తెలుగు కథకి జేజే – కానీ ఈ పుస్తకానికి మాత్రం చెప్పలేను!

“తెలుగు కథకి జేజే”  పేరు చూడగానే చదవాలనిపించింది కానీ, చివరికి నాకిది అసంతృప్తినే మిగిల్చింది. 😦 విషయానికొస్తే, ఇది సుమారు ఎనభై తెలుగు కథల సంకలనం. నేను చదివిన పేర్లూ, విన్న పేర్లు దగ్గర్నుంచి, కొత్త పేర్ల దాకా చాలా కథలు ఉండేసరికి, చూసి సంబరపడ్డాను… కథోత్సవం అని… కానీ, చివరికి ఇలా  అసంతృప్తి తో ఈ టపా రాస్తున్నా.

మొదట వరుసగా చదవడం మొదలుపెట్టాను. అంటే, అదే పనిగా కాదు… కాస్త గ్యాప్ ఇస్తూ వరుసగా ఒక్కో కథా. మొదటి పది కథల్లోనూ గొప్ప గొప్పోళ్ళ కథలున్నాయి. వాటిలో నాకు నచ్చింది ఒకే ఒక కథ… కృష్నశాస్త్రి గారి తప్పిపోయిన బామ్మ కథ. అది కూడా పదిలోకీ బెటర్ కథో, లేక నిజంగానే జేజే అనే కథో, మరి అర్థం కావట్లేదు ఇప్పుడు నాకు. 😦 తరువాత పదిలో కూడా మూణ్ణాలుగు మినహా పెద్దగా ఆకర్షించలేకపోయాయి. కథ బాగుంటే, కథనం నచ్చదు. అంతా బానే ఉందే అనుకున్నప్పుడు ముగింపు సంబంధం లేకుండా అనిపిస్తుంది…. ముళ్ళపూడి వెంకట రమణ గారి “ఆ చేతి చేత”, కొ.కు. “ఆదాయ వ్యయాలు” తప్ప మిగితావి నన్ను పెద్దగా ఆకర్షించలేకపోయాయి. ఈ ఇరవై కథల్లో బాగా ప్రముఖులైన వారి కథల్లో నుండీ ఈ మూడే నాకు మళ్ళీ చదవాలనిపించినవి.  ఇది జరిగాక, ఇక నేను వరుస మానేసి, అదృష్టాన్ని నమ్ముకున్నాను. ఏదో అలా ఓ కథ తీసి చదువుతాను, నా టైం బాగుంటే, కథ బాగుంటుంది – అని. కానీ, అది కూడా పెద్ద వర్కవుట్ కాలేదు నాకు 😦 ఇప్పటి దాకా చదివిన కథల్లో పదోవంతు నచ్చినట్లు ఉన్నాయి….అంతే. నేను కొనలేదు కానీ, ఖరీదు మూడొందలు!

డెబ్భై ఐదు కథలున్న పుస్తకం లో అరవై కథల దాకా వచ్చినా కూడా అసంతృప్తి అలాగే కొనసాగిందంటే, నాకింతకంటే పెద్ద కొలమానం లేదు ఆ పుస్తకం నాకు నచ్చలేదు అని తెలుసుకోడానికి. అసలు దీని గురించి బ్లాగు రాయడం కూడా ఆసక్తి లేనంత నిరాశ కలిగించింది ఈ పుస్తకం. ఇంతకంటే నేనేమీ రాయలేను.  సంకలనాలు కూర్చడం లో కూర్పరిని చూసి చదవాలని ఇప్పటికి అర్థమైంది నాకు.

Advertisements
Published in: on July 1, 2008 at 3:21 pm  Comments (2)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2008/07/01/telugukathakijej/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. hmmm

    It is still lying in my book rack in to be read section…

  2. Accham naadi kooda shame to shame experience andi. Infact aa sankalanakartha vraasina mundu maata chaala baagunnindi… Adi chadivi sagam inka lopala unna uddandapindula perlu chadivi Telugu brahmotsavalalo offer kinda 195/- ki vasthey jananni thosukoni maree konukkunnanu…. Annitikanna dourbhagyam chalam vraasina katha (arisela pindi katha) chadavagaane may nelalo lo mittamadhyahnam chennai lo mirapakaya bajjilu sala sala kaale sambaru lo munchuku thinnattu unnindi… Amma edo anukuntey chivaraku aa pindi ginnanu maa ooru antey ananthapur ki thapala cheyyadam naaku maree kopam theppinchindi….


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: