అనుక్షణికం – నా అనుభవం

ఈ పుస్తకం గురించి నేను ఎంతగా విన్నానంటే …. అసలు కథేమిటో కూడా తెలీకుండానే దేనికి సంబంధించిందో తెలీకుండానే … చదివి తీరాల్సిందే అని తీర్మానించుకునేంత. ఏదో రవికిరణ్ కొత్త గారి పుణ్యమా అని ఆ పుస్తకం దొరికింది నాకు. ఆ మధ్య ఓ సారి కలిసినప్పుడు చదవమని ఇచ్చారు. మొత్తానికి … ఒక విధంగా నాకు ఈ పుస్తకం నచ్చింది. ఒక విధంగా ఓ పెద్ద disappointment. చండీదాస్ గారు చనిపోయినప్పుడు ఆయన గురించి మొదటి సారి విన్నాను నేను. అప్పుడు ఏదో పత్రికలో ఆయన ఇంటర్వ్యూ వేసారు. అది చదివి… విపరీతంగా నచ్చింది నాకు. కొన్ని జవాబులు చాలా నచ్చాయి. కానీ, అక్కడికి ఆగిపోయింది. నాకప్పటికి తెలుగు సాహిత్యం గురించి అప్పుడప్పుడే తెలుస్తూ ఉండింది. అప్పటికే నేను చదవాలి అనుకుంటున్నవి చాలా ఉండటం తో ఈయన పుస్తకాలు చదవాలి అన్నది అంత ప్రబలంగా అనిపించలేదు. ఓ సంవత్సరం క్రితం మూలా సుబ్రమణ్యం గారూ, రవికిరణ్ గారు ఈ పుస్తకం గురించి గొప్పగా చెప్పడం తో మళ్ళా చండీడాస్ గారు గుర్తు వచ్చి ఈసారి చదువుదాం అనుకున్నాను. ఇదీ బ్యాక్‌గ్రౌండ్. ఇప్పుడు ఫోర్‌గ్రౌండ్ లోకి.

ఈ పుస్తకం గురించి…. నాకు నచ్చినవి మొదట చెబుతాను వరుసగా. నచ్చనివి చెబుతాను చివర్న. ఇదేమి తరహా పుస్తక పరిచయం? అనకండి… నాకు సంబంధించినంత వరకు ఇదో ప్రత్యేకమైన తరహా పుస్తకం. అందుకే ప్రత్యేక పరిచయం. ముందుగా నచ్చినవి:

1. భాష – భాష పై ఆయనకి ఎంత పట్టుందో ఆయన పదాల కూర్పుని, సృష్ఠించిన కొన్ని కొత్తపదాలు (ఉదా: స్నానించి, చిర్నవ్వి వగైరాలు), వంటి విషయాలని బట్టి అర్థమైంది.

2. కథనం – కొన్ని చోట్ల నాకు చెబుతున్న విషయం నచ్చకపోయినా కూడా పుస్తకం మూసేసి అవతలపడేయలేదు. చాలా చోట్ల “అసల్దీన్ని నేనెందుకు చదవాలి” అనిపించేలా ఉన్నా కూడా, కథనం కారణంగానే నేను దాన్ని పూర్తిగా చదివాను అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.

3. వర్ణనలు: ఎన్ని పాత్రలున్నాయో ఈ నవల్లో. ప్రతి పాత్రకీ ప్రతి చిన్న డీటైల్ నుంచి వర్ణన మొదలు. ఎంతలా ఉంటుంది అంటే పాత్ర మనముందు నిలబడ్డట్టు. ఒక్కో పాత్రకి దాని సొంత మేనరిజంస్. ఆ పాత్ర ఎక్కడ కనపడ్డా కూడా ఆ మేనరిజంస్ వెంటాడుతూ ఉంటాయి దాన్నీ, మనల్నీ కూడా.

