జంటనగరాలు

జంటనగరాలు … ఒక మధ్య సైజు నవల. రచన అశోకమిత్రన్. కొన్నాళ్ళ క్రితం ఓ రోజు నేను కోఠీ బస్టాపు దగ్గర చేసిన random walk లో కనబడ్డ ఓ షాపు లోకి తొంగిచూసి… “అశోకమిత్రన్” అన్న పేరు కనబడగానే…. “జంట నగరాలు” అన్న టైటిల్ చూసి మన ట్విన్ సిటీస్ అని అర్థమవగానే…. కథ ఏమిటి? మనం ఇదివరకు చదివిన పుస్తకమేమో…ఓ సారి కనీసం ఇది దేనికి అనువాదమో అయినా చూడాలి అన్న కనీసపు ఆలోచన కూడా లేకుండా పుస్తకం కొనేసి, బస్సెక్కేసాక తీరిగ్గా పుస్తకం మొదటి పేజీ చూసి – దీని తమిళ మాతృక padunettuvadu lakshatagalu అని చదివి అప్పటికే కాస్త అనుమానం కలిగినా కూడా పెద్ద పట్టించుకోకుండా పుస్తకం చదవడం మొదలుపెట్టాను. మొదటి రెండు, మూడు పేజీలు చదివేసరికి నాకు కథ అంతా తెలిసినట్లు అనిపించింది. అనుమానం బలపడి ఓ సారి పేజీలు తిప్పాను. అన్నీ తెలిసిన సంఘటనలే. అప్పుడు మొదటి సారి నా లోపలి మనిషి (రాకేశ్వరుడి భాష లో “హృదయభాను”) విజృంభించింది. “వెర్రిమొహమా! అది నువ్వు ఇది వరలో చదివిన the eighteenth parellel అన్న పుస్తకమే. గుర్తు లేదా.. దాని తమిళ మాతృక పేరు padunettuvadu atchakodu అనో ఏదో ఉండింది? తెలుగు వాళ్ళు ఒక రకంగా రాసారు మాతృక పేరు. ఆంగ్లానువాదం లో మరో రకంగా రాసినట్లు ఉన్నారు. ఓ భాష లో అనువాదం చదివిన పుస్తకాన్ని మరో భాష లో కొనుక్కుని మరీ చదువుతున్నావా?” అని వెక్కిరించింది. అప్పటిగ్గానీ నాకు సంగతి అర్థం కాలేదు. నేనేమో అశోకమిత్రన్ మీద అభిమానం ఏర్పరుచుకుని ఆయన పుస్తకం దొరికితే అది ఎదుటి మనిషి చేతిలో ఉంటే లాక్కుని చదవడానికి కూడా రెడీ గా ఉన్న రోజులవి. ఇప్పటి దాకా నాకు ఆయనది మరో పుస్తకం దొరకలేదు…. still hunting 😦

సరే, విషయమదీ. పుస్తకం విషయానికొస్తే, చాలా రోజులు మొన్నమొన్ననే చదివాము కదా, ఇంతలోపు మళ్ళీ అదే పుస్తకం ఏమి చదువుతాము లే అని చదవలేదు. గత పదిరోజుల్లో ఓ రోజు ఇంట్లో ఉన్నప్పుడు ఏమీ తోచకపోతే ఈ పుస్తకం తీసాను. అశోకమిత్రన్ ప్రపంచం లోకి మళ్ళీ ఇంకో మనిషి(అనువాదకులు) ద్వారా అడుగుపెట్టాను. కాస్త – “తెలిసిన కథే కదా” అన్న భావన తో మొదలెట్టినా కూడా కాసేపట్లోనే మునిగిపోయాను మళ్ళీ. కథ ఏమిటి అన్నది ఒకప్పుడు మొదట తెలుగుపీపుల్.కామ్ లో రాసి, తరువాత ఈ బ్లాగులో పెట్టిన ఈ టపా లో ఉంది. ఇది తెలుగు లో కూడా చదివేసాక ఆశోకమిత్రన్ కోసం refresh చేయబడ్డ వేట మొదలైంది. హాస్యం, వ్యంగ్యం కూడా సహజంగా ఆ సీరియస్ కథలోనే వచ్చేస్తూ ఉన్నాయి ఆ శైలి లో. ఒక్కొక్కప్పుడు first person లో సాగి మధ్య మధ్య లో author’s perspective లో సాగుతూ కాస్త మొదట్లో అయోమయానికి గురిచేసినా కూడా చివరిదాకా చదివించింది ఈ నవల. “చైతన్య స్రవంతి” అన్న పదానికి అసలు నిర్వచనానికి, నా నిర్వచనానికి ఎంత దాకా పోలిక ఉందో నాకు తెలీదు కానీ… ఇది కూడా “చైతన్య స్రవంతి” లాగా అనిపించింది చాలా చోట్ల. (అంటే, నేను అర్థం చేసుకున్న చైతన్య స్రవంతి అర్థం). ఈ నవల ఒక్క చంద్రశేఖర్ ఆత్మకథ మాత్రమే కాదు…. పంద్రాగష్టు కీ, హైదరాబాద్ సంస్థానం భారత ప్రభుత్వం లోకి విలీనమవడానికి మధ్య కాలం లో జంటనగరాల్లో జీవితాన్ని, పరిస్థితులనూ మన కళ్ళముందుంచుతుంది. నా అభిప్రాయం లో నిజమైన చరిత్ర పుస్తకాలు ఇలాంటి పుస్తకాలే. ప్రజా జీవితాల చరిత్రలను చెబుతాయి. సామాన్యులకి చరిత్ర లేదని అంటూ – “వారికి గతమూ లేదు, అనాగతమూ లేదు” అని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఓ కథ లో అన్నా కూడా, ఏ చరిత్ర పాఠ్య పుస్తకమూ చెప్పలేని కథల్ని ఇటువంటి నవల్లు తెస్తాయి. సామాన్యుడి perspective లో చెప్పబడిన చరిత్ర అని అనొచ్చు ఇలాంటి కథాంశాలతో రాసిన నవల్లను.

మొత్తానికి ఈ నవల ను రెండు సంవత్సరాల కాలం లో రెండు సార్లు బోరు అన్నది ఎరక్కుండా పూర్తిగా చదివాక(బోలెడు సార్లు అక్కడక్కడా చదివాక), ఈ తరహా అనువాద నవల్లను చదవడం లో ఆసక్తి చూపని మా అమ్మ కూడా ఈ పుస్తకం చదవడం చూసాక, మరో సారి దీని గురించి బ్లాగు రాయాలి అనిపించింది. పెద్దగా బెస్ట్ సెల్లర్స్ కాని వాళ్ళ రచనలనే వెదికి వెదికి చదవడం నాకెలా అబ్బిందో తెలీదు కానీ (నువ్వు గత రెండు టపాల్లో రాసిన పుస్తకాల పేర్లలో చాలా మటుకు నేను ఇప్పటిదాకా వినలేదు..ఆని చాలా మంది నుంచి కామెంట్లు వచ్చాయి… విరివిగా చదివే కొత్తపాళీ గారు వంటివారు కూడా ఇలా అన్నాక… నాకు సందేహం వచ్చింది… నాకే ఎందుకు ఈ పుస్తకాలు కనిపిస్తాయి అని)… దాని వల్ల ఓ లాభం కూడా ఉంది. చాలా మంది తెలుసుకోని కోణం లో నేను చరిత్రను తెలుసుకోవడం. ఉదాహరణ కు… అశోకమిత్రన్ చిన్నతనం నుండి చాలా కాలం జంటనగరాల్లో ఉన్నారు. ఆయన అప్పటి అనుభవాలు, అప్పటి జీవితపు గుర్తులు అన్నీ వేరొకరు ఎలా చెప్పగలరు చెప్పండి? 🙂 మీ తాతగారో అమ్మమ్మో మరొకరో … 1947 లో వాళ్ళ స్కూల్లో ఏమి చేసారో చెబుతూ ఉంటే ఎంత ఆసక్తిగా వింటారో (వినకపోయినా వింటాను అనుకోండి..అంతే! నేను వింటాను మరి!) సహజంగా రచయితలైన ఇటువంటి వారి చేతుల్నించి వస్తే అవే విషయాలు మరింత ఆసక్తికరంగా మారతాయి. అసలైన ప్రజా చరిత్ర ఇలాంటి నవల్లలోనే తెలుస్తుంది… ఏమంటారు?

Advertisements
Published in: on August 21, 2007 at 3:37 am  Comments (4)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/08/21/janta-nagaralu/trackback/

RSS feed for comments on this post.

4 CommentsLeave a comment

 1. గత రెండు వారాలుగా సాహిత్య పఠనం మాని సాంకేతిక విషయాలు చదువుతున్నాను. ఇప్పుడు మళ్ళీ ఈ అశోక్ మిత్రన్ రచనలు చదవాలనే ఉత్సుకత కలిగించారు మీరు 😦

  –ప్రసాద్
  http://blog.charasala.com

 2. ఈ మధ్య నగరంలోలేక పెద్దగా చదవట్లేదు టపాలు .
  మీరు హృదయభానుకి కొత్తనిర్వచనమిచ్చి, ఆమెని దిగజార్చారు ః)
  మీరు అన్ బిలీవబుల్ సంఖ్యలో పుస్తకాలు చదువుతారనుకుంటా.. మంచిది.
  నేనింకా మహాప్రస్థానం, కన్యాశుల్కం, భారతం వంటి అన్-బిలీవబ్లీ ప్రఖ్యాతిగాంచిన పుస్తకాలలోనే వున్నాను… 😦

 3. ‘ఒక యోగి ఆత్మ కథ’ చదివారా?

 4. nenu intha varaku perukuda vinaledu, dorikithe thappanisariga chaduvuthanu.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: