తొలిరేయి-చావా కిరణ్ గారి నవల

మన బ్లాగరు చావా కిరణ్ గారు నేనొక నవల రాసాను, చదివారా? చదివి మీ అభిప్రాయం చెప్తారా? అని అడిగినప్పుడు నాకు కాస్త సంతోషమేసింది – మన తోటి బ్లాగరు బ్లాగులో నవల రాసేసారు…అని. వెంటనే ఆయన బ్లాగు తెరిచాను. “తొలిరేయి” అన్న పేరు. ప్రేమకథేమో అన్న అనుమానం. మొదటి కొన్ని లైన్లు చదివాక, ఇలా చదవడం ఇబ్బందిగా ఉంది అంటే పీడిఎఫ్ ఇచ్చారు. ఏకబిగిన అరవై+ పేజీలూ చదివేసి, కాస్త కఠినమైన వ్యాఖ్యలు ఇస్తాను-మీకే చెప్పనా? బ్లాగులోనే పెట్టనా? అని అడిగితే – బస్తీ మే సవాల్…. అంటూ సై అనేసారు. దానితో ఇక్కడే పెట్టేస్తున్నా.

సైన్స్ ఫిక్షన్ – థీం నాకు కొత్తగా, బాగుంది. పేర్లు భలే వెరైటీ గా పెట్టారు…జిక్షి, సుబ్బా, స్టీల్రావు అంటూ. ఎక్కడ్నుంచి వచ్చాయో గానీ ఐడియాలు. మళ్ళీ నళిని, రజిత-మామూలు పేర్లే. కాన్సెప్ట్ అంతా కుతూహలం కలిగించే విధంగా ఉంది. ఇసుక తుఫాను సందర్భంగా చేసిన వర్ణన – టూ గుడ్. నాకు అన్నింటి కంటే ఆ భాగం నచ్చింది. ఇసుక తుఫాను రావడం,అక్కడ వెంటనే నాగరికతల ఆనవాళ్ళు బయటపడడం – చదువుతూ ఉంటే నాలో ఆ “వావ్!” ఫీలింగ్ కలిగించడంలో చావా గారికి ఫుల్ మార్కులు 🙂 ఒక వాక్యం:”ఇంత అందమైన బొమ్మకే సృష్టికర్త ఉన్నపుడు, ఇంత అందమైన లోకానికి ఉండడని ఎందుకు అనుకుంటున్నారు?” – గుడ్ వన్! ఇదే వ్యాఖ్యని డాకిన్స్ (Richard Dawkins) వంటి వారు వింటే ఎలా స్పందిస్తారో తెలీదు కానీ, బాగా రాసారు ఈ వాక్యం. కథలోని ముగ్గురి పరిశోధనలు (మేధా, రజిత, సుబ్బా) – కొరిలేట్ చేయడం – చాలా బాగా చేసారు. ఆ భాగం కూడా నాకు చాలా నచ్చింది.

ఇక, ఫ్లిప్ సైడ్:
1. భరించలేనన్ని అచ్చుతప్పులు.
2. “వచ్చినాను, వెళ్ళినాను…” ఇది.. నాకు వింతగా ఏమీ అనిపించలేదు కానీ, రాత భాషలో అలా చదవడం కొత్తగా ఉండింది. ఇలా మాట్లాడే వారిని చూసాను కానీ…చదవలేదు. 🙂
3. రజని-రజిత-రంజిత : ఒకే మనిషికి ఇన్ని పేర్లు వాడారు ఈ నవల్లో. అదొక సారి చూసుకుని ఉండాల్సింది.
4. ఒక దానికొకటి సంబంధం లేని ఘటనలు వరుసగా వస్తున్నప్పుడు కనీసం **** లాంటి సెపెరేటర్స్ ఉపయోగించొచ్చు కదా…. ఎంత ఇబ్బందిగా ఉండిందో చదవడానికి!!
5. “నేను పాపాల్రావుని కలవడానికి వచ్చాను” అంటూ జిక్షి ప్రశ్నించగానే… (౩౪ పేజీ) – అక్కడ ప్రశ్న ఏముంది అసలు?
మొదట అన్నట్లు, అచ్చుతప్పులు చూస్తేనే అర్థమౌతోంది కిరణ్ గారు రెండో రీడింగ్ కి బద్దకించారు అని… 🙂 నవల రాసేటప్పుడు ఎంత ఓపిగ్గా రాయాలో ఈ నవల చదువుతూ ఉంటేనే అర్థమైంది. ప్రపంచంలోని అన్ని భాషల నవలాకారులందరికీ పెద్ద నమస్కారం పెట్టాలి అనిపిస్తోంది. నవల రాయడం అన్న చక్రంలో ఎన్ని దఫాలు రాసింది చదవాలో, తప్పులు సరిచూసుకోవాలో ఇప్పుడొక లే-పర్సన్ అవగాహన వచ్చింది నాకు. (భయపడకండి, నేను రాసేంత సీన్ లేదు..హీహీ) కిరణ్ గారు ఆ హోంవర్క్ కొంతైనా చేసి ఉంటే, నవల మరింత ఆకర్షణీయంగా ఉండేది. ఈ హోంవర్క్ లేకపోడం వల్ల రీడబిలిటీ ఎంత తగ్గుతుందో ఇప్పటిగ్గానీ అర్థం కాలేదు నాకు. నేనూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసుకోవలి ఇక. 🙂 learning from others experiences!

చివరగా, కిరణ్ గారి నవల నాకైతే కథ,కథనం పరంగా చాలా నచ్చింది. మళ్ళీ ఆయన ఇంకోటి రాస్తే బాగుండు అనే ఎదురుచూస్తున్నా. నిజానికి ఓ రోజు అసలు మాటల్లో దింపి ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటూన్నా….ఎలా రాసారు? ఐడియా ఎలా వచ్చింది? సమయం ఎక్కడిది? మీ ఆఫీసోళ్ళు పనివ్వడం లేదా? 😉 అని. ఇంతకీ, చివరికి అంకితం చదివాక గానీ అర్థం కాలేదు ఇన్ని అచ్చుతప్పులు దొర్లిన కారణం – పరధ్యానం!! :))

Published in: on May 19, 2008 at 4:31 pm  Comments (7)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2008/05/19/chavakiran-novel/trackback/

RSS feed for comments on this post.

7 CommentsLeave a comment

  1. Hi Sowmya,
    I’ve been reading your posts for quite some time now, and there are all very good…the Telugu stories in particular are really wonderful. I’m an amateur blogger and so far I’ve written 2 posts in my blog….http://myinsiderspeaks.blogspot.com
    please read them…and give me your valuable suggestions..please 🙂

  2. చావా గారి ఈ నవల నాకూ బాగా నచ్చింది.చాలా ఆశక్తికరంగా కూడా నడిపారు కధని.కానీ చదువుతున్నంత సేపూ ఇలాంటి కధని ఎక్కడో చదివాను అనిపిస్తూ వుంది.బహుశా యండమూరివారి చీకట్లో సూర్యుడు నవలకి[?ఇదేనా?] దగ్గరగా అనిపించింది.అక్షర దోషాల విషయం లో బాగా శ్రద్ద వహించాలి[ఈ మాట నేను చెప్పకూడదేమో?నేనే బోలెడు తప్పులు రాస్తాను మరి]వర్ణలను చాలా బాగా చెప్పారు.మీరు చెప్పినట్టుగా ఇసుక తుఫాను వర్ణన మరియు గుడి వర్ణన బాగుంది.
    మన ఆది బ్లాగరుకి మహా రచయిత అయిపోయే లక్షణాలు చాలా ఉన్నాయి.విజయోస్తు .

  3. తొలిరేయి కథ సారాంశం (Story in brief) ఇవ్వటం మరిచారు. చాలామంది పాఠకులకు 60 పేజీల నవల చదివే సమయముండక పోవచ్చు అని గమనించాలి.

  4. సౌమ్య గారూ,PDF file ఎక్కడ?
    మీరు నా బ్లాగ్ పైన సీతకన్నువేయడం బాగాలేదండీ.
    దయచేసి కింది లంకెలోని నా బ్లాగుచూసి మమ్ము చరితార్థుల్ని చెయ్యమని ప్రార్థన.
    http://www.parnashaala.blogspot.com

  5. అబ్బాయి కిరణ్,,

    నీ నవల పార్టులుగా క్లిక్కలేనివాళ్ళకు పిడిఎఫ్ ఇవ్వొచ్చుగా. నీ బ్లాగులోనే. కాని ఇంత పెద్ద కథ ఓపికగా రాయడమే చాలా గొప్ప సౌమ్య. అందుకే ఈ అప్పు తచ్చులు మన్నించేద్దామ్. మొదటిసారిగా.

  6. […] Sowmya reviewed it it is an encouraging review. […]

  7. “ఇంత అందమైన బొమ్మకే సృష్టికర్త ఉన్నపుడు, ఇంత అందమైన లోకానికి ఉండడని ఎందుకు అనుకుంటున్నారు?”………ఈ కోణం నాకు చాలా నచ్చింది. ఈ ఆలోచన నాకు ఇంతవరకూ రాలేదు.

    మాధురి.


Leave a reply to జ్యోతి Cancel reply