడం, ఆ తరువాత కొన్ని నెలలకి మాయదారి కోవిడ్ – వీటితోనే సరిపోయింది. కానీ గత ఏడాది కాలంలో ఇక్కడ తరుచుగా బ్లడ్.సీయే వెబ్సైటు వారి ప్రకటనలు రోడ్డు మీదా, ఇంటర్నెట్ ఆడ్స్ లో కూడా కనిపించేవి. “రక్తదానం నిరంతర అవసరం. ఈ మహమ్మారి కాలంలో మరింత అవసరం”  అని ముఖ్యంగా కోవిడ్ సమయంలో మీ రక్తదానం మరింత అవసరం అని వారు చేసిన కాంపైన్ నన్ను బాగా కదిలించింది (స్వేచ్ఛానువాదం లెండి!).  సరే, కొంచెం ఇక పిల్ల కొంచెం పెద్దవుతోంది కదా అని ఇంటి దగ్గర ఏవైనా శిబిరాలున్నాయా అని చూడ్డం మొదలుపెట్టా. ఇంటి అడ్రస్ బట్టి వెదుకుతూ ఉంటే ఒకటి కనబడ్డది (మళ్ళీ దూరమంటే పిల్లని ఎక్కువ సేపు వదిలి పోవడం ఇష్టం లేక!).  మా పాప రెండో‌ పుట్టిన రోజు లోపు ఇవ్వాలనుకున్నా మా ఇంటి పుట్టినరోజు వేడుకలో భాగం అని. 

అపాయింట్మెంటు తీసుకున్నాక మనసు పీకడం మొదలుపెట్టింది. రెండు మూడు వారాల ముందు నుంచే ఇండియా/యూఎస్ లో ఉన్న డాక్టర్ స్నేహితుల తల తిన్నా – కోవిడ్ పరిస్థితిలో రక్తం ఇచ్చొచ్చాక నాకేమన్నా అవుతుందా? అని. నా బాల్య స్నేహితురాలేమో టెస్ట్ చేయించుకుని వెళ్ళి ఇవ్వు. పొరపాట్న నువ్వు పాజిటివ్ అయితే అదో ఇబ్బంది కదా బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి? అన్నది (పాయింటే, నేనాలోచించలేదు). ఇంకో స్నేహితులేమో సిచ్యువేషన్ బట్టి డిసైడ్ అవ్వు – కేసులు తగ్గుముఖం పడుతూంటే వెళ్ళు అన్నారు. ఆఫీసు వాళ్ళని కూడా తిన్నా – ఈమధ్య మీరేవన్నా రక్తం ఇచ్చారా? అని. ఒకరేమో – నువ్వు డెంటిస్టు దగ్గరికెళ్ళావా ఈ ఏడాది కాలంలో?‌ డెంటిస్ట్ కంటే రక్తదానం వల్ల ఏం ఎక్స్పోజ్ అవ్వవు నువ్వు అన్నారు (ఇది కూడా నిజమే కదా… అనుకున్నా). ఇంతలో ఓ కొలీగ్ – నాకన్నా పెద్దామే – “నేనిచ్చొచ్చాను ఈమధ్యే. ఏం కాదు, చాలా జాగ్రత్తలు తీసుకుంటూన్నారు.. ఖంగారు పడకు” అని భరోసా ఇచ్చింది. దానితో ముందడుగేశా. గతంలో రక్తం ఇచ్చేటపుడు రక్తం చూస్తే భయపడే వాళ్ళని, దాని వల్ల రక్తదానం చేయలేకో, చేసాక కళ్ళు తిరిగో పడిపోయే చాలామందిని చూశాను. ఇప్పటి కాలం లో వైరస్ భయమే ఎక్కువ. 

రెండు వారాలకోసారి, వారం ముందు ఓసారి, నాలుగు రోజుల ముందో సారి రిమైండర్లు – కోవిడ్ జాగ్రత్తల గురించి, వెళ్ళాక ఏమవుతుంది?‌ (కోవిడ్ ప్రశ్నలు, డోనర్ ఆరోగ్యం గురించి ప్రశ్నల చిట్టా, రక్తంలో హిమోగ్లోబిన్ టెస్టు) ఎంతసేపు పడుతుంది? ఇలాంటివన్నీ వివరిస్తూ ఈమెయిల్స్ పంపారు. మధ్యలో ఒకరోజు మళ్ళీ కోవిడ్ anxiety వల్ల వాళ్ళ వెబ్సైటులో ప్రశ్నోత్తరాలన్నీ చదివి, ఉన్నవి చాలక చాట్ బాక్స్ లో రక్తం, ప్లాస్మా, ప్లేట్లెంట్స్ ఇన్ని రకాల దానాలలో తేడా ఏమిటి? నేనేదైనా ఇవ్వొచ్చా? ఇలాంటివన్నీ అడిగి తలకాయ తింటే ఒక రిజిస్టర్ర్డ్ నర్సు నాకు ఓపిగ్గా జవాబులు కూడా ఇచ్చింది. అంతా చూశాక సాహసించానిక – పర్లేదు, నాకేం కాదు అక్కడికి వెళ్ళొస్తే అని. ఇందాక రాసినట్లు, రక్తం గురించి కాదు నా భయం – కోవిడ్ గురించి! ఇంట్లో నాతో పాటు ఉన్న కుటుంబం గురించి!)

అయితే, అసలు వెళ్ళినప్పటి నుండి ఇల్లు చేరేదాకా ఇదే ఇప్పటి దాకా నా బెస్ట్ రక్తదానం అనుభవం. వెళ్ళగానే టెంపరేచర్ చూసి, ప్రశ్నలూ అవీ వేసీ ఇంకో గదికి పంపారు. కెనడాలో ఇదే మొదటిసారి కనుక అక్కడ వాళ్ళ డేటాబేస్ లో నానా రకాల ప్రశ్నోత్తరాలకి జవాబులు రిజిస్టర్ చేశారు. తరువాత ఒకామె వచ్చి హీమోగ్లోబిన్ లెవెల్ చూడ్డానికి ఓ చుక్క రక్తం తీసుకుంది. చివరికి మళ్ళీ ఓసారి అంతా వివరంగా చెప్పాక, రక్తదానం మొదలైంది. ఐదు నిముషాల ఒక సెకను పట్టింది అంతే సాధారణ మొత్తంలో రక్తం తీయడానికి. అంతేనా? ఇంతకుముందు ఇంకాసేపు పట్టేదే అనుకున్నా. కానీ ఆమె మొదటే అనింది – if you are hydrated, it is very quick అని. అంతే ఇంక. మరో ఐదునిముషాలు కూర్చున్నాక ఇంక పొమ్మన్నారు జ్యూసు, నీళ్ళు, బిస్కట్లు గట్రా కొన్ని వాయినం కూడా ఇచ్చి పంపారు… ఇస్తినమ్మా రక్తం, పుచ్చుకుంటినమ్మా వాయినం. 

ఇన్ని దేశాల్లో కెనడా వారి రక్తదాన శిబిరాల పద్ధతి అన్నింటికంటే సులభంగా అనిపించింది. ఆ తరువాత ఇండియా – నిజానికి ఈ వెబ్సైటులూ అవీ ఉన్నాయో లేదో నాకు తెలీదు కానీ, పది-పదిహేనేళ్ళ క్రితం ఆ శిబిరాలు తరుచుగానే కనబడేవి ఇండియాలో. అక్కడెప్పుడూ‌ నాకు రక్తం ఇవ్వడానికి ఇబ్బందులు కానీ, ఎక్కడివ్వాలి? అన్న ప్రశ్న కానీ ఎదురవలేదు. అయితే నేను అక్కడే పుట్టీ పెరిగిన దాన్ని, స్వచ్ఛంద సంస్థలలో మధ్య మధ్య వాలంటీర్ గా వెళ్ళేదాన్ని .. ఒకసారి ఇలాగే రక్తదాన శిబిరంలో కూడా వాలంటీరు గా చేశాను (అప్పట్లో ఆపనులు చేసే స్నేహితులు పట్టుకుపోయేవారు ఖాళీగా కనిపిస్తే – స్వతహాగా అంత సేవా దృక్పథం లేదు నాకు). కనుక కొంచెం ఎక్కువ తెలిసేవి ఇలాంటి శిబిరాల గురించి.  కెనడాలో అయితే కొత్త వాళ్ళకి కూడా తేలిక అనిపించింది. డ్రైవర్స్ లైసెన్స్ దగ్గరే అవయవ దానం గురించి అడిగి, కార్డు మీద డోనర్ అని వేసేశారు. ఐ/టిశ్యూ డోనర్ గా కూడా రిజిస్టర్ అవడం తేలిక ప్రభుత్వం వారి ఆరోగ్య భీమా వివరాలకి అనుసంధానం చేశారు కనుక.  ఇలా  ఒక్క అదనపు కార్డు కూడా పెట్టుకోకుండానే నేను నేత్ర/అవయవ/టిస్యూ దాతగా రిజిస్టర్ అయిపోయా కెనడాలో.  ఇపుడు బ్లడ్ డోనర్ గా కూడా రిజిస్టర్ అయిపోయా కనుక ఇంకోసారి ఇవ్వాలనుకుంటే‌ మరింత తేలిక – ఆల్రెడీ వాళ్ళ లిస్టులో ఉన్నా కనుక. బ్లడ్.సిఏ వారిది ఒక ఆప్ కూడా ఉంది. నాకు ఆప్ లు గిట్టవు కానీ దీన్ని మాత్రం దిగుమతి చేసుకున్నా భవిష్యత్ స్పూర్తి కోసం. 

మొత్తానికి  “రక్తదానం నిరంతర అవసరం. ఈ మహమ్మారి కాలంలో మరింత అవసరం” అన్నది నేనిచ్చే సందేశమనమాట. నేత్ర దానం చెయ్యండి, మరణంలో జీవించండి, మరణించీ జీవించండి అన్న ప్రకటనకి ఊగిపోయి ఆవేశపడిపోయే చిన్నపుడు ఐ డోనర్ గా సైనప్ అయ్యా. అంత క్యాచీగా రాయడం నాకు రాదు – కనుక ఇలా రాసుకుంటున్నా. మనం శ్రమలేకుండా చేయగలిగే ఏకైక గొప్ప పుణ్యకారం ఇదే అని నా అభిప్రాయం.  ఇక ఇక్కడ పద్ధతి తెలిసింది కనుక ఇకపై ఏడాదికి ఒకట్రెండు సార్లన్నా ఇవ్వాలి అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో!

మా పాప పుట్టిన రోజు లోపు చెయ్యాలనుకుని వెళ్ళా. ఈ వారంలో మా తాతయ్య మరణం తో – ఇది ఆయన జ్ఞాపకంగా కూడా నేను చేసుకుంటున్నట్లు అయ్యింది. పుట్టినరోజుకీ, చావులకీ రక్తదానం ఏమిటి? అంటారా – కేకులు కూడా కోస్తామండి తర్వాత పుట్టినరోజుకి. కన్నీళ్ళు కూడా కారుస్తాం తాతకోసం- ఒక్కోళ్ళకీ ఒక్కో పద్ధతి ఉంటుంది కష్టానికీ, సుఖానికీ స్పందించడానికి. అందువల్ల ఏమనుకోకండి నా గురించి 🙂

స్వస్తి.  

Published in: on May 16, 2021 at 2:00 am  Comments (2)  

Tommy Douglas (20 October 1904 – 24 February 1986)


టామీ‌ డగ్లస్ గురించి నేను మొదటిసారి విన్నది గత ఏడాది The Promise of Canada అన్న పుస్తకంలో. కెనడాలో పబ్లిక్ హెల్త్ కేర్ పద్ధతికి నాంది పలికిన నాయకుడు ఆయనే అని అప్పుడే తెలిసింది. తరువాత అది కాక ఈ దేశంలోని ఇతరత్రా ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి కూడా అతను కెనడాలోని ఒక రాష్ట్రంలో మొదలుపెట్టిన పథకాలు స్పూర్తినిచ్చాయని చదివాను. ౨౦౦౪ లో కెనడాలో జరిగిన ఓ టీవీ ప్రోగ్రాంలో ప్రజలు ఈయనని గ్రేటెస్ట్ కెనెడియన్ గా కూడా ఎంపిక చేశారు. ఇవన్నీ తెలిశాక ఈయన మీద నాకొక గౌరవం ఏర్పడ్డది.

సాధారణంగా నాకు ప్రజల సంరక్షణ ప్రభుత్వం బాధ్యత అని ఆలోచించే విధానం మీద కొంచెం గౌరవం ఉంది. ప్రజలు కట్టే పన్నులలో కొంతభాగం వారికి అందరికీ ఉచిత వైద్యం అందించడానికి వాడతారంటే అది మంచి విషయం అనే అనుకుంటాను. నేను జర్మనీలో ఉన్నపుడు ఇలాగే పబ్లిక్ హెల్త్ ఖర్చులకి నెలజీతంలో చాలా (అప్పటికి నాకు చాలా అనే అనిపించేది) పోయేది. నేను మొత్తం ఐదేళ్ళలో కనీసం మందుల షాపుకు కూడా పోలేదు. నాలా ఉన్న మరొక స్నేహితుడితో ఈ విషయమై ఒకట్రెండు సార్లు చర్చ జరిగింది – అలా మనమెందుకు ధారపోయాలి ఎవరో జబ్బులకి? అని అతనూ… ప్రజలు కట్టే పన్నులకి వ్యక్తిగత లెక్కలేమిటని నేనూ. అక్కడ నుంచి యూఎస్ వెళ్ళాక ఒకసారి సైకిల్ లో పోతూ ఉండగా కిందపడి తలకి దెబ్బ తగిలింది. స్పృహ తప్పడంతో అప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. మొత్తం ఆరోజు అక్కడ నేను కట్టింది పది డాలర్లు. ఎందుకంటే మిగితాది ఆఫీసు ఇన్సూరంసులో వెళ్ళిపోయింది. ఆరోజు మొదటిసారి అనిపించింది అంటే ఉద్యోగం ఉంటేనే వైద్యసేవలని ఉపయోగించుకోగలమా? అని. అయితే, సాధారణంగా (నా అదృష్టం కొద్దీ) ఏ ఆర్నెల్లకో ఏడాదికో తప్ప కనీసం మామూలు డాక్టర్ దగ్గరికైనా నేను వెళ్ళను కనుక, ఈ విషయం పెద్దగా ఆలోచించలేదు.

ఈ ఏడాదిలో ఒకరోజు – నాకు ఏడో నెలలో పాప పుట్టింది. ఆరోజు నేను ఎమర్జెంసీ ఆంబులెంసులో వచ్చాను హాస్పిటల్ కి ఉన్నట్లుండి నొప్పులు రావడంతో‌. తరువాత మా పాపని ఉంచిన హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ వంటిది. ఆ వాతావరణం, ఆ ట్రీట్మెంటు పద్ధతులు, అంతా అదొక స్థాయిలో ఉన్నట్లు అనిపించాయి. అంతా బానే ఉంది కానీ ఇదంతా మనం పెట్టుకోగలమా? అని నాకు అనుమానం, భయం. అప్పటికి పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టం అని తెలిసినా కూడా ఎంతైనా ఇలా ఇన్నాళ్ళు ఇంత లెవెల్ సౌకర్యాలున్న చోట ఉంటే ఎంతో కొంత కట్టుకోవాలి కదా? అని నా అనుమానం. ఆల్రెడీ నా డిస్చార్జి దగ్గర నర్సుని అడిగా ఎవ్వరూ నా క్రెడిట్ కార్డు వివరాలైనా అడగలేదేంటి? అని (ఆవిడ పెద్దగా నవ్వింది కానీ ఆంబులెంసు బిల్లు పోస్టులో వస్తుందేమో అని నేను రెండు నెలలు చూశా). పాప హాస్పిటల్లో కూడా అంతే. ఎక్కడా ఎవరూ డబ్బు కట్టాలి అని చెప్పలేదు. మేమూ కట్టలేదు. రెండు నెలలు ఇలాగే సాగింది. ఇదే సమయంలో ఇలాగే ప్రీమెచ్యూర్ బేబీ ట్రీట్మెంట్ అని రెండు go fund me campaigns చూశాను – ఒకటి యూఎస్ లో, ఒకటి ఇండియాలో. వాళ్ళు ఫండ్ అడుగుతున్న మొత్తం చూసి గుండె ఆగినంత పనైంది. ఈ లెక్కన ఇలాంటి ఒక పెద్ద ఆరోగ్య సమస్య వస్తే చాలు ఓ కుటుంబం దివాళా ఎత్తడానికి అనిపించింది. మంచి హాస్పిటల్లో గొప్ప ట్రీట్మెంట్ అయ్యాక కూడా మాకేం బిల్లు రాకపోయేసరికి ఆశ్చర్యం, డగ్లస్ తాత మీద భక్తిభావం ఒకేసారి కలిగాయి నాకు. ఈ విధమైన పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టం ఎందుకు అవసరమో, ఎంత అవసరమో అప్పుడు అర్థమైంది.

దాదాపు అరవై ఏళ్ళ నాడు డగ్లస్ ప్రతిపాదించి, పట్టుబట్టి, అనేక వ్యతిరేకతలని (ముఖ్యంగా డాక్టర్ల నుండి వచ్చిన వ్యతిరేకతని కూడా) తట్టుకుని, ఈ universal health care అన్న ఆదర్శాన్ని స్థాపించడాన్ని తన ప్రధాన లక్ష్యంగా ఎన్నుకున్నాడు. చివరికి అతని తరువాతి ప్రీమియర్ (ముఖ్యమంత్రి లాగా) Saskatchewan రాష్ట్రంలో ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో నడిచే హెల్త్ కేర్ పద్ధతిని మొదలుపెట్టారు. డగ్లస్ చిన్నతనంలో అతని కాలుకి ఏదో ప్రమాదం జరిగి కాలు తీసేసే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరా అంత డబ్బుల్లేవు. ఈ సమయంలో ఓ డాక్టరు ఈ ట్రీట్మెంటు ఉచితంగా చేస్తా కానీ మా క్లాసు విద్యార్థులకి చూపించడానికి వాడుకుంటా, మీరు ఒప్పుకోవాలి అని అడిగాడంట. ఆ విధంగా డగ్లస్ కాళ్ళు నిలబడ్డాయి. ఈ అనుభవం అతను ప్రజారోగ్యం ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి కానీ ఎవరి దగ్గర డబ్బులెక్కువున్నాయి అన్న దానిమీద ఆధారపడకూడదు అనుకునేలా చేసిందని అంటారు. ఇంతకీ ఆ ఒక్క రాష్ట్రంలో ఆయన మొదలుపెట్టిన పద్ధతి తరువాత వేరే పార్టీ వాళ్ళు జాతీయ స్థాయికి తెచ్చి, కెనడాలో ఆ పద్ధతి స్థిరపడింది. ఎంతగా అంటే ఏ పార్టి అయినా దాన్ని తీసేయాలంటే ఇంక వాళ్ళకి ఓట్లు పడవు అనుకునేంతగా. అంటే ఈయనొక్కడే చేశాడు, మిగితా ఎవ్వరు చేయలేదని కాదు కానీ, ఈయన్నే ‘father of medicare’ గా తల్చుకుంటారు కెనడాలో.

పోస్టు మొదట్లో ప్రస్తావించిన పుస్తకంలో ఈయన గురించి రాసిన క్రింది వాక్యాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి.

అప్పట్నుంచే ఆయనంటే ఉన్న ఓ గౌరవం ఈ‌ఏడు హాస్పిటల్ అనుభవాల దెబ్బకి భక్తిగా మారిపోయింది. మాకు కృతజ్ఞతాభావం ఎక్కువైపోయి ఆయన పోస్టర్ ఒకటి (పోస్టు మొదట్లో ఉన్న బొమ్మ) కూడా ఇంట్లో పెట్టుకున్నాము 🙂 నేను చేయగలిగిన వాలంటీర్ పనులు చేసి ఈ హెల్త్ కేర్ సిస్టంకి తిరిగి ఇచ్చుకోడం కూడా ప్రారంభించాను (గత పోస్టులో కొంత ప్రస్తావించాను). నా మట్టుకు నాకు డగ్లస్ ప్రాతఃస్మరణీయుడు అయిపోయాడు. అక్టోబర్ 20 ఆయన జయంతి. ఆ సందర్భంగా ఈ పోస్టు రాసి నా గోడు వెళ్ళబోసుకోడం, ఆయనకి నివాళి అర్పించడం రెండూ ఒక్క దెబ్బకి చేస్తున్నాను.

ఈయన గురించిన విమర్శలు నేను చదవలేదు. వ్యాసాలూ అవీ చదివినంత మట్టుకు – దేశానికి ప్రతి తరానికీ ఇలాంటి గొప్ప నాయకుడొక్కడు ఉండాలని అనిపించింది. డగ్లస్ గురించి కెనడా లో వివిధ సందర్భాల్లో వచ్చిన వార్తలు, రేడియో/టీవీ క్లిప్పింగ్స్ వంటివి కొన్ని ఇక్కడ చూడవచ్చు. ఏదో గంభీరంగా ఉంటాడు అనుకున్నా కానీ మంచి హాస్య చతురత ఉన్న మనిషి కూడానూ!

డగ్లస్ గారూ మీరు ఏ లోకాన ఉన్నా ఇక్కడ నాబోటి వాళ్ళ మనసులో ఉన్నంత గొప్పగా అక్కడా ఉండిపోండంతే.

 

Published in: on October 20, 2019 at 3:38 am  Comments (1)  

శాస్త్రరంగం – మహిళలు – నా గోడు

గత రెండు రోజుల్లో ఇద్దరు మహిళలకి నోబెల్ బహుమతి రావడం, తరువాత వరుసగా సీబీసీ (కెనడా వారి బీబీసీ అనమాట) రేడియోలో పలు చర్చలు వినడం అయ్యాక ఏదో ఈ విషయమై నాకు తోచిన నాలుగు ముక్కలు రాసుకోవాలని ఈ టపా. వ్యక్తిగత అభిప్రాయాలు – జనాంతికంగా రాసినవి కావు. కొంచెం కడుపుమంటతో, కొంచెం అసహనంతో రాసినది – ఆపై మీ ఇష్టం. (నువ్వు అయ్యప్ప గుళ్ళోకి ఎంట్రీ గురించి రాయలేదే? అనీ, మీ ఊళ్ళో‌ ఒక చర్చి బయట సైన్ బోర్డు లో పాపం వాళ్ళు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయబోతే, సైన్ బోర్డ్ కంపెనీ వాళ్ళు ఇది మా మతానికి విరుద్ధం అని రాత్రికి రాత్రి బోర్డే ఎత్తేస్తే, చర్చి వాళ్ళు మానవ హక్కుల కేసు వేశారు.- దాని గురించి రాయలేదే? అని అడిగేవాళ్ళకి – మీకు పనీపాటా లేదా ఇలా అందరినీ అడుక్కోవడం తప్ప? అని నా ప్రశ్న).

విషయానికొస్తే, మొన్న భౌతిక శాస్త్రంలో నోబెల్ అందుకున్న ముగ్గురిలో ఒకరు కెనడాకు చెందిన (నేను ఉండే ఊరికి దగ్గర్లోనే ఉన్న వాటర్లూ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న) మహిళా ప్రొఫెసర్ డొనా స్ట్రిక్లాండ్ ఒకరు. ఆవిడ ఇక్కడే దగ్గర్లోనే ఉన్న మరొక విశ్వవిద్యాలయం – మెక్ మాస్టర్ లో చదివి, తరువాత అమెరికాలో పీహెచ్డీ చేసి, తరువాత కెనడాలో ప్రొఫెసర్ గా చేరారు. సరే, మామూలుగా ఇక్కడ విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా మొదలుపెట్టి, ఆరేడేళ్ళకి అసోసియేట్ అయ్యి, ఆపైన మరో ఐదారేళ్ళకి ఫుల్ ఫ్రొఫెసర్ అవుతారు. ప్రతి ప్రొమోషన్ కి ఒక తతంగం ఉంటుంది. పలు విధాలైన డాక్యుమెంట్లు, ఆ రంగంలోనే, ఈ వ్యక్తికి సంబంధంలేని (అంటే‌ కలిసి పనిచేయని) మేధావుల నుండి రికమెండేషన్ లెటర్లు, ఇలాంటివన్నీ సబ్మిట్ చేస్తే, ఒక ఆరేడు నెలల రివ్యూ ప్రాసెస్ ఉంటుంది – యూనివర్సిటీలో వివిధ స్థాయుల్లో ఈ మొత్తం ఫైలుని పరిశీలించి, ఈ మనిషి ప్రపంచ స్థాయిలో పరిశోధనలు అవీ చేసి, గ్రాంట్లు గట్రా సంపాదించి, యూనివర్సిటీ స్థాయిని పెంచేలా పని చేశారా లేదా అని బేరీజు వేసి, చివర్లో నిర్ణయం తీసుకుంటారు ప్రొమోషన్ ఇవ్వాలా వద్దా అని (అందువల్ల, ప్రొఫెసర్ ఉద్యోగం అంటే హాయి, పనేం‌ ఉండదు అనుకునేవాళ్ళు – మీరు నెక్స్టు మంచినీళ్ళు తాగుతారు కదా – ఆ గ్లాసులోకి దూకండి). నేను చెప్పింది అమెరికాలో జరిగే పద్ధతి. కెనడా లో కూడా ఇంచుమించు ఇంతే, నాకు తెల్సినంత వరకు.

విషయం ఏమిటంటే, డొనా స్ట్రిక్లండ్ గురించి చదువుతున్నప్పుడు నేను గమనించిన మొదటివిషయం – ఆవిడ అసోసియేట్ ప్రొఫెసర్ అని. దగ్గర దగ్గర అరవై ఏళ్ళావిడ. నోబెల్ ప్రైజు వచ్చిందంటే (నిజానికి వచ్చింది ఆవిడ ముప్పై ఏళ్ళ క్రితం పీహెచ్డీ విద్యార్థినిగా రాసిన మొదటి పరిశోధనాపత్రానికి!) ఎంతో గొప్ప పరిశోధనలు చేసి ఉండాలి ఇన్నేళ్ళ కెరీర్ లో. అలాంటిది ఆవిడకి ప్రొఫెసర్ పదవి ఇవ్వలేదా వాటర్లూ వాళ్ళు అని. వీర ఫెమినిస్టులు కొందరు వెంటనే ఇది వివక్ష, ఆడ ప్రొఫెసర్ అని ఆవిడకలా చేశారు, అని పోస్టుల మీద పోస్టులు రాశారు. కాసేపటికి ఆవిడని ఎవరో అడగనే అడిగారు ఇదే ప్రశ్న. ఆవిడ “నేను అసలు అప్లై చేయలేదు” అనేసింది. “ఎందుకు అప్లై చేయలేదు” అన్న విషయం మీద సోషల్ నెట్వర్క్ లో చాలా చర్చ నడించింది గాని, ఒక పాయింటు మట్టుకు నాకు “నిజమే” అనిపించింది. ప్రొమోషన్ కి మనం అప్ప్లై చేసుకుని ఆ డాక్యుమెంట్లు అవీ అరేంజ్ చేస్తేనే ఇస్తారన్నది కరెక్టే గాని, సాధారణంగా యూనివర్సిటీ లో చేరగానే ఎవరో ఒక మెంటర్ ని కుదురుస్తారు. వీళ్ళు కొంచెం సీనియర్ ప్రొఫెసర్లు. మనకి కొత్తగా నిలదొక్కుకుంటున్నప్పుడూ, ఇలా ప్రొమోషన్ కి అప్ప్లై చేస్తున్నప్పుడు, ఇతర వృత్తి కి సంబంధించిన సందేహాలేవన్నా ఎవరన్నా పెద్దలతో మాట్లాడాలి అనిపించినపుడూ – గోడు వెళ్ళబోసుకోడానికి, గైడెంసు పొందడానికి. ఇలా ఫుల్ ఫ్రొఫెసర్ కి అప్లై చేయమని సలహా ఇవ్వడం కూడా వాళ్ళ పనే అని నా అభిప్రాయం.

ఇక్కడొక పక్కదోవ కథ: ఇదివరలో నా క్లాసులో జరిగిన విషయం ఒకటి రాసినప్పుడు – ఇక్కడొక మహామేధావి – టీఏ ల మాటలు స్టూడెంట్లు పట్టించుకోరని పేలారు. నేను టీఏ ని నేను ఎక్కడా అనలేదు. ఆ మేధావి గారి డిడక్షన్ అనమాట. అప్పుడు నేను పీహెచ్డీ కి పని చేస్తున్నా, ఆ కోర్సుకి నేను అధికారిక అధ్యాపకురాలినే. జర్మనీలో అది సర్వసాధారణం – మాకు కోర్సులు గట్రా చేయాలని లేదు అమెరికాలోలా. కానీ, దాదాపు నాకు తెల్సిన అందరూ పాఠాలు చెప్పారు. మేధావిగారు తమ అజ్ఞానంలోనో, అహంకారంలోనో పేలారు. అది నేను అమ్మాయి కాకపోతే , మేధావి గారు అబ్బాయి కాకపోతే ఆలా పరిచయం లేని మనిషితో పేలేవారు కాదు అన్నది కూడా అప్పుడు అనిపించిన విషయం. అలాంటి మేధావులు ఈ పోస్టు చదువుతూంటే – మీ ఖర్మ కాలి, నేను అమెరికాలో ఒక యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేశాను కొన్నాళ్ళు. అందుకని పైన రాసినదంతా నాకు తెల్సిన విషయమే. “అబ్బ చా, నీకెవరు చెప్పారు?” అని మాన్ స్ప్లెయినింగ్ మొదలెట్టేముందు ఆ ముక్క బుర్రకి ఎక్కించుకొండి ముందు. నేను కొంతకాలం ప్రొఫెసర్ గిరి వెలగబెట్టా కనుక, ఒక మెంటర్ కాదు, ఇద్దరు ముగ్గురు మెంటర్లు (ఒకరిని యూనివర్సిటీ పెట్టింది, ఒకరిని నేను వెంటబడి పెట్టుకున్నా, ఒకరు నా మీద అభిమానంతో నా ప్రొఫెషనల్ బాగోగుల బాధ్యత తీసుకున్నారు – ఇలా) ఉన్నారు కనుక – మెంటర్ అన్న మనిషి ఖచ్చితంగా ఇది చెప్పాలనే నేను అనుకుంటున్నాను. మరి ఈవిడకి చెప్పలేదా? చెప్పినా ఈవిడ చెయ్యలేదా?‌అన్నది మనకి తెలియదు. కానీ, ఈవిడ మగవాడైతే ఇలా ఉండిపోయే అవకాశం చాలా తక్కువ అని మట్టుకు చెప్పగలను.

ఏందీ మగా, ఆడా గోల? ఎవరైతే ఏమిటి? అసలయినా ఆవిడ ప్రొఫెసర్ అవడం కాకపోడం ఆమె యిష్టం. మధ్య నీ ఏడుపేమిటీ?‌అనిపించొచ్చు. నిజమే. కానీ, ఇవ్వాళ పొద్దున రేడియోలో అన్నట్లు – భౌతిక శాస్త్రంలో పీహెచ్డీ చేయాలి అనుకునే ఆడవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు – ఆ సంఖ్య గత పదిహేనళ్ళలో తగ్గుతూ పోయిందట. గత యాభై ఐదేళ్ళలో ఆ రంగంలో నోబెల్ వచ్చిన మొదటి మహిళ ఈవిడే. రసాయన శాస్త్రం లో నోబెల్ వచ్చిన వాళ్ళలో ఒకరు ఫ్రాంసెస్ అనే అమెరికన్ ప్రొఫెసర్. ఆవిడ కూడా ఆ రంగంలో నోబెల్ పొందిన ఐదో మహిళే (వందకు పైగా ఏళ్ళ చరిత్ర ఉంది నోబెల్ బహుమతులకి!). ఏమన్నా అంటే రాయలేదంటారు – ఏ నోబెల్ బహుమతైనా పొందిన మొదటి మహిళ, భౌతిక, రసాయన శాస్త్రాల నోబెల్ బహుమతుకు పొందిన మొదటి మహిళా కూడా మేడం క్యూరీనే. ఇలా, అక్కడ మొత్తం నోబెల్ చరిత్రలో పట్టుమంది యాభై మంది కూడా లేరు మహిళలు. అందులో సైంసు లో వచ్చినది ఎంతమందికి? వీళ్ళిద్దరితో కలిసి పద్దెనిమిది మందికి వచ్చినట్లు ఉంది (భౌతిక, రసాయన శాస్త్రాలు, వైద్యశాస్త్రం కలిపితే). అంటే, ఇప్పుడిప్పుడే స్కూళ్ళకి పోతూ, సైంసు మీద ఆసక్తి చూపుతున్న అమ్మాయిలకి ఇదెంత స్పూర్తివంతంగా ఉంటుంది? ఆడపిల్లలు పెద్ద చదువులు చదవడం అన్నది ఇప్పటికీ అంత సాధారణం కాదు. వీళ్ళకి స్పూర్తిదాతల అవసరం ఎంతో ఉంది. అలాంటి స్ఫూర్తిదాత గత మే దాకా వికీపీడియాకి famous enough అనిపించలేదంట. అనామక సైంటిస్టులు చాలామందికి వికీ పేజీలున్నాయి (మగ సైంటిస్టులు లెండి!). నోబెల్ రాకముందు కూడా ఆవిడ శాస్త్రపరిశోధనలకి పేరుంది. అందుకే నోబెల్ వచ్చింది. రేడియోలో ఈ ముక్కే అంటూ – వికీపీడియా క్యురేటర్లలో కూడా తొంభై శాతం మంది తెల్లజాతి మగవాళ్ళు. వీళ్ళు తెలీయకుండానే ఇలా స్త్రీ ప్రముఖులు, లేదా ఇతరు (తెల్లజాతి కాని వాళ్ళు, మైనారిటీలు వగైరా)ల గురించి ఇలాగే చేస్తూ ఉండొచ్చని ఆంకరమ్మ వాపోయింది ఇందాకే. ఈ విషయం గురించే మాట్లాడుతూ బ్రిటన్ కు చెందిన మరొక మహిళా భౌతికశాస్త్ర ప్రొఫెసర్ – ‘women in physics’, ‘women in computer science’ తరహా గుంపుల అవసరం పోయే రోజు రావాలని కోరుకుంటున్నాను, అన్నది. ఆవిడ ఉద్దేశ్యం – బాగా కామన్ గా కనబడుతూ ఉంటే ప్రత్యేక గ్రూపుల అవసరం ఉండదని (black in engineering తరహా‌ గ్రూపులు కూడా అటువంటివే).

సాధారణంగా నేను చూసినంతలో మహిళలతో పోలిస్తే పురుషులు ఎక్కువ assertive గా ఉంటారు తమ గురించి తాము ప్రొజెక్ట్ చేసుకోడంలో. అలాగే ఉన్న మహిళలని డామినేటింగ్ అంటూ ఉంటారు. ఇళ్ళలో అయితే గయ్యాళులంటారు. నిన్న నేను రేడియో ఇంటర్వ్యూలో విన్నదాన్ని బట్టి డోనా గారు బాగా నిగర్విలా, మామూలుగా, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి టైపులో అనిపించారు. ఆవిడ ఫుల్ ప్రొఫెసర్ కి ఎందుకు అప్లై చేయలేదో కానీ, ఇంటర్వ్యూ విన్నాక ఆ విషయం అంత ఆశ్చర్యంగా అనిపించలేదు. అయితే, మెంటర్ అన్నవాళ్ళు ఆవిడ ప్రొఫెసర్ కావడం అన్నది ఇతర మహిళా విద్యార్థులకి ఎంత విలువైనదో గుర్తించి ఆవిడని ప్రోత్సహించి ఉండాల్సింది అనిపించింది.

బాగా చదువుకున్న, సో కాల్డ్ మేధావుల్లో స్త్రీల పట్ల ఉన్న చులకన భావం గురించి ఎందరో చెప్పగా విన్నాను, కొన్ని నేనూ ప్రత్యక్షంగా చూశాను. ఇది ఎక్కువగా సాహితీ మేధావుల్లో గమనించినా, శాస్త్రాలూ వెనుక బడలేదు. యూనివర్సిటీల్లోనూ, కాంఫరెంసులలోనూ, అమ్మాయిలతో వేసే జోకులు అబ్బాయిలతో వేసే జోకులతో పోలిస్తే వేరుగా ఉండడమూ, బాగా గౌరవప్రదంగా కనిపించే పెద్ద ప్రొఫెసర్లు తాగేసి తిక్కగా ప్రవర్తించి, పొద్దున్నే మళ్ళీ ఏం‌ జరగనట్లు ప్రవర్తించడమూ, ఆడపిల్లల రిసర్చిని చులకన చేయడమూ, ఇలాంటివన్నీ చూశాను నేను యూనివర్సిటీల్లో. కొన్ని చదివాను. ఒక జావా క్లాసులో లెక్చరర్ (హైదరాబాదులో) అబ్బాయిల వైపుకి తిరిగి – బాగా చదువుకోండి, కట్నాలు వస్తాయని, అమ్మాయిల వైపుకి తిరిగ్ – మీరెలాగో పెళ్ళిళ్ళు చేసుకునేదాకే కదా అన్నాడు దాదాపు పదిహేనేళ్ళ క్రితం. ఇలా తెలిసో తెలియకో ఆడ పిల్లల పట్ల, ముఖ్యంగా సైంసు, ఇంజనీరింగ్ రంగాలలో ఉన్న ఆడపిల్లల పట్ల పనికిమాలిన వివక్ష చూపుతున్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. కనుక నేనెప్పుడూ వివక్ష ఎదుర్కున్నట్లు అనిపించకపోయినా, చుట్టుపక్కల బీసీల నాటి భావజాలం గల మేధావులు కోకొల్లలు అని చెప్పగలను. ఇట్లా ఉండే స్త్రీలు లేరా? అనొచ్చు – ఉండొచ్చేమో గానీ, చాలా చాలా తక్కువుంటారు. ఇలా కాకుండా, తమకి కావాల్సిన వాటి గురించి బాగా అసర్టివ్ గా ఉండే స్త్రీలని స్త్రీల లెవెల్ కి అదే harassment తో సమానం అనుకుని వాళ్ళకి ఇలాంటి మగవారితో పోల్చడం మట్టుకు మహా పాపం. అలా మనసులో పోల్చిన వాళ్ళు నీళ్ళలో కాదు, బాగా మరుగుతున్న నీళ్ళలోకి దూకండి.

అయ్యప్ప గుళ్ళోకి అమ్మాయిలని పంపడంకంటే ఇది ముఖ్యమైన విషయమని నా అభిప్రాయం. అందువల్ల దీని గురించి నా గోడు ఇలా బహిరంగంగా వెళ్ళబోసుకుంటున్నాను. ఏమైనా బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు మహిళా‌‌ శాస్త్రవేత్తలకి ఒకే ఏడాదిలో నోబెల్ రావడం నా జీవిత కాలం జరిగిన గుర్తులేదు, జరుగుతుందన్న ఆశా కలుగలేదు. అందుకని ఏమిటో‌ పండుగలా ఉంది మనసులో! ఈ గోడు వెళ్ళబోసుకోవడం పండక్కి దిష్టి చుక్క లెండి.

Published in: on October 3, 2018 at 5:54 pm  Comments (4)  

కొండపల్లి కోటేశ్వరమ్మ (1920-2018)

2012లో “నిర్జన వారధి” పుస్తకం వచ్చినపుడు నాకు కోటేశ్వరమ్మ గారి గురించి తెలిసింది. ఆ పుస్తకం అప్పట్లో కొన్నిరోజులు నన్ను వెంటాడింది. కినిగె.కాం లో రెండు మూడు కాపీలు కొని ఆంధ్రదేశంలో ఉన్న స్నేహితులకి పంచాను – అప్పటికి జర్మనీలో ఉన్నా కూడా. ఇప్పటికీ ఆవిడని తల్చుకుంటే ఆ పుస్తకం గుర్తు వస్తుంది. ఒక దాని వెంబడి ఒకటి విషాదాలు మీద పడుతూ ఉన్నా ఆవిడ వాటితో సహజీవనం చేస్తూనే వాటిని దాటుకుంటూ‌ వెళ్ళిపోయిన సంగతి చదివినపుడూ, ఇప్పుడు తల్చుకున్నప్పుడూ స్ఫూర్తివంతంగా అనిపిస్తుంది. ప్రజా ఉద్యమాల రోజుల్లో ఆమె అనుభవాలు రాస్తూంటే ఒక వైపు గగర్పాటు, ఒకవైపు గొప్ప నాయకులనుకునేవాళ్ళు ఉద్యమాల్లోని మహిళలతో ప్రవర్తించిన తీరు పట్ల ఆశ్చర్యం కలుగుతాయి.

కోటేశ్వరమ్మ గారికి ఆరోగ్యం బాలేదని వారం పదిరోజుల క్రితం హైదరాబాద్ బుక్ ట్రస్ట్ గీతా రామస్వామి గారు చెప్పారు. అంతకుముందే ఆగస్టులో వందవ సంవత్సరంలోకి అడుగు పెట్టారని వేడుకలు చేశారు – ఆ విడియోలు, ఫొటోలు చూశాను నేను. అంతా ఎంతో సంబరంగా పండుగలా ఉండింది. ఎంతో మంది అభిమానులు, శ్రేయోభిలాషుల మధ్య, ఉద్యమ స్ఫూర్తిని, జీవనోత్సాహాన్నీ అలాగే కొనసాగిస్తున్న కోటేశ్వరమ్మ గారిని చూస్తూ, కొద్ది కొద్దిగా మాట్లాడిన ఆవిడ మాటలు వింటూ ఉంటే అక్కడ వేడుకల్లో లేకపోయినా సంబరంగా అనిపించింది. వందేళ్ళ నిండు జీవితం స్ఫూర్తివంతంగా జీవించి వెళ్ళిపోయారు. ఈ సందర్భంలో నాకు ఆవిడతో ఉన్న వర్చువల్ పరిచయాన్ని తల్చుకోవాలని ఈ టపా.

2012 డిసెంబర్లోనే అనుకుంటాను – గీత రామస్వామి గారిని హైదరాబాదులో కలిసినపుడు “నిర్జన వారధి పుస్తకం చదివావు కదా, దాన్ని ఆంగ్లంలోకి అనువాదం చేస్తావా?” అని అడిగారు. భయంతో కూడిన ఆశ్చర్యం వల్ల “ఎవరూ? నేనా? నా వల్ల ఎక్కడవుతుందండి?” అన్నాను. “పర్వాలేదు, ఒక చాఫ్టర్ చేసి చూడు, అది చూసి తర్వాత నిర్ణయిద్దాం” అన్నారు. అక్కడ అలా మొదలై, మధ్యలో కోటేశ్వరమ్మ గారి మనవరాళ్ళతో, వాళ్ళ కుటుంబ సభ్యులతో కొన్ని ఈమెయిల్ సంభాషణలు, నా అనువాదానికి వాళ్ళ సలహాలు అవీ అయ్యాక 2015లో Zubaan Books వారి ద్వారా పుస్తకం ఆంగ్లానువాదం విడుదలైంది. దీని తాలూకా కాంట్రాక్టు అదీ సంతకం పెడుతున్నప్పుడు ఆవిడ పేరు పక్కనే నా పేరు చూసుకుని మురిసిపోయాను. తెలుగుతో సంబంధంలేని నా జర్మన్ గురువుగారికి కూడా అది చూపించి కోటేశ్వరమ్మ గారి గురించి చెప్పాను. ఆరోజుల్లో అక్కడ ఉన్న రష్యన్, రొమేనియన్ మిత్రులకి కూడా కోటేశ్వరమ్మ గారు తెలిసిపోయారు నా దెబ్బకి. ఇంతా జరిగాక కూడా నేనెప్పుడూ ఆవిడని కలవలేదు. ఫోనులోనైనా మాట్లాడలేదు. అదొక్కటి పెద్ద లోటే నాకు. అవకాశాలు ఉన్నప్పుడు నేను భారతదేశంలో లేను. నేను అక్కడికి వచ్చినపుడు సందర్భాలు లేవు. అలా గడిచిపోయింది.

కోటేశ్వరమ్మ గారు నా జీవితంలో నన్ను బాగా ప్రభావితం చేసిన వారిలో నిస్సందేహంగా ఒకరు. మేధావి వర్గం తరహా ప్రభావం కాదు. ఒక మామూలు మనిషి పరిస్థితులకి ఎదురొడ్డి నిలిచి, కాలక్రమంలో అనేకమందికి స్పూర్తిని కలిగించి, చివరిదాకా అలాగే సహజంగా, ప్రజల మధ్యనే జీవించిన మనిషి ఆవిడ. ఆవిడ మాట్లాడినవి విడియోలు అవీ చూసినపుడు కూడా ఎక్కడా “అబ్బో! మనకి అర్థం కాదు” అనిపించలేదు నాకు. సామాన్యుల భాష. ఆ అత్మకథ లో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఆవేశం అన్నది అసలు కనబడదు. మామూలుగా ఆత్మకథల్లో కనబడే పరనింద, ఆత్మస్తుతి మచ్చుకైనా కనబడవు. అంత విషాదాల గురించీ నాటకీయత లేకుండా, “ఇదిగో, ఇలా జరిగింది” అని చెప్పుకుపోయారు. తన జీవితాన్ని అతలాకుతలం చేసినవారిని గురించి కూడా చెడుగా రాయలేదు. కానీ, ధీటుగానే ఎదుర్కున్నారు. అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు వీటిమధ్యకూడా – ఇవన్నీ తల్చుకుంటూ ఉంటే అబ్బురంగా అనిపిస్తుంది నాకు.

నిండు జీవితం పదిమంది మధ్యా, వారికి ఉపయోగపడేలా, వారంతా పదే పదే తల్చుకునేలా గడిపి వెళ్ళిపోయారు. వారిని కలవకపోవడం లోటే అయినా, ఏదో ఒక విధంగా ఆవిడ కథలో నేనూ భాగం అయినందుకు గర్వంగానే ఉంది.

Published in: on September 19, 2018 at 12:15 pm  Comments (7)  

An illiterate’s declaration to a literacy preacher!

I am always fascinated by the diversity of the collection at ArvindGupta website. I was talking to a friend about James Thurber’s “The Last flower”, which I first found in ArvindGupta site. As I began revisiting the list of books mentioned over there, I stopped at the mention of this title –“An illiterate’s declaration to a literacy preacher”. The title in itself had enough to convince me in to reading it immediately.

You can read it here.

It starts with humble acknowledgements like – “I am again grateful to you for being so worried about me. I have given my full attention to all of your preachings.”

After enlisting a sort of comparison between “educated” and “uneducated” lifestyles, comes the punch line (IMHO) – “My learning is apparent and authentic in itself. I do not worry about being awarded any certificates to prove this.”

It was followed by a strong (in my view…not so compelling… and extremely blind) criticism of modern education system. However, at one or two places, it made me think a bit. For example, towards the end, it says:

“The real problem of today’s society is not that the working class is illiterate. In fact the real problem is that the schooled people of our society are averse to work, particularly to any sort of physical labor.”

I do feel the whole article has a strong “anti” feeling towards “modern” education and criticizes every thing in it, which makes it uncomfortable for me to call it “objective” … even if objectivity as such is a myth.

However, despite all its shortcomings, in the few minutes while and after reading it –

How many times was I reminded of “Nookaalu” of Gangaputhrulu?
How many times was I reminded of “Rudrudu” of Sontaooru?
How many times did I think about the shallow but informative chats with “sage-in-making” on the topic of development?
How many times was I reminded about “Gao Chodab Nahin“?
– I did not count!!

This short document might hit you hard, if you really do the Hamsa act, separate what is valid criticism and ignore the rest 🙂

Not that I know the answers for all those question, though! 😉

Published in: on March 30, 2012 at 12:35 pm  Comments (2)  

Rich calling for more taxes

Okay…I continue with my blogging marathon!

I was so thrilled to read yesterday, in “The Hindu”, about 16 of the France’s wealthiest people coming forward to pay more taxes. I began telling about that to everybody I spoke to (read-every Indian), with an obvious excitement. Today, I read another news, that the German rich are also calling for the same. Thrilled again!

More thrills came, when “The Hindu” published another article today “Europe’s wealthy ask to be taxed more”. Wonder if I will ever read such an announcement from the Indian rich! :((. This was the sentiment that most of my friends too echoed, when I shared with them this news piece… :((

I am naive enough not to understand the implications and loopholes in this process. However, I still think its a good move on the part of the super-rich. It won’t make them poor anyways :P. In a way, they’ve made my day with the announcement! 🙂

Here is the Warren Buffet article from NYT, which is supposed to have triggered these moves.

Published in: on September 1, 2011 at 11:06 am  Comments (4)  

ఓయ్ నేస్తాలూ, మీరు విన్నా వినకున్నా, ఇది మీకోసమే!

నాకు పొద్దుట్నుంచి మహా దురదగా ఉంది, పబ్లిక్ గా నా స్నేహితులందరికీ పెద్ద థాంక్స్ చెప్పుకోవాలని. నూటికి తొంభై రోజులు డిప్రెషంలోనూ, పుట్టకా, చావు మిథ్యేనా?‌ అన్న సందేహంలోనూ బ్రతుకుతూ ఉండే నాకు, సమాంతరంగా సరదాలూ, సంతోషాలతో మరో జీవితం ఇచ్చినందుకు అందరికీ థాంకులు చెప్పుకోవద్దూ? అందరికీ ఉంటార్లేవో అంటారా? ఉంటారు… కానీ, నాలాగా అవతలి మనుషులను అర్థం చేసుకుని, వారితో మంచిగా మాట్లాడ్డం కూడా చేతకాని మనుషులకి కూడా స్నేహితులు ఉన్నారు అంటే, అది ఆ స్నేహితుల గొప్పదనమే కదా మరి! అఫ్కోర్సు, వీళ్ళలో నా దినం చేసే వాళ్ళు కూడా ఉన్నారు కానీ, దినం చేసే వాళ్ళు కూడా ఒక్కోసారి నన్ను ఎంత భరిస్తారూ అంటే, నాలాంటి నాకే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయ్!

అసలుకి నాకు అర్థమే కాదు – నాకెలా ఇంత అదృష్టం పడుతూ ఉంటుంది? అని. తక్కిన విషయాల్లో ఎలా ఉన్నా, అసలుకి నేను అంత కలువుగోలుగా ఉండకపోయినా, నాతో ఇంత ఆదరంగా, మంచిగా ఎందుకుంటారు కొంతమంది? అన్నది నాకు అర్థమే కాదు. రమణ గారి తొమ్మిది మంది తల్లుల్లా, నాఈడు వారే నన్ను ఒక్కోసారి అలా ఆదరించారు. ఇందులో, ఈ నా ప్రపంచంలో, కాలక్రమంలో, ఒక్కోసారి నేస్తాల అక్కలో, చెల్లెళ్ళో, వాళ్ళ కుటుంబాలో కూడా, పర్మనెంట్ సిటిజెంషిప్ పొందేశారు. కొందరు సొంత కుటుంబీకులు కూడా స్నేహితుల లెక్కలో వస్తార్లెండి నాకు.

ఒక స్నేహితులకి ఏదో‌ సమస్య ఉంది. అది వాళ్ళు విడమరిచి చెప్తే కానీ, సాధారణంగా నాకు అర్థం కాదు. ఒకరికి కాసేపు నాతో మాట్లాడితే మనసు తేలిక పడుతుంది అనిపిస్తుంది అనుకోండి – అది వాళ్ళు చెప్తే కానీ నాకు అర్థం కాదు. అలాగని, ఒక్కోసారి వాళ్ళు చెప్పేది కూడా పూర్తిగా వినను. సగం వింటూ ఉండగా, మనసు అన్యవస్తుక్రాంతం అయిపోతూ ఉంటుంది. అంత బ్యాడ్ లిజనర్ ని నేను. కానీ, నాకేదైనా గోడు ఉంటే మాత్రం, అర్జెంటుగా చెప్పాలి అనిపించిన వాళ్ళకి చెప్పేస్తా. వాళ్ళు బాగున్నారా? అన్నది కూడా అడగను. అలాంటి అక్రూర జాతి పనికిమాలిన స్నేహితురాలిని నేను. ఇందులో దాపరికం ఏమీ లేదు. అందుకే నాకు ఆశ్చర్యం. ఇంత ఓపిగ్గా ఇన్నేళ్ళూ నన్ను వీళ్ళంతా ఎలా భరిస్తున్నారా? అని.

ఓ మూణ్ణాలుగేళ్ళ బట్టీ‌ అవతలి పార్టీ అభిప్రాయం కనుక్కోకుండా మూకుమ్మడిగా స్నేహాలు వదిలేసి, కొత్త జీవితం మొదలెట్టే ప్రయత్నాలు కొన్ని వందలు చేశా. అయినా కూడా, కొందరు ఇంకా నాతో మామూలుగానే మాట్లాడుతూ ఉంటారు, నేను మళ్ళీ పలకరిస్తే. నన్ను ఒకటీ అరా తిట్టినా, మామూలైపోతారు. ఇంత మంచోళ్ళేంటో, వీళ్ళకి నేను తగలడం ఏమిటో! ఇలా, నా ధోరణిలో నేనుండి, ఉన్నట్లుండి ఒకరోజు నా గోడు చెప్పేస్కుని, ఆ తర్వాత నెల రోజులు కనిపించక – ఇలాంటి వెధవ్వేషాలు గత కొన్ని నెలలుగా లెక్కలేనన్ని వేశాను. అయినా, ఆశ్చర్యం, నన్ను పల్లెత్తుమాటైనా అనరు ఎవ్వరూ. ఉత్తి పుణ్యానికి వేపుకు తింటున్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ, వాళ్ళ శాతం – సముద్రంలో కాకిరెట్టంత. అయినా, వాళ్ళూ నా స్నేహితులే. ఒకసారి స్నేహితులంటే ఇక జీవితకాలం పాటు అంతేగా!

కాబట్టి, ఓ మై డియర్ ఫ్రెండ్సులారా! Thanks for everything you gave me!!! మీరే లేకపోతే, నేను లేను.
I will try to be a better friend in the coming years…. 🙂
నా టైం బాగుంటే, ఇది చదివి నన్ను క్షమించండి, ఎప్పట్లాగే!
మీ టైం బాగుంటే, ఇదే నా అసలు రంగు. తెలుసుకుని, నన్ను వదిలించుకోండి! 🙂

ఇలా, అత్యుత్సాహంతో, నా అదృష్టానికి బహిరంగంగా మురిసిపోయిన మొదటి/ఇప్పటిదాకా చివరి సారి, కోలుకోలేని దెబ్బతిని, దానికింద ఇంకా నలిగిచస్తున్నా. కనుక, ఇలా బహిరంగంగా నా అదృష్టం గురించి టముకు వేశాక ఏం వినాల్సి వస్తుందో అన్న చింత ఉండనే ఉంది కానీ, ఐ డోంట్ కేర్. ఆ మాత్రం ఖలేజా లేకుంటే, అదేం బ్రతుకూ!!

Published in: on August 7, 2011 at 11:54 pm  Comments (14)  

స్కూలప్పటి అనుభవాలు

మన “మాయాశశిరేఖ” సౌమ్య గారి బ్లాగులో మొదటి సంఘటన చదివాక, నాకు రెండు చిన్ననాటి సంఘటనలు గుర్తొచ్చాయి. అవి ఇక్కడ పంచుకుందామని…

1) అవి నేను ఐదో తరగతి లో ఉన్నరోజులు. కారణాలు గుర్తులేవు కానీ, అప్పుడప్పుడూ క్లాస్ బయట ఉండే చెట్టు కింద, రెండు మూడు సెక్షన్లకి కలిపి పాఠాలు జరిగేవి. అంతమంది ఒకచోట కలిస్తే, ఏం జరుగుతుందో తెలుసు కదా… గోల. ఇలాంటి గోలల్లో పాలు పంచుకోడం నాకు బానే అలవాటు. మా క్లాసులో ఐతే క్లాసు లీడర్ని కానీ, అన్ని క్లాసులు కలిస్తే మనమేం మానిటర్ చేయనక్కర్లేదుగా…అల్లరి చేయడంలో మునిగేదాన్ని.

అలాంటి రోజుల్లో ఒకరోజు…టీచరెక్కడికో వెళ్ళారు. షరామామూలుగా గోల మొదలుపెట్టాము. కాసేపటికి ఆవిడ వచ్చారు. అందర్నీ వాయించడం మొదలుపెట్టారు. నా ఖర్మ కాలి, నా వైపు నుండి మొదలై “అల్లరి చేసావా లేదా?” అని కోపంగా అడిగారు. ఎలాగో నేను చేయలేదు అని అబద్దం చెప్పినా కొడతారుగా! అనుకుని “చేసాను టీచర్” అని అరిచేసా భయంకొద్దీ. అంతే, నా జీవితంలో టీచర్ చేత కర్ర దెబ్బలు (రెండే అయినా) వేయించుకున్న ఏకైక సందర్భం అదే అనుకుంటాను. విరక్తొచ్చింది కానీ, పోనీలే, ధైర్యంగా ఒప్పుకున్నా అని సంతోషించా. కానీ, అక్కడే అసలు సమస్య మొదలైంది.

అక్కణ్ణుంచి, నేను ఎప్పుడు ఆవిడ ఉన్న దిక్కుకు పోయినా, “సంతోషం” సినిమాలో కోటా తన ప్రతిస్నేహితుడికీ బ్రహ్మానందాన్ని పిలిచి “హీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండీ…” డైలాగు మళ్ళీ మళ్ళీ చెప్పించినట్లు, నన్ను ఆపి, “ఈ పిల్లకెంత పొగరు తెలుసా…ఆరోజు అల్లరి చేసావా అని అడిగితే, “చేసాను టీచర్” అని గర్వంగా చెప్పింది… అని అనడమూ, ఆ అవతలి టీచరు నా వంక అదోలా చూడ్డమూ…..నేనేమో అసలు నేను చేసిన తప్పేమిటో అర్థం కాక తలవంచుకోవడమూ…. పైగా, నేను అంత భయపడుతూ చెప్పి ఏడ్చినంత పని చేస్తే అందులో గర్వం కనబడ్డం ఏమిటి? అని అనుకుంటూ దిగాలుగా మొహం వేళాడేసుకుని వెళ్ళిపోవడమూ జరిగేది.మా చెడ్డ అవమానంగా ఉండేది. అప్పట్లో నేను క్లాసు టాపర్ని. కనుక, మరీ అవమానంగా ఉండేది. అర్జెంటుగా ఈ స్కూల్ మారిపోతే బాగుండు అనుకున్నా. నిజంగానే హైస్కూలుకి వేరే స్కూలుకి వెళ్ళిపోయా కానీ, అలా నాకు ఆ టీచరంటే మాత్రం అవర్షన్ ఏర్పడింది. అప్పట్లో, పదేళ్ళ వయసులో ఏమీ చేయలేకపోయా కానీ, నాకు బాగా గుర్తుండిపోయింది ఆ సంఘటన.

2) రెండోది, నేను గర్వంగా గుర్తుంచుకునే సంఘటన. ఏనిమిదో క్లాసులో (తొమ్మిదేమో!) అనుకుంటా, ఒకసారి జ్వరమొచ్చో ఏదో జరిగి, నేను ఒక యూనిట్ టెస్ట్ పరీక్ష రాయలేదు. నా లా ఇద్దరు ముగ్గురికి శనివారం మధ్యాహ్నం స్కూల్ అయిపోయాక పెడతాం అన్నారు. ఏం జరిగిందో గుర్తులేదు కానీ, చివర్లో నేనొక్కదాన్నే రాయాల్సి వచ్చింది. మా సారా ఎక్కడికో వెళ్ళే తొందర్లో ఉన్నారు. కరెక్టుగా ఆయన తాళం పెట్టి బయటకు రావడమూ, వరండాలో కూర్చుని రాస్తున్న నేను పూర్తి చేసి పేపర్ ఇచ్చేందుకు వెళ్ళడమూ ఒకేసారి జరిగింది. నేనేమో, భయంఏసి…ఇంక సున్నానే ఏమో అనుకుని… “సార్..ఇంకా టైం ఉండింది కదా… నేను రాసేసాను…ప్లీజ్…తీస్కోండి…” అని అడుక్కోడం మొదలుపెట్టా.

ఆయన నన్ను చూసి నవ్వి – “నాకు తెలుసు టైం ఉందని. కానీ, నేను అర్జెంటుగా వెళ్ళాలి. ఆ పేపరు నీ దగ్గరే పెట్టుకుని సోమవారం తెచ్చివ్వు..” అన్నారు. నేను అవాక్కైపోయాను. అంటే, ఆ రోజుల్లో నేను నిజంగానే అతి నిజాయితీ మనిషిని….అన్న విషయం ఆయనకి తెలుసని నాక్కూడా తెలుసు (గతంలో జరిగిన సంఘటనల మూలంగా నా అతి-సిన్సియర్ ప్రవర్తన ఆయన గమనించారు). కానీ, ఎంతైనా, అలా ఎలా పట్టుకెళ్ళేది ఆన్సర్ పేపర్?? “అదేంటి సార్..అలా ఎలా తీస్కెళ్తాను?” అన్నాను.
“నాకు నీ మీద నమ్మకం ఉందిలే. నువ్వేం మార్చవని. తట్స్ ఓకే” అన్నారాయన. “అది కాద్సార్…ఇలా చేసానని తెలిస్తే రేపు నా ఫ్రెండ్సందరూ నా గురించి ఏమనుకుంటారు?”
“ఏమీ అనుకోరు. నేను నిన్ను నమ్ముతున్నా అని చెప్పా కదా. మండే కలుద్దాం…నేను అర్జెంటుగా వెళ్ళాలి” అనేసి వెళ్ళిపోయారు.

నాకు కోపం కాదు..భయం నషాళానికంటింది (చెప్పాగా, అప్పట్లో అమాయక జీవినని!)…. స్కూల్లోంచి బయటకి రాగానే, పక్క వీథిలో ఉన్న ఫ్రెండు ఇంటికెళ్ళి, విషయమంతా చెప్పేసి, “మీ ఇంట్లో పెట్టుకోవా ప్లీజ్! నాకు భయం నేను మళ్ళీ ఏమన్నా మార్చేస్తా ఏమో పేపర్లో అని” అని అడిగేసరికి, ఆమె ఆశ్చర్యంతో సరేనని తీసుకుంది. నేను ఆ తర్వాట నా బెస్టు ఫ్రెండుని కలిసి, జరిగిందంతా చెప్పాను. ఆమేమో ఊరికే ఖంగారు పడొద్దని చెప్పేసరికి, శాంతించాను. మండే రోజు పేపర్ ఆయనకిచ్చేసి, ఇలా నేను ఫలానా అమ్మాయి ఇంట్లో ఉంచాన్సార్ నేనేమన్నా మార్చేస్తా ఏమో అని…అన్నాను. ఆయన నవ్వేసి పేపర్ తీస్కున్నారు. టాప్ మార్కులు రాలేదు కానీ, బానే మార్కులు వచ్చినట్లు గుర్తు ఆ పేపర్లో. సార్ రూము నుంచి వెనక్కొస్తున్నప్పుడు ఛాతి బోలెడు ఉప్పొంగింది. అప్పటిగ్గానీ ఆ సంఘటన విశేషం అర్థం కాలేదు నాకు!

ఆయన నాపై అంత నమ్మకం ఉంచినందుకేమో, తర్వాత కూడా స్కూల్లో ఉన్నన్నాళ్ళూ అలాగే ఉన్నా. పెపంచికంలో పడ్డాక, వేరే సంగతి. కానీ, ఆ సంఘటన మూలానా ఆయనతో బంధం సిమెంటైందని నా అనుమానం. ఆ ఊరు ఎప్పుడెళ్ళినా, ఆయన్ని కలవడం తప్పనిసరి నాకు! ఆయనకి బహుశా ఈ సంఘటన గుర్తుండకపోవచ్చు కానీ, నేను గర్వంగా చెప్పుకోగల సంగతుల్లో ఇదొకటి.

అదీ సంగతి. ఈ విషయాలు కదిపిన సౌమ్య గారికి థాంక్స్!!

Published in: on July 7, 2011 at 3:55 pm  Comments (13)  

Readings: Amazon Mechanical Turk – Gold mine or Coal mine?

First things first:
Title of the article: Amazon Mechanical Turk: Gold Mine or Coal Mine?
Authors: Karen Fort, Gilles Adda, K.Bretonnel Cohen
In: Computational Linguistics Journal, June 2011, Vol. 37, No. 2, Pages 413-420

In the past 2 months or so, I guess I read this article 2-3 times. I still don’t understand why it was written 😦 Oh, the incomprehensibility was not the reason why I read it again, though. I found it multiple times, lying on my table..for various reasons (which include piling up of stuff you never read!)

Coming to the point:
1) I never used amazon mechanical turk – neither as a requester nor as a turker. But I don’t feel that there is something wrong with the approach. Its up to the turkers to do or not do a given task. So, I don’t think there should be question of ethics here. If there is anything, there should be a question on the quality.

2) If some turkers use it to meet their basic needs, (IMHO) its not the wrong-doing of amazon or the requesters.

So, if the concern in the article was about the quality of linguistic resources developed, perhaps, It might have sounded so abnormal to me. But, the issue was on the “working conditions” of the AMT “workers”. Whatever way people are using it (as a hobby, timepass, for some pocket money, to meet living expenses etc), its people who do that…and neither Amazon nor the task givers on AMT promise employment, right?

And hence the confusion… 🙂
Ofcourse, now, I won’t do a re-reading of the article! 😛

Published in: on July 1, 2011 at 1:58 pm  Leave a Comment