4. అసలు ఇన్ని రకరకాల సమస్యలను ఇన్ని పాత్రలను తీసుకుని కూడా విజయవంతంగా సుమారు 900 పేజీల నవల రాయగలిగినందుకు ఆయనకి ఎన్ని వీరతాళ్ళైనా వేయొచ్చేమో. 🙂 అప్పటి భారద్దేశం లో ఉన్న సమస్యలన్నీ ఆ నవల్లో ఆయన స్పృశించాడని విన్నాను. నిజమే ఏమో .. అదీ ఇదీ అనిలేదు… ప్రతి విషయం గురించి ఎక్కడో ఒక చోట రాసాడు..ఏదో ఓ పాత్ర ద్వారా చెప్పించాడు.

5. నాకు కూడా శ్రీపతి లాగా ఎప్పుడూ అలా రకరకాల విషయాలను చదువుతూ ఉండిపోవడం అన్నది చాన్నాళ్ళుగా ఉన్న కోరిక. అదొక కారణం.

ఇక నచ్చనివి:

1. ఇదే కొన్ని సార్లు – “ఈ నవల చదవడం అవసరమా?” అనిపించేలా చేసిన కారణం…. చాలా చోట్ల చదవడానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను. నవీన్ వి చదివినప్పటి కంటే ఎక్కువ ఇబ్బంది పడ్డాను. అలాంటి తరహా ఇబ్బంది పెట్టే వర్ణనలు ఈ నవలలో కోకొల్లలు. వాటి వల్ల ఒరిగేదేమిటో అర్థం కావడం లేదు నాకు. ఒకటి రెండు పాత్రలు తప్ప ప్రతి పాత్ర కూడా ఆడా/మగా తేడా లేకుండా ఇదే గోల! జీవితానికి వేరే లక్షాలూ గట్రా లేనట్లు.

2. డిటో

3. డిటో

4. డిటో

5. డిటో

– నాకు ఓ నమ్మకం ఉండేది … ఓ పుస్తకం గానీ, కథ గానీ, సినిమా గానీ … ఏదైనా సరే … చదివాక/చూసాక ఓ నాలుగైదు రోజుల తరువాత కూడా గుర్తు వచ్చాయి అంటే ఇంక అవి బాగున్నాయనే అర్థం – అని. ఈ పుస్తకం అది తప్పు అని రుజువు చేసింది. అంటే ఇది బాలేదని కాదు. నాకు వేరే కారణాలకు గుర్తు వచ్చింది ఈ పుస్తకం.

నాకు మళ్ళీ ఈయన రచనలు చదివే ఆసక్తి ఇంకా పూర్తిగా పోలేదు కానీ…. కొంత గ్యాప్ ఇచ్చి రెండో నవల చదువుతా ఏమో. ఇక ఎవరన్నా ఈ నా వ్యాసం చదివి పుస్తకం చదవాలా వద్దా అని సందేహానికి వస్తే … నేను చెప్పేదొక్కటే – బహుశా అది చదివి తీరాల్సినదే ఏమో. కానీ … నాకే దాన్ని appreciate చేసేంత ఎదుగుదల లేదేమో… ఇంక నేనేమీ వ్యాఖ్యానించను ఈ పుస్తకం పై. ఈ పుస్తకం పాపులారిటీ వల్ల నాకు ఏమి చెప్పాలో అర్థం కావడం లేదు. ఏమి చెప్తే ఎవరు దాడి చేస్తారో! 🙂 సాధారణంగా ఈ విషయం నేను పట్టించుకోను గానీ – ఎవరేమనుకుంటారో అని… ఈ విషయం లో నాలోనే దీనికి “Haa”, “naa” చెప్పే రెండు పక్షాలు ఉండడం వల్ల వచ్చిన సమస్య అనుకుంటా ఇది.

Published in: on July 23, 2007 at 6:32 am  Comments (26)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/07/23/anukshanikam/trackback/

RSS feed for comments on this post.

26 CommentsLeave a comment

  1. సౌమ్య గారికి,
    మీ అభిప్రాయాలు బాగున్నాయి
    రవికొత్త గారికి,నాదగ్గర అన్నిరోజులు నీ అనుక్షనికం ఉన్నా నేను పూర్తిగా చదవలేదు.ఇప్పుదు సౌమ్య గారి అభిప్రాయం చదివాక నిజంగా దాన్ని తిరిగి చదవాలనిపిస్తుంది.
    క్రిష్నకె

  2. సౌమ్యా.. మీ సమీక్ష బాగుంది. మీరు స్పృశించిన, స్పృశించని అంశాలు ముఖాముఖి మాట్లాడుకోవచ్చు.

    మనుషుల్ని మరింతగా చదవడం (ఇప్పుడు పుస్తకాల్ని చదువుతున్నంతగా కన్నా ఎక్కువగా..) చేస్తూండండి.

    ఇక కృష్ణ కె గురించి. “అసలు పుస్తకాలు చదవడానికి మీకు సమయమెలా దొరుకుతుంది” అనే జాతికి చెందిన వాడు ఇతను. పుస్తకం చదవడానికి పుస్తకం ఉంటే చాలు, ఇంకేం అఖ్ఖలేదు అని నువ్వు తెలుసుకునే దాకా నువ్వు దాన్ని చదవలేవు.

    కొత్త రవికిరణ్
    9908 638 118

  3. మరొకరి సమీక్ష

    http://eemaata.com/em/issues/200507/177.html

  4. రవికిరణ్ గారూ!
    ఈమాట లింకు కి ధన్యవాదాలు.

  5. మొన్నీమధ్యన చరసాల గారి బ్లాగునించి అనుకుంటా మొదలైంది ఒక చర్చ – అస్తిత్వ వాద సాహిత్యం గురించి – అది తరవాత సాహిత్యం గుంపులోకి పాకింది. చండీదాస్ గారు తానే చెప్పుకున్నట్టు బుచ్చిబాబు గారి అనుయాయీ, కొంతవరకూ సాహిత్య వారసుడు కూడా. అందుకని “ఈ కథకి ఏవిటర్థం” అనే ప్రశ్న ఈ రచనల్కి అన్వయించడం సబబు కాదు. ఏమీ అర్థం లేకపోవడమే ఒక అర్థం. ఇక అనుక్షణికం విషయం – ఒక విశ్వవిద్యాలయంలో ఒక పదేళ్ళ వ్యవధిలో జరిగిన నిజ పరిణామాల (ఎమెర్జెన్సీ, రాడికలిజం, మొ..) నేపథ్యంలో ఆయా పాత్రల జీవితాలు ఎలా పరిణమించాయో చెపుతుందీ నవల. ఆ విధంగా ఒక కాలపు chronicleగా ఇది విలువైనది. ఇది కాక ఈ నవలని మనకి ప్రీతిపాత్రం చేసే విషయాలు ఇంకా చాలా ఉన్నై.
    నచ్చని విషయంలో “డిటో” అంటూ మీరు చెప్పిందేమిటో నాకు అర్థం కాలేదు.

  6. సౌమ్య గారు రాసిన రివ్యూ బాగుంది.అయితే మంచి రచనలే కావు జుగుప్స కలిగించే రచనలు కూడా చాలా రోజులు వెంటాడుతుంటాయి.అనుక్షణికం నా ఉద్దేశంలో అలాంటి నవల.ఎందుకో వివరించే ముందు ఓ ముచ్చట..అనుక్షణికం కథాకాలం ఎమర్జెన్సి రోజులు.అప్పుడు కేంద్ర మంత్రి కొత్త రఘురామయ్య గారు సంజీవగాంధీ చెప్పులు మోశారన్న కథ ప్రచారంలో ఉండేది.ఈ విషయాన్ని నేను అసందర్భంగా ప్రస్తావిస్తే మిత్రులు కొత్త రవికిరణ్ గారికి బాధగానే ఉంటుంది కదా!అనుక్షణికం జ్యోతిలో సీరియల్ గా వస్తున్న రోజులలో ఆ నవలలోని కొన్ని ఇంటిపేర్లతో నా స్నేహితురాళ్ళు ఉండేవాళ్ళు.జాగ్రత్తగా గమనిస్తే ఆ నవలలో సెక్సు విషయంలో అడ్డదారులు పక్కదారులు పట్టిన వారిలో ఎక్కువమంది ఒకే కులానికి చెందినవారు.ఆ ఇంటి పేర్లతో ఉన్న నా ఫ్రెండ్స్ ని కాలేజి లో ఎంత వల్గర్ గా ఏడిపించేవారో.ఒక్కొక్క వారం ఆంధ్రజ్యోతి రాగానే వాళ్ళు కళ్ళనీళ్ళు పెట్టుకునేవారు.చండీదాసు ఒరిజినల్ ఇంటిపేరుతూ కాని ఆయన కులానికి చెందిన ఇంటిపేర్లతో గాని బరి తెగించినవారు నీతితప్పిన వారు ఉండరు..హీరో ఆయన కులస్తుడు.సంయమనం పాటించ వలసిన రచయిత చేయవలసిన ఇలాగేనా?ఓ కులం పైన ఆయనకి ఉన్న కోపాన్ని తీర్చుకోవటానికి ఆ కులంలోని ఆడవారి ని అష్లీలవంతులుగా సృష్టించటం సంస్కార లక్షణమా?సాహిత్య ప్రయోజనం అదేనా?
    నా అభిప్రాయంలో చండీదాసు నేర్పరి అయిన శిల్పి అయిఉండచ్చు.అయితే అశ్లీలాన్ని,అశుధ్ధాన్ని,అసహ్యాన్ని,బురదని రంగరించి శిలగా చేసుకుని అనుక్షణికం రాషాడు.ఆయన తెలుగు వారికి చేసిన గొప్ప సేవ ఏమిటంటే తరువాత రాయక పోవటం.
    ఇది టైపు చేస్తున్నప్పుడు నా స్నేహితురాళ్ళ వేదన గుర్తుకి వచ్చి వేళ్ళు వణుకుతున్నాయి.జుగుప్సతో ఒళ్ళు జలదరిస్తున్నది.
    రచన.

  7. కొత్త రఘురామయ్య గారు చెప్పులు మోస్తే కొత్త రవికిరణ్ ఎందుకు బాధ పడాలి? ఆయన మాఊరికి చెందినవారే.. దగ్గర సంబంధం కూడా ఉన్నది. అయినప్పటికి బాధ పడటానికి నాకు ఒక్క కారణమూ తట్టడం లేదు. ప్రతీ రంగంలో ఒక వర్గం లోని ఒక్కరి గొప్పలకు, తప్పులను మొత్తం ఆ వర్గానికి ఆపాదించడం ఎప్పటినుంచో జరుగుతూ వస్తున్నదే.

    రచన గారూ..నాకనిపిస్తోంది… మనం నిజంగా బాధ పడాల్సింది వాళ్ళని వల్గర్ గా ఏడిపించిన వాళ్ళ సంకుచిత మనస్తత్వానికి గానీ, ఏదో కొన్ని సన్నివేశాలను ఉదహరించిన రచయితను విమర్శించడం భావ్యం కాదనుకుంటా.

    ఒక కులం వారిపై తన కోపాన్ని వెళ్ళగక్కాడనడాన్ని కూడా నేను సమర్ధించను. నేను చండీదాస్ గారిపై ఎందరో వ్రాసిన కధనాలు చదివాను గానీ, ఈ విమర్శ రచన గారి వద్దే వింటున్నాను. కొద్దో గొప్పో అన్ని వర్గాలూ ఆయన పెన్ను పోటు అనుభవించినవే అని నాకు గుర్తు. (ఇప్పటికి సరీగ్గా, గుర్తు లేదు, మళ్ళీ చదవాలను కుంటున్నాను.)

    అసలు రచన ఏదైనా చదివేటప్పుడు పాఠకుడిగా చదవాలి గానీ, నా సామాజిక నేపధ్యం, నా కుటుంబ గౌరవం అనుకుంటే కుదరదని నా అభిప్రాయం.

    ఆయన వ్రాసినా, వ్రాయకపోయినా ఆ తరహా సన్నివేశాలు జరిగే ఉంటాయి. అన్ని కులాల్లో ఈనాడూ అటువంటివి జరుగుతూనే ఉన్నాయి. ఆయన కాంతి ప్రసరించాడంతే.. ఫోకస్ చేసిన రచయితని ఆడిపోసుకోవడం అనవసరం అని నా భావన.

    ఒక కులంలో ఒకడు ఐ.ఏ.ఎస్. పాసైతే కుల పార్టీలు జరిగే స్థాయి నుంచి, ఒక మతానికి చెందినోడు బాంబు పెడితే ఆ వేష ధారణలో ఉన్న వాళ్ళందరినీ, ఊచకోత కోసే స్థాయి నుంచి మనం ఎదగాలని కోరుకుంటున్నాను.

    చివరగా ఒక మాట. ఇవి నా అభిప్రాయాలు మాత్రమే. దీనిపై చర్చకు నేను సిద్ధమే గానీ, వాగ్యుధ్ధానికి కాదు. నా మటుకు నాకు అనుక్షణికం ఒక “అద్భుతం”

    • u said :[ అన్ని కులాల్లో ఈనాడూ అటువంటివి జరుగుతూనే ఉన్నాయి. ఆయన కాంతి ప్రసరించాడంతే.. ఫోకస్ చేసిన రచయితని ఆడిపోసుకోవడం అనవసరం అని నా భావన.]

      మీ ఇంటి పేరు ,మీ కులం పేరు చెపుతారా..? నేను ఒక కధ రాసి పంపిస్తాను..”సారి కాంతి ప్రసరింప చేస్తాను”. మీరు పాఠకుడి గా చదవుదువు గాని..

  8. మొత్తానికి మళ్ళీ ఇది తప్పక చదవాలి అన్న కాంక్షను మీ సమీక్ష ఆ తర్వాతి చర్చా కలిగించాయి.
    ఈ పుస్తకం నేను చదవలేదు గనుక రచయిత మనుసులో ఏమి పెట్టుకొని రాశాడో తెలియదు గానీ అన్ని అశ్లీల పాత్రల్లోనూ ఒకే కులం ఇంటి పేర్లు వాడటం (వాడివుంటే) తప్పే!

    –ప్రసాద్
    http://blog.charasala.com

  9. .నేను రచనగారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.రవికిరణ్ గారి సమర్ధన పేలవంగా ఉంది కారణం 1)సమాజంలో సంకుచితమనస్కులు కోకొల్లలుగా ఉన్నారని తెలిసిన రచయితలు వాళ్ళని ప్రేరేపించి రెచ్చగొట్టే రచనలు చేయకూడదు.2)సమాజంలో ఉన్నవాటినే చండీదాసు ఫోకస్ చేస్తీ ఒక కులాన్నే టార్గెట్ చేయటం ఎందుకు.తన కులంపై ఎందుకు అలా కాంతి ఫోకస్ చేయలేదు? అన్య కుల ద్వేషం ,స్వ కుల వ్యామోహం ఉన్నవాడు గొప్ప రచయిత కాడు.3)స్త్రీ ని విలాస వస్తువు గా చూసే సమాజన్ని ఆయన చిత్రీకరించాడనుకున్నా ఆయన రచయితగా చేసిన కొన్నికామెంట్స్ స్త్రీల పైన ఆయనకి ఎంత చవుకబరు
    అయిడియాలు ఉన్నాయో చెబుతాయి.
    భాస్కర్

  10. The major problem with Chandidas is that

    1. Though studied Indian Philosophy, he is not authoritative.
    2. Though he narrated the life at Osmania University, he was away from the friends’ circle.
    3. Though relinquished the family, he successfully failed to understand the woman
    4. Though his style is lucid, he was poor in framing the story (Katha Kathanam)

    Being half in every thing and trying to create a master piece is a herculian job. Chandidas successfully proved himself to be a failure in this field. After coming to know about his own ability, he confined himself in a single room even banning the entrance for a tea boy. He died in self imposed jail.

  11. half-baked review. and statements like, “emi chepte evaremanukuntaaro…” do not help much either.

    Looks like all the descriptions abt affairs, brothels did not go well with you :). me neither. But you have to accept the fact that they are there in the world. And such people do live among the university campuses.
    If you have nt come across, may be because you are living in protected cocoons.

    I dont remember the character names so well now, but only one looked very cinematic to me. Some pretty girl (Tara is her name i think) goes after some DON like character and kills herself. That looked very very cinematic. and character of Swapnaragaleena too was very melodramatic. Rest all I can agree that they do exist in hte world that I live.

    Another beauty of novel that I really liked is, the spectrum of society he described has nt changed even now. Even now, people complain abt reservations, uppercastes ridicule lowerclasses. and there are people like Gayatri who live their beliefs. There are people like swapnaragaleena who are born to rich parents(not their mistake) and do not know what an average indians life is. more later..

    oh, one morething.. I saw some silly accusation abt caste related things. Would some one enlighten me what Chandidas’ caste was? and which character in that is not maligned??

  12. చండీదాస్ ని అర్ధం చేసుకోడానికి ఈ వ్యాసం బహుశ ఉపయోగపడచ్చు.

    http://eemaata.com/em/issues/200507/177.html

    • Thank you sir, it really helped.

  13. చండీ దాస్ ని గురించి మరి కొంత ఇక్కడ –

    http://poolavaana.wordpress.com/

  14. It is very interesting to note several comments about Chandidas garu. All of them are right in their perspective. Chandidas tried to experiment with his life but in vain. He tried to portray “Some thing” which he is unable to comprehend completely. However the “Saili” is very good. I read his novels almost three times each. This is about 17-18 years ago. We need these experimentalists. Otherwise there is no spice in literature.Unfortunately I can not write in Telugu now.

  15. చండి దాస్ IS RIGHT IN ALL. ఇక కులం గురించి అంటారా… చలం గారు రాయలా?? ఇంకా చాలా మంది రాసినట్టు గుర్తు. చాలా సినిమాలలో కూడా. .. అను క్షణికం ఒక గొప్ప సీరియల్. ఇక విమర్శలంటారా… అవి సహజం..

  16. comments chesina vall lo chala mandiki saahityam gurichi purthi avagahana ledemo anipisthundi. chandi das padala lo jivam undi trunchite raktham karuthai, annaru guthikonda nageswar rao gaaru ,chikatlonchi chikatloki mundu matalo. varu ayana ekaika snehithudu, svuniversity lo udyoga rithya.vaaru ayana gurichi enduku rayaro artham kaadu.vaari priya sishyudu katta sekhar reddy, andhrajyothi, editorial board,ku guruvu garini comment chesina vaarini maatalatho cheyi chesukunnaru, andhra jyothi lo oka saari. sekhar reddyni nenu request chesthunnanu, vaari gurichi cheppamani. na bad luck nanu vaaru rammani pilisthe antha goppa vaaritho em matlaadaalo artham kaakunda prathi samaveshaa laku sabha laku vache vaarini aanandam tho, aaraadana ga chustu gadipesaanu, svu lo.vaaru sexual impact on social life gurinchi swantha bayankara anubhavaala mulanga affect ayyi, alaa mouna yogi la undi povadam jariginattu telustondi. vaaru, svu professor quarters lo medicine chadive daughter, ayana mother to kalisi unde vaaru. samaavesallo vaarini matladichalani sekhar reddy prayathninchi vipalam ayyamu, naakem telusani maatladaali anevaaru.vaaru easthetics teach chese vaaru philosophy students ki. mana lo antha depth unte tappa aayana tatwam artham kaadu, nenu vaari virabhi maanini, naa pedda kuthiriki swapna raagalina ani peru pettu kunnanu kudaa…

  17. ee novel gurinchi maa father chala sarlu chepparu. kani naku ee novel entha try chesina dorakaledu dayachesi ee novel ekkada dorukutundo cheppagalara

  18. Plz can u tell me where i can get ANUKSHANAM ..I became a fan of him after reading HIMAJWALA

  19. I read this when i am in my ninth class. Though not fully matured enough to understand the story in first reading, the influence of that novel had been so much that I ended up in Osmania College of Engineering even though I got a sixth rank in Entrance and I had my pick of colleges.
    And there are more than fifteen times i read that novel. I have copy which I bought around ten years back in Vishalandhra in Kothi Hyderabad.
    felt sorry when Chandidas passed away.
    Venkat

  20. Prathi rachanani kulam sthai nundi chuse drishtinundi manam pieki edagali.
    Eerojullo kulam perutho politics, kulam perutho jobs, akhariki andaru kalusukodam kosam pettina vanbhojanaalu kuuda kulam peruke aipoyayi.
    Mr.Kiran annattu aa navala oks adbhutham.

  21. – I read this novel when I was around 20 years old and bowled over by it. Then I merely enjoyed the plot.
    – About the “varnanalu”..I too felt the same way when I read it. But later on came to know that they are part of creating an experience. If we are a bit more patient initially, we’ll carry a complete experience later on during our read. They are part of maximizing the transfer of the “anubhooti” in the writer’s mind to the reader’s mind (Though not 100% transfer)
    – About the caste angle. Till I read the comments in this article, I have never bothered what his caste was. Just googled and found that it might be same as mine. If the characters are representative of certain patterns in the communuities, It is ok. If I remember correct, bad women characters were portrayed from other castes in that novel (vaguely remember a nellore based affair). In the same novel he portrayed certain characters belonging to certain communities as very headstrong. certain characters as feudal etc. The characteristics in communities change over time.They are influenced by the socio political conditions of that age. Some castes which were portrayed as very backward in olden days, can now can be portrayed to be a government employee.
    – I do not think the protagonist was from the authors community- Meka Sripathi. And the protagonist was very supportive of an intercaste marriage by his siste/cousin.
    – He was mostly influenced by Butchi Babu. introverted.. If some people teased women, his novel/he could be the reason, but his responsibility is limited. His intention is not suspect. Anyways he should have written more cautiously while portraying such characters, as giving sur names is unnecessary.
    – His another novel HimaJwala- I did not like it, since it was not realistic.
    – The mentioning of surnames, caste names etc was pathbreaking in those days of all India radio. Now a days, in the age of 24 hours news channels, which dissect caste, region,subcaste, surname..sometimes wrongly assume caste based on sur name and cook news..it’s no longer novel. It’s like watching Siva movie now..after so many gangster movies.

  22. PS: I do not subscribe to chandi das..philosophical/spiritual leanings

  23. Hallo..
    Does any one have Anukshanikam book pdf format.. Please let me know or please send it to: grt438@gmail.com
    Thanks for reading.

  24. If any one anukshanikam book pdf, please send it to below email id: togetherforever1328@gmail.com


Leave a reply to babu Cancel reply