Development ? indeed!

మొన్నామధ్య రెపబ్లిక్ డే రోజు కాలేజీ లో జరిగిన చిన్న సమావేశం లో మా ప్రొఫెసర్ ఒకాయన మాట్లాడుతూ : ఆయన కొత్త గా కాలేజీ నుండి బయటకు వచ్చిన నాటి పరిస్థితులనూ, ఇప్పటి పరిస్థితులనూ పోల్చి చూస్తూ, మనం రోజు రోజు కీ prosper అవుతున్నాం అని తేల్చారు. దానికి బోలెడు ఉదాహరణలు కూడా చెప్పారు. అయితే ఇన్ని ఉదాహరణల్లో technology ఎలా ఎదిగిపోతోంది, దాని వల్ల మనం ఎలా లాభపడుతున్నాం, పెరిగిన ఉద్యోగావకాశాలు … ఇవన్నీ చెప్పారు కానీ, పెద్దగా మార్పు లేని జీవితాల ప్రస్తావన తేలేదు. research university లో పెద్దలకి అవన్నీ ఆలోచించే తీరిక ఉండదేమో కానీ, ఆయన మనం prosper అవుతున్నాం అనగానే నాకైతే “ఎక్కడ?” “ఎవరు” అన్న ప్రశ్నలకు నా మనసు చెప్పిన జవాబులు, నిజాలు కాబట్టి చాలా చేదుగా అనిపించాయి.

మా కాలేజీ లోనే సాయంత్రం ఆషాకిరణ్ స్కూలు ఉంది. ఓ సారి సెలవుల తర్వాత పిల్లల్ని తీసుకురావడానికి వాళ్ళ ఇళ్ళకు వెళ్ళాను. అప్పుడు చూసాను – వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారో! అలాంటి చోట్ల ఉంటూ, చదువు మీద శ్రద్ధ పెట్టడం, పెట్టినా, ఆ చాలీ చాలని వసతుల మధ్య పైకి ఎదగడం ఎంత కష్టమో నాకు అనుభవమైంది. మరి, ఎక్కడి అభివృద్ధి అన్నట్లు? విద్యావకాశాలు – డబ్బు తో ముడిపడినవి. నాకు తెలుసు. ఈ ఘనత వహించిన మా కాలేజీ లోనే – (నేను ఫ్రీ గా, ఫీజు లేకుండానే చదువుతున్నా కూడా) BTech పిల్లలకి నెలలకి 75000 రూపాయల దాకా అవుతుంది. అంతెందుకు, ఒకానొక అతి సాధారణ కాలేజీ లో BTech చేయాలంటే ప్రస్తుతం 22 వేలంట. దాన్ని ఇంకా పెంచాలని యాజమాన్యాల గోల. నిజమే – మా గొప్ప అభివృద్ధి. BTech, MBBS లే చదువులు అని నేను అనడం లేదు. ఇక్కడ గచ్చిబౌలి ప్రభుత్వ పాఠశాల లో చదువులను గురించి కూడా ఇదే అంటున్నాను. బాగా జేబులు నిండుగా ఉంటే పిల్లకి మంచి exposure వచ్చే కాలం ఇది అంటున్నా.

నాకో నమ్మకం : అట్టడుగు న ఉన్నవారిని పైకి తేవాలంటే చదువు ఒక గొప్ప మార్గం అని. కానీ, అభివృద్ధి మహా ఎక్కువై పోయి, చదువు కూడా వాళ్ళకి అందకుండా వెళ్తోంది. అయినా మనది మాత్రం బాగా అభివృద్ధి చెందుతున్న దేశం. నిజం!

Published in: on February 2, 2007 at 4:19 am  Comments (2)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/02/02/development-indeed/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. అభివృద్ది చెందిన వారికి, చెందుతున్న వారికి, చెందడానికి అవకాశాలు వున్న వాళ్ళకి prosperగానే కనిపిస్తుంది. ఆ గీతకి ఇటువున్న వాడూ దూసుకుపోతున్నాడు పైపైకి, అటువున్న వాడూ దూసుకుపోతున్నాడు లోలోపలికి!
    ఈ అభివృద్ది పద ఘట్టనలకు తట్టుకోగలివాడూ పైపైకి లేని వాడూ అధఃపాతాళానికి!

    –ప్రసాద్
    http;//blog.charasala.com

  2. మీ ఈ పోస్టు చూడగానే ఎందుకో ఇది ఇక్కడ రాయాలనిపించింది.ఒక కాలేజిలో ఇంటర్ చదివే అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది.ఎందుకా అని ఆరతీస్తే ఆ అమ్మాయి మధహ్నం భొజనం తినదని తెలిసి ఆ కలేజిలో చదివే ప్రతి ఒక్కరూ మధ్యాహ్న భోజనం తెచ్చుకోవాలి అని రూల్ పెట్టారట.ఆ తరువాత కొన్నాళ్ళకి మళ్ళ ఇంకో ఇద్దరు అలాగే కళ్ళు తిరిగి పడిపోతే అందరి బాక్సులూ చూస్తే కొంతమంది బాక్సుల్లో ఇటిక ముక్కలు వున్నాయట.వాళ్ళందరూ చదువుమీది ఇష్టం తో తిండి లెకపోయినా ఫీసులు కట్టి చదువుతున్నారు.అది తెలిసి చలించి పోయిన అధ్యాపకులే కొంత డబ్బును పోగేసి తమ వద్ద చదివే పేద విధ్యార్ధులకు మధాహ్నం భోజనం పెడుతున్నారు..ఇది విని మరికొన్ని కాలేజిల టేచర్లు కూడా తమ వంతుగా వాల్ల వాల్ల కాలేజిల్లో కూడా ఇలా చేస్తున్నరట.


Leave a comment