వానా వానా వానా …..

మొన్నో రోజు వర్షం పడ్డప్పటి నుంచి మొదలైంది ఈ పాట వినడం. ఆ రోజు కిటికీ లోంచి వర్షాన్ని చూస్తూ ఉంటే ఎందుకో ఈ పాట వినాలనిపించింది. సరే, డౌన్ లోడ్ చేసి వినడం మొదలుపెట్టా. ఏ ముహుర్తాన మొదలుపెట్టానో కానీ, 3 రోజులుగా … వింటూనే ఉన్నా. ఇంతకీ పాట – “వానా, వానా, వానా..” – శ్రీను, వాసంతి, లక్ష్మి సినిమా లోనిది. R.P.Patnaik గానం, సంగీతం, నటనానూ ఈ పాటకి. All-in-one లాగ. వర్షం పడుతున్నప్పుడు ఈ పాట వింటూంటే – ” ….. నీతో చిందేసి ఆడనా..” అనాలనిపిస్తుంది వర్షం తో 🙂 అసలీ సినిమా పాటలు నేను ఇంతకు ముందు విన్నవి రెండే – “గోదారి నవ్వింది తుమ్మెదా…” , “వానా వానా వానా..” – అవి కూడా ఎక్కువ గా ఏమీ వినలేదు. మరి ఆ క్షణాన నాకెందుకు ఈ పాట గుర్తు వచ్చిందో కానీ, మూడురోజులుగా ఇదే లోకమైంది.

మీరూ వినండి ఈ పాట – ఇక్కడ లేదా ఇక్కడ. ఈ పాట సాహిత్యం – telugubiz.net వారి పుణ్యమా అని…. ఇక్కడ రాస్తున్నా. రచన : కులశేఖర్.

వానా వానా వాన … నీలకాశం లోనా
నీతో చిందేసి ఆడనా
వానా వానా వానా మేఘలాపనలోన
నేను ఓ పాట పాడనా
పన్నీటి పూలతోనా ఊసులాడుకోనా
పసి పాపలా -హరివిల్లునే చేయి చాపి అందుకోనా !

వాన లోన కాగితాల పడవలేసే చిలిపి ప్రాయం
ఇంకా గురుతే … చిన్ని నేస్తం
ఏటి లోన గాలమేసి ఎదురు చూసే మనసు పాపం
మదిలో మేదిలే నాటి బాల్యం
వాన నీటిలో ఆడుకున్న యీతలు
జామతోటలో పాడుకున్న పాటలు
మరుపే లేని తియ్యనైన జ్ఞాపకాలు

నింగి లోనా మబ్బు కూన అందుకుంది చినుకు రాగం
దాహం కోరే నేల కోసం
నేల పైన నీటి వీణ పల్లవించే మబ్బు కోసం
స్నేహం పంచే పూల గీతం
కోయిలమ్మతో పాటు కొంటే పాటలు
జాబిలమ్మతో ఎన్ని జామురాతృలు
మరుపే లేని తియ్యనైన జ్ఞాపకాలు

పాట వింటూ ఉంటే తెలీకుండానే – చిన్నప్పటి నుంచి వర్షం లో తడిసిన సన్నివేశాలు అవీ, ఇవీ అన్నీ గుర్తు రావడం మొదలుపెట్టాయి. మనసంతా నువ్వే పాట కి మాతృక అయిన విదేశీ పాట విన్నరోజు నుంచి నేను R.P.Patnaik పాటలు విన్నట్లు గుర్తు లేదు. చాలా రోజుల తరువాత విన్నది ఈ పాటే. ఇంతకీ ఈ మధ్య ఇతను సంగీత దర్శకత్వం చేసిన సినిమాలు ఏవన్నా వచ్చాయా? సరే, ఇక్కడికి ముగించేస్తా – మధ్యాహ్నం నాకు ఆఖరి end-sem. (అయిపోతున్నందుకు సంతోషించాలో, పాడుచేసుకోబోతున్నందుకు బాఢపడాలో తెలీడం లేదు కనుక ఏ smiley పెట్టాలో అర్థం కావడం లేదు…)

Published in: on April 12, 2007 at 4:36 am  Comments (4)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2007/04/12/vana-vana-vana/trackback/

RSS feed for comments on this post.

4 CommentsLeave a comment

  1. నేను కూర్చున్న చోటు నుండు చాలా మంచు కనిపిస్తుంది. ఐనా, మీకు ఇంతగా నచ్చుందని, నాకూ కొద్దిగా వానంటే ఇష్టం కాబట్టి, పాట మీద ప్లే నొక్కా. ఆర్పిగారు అందు కున్నారు. నాకెందుకో ఆ గొంతు నచ్చదుచ, పైపెచ్చు సొంత సినిమాలో యదేఛ్ఛగా పాడేస్తుంటారని నా అభిప్రాయం. ప్రస్తుతం పాట ఎప్పుడు అవుతుందా అని నిరీక్షణ. అందరికీ ఒకే సంగీతం నచ్చక పోవడం దురదృష్టకం.

    పరీక్ష బాగా వ్రాయండి.

  2. నిజమే ఆర్పీ గొంతు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది…
    చాలా మందికి తెలిసుండకపోవచ్చు… ప్రేమంటే ప్రాణమిస్తా అని ఒక డబ్బింగ్‌ సినిమా వచ్చింది. సంగీతం ఏ.ఆర్‌.రెహమాన్‌. అందులో పాటలు బాగనే ఉంటాయి. కానీ సిరివెన్నెల రాయగా ఎస్‌.పీ.బీ పాడిన వాన పాట ఒకటి ఉంటుంది. నాకు బాగా నచ్చింది. చాలా రోజులైంది ఆ పాట విని. సమయానికి ఆ పాట గుర్తుకు రావడం లేదు. ప్చ్చ్‌…
    డాడీలో కూడా వానా వానా… అని ఒక పాట ఉంటుంది…
    ఈ రెండూ వినండి మీకు నచ్చుతాయి…

  3. mee uttaram bagundi…prakruti aradhakaluga meeru kanipisthunnaru…andamina aa anubhutini matallo varninchalemu…

  4. తనకు వచ్చిన సంగీతం అంతా కంపోజ్ చేసేసాడు. నటన కూడా అంతర్జాతీయ స్తాయిలో చేసేసాడు ఇంక మిగిలిన ఒకే ఒక్క శాఖ ‘దర్శకత్వం’, ఆ పనిలో బిజీగా ఉన్నాడు. చూద్దాం.


Leave a comment