విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు

“విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు” – అప్పుడెపుడో “సంగతులూ-సందర్భాలూ” శ్రీరాం గారు తమ బ్లాగులో రాసి, తరువాత ఓ సారి ఈ-బుక్ ఇస్తే, నేను ఇప్పుడు చదివాను దానిని. చదివేసాక దీన్నా ఇన్నాళ్ళు చదవకూండా విత్‍హెల్డ్ లో పెట్టినట్లు పక్కన పెట్టింది అని కాస్త ఫీలయ్యాను. అంత బాగుందీ పుస్తకం. “వేయిపడగలు” దెబ్బకి నేను విశ్వనాథ వారి పుస్తకాలు ఏవన్నాచదవాలంటే రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి కలిగింది. మళ్ళీ ఈ పుస్తకం తరువాత ఆయన రచనలు చదవడానికి కొత్త ఉత్సాహం వచ్చింది.

ఈ నవల్లో రచయిత కి విష్ణుశర్మ, తిక్కనా ఇద్దరూ కల్లోకి వస్తారు. కల్లో మాటకేం గానీ… ఇలలో కొన్నాళ్ళుంటారు వాళ్ళింట్లో అతిథిగా. వీళ్ళకి ఇంగ్లీషు నేర్పమని అడుగుతారు రచయితని. స్థూలంగా ఇదీ కథా విషయం. ఆద్యంతం హాస్యం. ఎక్కడా కూడా బోరు కొట్టదు. పదాలతో భలే ఆడుకున్నారు. ఇంకా, ఇంగ్లీషు నీ, తెలుగు నీ పోలుస్తూ విష్ణుశర్మ, తిక్కన అడిగే సందేహాలు, విసిరే విసుర్లు ఇవన్నీ కడుపుబ్బా నవ్వించాయి. ఈ సందర్భం లోని కొన్ని వాక్యాలు నాకు మా Machine Translation క్లాసులని గుర్తు తెచ్చాయి. రాసిన విధానం ఎలా ఉంది అంటే, ఈ రెండ్రోజుల్లో ఎన్ని సార్లు ఆ డైలాగులను తలుచుకుని నవ్వుకున్నానో! జంధ్యాల సినిమాలలా ఉన్నాయి. మచ్చుకి కొన్ని:

“కొందరేం చేస్తారంటే..అర్థరాత్రి వేళ వస్తారు. తలుపు తట్టుతారు. ’ఎవరు వారు’ అంటే ’నేను’ అంటారు. ఏమి నేను శ్రాద్దం నేను.”

“మీలో ప్రతివాడూ ఎవడో ఒకడై ఉంటాడు కదా. వాడు వాడేనని ఇంకొకడెవడో చెబితే కానీ కాడా ఏమిటి?”

“పాలముంచినా, నీట ముంచినా నువ్వే” నన్నాడు. మాకు పాలు, నీళ్ళూ వేరు వేరుగా ఉండవు. కలిసే ఉంటయి. ఇల్లు దూరమైనకొద్దీ నీళ్ళెక్కువ కలుస్తయి.

“ఆ గేదె పాలు ఇచ్చినా సరే, ఇవ్వకున్నా సరే..ఇది రోజూ నాలుగు చెంబులనిండా పాలు తీసుకవస్తుంది.”

“అసలు కవిత్వమనే వస్తువు వేరే ఉంటుంది. ఒక్కోసారి పద్యంగా ఉంటుంది. ఒక్కోసారి గద్యంగా ఉంటుంది. మరి ఒక్కొక్కప్పుడు గద్యంగా పద్యంగా ఉంటుంది. ”

“ఓరిబాబోయి, వీళ్ళూ చచ్చారన్నమాటే తప్ప, చచ్చారుగనుక బతికిపోయాం గానీ …”

“పగటి కలలకు పాటింపు లేదు.”
“ఆ సంగతి నాకు తెలుసు. అందుకనే నవల రాయడం. పాటింపు ఉంటే నవల రాయడమెందుకు? దానినమలులోనే పెట్టేవాణ్ణి.”

కొన్ని అర్థం తెలీకపోయినా నవ్వు పుట్టించిన మాటలు:
“ఆకాసి పోకాసివాణ్ణనుకున్నావా?”
“లత్తుకోరు మాటలు నేర్చుకుని…”

మాట గురించి విశ్వనాథ వారి మాట – “మాటకున్నంత శక్తి మరొకదానికి లేదు. మాటకు అనేకములైన అర్థములు ఉంటవి. వంద సందర్భాల్లో ఒకేమాట వంద అర్థాలనిస్తుంది. ఒక్కమాటే అన్ని అర్థాలిస్తే రెండు మూడు మాటలు కలిస్తే ఎప్పుడు ఏ అర్థమిస్తుందో చెప్పలేము. కనుక మాటకు శక్తి లేదనకు. శక్తి లేనిది మనకు. మాట అర్థం ఇస్తుంది. అర్థం చేసుకొనవలసినది మనము.”

మొత్తానికైతే మంచి పుస్తకం. మరిన్ని సార్లు చదివినా కూడా బోరు కొట్టదేమో. నేను పుస్తకం చివరికొచ్చేసరికి Language Technologies Research  లో ఒక హాస్యమయమైన దృక్కోణాన్ని చూట్టం మొదలుపెట్టాను 🙂 ఇక్కడ తరగతి గదుల్లో సీరియస్ గా చర్చించిన విషయాల్నే అక్కడ పుస్తకం పుటల్లో విశ్వనాథ వారు చాలా చక్కని హాస్యం తో జనానికి అందించారు. అప్పటికి ఈ Natural Language Processing వగైరా లేవెమో… ఉన్నా ఆయనకు తెలిసే అవకాశం తక్కువ. అయినా కూడా నేను ఇందులో ఆ కోణం చూడగలిగాను. జ్ఞానోదయం అయినట్లు అనిపించింది, విష్ణుశర్మ, తిక్కన ల వాదం వింటూ ఉంటే 🙂 శ్రీరాం కాకరపర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

Advertisements
Published in: on November 6, 2007 at 7:14 am  Comments (44)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/11/06/vishnusarma-english-chaduvu/trackback/

RSS feed for comments on this post.

44 CommentsLeave a comment

 1. Nice write up

 2. ఎక్కడ దొరుకుతుంది?

  కొత్త రవికిరణ్

 3. @ravikiraN – Visvanatha’s novels are now available as a complete set.

  Sowmya – Ncie write up. I too read this book recently (couple of months ago). Moved me very strongly. Started writing a blog about it. Darned procrastination ..anyways, nice job in your review. However I take exception to your last statement – అప్పటికి ఈ Natural Language Processing వగైరా లేవెమో… ఉన్నా ఆయనకు తెలిసే అవకాశం తక్కువ. – IN fact this book and Ha Ha Hu Hu give good indicaton that Visvanatha is intimately familiar with a lot of modern concepts.

 4. @కొత్తపాళీ గారు:
  Yeah… Forgot totally about “hahahuhu”. It was the first Viswanatha’s novel I read. Hmm…. Yeah…should agree with ur statement. but…perhaps, NLP did not exist as an area of specialisation in this times….

  • విశ్వనాథనీ ఎన్.ఎల్.పి. కాన్సెప్టునీ ముడిపెట్టుకుని ఆలోచిస్తూన్న నాకు దాన్ని గురించి ముందుగానే మీరు అనేసుకున్నారని చదువుతూంటే భలేగా అనిపించింది లెండి.
   మాటలకున్న శక్తిని గురించి ఈ నవలలోనూ, దేవతల యుద్ధంలోనూ, అలానే వల్లడు పని సాధించే విధానం(వీర వల్లడు), నీలతో కాళింది మాట్లాడే పద్ధతీ, ఆపై కాళింది దుస్సల ఒకర్నొకరు అంచనా కట్టుకునే విధానమూనూ(భగవంతుని మీది పగ), ఇక మొత్తంగా చంద్రగుప్తుని నవల చదువుతూంటే 1990ల్లో అభివృద్ధిచేయబడ్డ ఎన్.ఎల్.పి. అనే కాన్సెప్టును కాన్సెప్టుగా కాక కేవలం తన పరిశీలన శక్తితో అవగాహన చేసుకుని రాసేశారా విశ్వనాథ అనిపించింది. కాన్సెప్టైతే ఈమధ్య అభివృద్ధి చేశారు కానీ మానవ స్వభావంలోని ఆ అంశాలు ఎప్పటినుంచో ఉన్నవేగా.

  • క్షమించాలి. మీరన్న ఎన్.ఎల్.పి. నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కాగా నేననుకున్న ఎన్.ఎల్.పి. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాం. మొత్తానికి అబ్రివేషన్ వల్ల పొరబడడమైనది.

 5. This is a nice book, I have pdf copy, if you need it please let me know

  • Sir,iam searching for vishnusarma english chaduvu book.pls if you send pdf copy,iam very greatful to you sir.
   srideviramesh

 6. e-book link

  http://www.mediafire.com/?2vbisgmddtx

 7. “టంగు తెగుద్ది” మరచినట్లున్నారు. ఠాగూర్ సినిమాలో (కొంచెం వికారంగా కలిగించే) ఈ మాటను విని ఇది పరుచూరిసోదరులదేమో అనుకున్నాను ఈ పుస్తకం చదివేవరకూ. ఆ పుస్తకాన్ని మళ్లీ చదివించేలా వుంది మీ టపా. (శ్రీరామ్‌కు కృతజ్ఞతలు)

 8. @ రానారె – “తెగుద్ది” అని కాదు, తెగుతుంది అనే రాశారు. ఈ “టంగు తెగటం” ఈ నవలికలో చాలాసార్లు కనబడుతుంది.

 9. I am glad you liked the book. And as expected you came up with a nice write up.

  gurUjee promised to write a review which never came out as i suspected 🙂 hope this will move him now…

  Cheers!

 10. నేనూ చదివాను ఆ పుస్తకాన్ని. హాయిగా నవ్విస్తునే, ఆలోచింపజేస్తుంది.

 11. […] కౌముది, రాకేశ్వర, రానారె, సరిగమలు, సౌమ్య వంటి బ్లాగర్లు ఎన్నో పుస్తకాల […]

 12. మీరు రాసిన సమీక్ష చదివాక – ఉండబట్టలేక ఈ రోజే దీనిని అంతర్జాలంలోంచి దిగుమతి చేసుకొని ఏకబిగిన చదివి ఇప్పుడే పూర్తి చేసా. విశ్వనాధ వారి పుస్తకాలు చదవాలంటే నాక్కూడా మీలాగే కొంచెం జడుపు – ఆయనేదో ఛాందసుడని కాదు గాని — ఆయన చాలా నింపాదిగా కథ చెప్తాడు, ఆయన శిల్పంలో చాలా రికర్షనుంటుంది. నేనేమో, మెదటసారి పుస్తకం చదివినప్పుడు వైడాంగిల్ లెన్సుతో చదివి, రెండోసారి ఏ కోణంతో చదవాలో మార్కు చేసుకొంటా, కాని ఆయన రచనల్లో ఉండే రికర్షను వల్ల నాకు స్టేక్ ఓవల్ ఫ్లో అయిపోతుంటుంది.

  I have a few things to say about this book but I will wait for KottaPali’s review (I have a promise to keep:-) )

  There are many things he says in this book, but what attracted me most is the ‘method’ that Vishnu Sarma uses to acquire mastery in a new language. Once you understand ‘first principles’ thoroughly, you can then apply them to learn any thing else – because the first principles tend to be universal. This is a simple idea – but in order to internalize the first principles – you first have to master at least two different subjects simply because first principles cannot be taught so easily. This is a sort of catch 22 situation in teaching and learning. For example, a mathematics teacher cannot teach you how to ‘do’ mathematics – he/she can only show you enough examples, and you are expected to get the ‘trick’ yourself. In some sense, Viswanatha may be right that in the good old days – the focus was certainly more on understanding the ‘process’ of doing something rather than producing a final outcome.

  Recently, I have been reading Donald Knuth’s wonderful book called ‘Things that a computer scientist rarely talks about’. The book is a series of lectures he gave on faith. In the third lecture, he talks about how he taught himself Hebrew without ever knowing the Hebrew alphabet or grammar. He even managed to do a highly acclaimed translation of bible!! The method he described in that lecture is very similar to the method used by VishnuSarma in this novel. Of course, being an eminent scientist, Knuth’s lecture is full of rigor – where as in this story there is just too much rhetoric. I used a similar method to teach myself Sanskrit without ever referring to any dictionary/grammar book on Sanskrit.

  I agree with your observation that some of the topics covered in this book are routinely taught in NLP courses – may be you can talk to Vasu and see if one could use some material from this book!!

  నాగరాజు (సాలభంజికలు)

 13. […] , రాకేశ్వర, రానారె, సరిగమలు, సౌమ్య వంటి బ్లాగర్లు ఎన్నో పుస్తకాల […]

 14. […] రాకేశ్వర, రానారె, సరిగమలు, సౌమ్య వంటి బ్లాగర్లు ఎన్నో పుస్తకాల […]

 15. First of all thanks for talking about two good, intelligently written books!!

  Here is an unsolicited, but an honest, advice- rather a tip – to those that pay no attention to copyrights etc. I don’t know who put VSN’s work in e-form on net, and that too as freely down-loadable. Without going deep into details what all I can say is that VSN’s heirs are extremely cautious about the CR issue. So, please be aware of eventual legal consequences if they come to know about that. I myself have *very strong reservations* about their policy. But when Sri Pavani Sastry was alive he didn’t help much in popularizing his father’s works, nor his sons; i.e. VSN’s grandsons have been doing any better (purely my personal opinion!!).

  Velcheru Narayanarao has an excellent (again my opinion!) essay (along with the translation) analyzing VSN’s “modernity” published in a journal. He did also do a similar publication on “vishNuSarma ingleeshu chaduvu” which remains unpublished (s.a).

  Digressing a bit, apropos, if one is interested in
  NLP and Indic languages (esp. Sanskrit) theres a whole lot of scientific/academic and pseudo-academic publications on it :-). From philosophical side, the famous scholar late B.K. Matilal has a small monograph on “The Word and the World: India’s Contribution to the Study of Language”.

  Enough of my ramblings!

  Regards,
  Sreenivas

  • Sreenivas garu: I know this is a super late reply here. But, thanks for the reference. Will read the book by B.K.Matilal soon.

 16. చాలా బాగా రాశారు సౌమ్యా! మీరు వేయిపడగలు గుర్తుచేయగానే నా పుస్తకంలో మడత పెట్టిన పేజీ గుర్తొచ్చింది.. ఒక ఏడెనిమిది నెలల క్రితం అనుకుంటా పేజీని మడత పెట్టి రాక్ లో ఎదురుగా పెట్టాను.. ఏదన్నా చదవాలనిపించినపుడు మిగతా పుస్తకాలని కిందనించి, లోపలనించీ లాగి పీకి చదువుతున్నాను కానీ దాని జోలికి వెళ్ళాలంటే మాత్రం భయం వేస్తుంది.. మీ write-up చదివిన తర్వాత ‘హయ్యమ్మా! I’m not alone’ అన్న ఫీలింగ్! 🙂 ఇప్పుడు మీ టపా చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు విష్ణు శర్మ గురించి చదవుదామా అని ఉంది! Thanks So much for the nice write-up and bringing this book to us!

 17. రానారే గారు,
  ఠాగూర్ లో ‘tongue’ వి.ఇం.చ లో టంగు ఒకటి కాదేమో.

  టంగు [ ṭaṅgu ] or టంగునారు ṭangu. [Tel.] n. A saddle girth. గుర్రములమీది జీమ జారకుండుటకుకట్టే వారు.

 18. పుస్తకాని మాత్రము డౌన్ లోడ్ చేసుకొన్నాను. చదవడానికి సమయం చిక్కలేదు మెదటి పది పదిహేను పేజిలు చదవగలిగాను.ప్రారంభిస్తే ఆగని పుస్తకము , కాని నా పని వత్తిడి వల్ల పుస్తకాన్ని పక్కన పెట్టవలసి వచ్చింది

 19. […] అర్థం చేసుకొనవలసినది మనము.” ” ఇది ఇక్కడినుండి అరువు తెచ్చుకున్నాను. ఇక ఇక్కడ  […]

 20. Ee book ekkada dorukutundi Hyderabad lo?

  Very good writeup Sowmya 🙂

 21. Vedam venugopal garu…book download link …paine vunnadi choodandi…hard copy kaavaali anukunte koti lo vislandhra publications lo dorakachchu

 22. చాలా సంతోషం …. ఇలా online లో ఇంత మంచి రచనలు దొరకుతాయని నాకు తెలీదు … ఇంకా ఇలాంటివి ఏమైనా links వుంటే చెప్పండి … మీ జన్మ ఈ మేలు లో మరచిపోలేను … 🙂 … ఇవన్నీ చదివి ఈ రోజు నాకు నిజంగానే కడుపు నిండిపోయింది …

  చంద్రం.

 23. hi sowmya, how are you doing?
  ur writtings really inspiring me to expose myself, i too am a very good reader.

 24. మీ ఈ సమీక్షను నేను మా http://www.teluguthesis.com లో చదివా. మీ బ్లాగ్ చూడాలనిపించింది. చాలా బాగుందండి మీ కృషి.

 25. […] చదివినప్పుడు. విశ్వనాథవారి ‘విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు‘ ని పరిచయం చేస్తూ “వేయిపడగలు […]

 26. ee madhya VISHNU SARMA ENGLISHU CHADUVU story D.D.8 lo serial ga vachhimdi. D.D.vari branded serials laga kakumda action, direction bagunnayi. yekkadaina dorikite tappakuda chudamdi.

 27. Viswanadha gaariki haasya konam undani(Rachanala rupam lo) oohinchaledu…
  Sowmya ki maro saari krutagyatalu.. kotha vishayalani kotha velugu lo chupinchinanduku

  Absolutely novel thought of juxtaposing period writers into contemporary world. And since they are creative people kind of synonymous with the openness of their minds( can get into debate… but relativity is the hub here), they leave a lot of scope for noveau criticism.. Excellent topic to extrapolate and explore ideas.

  I have a faint doubt … if Yamagola whatever movies’ foundation lies in here.Inspiration is the word.We Indians are bad at crediting

 28. Viswanadha vari Abhimanulu andariki vandanamulu. Vishnu Sarma English Chaduvu(VSEC) is marvel.Let me proudly ( As Viswanadha Satyanarayana) and humbly ( As Dr. Goda Bhaskara Rama Krishna Sastry )say a few words in this context.The Telugu channel Saptagiri, Hyrerabad,has produced in Seven Episodes in September 2008.The VSEC Noel was dramatised by Sri Chintapenta Satyanarayana Rao (C.S.Rao).This was staged in Ravindra Bharathi as a stage play direced by Sri D.S.Dixit.The play was witnessed by Viswanadha’s Eldest son Atchuta Rayulu,daughter Smt.Durga and grand children.A galaxy of Viswanadha vari Abhimanulu(fans) enjoyed the play.Among them were Second Gnana Peeth Awardee Dr.C.Narayana Rerddy Doordarsan Director Palakurthy MadhuSuda Rao.There they decided to produce for T.V. as a serial.It was produced and won Golden Nandi as best tele film of the year.I have played the character of Kavi Samrat Dr.Viswanadha Satyanarayana which has brought me Nandi Award for Best Acting and for C.S.Rao as best dialouge writer. Thank you all the readers of Sri Viswanadha.

 29. Corrections: noel=novel is a marvel Atchuta Deva Rayalu Madhusudana Rao The character Vishnu Sarma was played by Sri Malladi Bhaskar and Tikkana Somayaji was played by Sri S.S.Vajapayee.Viswanadha’sWife Varalakshmi was plyed by Smt.K.Vijaya Lakshmi

 30. Viswanadha vari oka English jhalak:
  Vishnu sarma and Tikkana came from heaven to learn english from me (Viswanadha).I agreed.One day after lunch Tikkana was sleeping on nulaka mancham in the backyard.vishnu sarma asked me to start english teaching.I brought an english letters’ chart. Showing the chart Iexplained how to read and write. Then I told him that there are “two” single lettered words.”A” ante Oka. “I” ante Nenu.Then I asked him to read and write the letters ten times.Vishnu sarma( Vaideeki)instantly said, “Why all these things for me?Nenemaina voollela leka vudyogalu cheyyala! Idigo Aa Tikkanaku(niyogi)cheppu. Okavela vudyogam chesukovalasi vasthe vapayogistundi. Ataganni lepu. “babu”
  “Baboo” antu lepanu.

 31. Enthasepu lepina levaremandi?”Nuvvu “babu.. baboooo”ani mee abbayini mudduga piluchukuntunnavanukunnanu.” “kadandi, mimmalne leputunnanu.vishnu sarma garu meeru kuda english nerchukunte baguntundantunnaru” “Sare! Peddayana mata kadanalenu.Patham Modalettu.” I repeated the lesson and told “A” ante Oka,”I” ante Nenu.” Tikkana:”I” ante Nenu, mari “Nuvvu” anadaniki emanali?” “U” analandi.” vishnu sarma :Idigo abbai! indaka natho ekakshara padalu rende vunnayannavu! mudodi “u” kuda vundani cheppalede? “Adi kandandi.”Y.O.U.” ani rasi, U ani palakali. ala rasi U ani palikitene Nuvvu ani ardham.Vatti U ki aa ardham ledu.” Vishnu sarma:Emito Neeku sariga enlishu vachhinatlu ledabbai.” “Avunandi.Naku english radu. nenu meeku sariga nerpaleka potunnanu. Oooof! Y.O.U. ani rasi “U” ani palakadame tappa aaa modati rendaksharalu chachhayani kani, aaa chivari aksharam U matrame palukutunnamani kani naaakoo teliyadu. Meeku chaduvu cheppe sariki naa TThhangu tegela vundi.(scene end)

 32. Sowmya gariki Viswanadha Satyanarayana Aaseessulu. Mee hrudayam lo mee dwara marendari hrudayantaralalo nannu chiranjeevini chestunnanduku naa abhivadamulu. mee krushi vurike podu. Ee antarjalam dwara Telugu sourabhalani inka vedajallalani,aakankshisthu ee naa sandesam, Professor and Principal, naa aatma amsa sambhutudaina Rama krishna Sastry cheta vrayistunnanu. Subham.

 33. hi sowmya garu, Nenoo, viswanadha satyanarayana. naaku aavakayi annam lo pachi mirapa kaya korukku tindam alavatu. ani andariki cheppu.

 34. Sowmya gariki Aseessulu. “Vishnu Sarma English Chaduvu” Natakanni ( Stage Play)Vijayawada lo 2011, August 13,14 Dates lo pradarsisthunnamu.Krishna Zilla Rachayithala Sangham Hon’ble Sri Mandali Buddha Prasad gari Aadhwaryam lo arrange chestunnaru.This is my personal Invitation as Viswanadha Satyanarayana.Aa roju Ramakrishna Sastry meeda Parakaya Pravesam chesthanu. Do’nt miss. Thank you one&all

 35. asalu vishayam cheppaledu.VSEC stage play Prapancha Telugu Rachayithala Maha Sabhala Sandarbham ga veyisthunnaru. 15th August Vemana Yogi Stage play kooda veyisthunnaru.Tappaka choodandi.

 36. Dear Readers

  BRAMHA SRI –MADHIRA subbana dishitula vari —“”KASI MAJILI kATHALU”” (1868) six books and 12 parts –with easy telugu — tappaka chadavandi –sarala maina telugu lo chala baga vunnai

 37. […] ఇంగ్లీషు చదువు” పుస్తకం గురించి బ్లాగు టపా రాసినప్పుడు దాని కింద పరుచూరి […]

 38. Hello!World Telugu Conference Tirupathi lo December 27,28,29 dates lo jaragabotunnayi.Aa sandarbham lo Vishnu Sarma English Chaduvu Natakam pradarsistunnamu. Andulo nenu viswanadha Satyanarayana gari patra chesthanu.Meeku Telusuga.

 39. Nenu chinnappudu (25 yrs back) radio lo ee book ni evaro (chala manchi voice..naku baga gurthu) chadive vallu…varani ki oka sari vachedi…intillipadi kurchuni vinevallam.
  ayana voice lo ee satynnarayana gari virupuu baga pandinayi…naku baga gurthunnad okati

  “Put”……”Putta..?”, “But”….”Battaa..”” edmi vyakaranam?

  ee audio file dorike chance unda?
  Vasu

 40. Dear vasu garu,Namasthe.
  Chadivina vari peru Jeedigunta Ramachandra Murty
  varitho maatladenu. dorakadu ani chepparu.
  Sorry.
  Regards
  9848053115


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: