ఒకే పుస్తకానికి రెండు అనువాదాలు అవసరమా?

ఒక పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించాలి. దానికి రెండు అనువాదాలెందుకు?

నిన్నటి హిందూ లిటరరీ రివ్యూ లో యు.ఆర్.అనంతమూర్తి నవల ‘భారతీపురా కు కొత్తగా రాబోతున్న/ఇటీవలే వచ్చిన సుశీల పునీత ఆంగ్లానువాదం నుండి కొన్ని పేజీలు ఒక వ్యాసంలా వేశారు. (దాన్ని ఇక్కడ చదవవచ్చు)

అయితే, ఆ పేరు వినగానే నాకు పరిచయం ఉన్నట్లు అనిపించింది. ఈ నవల ఆంగ్లానువాదం ఇదివరలో నేను చదివినట్లున్నా కదా..అనుకుంటూ ఉండగా, కథాంశం లీలగా గుర్తొచ్చింది. వెంటనే, అప్పట్లో బ్లాగులో రాసే ఉంటాననుకుని సర్చ్ చేస్తే, లంకె దొరికింది. (ఇదిగో!).

అదేమిటి ఇలా కూడా చేస్తున్నారా అని ఫ్లిప్కార్టు కి వెళ్ళాను. అక్కడ “భారతిపుర” పేరుతో శోధిస్తే, రెండు పుస్తకాలు కనబడ్డాయి. (మీరిక్కడ చూడండి). అక్కడ కనిపిస్తున్న రెండో పుస్తకమే నేను చదివిన పుస్తకం అనుకుంటాను. ఆ అట్ట చూస్తే అలాగే ఉంది. అనువాదకుడి పేరు కూడా అదే. నేను చదివిన పుస్తకం వెల – నూట పదిహేను. ఇప్పుడొచ్చిన పుస్తకం వెల నాలుగొందలా యాభై!

అసలు ఒకసారి అనువాదం అయిపోయిన పుస్తకాన్ని మళ్ళీ అనువాదం చేయడం ఎందుకు? అన్నది మాత్రం నాకు అర్థం కావట్లేదు. మీకేమన్నా అర్థమయిందా? ఎంతైనా, అనువాదం చేసిన మనుషులకి ఇదివరలో ఒక అనువాదం ఆల్రెడీ వచ్చిన విషయం తెలీకుండా ఉండే అవకాశం లేదు అని నా అభిప్రాయం. ఎందుకంటే –
1) కనీసం అదేమన్నా స్థానిక భాషలోకి అనువదితమైతే, ఇలాంటి ‘తెలియకపోవడం’ జరిగి ఉండొచ్చు. కానీ, అనువదితమైంది ఆంగ్లం లోకి. అందునా, ప్రముఖ రచయిత పుస్తకమూ!
2)ఎక్కడో హైదరాబాదు లో కాలేజీలో చదువుతున్న నాకే ఆ అనువాదం దొరికింది అప్పట్లో. మరి, ఆల్రెడీ రచనా వ్యాసంగంలో ఉన్న కన్నడిగులకి దొరక్కుండా ఉంటుందా?

నిజానికి, లిటరరీ రివ్యూలో ఎక్కడన్నా రీడర్స్ కామెంట్స్ సెక్షన్ ఉందేమో చూశా, కనబళ్ళా. కనుక, నా అనుమానాలన్నీ ఇక్కడే వెళ్ళగక్కేసుకుంటున్నా!

Advertisements
Published in: on December 6, 2010 at 10:35 am  Comments (9)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2010/12/06/bharathipura-translation2/trackback/

RSS feed for comments on this post.

9 CommentsLeave a comment

 1. for the 1st translation may b the publisher was not benifitted much financially…

 2. ఒకరు సూర్యరాయ వారిది, వేరొకరు బ్రౌన్ గారిదీ నిఘంటువులు ఉపయోగించి ఉండవచ్చు.

  • @Surya: ??
   I am talking about a Kannada book translated to English…

 3. దయచేసి కన్నడ సూర్యరాయ, కన్నడ బ్రౌన్ అని తీసుకోండి. అదే వాల్మీకి రామాయణాన్ని మొల్ల, గోపీనాధులు, విశ్వనాధులు వ్రాసిన విధంగానని నా కవి హృదయం.

 4. చర్చకి విషయం బాగుంది. ఇలాటి అనువాదాలు సాధారణంగా ఎకాడమీలో చర్చకి వస్తాయి. నాకు తెలిసిన కొన్ని కారణాలు – అనువాదం చెయ్యాలన్న ఉత్సాహం, ఉన్న అనువాదం నచ్చక, అంతకంటే బాగా కానీ, మరొకరకంగా మరింత ఆసక్తికరంగా చెయ్యొచ్చు, చెయ్యగలను అన్న నమ్మకం ఉన్నప్పుడు జరుగుతుంది. పైన సూర్య చెప్పినట్టు, రామాయణాలస్థాయిలో అన్నమాట. పైగా, నేను ఒకోసారి, ఉన్న అనువాదం మరీ ఇండియనింగ్లీషులో ఉంది, అంచేత ఇండియా దాటి ప్రాచుర్యం పొందలేదు అనుకున్నప్పుడు కూడా మళ్ళీ చేస్తాను.

 5. ఉత్సాహం అంటే ఆ రచయిత అంటేనో, ప్రత్యేకించి ఆ రచన అంటేనో గల భక్తిశ్రద్ధలన్నమాట ;p

 6. సూర్య కామెంట్ బావుంది 🙂
  నా దృష్టికి వచ్చినంతలో రష్యను, స్పానిష్ భాషల నవలలకి ఆంగ్లానువాదాలలో ఇది సర్వ సాధారణం.
  కనడం నించి ఇంత అవసరమా అంటే, వడ్డించేవాడూ మనవాడాఇనప్పుడు రెండే ఏం ఖర్మ, ఇంకా ఎక్కువే వస్తాయి 🙂 I think it has more to do with U.R’s influence at central govt than anything else.
  అదే తెలుగులో ఒక్కదానికే దిక్కులేదు!!

 7. […] పుస్తకానికి రెండు అనువాదాలెందుకు అని సౌమ్య అడుగుతోంది. ఈమధ్యనే అఫ్సర్ […]

 8. @All: It seems the first translation’s author is himself an English prof somewhere in Philadelphia. Hence, Its possible that first one was also meant for foreign audience..though I don’t remember the publishers. 🙂


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: