Tilak Kathalu

“అమ్రుతం కురిసిన రాత్రి” అని స్కూలు రోజుల్లో పరిచయమైన ఒక పుస్తకం ద్వారా తిలక్ గురించి తెలుసు నాకు. ఐతే ఆ అమ్రుతం కురిసిన రాత్రి కూడా నేను పెద్దగా చదవలేదు. అప్పుడోటీ అప్పుడోటీ చదవడం తప్ప. ఆ తిలక్ కథలు కూడా రాస్తారని ఈ పుస్తకం చూసేదాకా తెలీదు. ఇందులో మొత్తం 30 కథలు ఉన్నాయి. కొన్ని నచ్చాయి, కొన్ని నచ్చలేదు. కొన్ని అర్థం అయ్యే లానే ఉన్నాయి. కొన్ని అర్థం కాలేదు. ఐతే ఆసక్తికరమైన పుస్తకం. ఆలోచింపజేసేది కూడా.

“లిబియా ఎడారిలో” కథ మొత్తంగా ఎందుకు రాసారో అర్థం కాలేదు కానీ పదాల కూర్పు బాగుంది. చక్కని సంభాషణలు ఉన్నాయి కొన్ని చోట్ల. కొంతవరకూ సెటైర్ అయి ఉండొచ్చు. గొప్ప ఊహా శక్తి నిండిన కథ. తెగిపడ్డ అవయవాల మధ్య జరిగే సంభాషణలు ఏకకాలం లో గగుర్పాటునీ హాస్యాన్నీ ఆలోచననీ మూడింటినీ కలిగించాయి. “కదిలే నీడలు” ఇదివరలో ఎక్కడో చూసాను. అప్పుడూ అంత అర్థం కాలేదు. ఇప్పుడూ అంతే. “యవ్వనం” కథ లో “వెన్నెల వెండి చేతుల్తో రా రా అని పిలుస్తూ ఉంటే చీకటి మొండి దేహాన్ని కౌగిలించుకుంటునట్లుగా ఉంది” – ప్రయోగం బాగుంది. నిజానికి చిన్న సంఘటన చుట్టూ అల్లిన కథ. నాకు వర్ణనలే తప్ప కథ నచ్చలేదు. “హోటెల్లో 5 రోజుల దినచర్య” – శైలి చాలా కొత్తగా అనిపించింది. బానే ఉంది కథ … దీన్ని కథ అనుకుంటే.

“అద్దంలో జిన్నా” అస్సలు అర్థం కాని కథ.  “ఆశా కిరణం” చాలా మంచి కథ. శైలి పరంగానూ, వస్తువు పరంగానూ మంచి కథ అనిపించింది. నిస్సహాయత ను చాలా హ్రుద్యంగా, ప్రాక్టికల్ గా చూపారు అనిపించింది. ఇలాంటి వస్తువు తో రాసిన కథలు ఓ 3,4 ఉన్నాయి ఈ పుస్తకం లో. “బాబు” కథ – ఏంటో, ఎందుకు రాసారో అర్థం కాలేదు. “మీరేనా-నువ్వేనా” అన్న కథ సాధారణంగా అనిపించింది. “మణి ప్రవాళం” మళ్ళీ నాకు అర్థం కాలేదు. అందులో పైకి కనిపించని అర్థం ఏదో ఉందని నా అనుమానం.

“జీవితం” – బానే ఉంది కథ. కథ నిండా బోలెడు ట్విస్టులు. “విద్యాధికులకు అంతే. దయ్యాన్ని నమ్మరు. కానీ పిరికితనం” అన్నా, “ఆశకు అంతు లేదు. కానీ అంతానికి ఆశే కారణం” అన్న ఈ కథలో అక్షర సత్యాలు ఉన్నాయి. “అతని కోరిక” – మరో కదిలించే కథ. అర్థం కాని కథల్ని పక్కన పెడితే తిలక్ కథలన్నింటిలోనూ సమాన్యులు, నిస్సహాయులు, ఎక్కువగా దిగువ మధ్యతరగతి జీవితాలు, దురద్రుష్టవంతుల కథలు ఇవే వస్తువులుగా తోస్తాయి. వారి జీవితాలని తన అక్షరాల్లో మనకు చూపడం లో రచయిత చాలా వరకు సఫలీక్రుతులయ్యారు అనిపించింది. “నవ్వు” కథ లో మనకు కథ సినిమాటిక్ గా అనిపించినా కూడా అందులో ఓ తాత్వికత ఉంది అనిపించింది.

“ఊరి చివర ఇల్లు” – బాగా కదిలించే కథ. “ప్రతి బ్రతుకునీ ఏదో రహస్యం లో చుట్టబెట్టి అగోచరమూ, బలీయమూ అయిన విధి నిరంకుశంగా ఎక్కడికో తెలియని చోటుకి నడిపిస్తున్నట్లు అనిపించింది అతనికి” – కథ లోని వస్తువు లో లీనం అయ్యే కొద్దీ ఈ భావన ప్రతి పాఠకుడికీ వస్తుంది ఏమో అనిపించింది. “ఓడిపోయిన మనిషి” – అదో రకం కథ. నాకంత నచ్చలేదు. సడెన్ గా ముగిసిపోయినట్లనిపించింది. “గడియారపు గుండెలు” , “ఫలిత కేశం”, “తీవ్రవాద నాయకుడు”, “సీతాపతి కథ”,”సుందరీ-సుబ్బారావ్” – బానే ఉన్నాయి. కాకుంటే నాకు అంత ప్రత్యేకంగా ఏం అనిపించలేదు. “కవుల రైలు” – వ్యంగ్యం, అప్పటి కవిత్వం మీద. “బొమ్మ”- బాబు కథ లానే చెప్పదల్చుకుందేంటో అర్థం కాలేదు. సూటిగా చెప్పకుండా ఏవేవో దారులు తిరగడం ఎందుకు? అనిపించింది.

“దొంగ”, “ఉంగరం”,”నిర్మల మొగుడు” – బాగున్నాయి. “బ్రతుకు అడుక్కి పోయిన కొద్దీ బ్రతకడానికి చేయూత స్వప్నమే కాబోలు” అంటాదు రచయిత “ఉంగరం” లో. నాకు చాలా నచ్చింది ఈ వాక్యం. “నల్ల జర్ల రోడ్డు” – బాగుంది. మనిషుల్లోని రెండు భిన్న ధ్రువాల్ని కథలోని పాత్రల్లో బాగా చూపారు. “నిర్మల మొగుడు” లో ఐరనీ ని బాగా చూపారు. “సముద్రపు అంచులు” బాగా కదిలించే కథ. పేదరికం అనబడు చేదు నిజాన్ని హ్రుద్యంగా … కదిలించే లా చూపిన కథ. “దేవుణ్ణి చూసిన వాడు” – కొన్నాళ్ళ క్రితం చదివిన ఓ మలయాళ కథ అనువాదాన్ని గుర్తు తెచ్చింది.  ప్రస్తుతం కథ పేరు,రచయిత పేరు గుర్తు లేదు. తెలియగానే ఇక్కడే కామెంటు రాస్తాను.  “ఏమీ లేదు” చైతన్య స్రవంతి లో సాగింది ఏమో అనిపించింది. సడెంగా ముగిసిపోయినట్లు అనిపించినా కూడా ఎందుకో గానీ ముగింపు కి నవ్వు వచ్చింది.

“రాత్రి తొమ్మిది గంటలకు” – చైతన్య స్రవంతి లా అనిపించింది మళ్ళీ. మంచి కథ. ఈ తరహా లో జీవన స్రవంతి ని ఇండిఫరెంట్ గా వర్ణిస్తూ సాగిపోయే కథలు నచ్చుతున్నాయి నాకీ మధ్య. మొత్తానికి పుస్తకం చదివించేదే. “సేవా సదనానికి…. ఆ సదనం ఏమిటొ, ఏం చేసేదో నాకు ఇప్పటికీ తెలీదు. ఈ తరహా సంస్థల ప్రత్యేకత ఇదే కాబోలు” – అన్న వ్యంగ్యం లోనూ, “క్రిష్ణ పక్షపు గుడ్డి వెన్నెల్లో ఆ నగరం తనలో తాను ఒదిగిన పెద్ద తాబేలు లా ఉంది ” అన్న వర్ణనలోనూ రచయిత నేర్పు కనిపించింది నాకు.

Published in: on September 2, 2006 at 7:29 am  Comments (8)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2006/09/02/tilak-kathalu/trackback/

RSS feed for comments on this post.

8 CommentsLeave a comment

  1. బాగుందండీ పోస్టు… చదవాలనిపించేలా.. మీ పోస్టు, పుస్తకం రెండూనూ.

  2. Libiya edarilo enduku rasado naaku kuda artham kaaledu [:D]
    Uuri chivara illu kathalo edho missing ani anipinchindi naaku .. a pinch of salt emo [:P]

  3. tilak kadhalu koodaa rasaarannamaaTa…

  4. tilak kavi kadaa…kaabaTTi kathalO kuuDaa kavitvam kanipistuu unTundi…nuvvu quote chEsina vaakyaallO idi chuuDocchu…

    nii taste baagundi…good work!

  5. 1.లిబియా ఎడారిలో” కథ చాలా Different గా ఉంది.. యుద్ధ జరిగాక పరినామలని కవి చాల దిఫ్ఫ్ గ వర్నించాదు.. యుధం జరిగాక ఒక్కొ వ్రుత్థి లొ ఉన్న వ్యక్థి తన చావు తరువాత యీమి జరుగుతుందూ అని ఒక్కొ సరీర భగము తొ ఆ యుద్ధ భూమి లొ వర్నించాడు అని నాకు అనిపించింది
    2. భాబు నాకు నచ్చిన కధలలొ ఒకటి, ఒక కుర్రవాడిలొ కలిగిన అవీసాన్ని చాల చక్క గా వర్నించారు… మామూలుగా అనాధ పిల్లలలొ ఉండీ పౌరుషాన్ని బాగా వర్నించారు… మనము కూడ అంతీ బాగా కొపం వస్త్తె యెదురు తిరగటానికి ప్రయత్నిస్తం గా.. కొన్ని జీవితాలీ
    వీత్ట్కి నిదర్సనాలు

    మిగతావి నీను ఇంకా చదవలీదు చదివాకా చెబుతాను నా
    అభిప్రాయాలు

    3.అద్దం లొ జిన్న్నా చాలా బాగా నచ్చింది నాకు.. ఒక నాయకుడి మనస్తత్వాన్ని బాగా వర్నించారు.. అందులూ రక్తం గురుంచి చాలా బాగా వర్నించారు.. రక్తానికి భయం లెదు కులం లెదు అమాయకమైనది చచినా చావు యెరుగనిది
    జిన్నా మనసు అద్దములొ నువు చెస్తున్నది తప్పు అని చెబుతున్నా ఒక స్తెగె తరువాత మనిషి మారలెడు అని రాజికీయ వెత్త ని ఉద్దెసించి చెప్పరు తిలక్ గారు అని నా అభిప్రాయం.

  6. tilak bhavakavitwam loni sunnitatwam abhyudayakavitwamloni avesanni kalabosi manaku kavitwanni vadilivelladu

  7. మణిప్రవాళం – తెలుగూ, సంస్కృతమూ వాటివాటి వ్యాకరణరూపాలతో సహా కలిపికొట్టిన కవితాప్రయోగం. ఈ శైలిని మొదట మొదలుపెట్టినవారు మలయాళీ కవులు.

    ఉదా :- కర్మవశాత్ ఖాయిలా పడినా అదృష్టవశాత్తు మందులు తీసుకుంటే కాలక్రమేణ స్వాస్థ్యం భవతి.

  8. hey its u sowmya…!
    Suddenly i wanted to grab samudrapu anchulu story and i dont have the book here and when i googled urs is the only link i got..
    Great work by you i must say…
    Hope i catch the book by evening..


Leave a reply to HalleY Cancel reply