The Word and the World – 6 (తాత్కాలిక విరామం)

(ఈ టపాలు ఈ పుస్తకం గురించి నేను రాసుకుంటున్న నోట్సు. ఈ సిరీస్ లో తక్కిన టపాలు ఇక్కడ.)
************

Chapter-5: The Karaka Theory
ఈ కారక సిద్ధాంతం గురించి ఇదివరలో మా కంప్యుటేషనల్ లింగ్విస్టిక్స్ పరిచయ క్లాసుల్లో విన్నందువల్ల – అదేమిటో – నాకు అర్థమైనంతలో చెప్పే ప్రయత్నం చేస్తాను – ఒక వాక్యంలో క్రియ మూలపదం అనుకుంటే, దానితో ఇతర పదాలకి ఉండే అనుబంధాన్ని “Karaka roles” సహాయంతో నిర్వచించవచ్చు. ఇవి ఆరుంటాయి – అపాదాన, సంప్రదాన, కారణ, అధికరణ, కర్మన్, కర్త.  ఈ సిద్ధాంతం ఈ రోల్స్ ఎలా ఇస్తారు? దాన్ని వ్యాకరణానికి ఎలా ఉపయోగించుకోవచ్చు అన్నవాటి గురించి.

వీటి గురించి సాంకేతికుడి కోణంలో ఒక చర్చకి NLP-A Paninian Perspective అన్న ఈ-పుస్తకం చూడండి. ఇక పుస్తకంలో ఈ అధ్యాయానికి వచ్చేస్తే –

**
G.Cardona అన్న ఇండాలజిస్టు అభిప్రాయం ప్రకారం ఈ కారక సిద్ధాంతం – ‘basis to Panini’s derivational system.’

W.D.Whitney అన్న మరొక భాషావేత్త ప్రకారం ఈ సిద్ధాంతం – ‘a reflection of case form’ మాత్రమే.
-అయితే, అపాదాన-సంప్రదాన అన్నవి రెండూ ablative-dative లను పోలి ఉన్న మాట నిజమే అయినా, ఈపోలిక ఉన్నంతమాత్రాన Whitney ప్రతిపాదనను తాను అంగీకరించలేనంటారు రచయిత. (నిజానికి, మాకు కారక గురించి చెప్పినప్పుడు విచిత్రంగా ఈ కేస్ సిద్ధాంతాలకి సంబంధించిన Thematic Role అన్న అంశాన్నే ఉదాహరణలు గా తీసుకుని వివరించారు అని గుర్తు. 🙂 బహుశా బొత్తిగా వీటి గురించి పరిచయం లేని వారికి, పాశ్చాత్యుల టర్మినాలజీతో పరిచయం ఉండేవారికీ అలాగే చెప్పాలేమో! వీటి గురించి నాకు అంత గొప్ప సైద్ధాంతిక అవగాహన లేదు, ప్రాథమిక పరిజ్ఞానం తప్ప. కానీ, 1960లలో కి వచ్చేదాకా పాశ్చాత్యులు రూపొందించని ఈ సిద్ధాంతాలని మన భాషావేత్తలు ఎప్పుడో పురాతన కాలంలోనే అంత వివరంగా డాక్యుమెంట్ చేసారంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది!)

“After applying the Karaka categorization rules to classify items, it becomes easy to formulate grammatical rules which introduce affixes to such items based upon such conditions. An object(karman), for example takes the -am suffix .. .. and an instrument takes the -ta affix… ”
(ఈ అంశం గురించిన సుదీర్ఘ చర్చ కూడా పైన లింక్ చేసిన – NLP-A Paninian Perspective పుస్తకంలో ఉంది.)

ఈ కారక సిద్ధాంతం గురించే, Panini కాక ఇతర భారతీయ భాషావేత్తలు కూడా వివరంగా వ్రాసారు. ప్రధానంగా భర్తృహరి మీద ఫోకస్ చేస్తూ, కారక సిద్ధాంతాన్ని అర్థమయ్యే భాషలోనే వివరించిన ఒక వ్యాసం ఇక్కడ చదవండి.

రచయిత రాసిన ఈ వాక్యాలు నాకు బాగా నచ్చాయి.
“It is well known that Panini and the Paniniyas were Sabdapramanikah, those who regard speech patterns as authority. Patanjali has said (which has often been quoted): ‘we accept the authority of the speech. What speech tells us is what we depend upon (for deciding issues)’. This, I believe, means that we should put stress on the point that grammar is not concerned with ontology (or semantics, i.e, things and events) but with what people actually say, or rather how people speak of things and events. Paninin’s Karaka categories fit in well with this point and hence we can easily account for such usages as ‘sthali pachati’, ‘the cauldron cooks’, although we know very well that the cauldron is the substrate where cooking takes place, not the agent of cooking. But philosophically, one can think of the cauldron as a contributing factor to the action of cooking and some agency may be attributed to it.”

3. అసలు “కారక” అన్న దానికి సరైన నిర్వచనం ఏమిటి? అని వివిధ శాఖల మధ్య వాదోపవాదాలు జరిగాయట. వీటిల్లో రెండు ప్రధానమైన నిర్వచనాలు ఉన్నాయి – ఒకటి kriyanimitta – causal factor of an action/verb, రెండవది – Kriyanvayin -syntactically connected withaction/verb kriya” – ఇలాగే ఈ కరక గురించి వాదోపవాదాలు చాలా కాలం కొనసాగాక –

“What is Karaka? అన్న ప్రశ్నకి పదిహేను-పదహారో శతాబ్దపు నవ్య నైయాయికులు ఒక పరిష్కారం సూచించారు. రచయిత మాటల్లో –
“Bhavananda says that a Karaka, both in its principal sense and its secondary sense, is to be defined as that which is syntactically connected (anvayin) with the action verb through the intermediary of the meaning of vibhaktis (the so-called case-affixes). It is clear here that the karaka categories are intermediaries between the semantic interpretation and grammatical suffixes.
… …
Thus, Bhavananda at the end says that the correct definition would be as follows. A Karaka is what is syntactically connected with the action verb (anvita) and is endowed with any one of the six properties or powers: agenthood, objecthood, instrumentality, recipienthood, apadanatva ‘being fixed point of departure’ and locushood.”

-ఇదీ విషయం.
*****
(ఈ వ్యాసమంతా philosophical కోణంలో సాగింది కానీ, నిజజీవితంలో, కంప్యూటర్ సైన్సు వాళ్ళు కారక సిద్ధాంతాన్ని ఎలా ఉపయోగించాలి అనుకుంటున్నారో, ఉపయోగిస్తున్నారో తెలుసుకోవాలంటే మాత్రం పైన లంకె ఇచ్చిన NLP-A Paninian Perspective మంచి స్టార్టింగ్ పాయింట్ అని నా అభిప్రాయం. Karaka Natural language processing ఇలాంటి క్వెరీలతో శోధనాయంత్రాల్లో వెదికితే, ఈమధ్య కాలంలో వచ్చిన రిసర్చి పేపర్లు గట్రా కనబడతాయి. ఇంకా మీకేవన్నా ఆసక్తికరమైన లంకెలు కనిపిస్తే – వ్యాఖ్యలలో తెలియజేయండి.)

(మళ్ళీ ఈ వ్యాసాలను సంక్రాంతి తరువాత కొనసాగిస్తాను.)

Advertisements
Published in: on November 25, 2012 at 7:00 am  Leave a Comment  
Tags: ,

The Word and the World – 5

(ఈ టపాలు ఈ పుస్తకం గురించి నేను రాసుకుంటున్న నోట్సు. ఈ సిరీస్ లో తక్కిన టపాలు ఇక్కడ.)
************

Chapter-4: Names and Things: Universals

ఒక పదానికి – అది సూచించే వస్తువు/భావానికి మధ్య గల సంబంధాల గురించిన వివిధ వాదోపవాదాల గురించి ఈ వ్యాసం.
* కాత్యాయనుడి సిద్ధాంతం ప్రకారం – things get their names on the basis of some quality or the other. అయితే, ఆ quality అన్నది నేరుగా కనిపించేదా? లేకపోతే ఆలోచనల్లో మనం చూసేదా? లేదంటే ఏదో ఒక సార్వజనీనమైనదా? – అన్నది కాత్యాయనుడు రాసిన వ్యాఖ్యానంలో స్పష్టంగా లేకపోవడంతో దిగ్నాగుడు, భర్తృహరి ఆ అంశం గురించి రెండు వేర్వేరు వాదాలు చేసారట. “On the whole, the theory can be understood as saying that names are given to spatio-temporal things on the basis of a quality which belongs to them” – అని రచయిత సారాంశం.

* నైయాయికుల మధ్య “ఒక పదానికి అర్థం అంటే ఏమిటి?” అన్న అంశం గురించి చర్చలు జరిగాయట. వీళ్ళ ప్రకారం – ఒక పదానికి మూడు “అర్థాలు” ఉంటాయి – వ్యక్తి, ఆకృతి, జాతి (అంటే – thing, form of the thing, the universal – “ఆవు” అంటే – ఒకా ఆవుని గానీ, లేదంటే దానితాలూకా imageని సూచిస్తూ – “బంగారు ఆవు” అనడం గానీ, లెదంటే, మొత్తంగా ఆవు అన్న జాతిని సూచిస్తూ – “ఆవు బొమ్మ గియ్యి” అనడం – ఈ మూడు ఉదాహరణలు ఇచ్చారు)

* ఇదే అంశాలపై పతంజలి అభిప్రాయం: “…it is neither the universal cowhood nor the individual cow nor its qualities nor its actions. He replies that the word ‘cow’ is ‘that by utterance of which there is a comprehension of the object having the dewlap, the tail, hump, the hoofs, and the horns (all taken together).'” అలాగే, పతంజలి ప్రకారం – “…four classes of words upon the distinction of their ‘occasioning ground or basis’ (nimitta): they are class names, quality names, action names and arbitrary names or proper names.”
-దీని పై పాయింటు చదువుతున్నప్పుడు మరి మామూలు పేర్ల సంగతేంటి? అనుకుంటూ ఉన్నా. పతంజలి చెప్పింది బాగుంది నాకు 🙂

* వీళ్ళు ఇలా ఉంటే – పదాలు-వాటి అర్థాలు convention వల్ల పుట్టలేదని, అవి eternal అనీ నమ్మే మీమాంసకులు నైయాయికుల మూడు-అర్థ విభాగాల వర్గీకరణను నిరాకరించారట.universal cowhood అన్నది ఒక్కటే వీళ్ళ ప్రకారం కరెక్టు. “Word meaning relationship is underived, natural, eternally established, it is only our learning of it that is acquired through some convention or other. Convention reveals the relationship, does not create it.” – అదీ సారాంశం.

* “Bhartrhari’s main of language is ofcourse, that each linguistic unit, a letter or a word or a sentence, is actually an invariant sphota (varna sphota, pada sphota, vakya sphota), i.e., an invariant, sequenceless and partless ‘whole’ entity which is only manifested by the corresponding audible noise in speech. And at the level of sphota, a linguistic unit and its meaning or the thought it supposedly conveys are one and undifferentiated.”
… ….
“Hence we can say that such a functional property characterizes each member of the cow class and only such members, and the presence of some abstract but ontologically real universal, cow hood, is not needed in order to make use of the class-name “cow” to denote cows.”

* తరువాత బౌద్ధ సంప్రదాయంలో ఉన్న apoha doctrine గురించి చర్చ, పైన చెప్పిన ఇతర భారతీయ సంప్రదాయాలతో పోలికా ఉన్నాయి.

… ఈ భాగం అంతా నాకు ఆట్టే అర్థమైందనుకోను, ఏదో మధ్యమధ్యలో కొంచెం అర్థం అయినట్లు అనిపించడం తప్ప. బహుశా మళ్ళీ చదవాలేమో!

Published in: on November 20, 2012 at 8:48 am  Leave a Comment  
Tags: ,

The Word and the World – 4

(ఈ టపాలు ఈ పుస్తకం గురించి నేను రాసుకుంటున్న నోట్సు. ఈ సిరీస్ లో తక్కిన టపాలు ఇక్కడ.)
************

Chapter 3: Words and their meanings

ఈ అధ్యాయంలో ఏడు ఉప విభాగాలున్నాయి. అన్నీ అరపేజీ నుండి రెండు మూడు పేజీల లోపే ఉన్నాయి కానీ, విడివిడిగా అయితే సమ్మరీ రాసుకోవడం ఈజీ అని నేనూ విడి విడిగానే ఉంచుతున్నాను.

a) Classification of Words:
యాస్కుడు పదాల ని నాలుగు విభాగాల్లోకి వర్గీకరించాడట (Parts of speech). అవి -నామ (nouns), అఖ్యాత (verbs), ఉపసర్గ (pre-verbs or prefixes), నిపాత (particles, prepositions). అయితే ఈ విధమైన వర్గీకరణకి వేద మంత్రాలని పదాలు పదాలుగా విడగొట్టి చేసే విశ్లేషణ ఆధారమట. అలా విడగొట్టడం ఒక తాత్విక వివాదానికి (Philosophical controversy) దారి తీసిందట. ఒక వర్గం – పదాలు వాక్యభాగాలే కాని స్వతంత్ర ప్రతిపత్తి కలిగినవి కావనీ, మరొక వర్గం – పదాలే primary, వాక్యం secondary అనీ అభిప్రాయ పడ్డారు. ఈ విషయమై వాదోపవాదాలు చాలా ఏళ్ళు, చాలా తీవ్రంగా కొనసాగాయట. (తర్వాతి అధ్యాయాల్లో కొంచెం వివరం తెలుస్తుంది.)

b) Categories of things:
పైన చెప్పినది parts of speech అయితే, ఇక్కడ చెప్పేది ontological categories.

Yaska’s contribution however lay in singling out two main (ontological) categories, a process or an action and an entity or a being or thing. L.Sarup chose to contrast these two, “bhava” and “sattva” by using the familiar terminology of “becoming” and being”

-అన్న రచయిత వాక్యాలు బహుశా మొత్తంగా ఈ విభాగానికి సారాంశం ఏమో. అయితే, సరిగ్గా అవగాహన రావడానికి నేను ఈ విభాగాన్ని మరొక్కసారైనా చదవాల్సి ఉంటుందేమో. ఇప్పటికి ఒకటికి రెండుసార్లు చదివినా, స్పష్టంగా ఒక అవగాహన కలగడంలేదు నాకు 😦

c) Primary and Non-Primary meanings of a word: Metaphor
Metaphor కు ఆంధ్రభారతి నిఘంటువులో – ఉపమ, ఉత్ప్రేక్ష, రూపక, శ్లేష – ఇలా అన్ని అర్థాలూ ఉన్నాయి. కనుక metaphor అనే రాస్తా. భారతీయ తత్వవేత్తలు (ప్రధానంగా నైయాయికులు) ఈ అంశాన్ని చర్చిస్తూ – పదానికి రెండు రకాల ‘powers’ ఉంటాయని, అందులో ఒకటి saying అయితే, ఒకటి pointing/indicating power అన్నీ అన్నారు. Metaphor లక్షణాల గురించి ఈ క్రింది వివరం ఈ విభాగం సారాంశం అని నా అభిప్రాయం.
“On analysis, the Naiyayikas identify two necessary conditions: a) the primary meaning should be a ‘misfit’ in the context; it would not go with the meanings of other words in the sentence and b) the indicated meaning (..) would have to be associated with the primary meaning in one way or the other.
ఇవి కాక మూడో పదానికి power ఉందనీ, అది suggestive power అని అలంకారశాస్త్ర పండితులు అంటారట. అయితే, ప్రధాన అర్థం, మెటఫొరికల్ అర్థం, వాక్యం కాంటెక్స్ట్ అన్నీ తెలిస్తేనే ఈ మూడో అర్థం గ్రహించగలమని, ఇది గొప్ప కవిత్వం లక్షణమనీ వీళ్ళ అభిప్రాయం. (ధ్వన్యాలోకం అన్న పుస్తకం గురించి ఇదివరలో బ్లాగ్లోకంలో ఒక చర్చ చూశా ఎప్పుడో. అది దీని గురించేననుకుంటా!)

d) Criticism of the ‘suggestive’ power
ఒక పదం “సూచించే” అర్థం దాన్ని వినేవాడి అన్వయంపై కూడా ఆధారపడుతుందనీ, పదానికే పూర్తిగా ఆ suggestive power ఉందనక్కర్లేదని భావం. పై వాదానికి ఇదొక విమర్శ అనుకుంటాను.

e) The speaker’s intention
ఒక వాక్యాన్ని పలికిన వ్యక్తి ఏ ఉద్దేశ్యంతో అన్నాడు? అన్న ఎరుక వల్ల వాక్యంలోని అయోమయాల్ని పోగొట్టవచ్చునని ఇక్కడ సారాంశం. పుస్తకంలో ఇచ్చిన ఉదాహరణ – సైంధవము అంటే – గుర్రము, ఉప్పు రెండు అర్థాలు ఉన్నాయి. అయితే, వాడిన సందర్భాన్ని బట్టి పలికిన వ్యక్తి ఉద్దేశ్యం విన్న వ్యక్తికి అర్థమవుతుందని సారాంశం.

f) Ambiguity and Contexual factors
ఇలా ఒకే పదానికి నానార్థాలు ఉన్న సందర్భాల్లో ఏది సరైన అర్థం అన్నది ఎలా నిర్థారిస్తామో – కొన్ని నియమాలు చేశాడట భర్తృహరి. అవి –
* Word association, dissociation: ఒక పదాన్ని దాని వాక్యంలో చుట్టు పక్కల ఉన్న పదాలతో కలిపి చూస్తే విడిపోయే తరహా అయోమయం.
* Mutual Association: rama and lakshmana అంటే శ్రీరాముడు కానీ బలరాముడు అవ్వడు కదా! 😉 ఇదీ పైన చెప్పిన association, dissociation లాగానే అనిపించింది నాకు. కానీ, ఇక్కడ ప్రస్తావన ఈ తరహా compound words (multi word expressions) గురించి మాత్రమే.
* Hostility or opposition: ఇది నాకంతగా అర్థం కాళేదు కాణీ,ఈ నాలుగూ కూడా వివిధ రకాల associations అని రచయిత రాయడం తో కొంచెం రిలేట్ చేసుకున్నా..
* Purpose : స్థాను అంటే శివుడు, స్థంబం అన్న రెండర్థాలు ఉన్నా worship sthanu అన్నప్పుడు శివపూజ అనే అర్థం చేసుకుంటాము కదా! అన్నది ఉదాహరణ. అయితే, ఇదీ నాకు association-dissociation లాగానే అనిపించింది.
* Context or Situation: తింటున్నప్పుడు “సైంధవాన్ని తీసుకురా” అంటే అది ఉప్పు అనే అర్థం చేసుకూంటాము కదా! అదే ఇది.
* Indicatory Sign: పై ఉదాహరణలో లా అదే వాక్యంలో కాకపోయినా, దాని ముందు అదే context లో వాడిన పదాలని బట్టి ప్రస్తుత వాక్య సందర్భం అర్థం చేసుకుని పదార్థంలోని అయోమయం పోగొట్టుకోవచ్చు.
* Proximity with Another word : నాకైతే ఇది అసోసియేషన్ అనే అనిపించింది (ఉదాహరణను బట్టి).
ఇలాగే, Capacity, Propriety, Place, Time, Gender, Accent ఇత్యాది వివరాలను బట్టి పదార్థాల మధ్య అయోమయాన్ని క్లారిఫై చేసుకోవచ్చు అని భర్తృహరి సూచనలు. వీటిని contexual, grammatical factors అని ఒక వర్గీకరణ చేయవచ్చని. contexual అంటే ప్రధానంగా association ఆధారితమైనవని రచయిత ఈ మొత్తాన్నీ సమ్మరైజ్ చేశారు. ఆధునిక శాస్త్రీయ భావజాలంలో ఈ తరహా పరిశోధనలని Word sense disambiguation అంటారు. Natural Language Processing రంగంలోని పరిష్కృతం కాని సమస్యల్లో (open problems) ఇదీ ఒకటి.

g) The word object relation: is it conventional? or eternal?
ఇదివరలో ఇదే చర్చ – ప్లాటో, అరిస్టాటిల్ కాలంలో జరిగినట్లు చదివాను (గత పుస్తకంలో). అయితే, అక్కడితో పోలిస్తే, ఇక్కడ పొందుపరచిన సంక్షిప్త సమాచారం కూడా విస్తారంగానే అనిపించింది. పదానికి-పదార్థానికి మధ్య ఉన్న సంబంధం గురించి గ్రీకుల లాగానే భారతీయ పండితుల్లో కూడా రెండు వర్గాలు ఉండేవి – న్యాయ, వైశేషిక వర్గాలు ఈ సంబంధం convention అని అభిప్రాయపడితే మీమాంసకులు, వైయాకరణులు ఈ సంబంధం eternal అని అభిప్రాయపడ్డారట. అయితే, ఈ సంబంధం eternal అనడానికి పాణిని వాడిన వాదం గురించి చెబుతూ – “People are seen to be using words to convey meanings, but they do not make an effort to manufacture words” అన్నాడని రచయిత అభిప్రాయపడ్డారు. అక్కడే నాకో సందేహం మొదలైంది – మనం పదాలు సృష్టించడం, అవి జనాల నోళ్ళలో నానడం అంతర్జాతీయంగా జరుగుతోంది కదా! అని. అయితే, ఇదే మూసలో, ఈ eternal సంబంధం సమర్థిస్తూ సాగిన వాదదనలు చదువుతూంటే మాత్రం గతంలో ప్లాటో వాదాలు చదివినప్పటితో పోలిస్తే, ఇక్కడ చాలా లోతైన చర్చలు జరిగినట్లు అనిపించింది. అధ్యాయం చివ్వర్లో రచయిత conclusion సబబుగా అనిపించింది నాకు –

“It seems that both theories contain some grains of truth. If we believe in conventionalism, then, in an extreme interpretation, language becomes entirely dependent on the whims of the language user. … .The introduction of God as the first creator of convention was meant to avoid such absurd consequences. The Eternalist has also made one important point regarding the givenness of the language and the word-object connection. Within a given linguistic community, the connection C cannot be easily tampered with. The debate between the Eternalist and the conventionalist may well reveal the point that there is some justification for accepting a theory like sphota theory of language, according to which the word and its linguistic meaning both remain undistinguished in the mind of the competent speaker as well as the competent hearer.”

-గొప్ప వ్యాసం. ఇవన్నీ నాబోటి non philosopher, non linguist మామూలు మనుషులకి అర్థమయ్యే భాషలో చెప్పడం సామాన్య విషయం కాదు!

Published in: on November 15, 2012 at 11:55 am  Comments (5)  
Tags: ,

The Word and the World – 3

(ఈ టపాలు ఈ పుస్తకం గురించి నేను రాసుకుంటున్న నోట్సు. ఈ సిరీస్ లో తక్కిన టపాలు ఇక్కడ.)
************

Chapter-2 : On Grammar and Linguistic Studies

ఇందులో నాలుగు ఉపశీర్షికలు ఉన్నాయి.
1) పాణిని, యాస్కుడు
ప్రాచీన భారతంలో వ్యాకరణాధ్యయనం ఇతర అధ్యయనాలకి ప్రవేశద్వారం అని భావించేవారు. వేదాధ్యయన పాఠ్యప్రణాళికలో గల ఆరు వేదాంగాలలో వ్యాకరణం ఒకటి (తక్కిన ఐదు: శిక్ష, కల్పము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషము – ఈ పెద్ద పెద్ద వికీపేజీలు చదవడానికి ఓపిక లేకుంటే వివిధ వేదాంగాల గురించి ఒక చిన్న పరిచయం కోసం ఈమాటలో సురేశ్ కొలిచాల గారు నిర్వహించే “పలుకుబడి” సిరీస్ మొదటి వ్యాసంలో చూడవచ్చు.).

ఈ కారణం వల్ల భారతదేశంలో వ్యాకరణ శాస్త్ర అధ్యయనం చాలా లోతుగా జరిగింది. నాలుగువేల సూత్రాలతో కూడిన సంస్కృత వ్యాకరణం – పాణిని రాసినది – ఎప్పుడో క్రీ.పూ. ఐదవ శతాబ్దం నాటిదైనా ఇప్పటికీ “One of the greatest monuments of human intelligence” (Bloomfield, 1933) అని పొగడబడే అద్భుత రచన. పాణిని వ్యాకరణ సూత్రాల్లో ప్రధాన భాగం వాక్యాలకి మూలకేంద్రాలైన క్రియల నిర్మాణం గురించి ఉంటుంది. వాక్యల్లో కనబడే ఈ క్రియారూపాలని -మూలధాతువు, దాని ప్రత్యయాలు అని రెండు భాగాలుగా విభజించవచ్చు అన్న అంశం ఈ సూత్రాల్లో ముఖ్యమైనది.

ఈ అంశం గురించే పదమూలాలు పరిశోధించే నైరుక్తులకు (Etymologists) పాణినీయులకి (Grammarians who follow Panini) మధ్య వాదోపవాదాలు జరిగేవట. నైరుక్తుల ప్రకారం – అన్ని నామవాచకాలూ ఏదో ఒక క్రియా ధాతువు నుండే పుట్టినవి. ఈ వాదాన్ని యాస్కుడు తన నిరుక్తంలో అతనికి పూర్వుడైన శకటాయనుడి వాదంగా చెబుతూ, సమర్థిస్తాడు. యాస్కుడే గర్గ్యుడనే మరొక సంస్కృత పండితుడి సిద్ధాంతాల గురించి కూడా ప్రస్తావించాడట. ఆయన శకటాయనుడికి మల్లే కాక – కొన్ని నామవాచకపదాలు ఎక్కడనుంచో వేరే పదాల నుండి పుట్టినవి కావనీ, వాటికి అవే మూలాలనీ అన్నాడట – ఈ వ్యూపాయింట్ ని యాస్కుడు ఒప్పుకోలేదు లెండి. కానీ, పాణిని వ్యాకరణంలో ఈ వ్యూపాయింట్కి తగ్గట్లు కొన్ని పదాలకి ధాతు-ప్రత్యయ విభజన లేకుండా ఉండడాన్ని అంగీకరించాడట. ఈ విధమైన సూత్రీకరణల ద్వారా పాణిని ఎన్నో ప్రశ్నలు రేకెత్తించారని తరువాతి భాష్యకారులు వీటిని లోతుగా అధ్యయనం చేశారనీ ఈ రచయిత రాశారు. అలాగే, పాణిని పరిశోధనలు ఆధునిక భాషాశాస్త్ర అభివృద్ధి క్రమంలో కూడా ప్రధాన పాత్ర పోషించాయని కూడా అంటారు. అయితే, ఈ ధాతు-ప్రత్యయ విభజనలు దాటి – వాక్య నిర్మాణం, పదార్థ శాస్త్రం (syntax, semantics) వంటి అంశాల మీద పాణిని కి ఎక్కువ ఆసక్తి లేదని తేల్చారు రచయిత.

ఈయనే తొలి వైయాకరణుడు అనలేము – ఈయనకి ముందు వారి ప్రస్తావన కూడా ఈయన రచనల్లో ఉంది కానీ, అవి అలభ్యం(మరిన్ని వివరాలకి అష్టాధ్యాయి వికీ పేజీ ఇక్కడ).

2) వ్యాకరణం అధ్యయనం చేయడం దేనికి?
దీనికి ప్రాధాన కారణం – శబ్దమూలాలని అధ్యయనం చేసి, ఏది సరైన పదం, ఏది తప్పు? అన్నది తెలుసుకోవడం అని పాణిని వ్యాకరణానికి ఒక వ్యాఖ్యానం రాసిన కైయతుడి అభిప్రాయం. అయితే, పతంజలి తన వ్యాఖ్యానంలో వ్యక్తపరచిన ప్రధాన కారణాలు ఇవి – “protection of scriptural texts in their pristine purity (raksha), transformation of word affixes to suit ritual context (uha), recitation of Scriptures (agama), a simpler way of learning the language (laghu), a way of learning about the proper meanings when ambiguous words are used (asamdeha)”

అయితే, మొత్తానికి ఇవీ కారణాలు అని ప్రత్యేకం ఎక్కడా చెప్పకపోయినా, వేదాంగం కావడం వల్ల వ్యాకరణ శాస్త్రం ప్రాముఖ్యతను సంతరించుకుందని రచయిత అభిప్రాయం. ఆ కాలంలో వ్యాకరణ అధ్యయనం పై ఉన్న చులకన భావాన్ని పోగొట్టడానికి పాణిని వ్యాకరణాన్ని ఒక శాస్త్రం అయ్యేలా ఈ గ్రంథం రాశాడని కూడా ఒక వాదన ఉంది. మొతానికి, పాణిని అభిప్రాయంలో – “language reveals its own secret to one who studies grammar just as the faithful wife reveals her beautiful body to her husband”

3) భాష నేర్చుకోవడం
భాషలోని పదాలని ఎలా నేర్చుకుంటాము? అంటే – దానికి వివరణగా విశ్వనాథుడు సిద్ధాంతముక్తావళిలో చెప్పినట్లు గా చెప్పుకునే ఒక పద్యాన్ని ఉదహరించారు. ఆ ప్రకారం,
“The ancients say that the meaning of a word is learnt from – a) grammar b)analogy c) a lexicon d)the statement of a reliable person e) the speech behavior of elders f) the remaining part of the sentence
g) explanation and h) proximity with well-known words”
-ఇంత వివరంగా ఆ కాలంలోనే రాసారంటే నాకు చాలా గొప్పగా అనిపించింది. అయితే, నేను ఒకళ్ళిద్దరు లింగ్విస్టిక్స్ విద్యార్థులని అడిగా – ఇదంతా వాళ్ళకి ఏదో ఒక తరగతిలోనైనా చెప్పి ఉంటారు కదా అని. నేను విన్న దాని ప్రకారం వాళ్ళ కరికులంలో లేదంట! విదేశాల్లో సరే, కానీ, మన దేశంలో కరికులం లో ఎందుకు లేదో నాకర్థం కాలేదు మరి.

4) సమానార్థకాలు, నానార్థాలు

సమానార్థక పదాల గురించి ఆట్టే వాదోపవాదాలు లేకపోయినా, నానార్థాల గురించి ప్రాచీనుల మధ్య రకరకాల సిద్ధాంతీకరణలు జరిగాయట. ఆ నానార్థ పదం నిజానికి వేర్వేరు అర్థాల గల పదాలకి అన్నింటికీ కలిపి ఒక dummy word అని ఒక వాదం, ఒకే పదానికి చాలా అర్థాలు ఉండే కేసు అని మరొక వాదం ఉండేవట. నిజానికి ఒక పదానికి వాడుక వల్ల ఏర్పడ్డ కొన్ని secondary meanings బాగా వ్యాప్తి చెంది, మరొక primary meaning అవుతాయనీ, అది సహజం అని చాలమంది ప్రాచీనులు అభిప్రాయ పడ్డారు. అయితే, వీళ్ళలోనూ మీమాంసకులనే వారు (ఉదా: కుమరిల భట్టు) సమానార్థకాలనీ, నానార్థాలనీ – రెంటినీ “అపభ్రంశాలు”గా పరిగణించేవారట. అలాగే, ఒకదాన్ని primary meaning ఒకదాన్ని secondary meaning అనీ అనడానికి కూడా వీళ్ళు వ్యతిరేకులట. వీళ్ళ ప్రకారం రెండూ ప్రధాన అర్థాలేనట. మరి వీళ్ళ థియరీకి వ్యతిరేకంగా ఒకే పదానికి మళ్ళీ వేరే అర్థాలు ఎలా ఉంటాయి? అన్న విషయాన్ని వివరించడానికే – అపభ్రంశాల ప్రస్తావన అనమాట!

“In fact the richness of linguistic devices to convey meanings is too great; these theories cannot exhaustively explain them. