నరశింహ శతకం – కొన్ని పద్యాలు

ఈమధ్య నాలుగైదు రోజులుగా శతకాలు చదువుతూ ఉన్నాను. సుమతీ, కుమార, భాస్కర, నరసింహ – ఇలా దొరికినన్ని చదువుతున్నాను. వీటిలో నాకు బాగా నచ్చింది – భాష సరళంగా ఉండటం. అందుకేనేమో అలా చదువుతూ పోతున్నాను. భాస్కర శతకం మొదలుపెట్టాక – ’అర్థం కావట్లేదు…’ అని దీనంగా మాఅమ్మతో అంటే – చదువుతూ ఉంటే అదే వస్తుందిలే-అన్నది. దానితో ధైర్యం వచ్చి మళ్ళీ మొదలుపెట్టేశా.

ఈ నరసింహ శతకంలో కొన్ని పద్యాలు భలే ఉన్నాయి. భాష పరంగా కాదు  -భావం పరంగా.. చదువుతూ ఉంటేనే కొంచెం నవ్వొచ్చింది. మచ్చుకి ఒక నాలుగైదు పద్యాలు ఇలా బ్లాగ్ముఖంగా పంచుకుంటున్నాను.
(“భూషణవికాస! శ్రీధర్మపుర నివాస! దుష్ట సంహార! నరసింహ! దురితదూర!” – అన్నది ఈ పద్యాల మకుటం.)

గౌతమీ స్నానాన గడతేరుదమటన్న
మొనసి చన్నీళ్ళలో మునుఁగలేను
తీర్థయాత్రలచే గృతార్థుఁడౌదమటన్న
బడలి నేమంబులే నడుపలేను
దాన ధర్మముల సద్గతిని జెందుదమన్న
ఘనముగా నాయొద్ద ధనములేదు
తపమాచరించి సార్థకము నొందుదమన్న
నిముషమేని మనసు నిలుపలేను.

కష్టములకోర్వ నా చేతఁగాదు నిన్ను
స్మరణ్ఁ జేసెదనా యధాశక్తి కొలఁది

||భూషణ….|| (తొమ్మిదో పద్యం)
– ఈజీ మనీలా ఈజీ మోక్షా రిక్వెస్టు. ఇప్పుడు మరోటి చూడండి –

ఆయురారోగ్య పుత్రార్థ సంపదలన్నిఁ
గలుగఁజేసెడి భారకర్త నీవె
చదువులెస్స(గ నేర్పి సభలో గరిష్టాధి
కార మొందించెడి ఘనుఁడ నీవె
నడక మంచిది పెట్టి నరులు మెచ్చెడునట్టి
పేరు రప్పించెడి పెద్ద నీవె
బలుపైన వైరాగ్య భక్తిజ్ఞానము లిచ్చి
ముక్తిఁ బొందించెడి మూర్తి నీవె

అవనిలో మానవులకన్ని యాసలిచ్చి
వ్యర్థులను జేసి తెలిపెడి వాఁడవీవె

||భూషణ…|| (ముప్పై ఆరో పద్యం)
– చదవగానే నవ్వాగలేదు. ఇంకోటి చూడండి.

కమలలోచన నన్ను గన్న తండ్రివిగాన
నిన్ను మరువకుంటి నేను విడక
నుదుర పోషణకునై యొకరి నేనాసింప
నేర నా కన్నంబు నీవు నడుపు
పెట్టలేనంటివా పిన్న పెద్దలలోన
తగవుకిప్పుడు దీయఁ దలఁచినాను
ధనము భారంబైన దల కిరీటము నమ్ము
కుండలంబులు పైడి గొలుసులమ్ము

కొసకు నీ శంఖచక్రముల్ కుదువఁబెట్టి
గ్రాసము నొసంగి పోషించు కపటముడిగి

||భూషణ…|| (నలభై ఆరో పద్యం)

కువలయశ్యామ నీ కొలువుజేసిన నాకు
జీతమెందుకు ముట్టఁజెప్ప వైతి
మంచిమాటలచేత గొంచె మియ్యగలేవ
కలహమౌ నిఁక జుమ్మి ఖండితముగ
నీవు సాధువుగాన నింత పర్యంతంబు
చనువుచే నిన్నాళ్ళు జరుప వలపె
నిఁక నేను సహింప నీవిపుడు నన్నేమైన
శిక్ష చేసిన సేయు సిద్ధమయితి

నేడు కరుణించకుంటివా నిశ్చయముగ
దెగబడితి జూడు నీతోటి జగడమునకు

||భూషణ..|| (నలభై ఏడో పద్యం)
– బెదిరింపు లేఖలు! 🙂 ఇటువంటివి మరో నాలుగైదున్నవి ఈశతకంలో. ముందు చదివిన భక్తి శతకాల్లో ఈ తరహావి తగల్లేదు. ఇలాంటిదే మరోటి

ఇక, ఇది చూడండి:
హరి నీకు పర్యంక మైన శేషుఁడు చాల
పవనము భక్షించి బ్రతుకుచుండు
ననువుగా నీకు వాహనమైన ఖగరాజు
గొప్పపామును నోట గొరుకుచుండు
నదిగాక నీ భార్య యైన లక్ష్మీదేవి
దినము పేరంటంబు దిరుగుచుండు
నిన్ను భక్తులు పిల్చి నిత్యపూజలు చేసి
ప్రేమ పక్వాన్నముల్ పెట్టుచుండ్రు

స్వస్థముగ నీకు గ్రాసమ్ము జరుగుచుండ
గాసు నీచేత దొకటైన గాదు వ్యయము

||భూషణ…|| (నలభై ఎనిమిదో పద్యం)

ఇక చివరగా- శతకం చివరి భాగంలో వచ్చే ఈ పద్యం –
అర్థులేమైన నిన్నడుగ వచ్చెదరంచు
క్షీరసాగరమందుఁ జేరినావు
నీ చుట్టు సేవకుల్నిలువ కుడుంటకునై
భయద సర్పము మీఁద బండినావు
భక్త బృందము వెంటఁ బడి చరించెదఁరంచు
నెగసి పోయెడి పక్షి నెక్కినావు
మౌనులు నీ ద్వార మాసింపకుండుటకు
మంచి యోధుల కాపలుంచినావు

లావుగలవాడవైతి వేలాగు నేను
నిన్ను జూతును నా తండ్రి నీరజాక్ష

||భూషణ…|| (తొంభైయవ పద్యం)

-అదండీ…. నరసింహశతకంతో నా అనుభవం. ఇవి చదివాక మీకు దీని గురించి కుతూహలం కలిగితే, వికీసోర్సులో ఇక్కడ చదవొచ్చు.

Advertisements
Published in: on March 28, 2010 at 8:00 am  Comments (8)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2010/03/28/narasimha-satakam/trackback/

RSS feed for comments on this post.

8 CommentsLeave a comment

 1. చాలా బాగున్నాయి ఈ పద్యాలు.

 2. నరసింహ కదా!

  • శ్రీనివాస్ గారికి: ఆ పుస్తకం కవర్ పై “శింహ” అని ఉంది… ఏమో, అలాగే రాయాలేమో అని… అలాగే రాసాను.

 3. Nice post..
  “ఈజీ మనీలా ఈజీ మోక్షా రిక్వెస్టు.” —> liked that comment

 4. నరసింహ అనే ఉండాలండీ. పైగా హెడ్డింగులో తప్పు వచ్చింది. 🙂 బాగా వ్రాస్తున్నారు తెలుగు విషయాలను.

 5. they are very good. but then little long

 6. మరికొన్ని శతకముల కొరకు ఈ క్రింది లింకుని చూడండి.
  http://www.samputi.com/launch.php?m=home&l=te

  • Sir, you need not come and comment so many times each time the word Satakam is mentioned in whatever I write. I can read Telugu pretty decently and understand simple pointers if I read once.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: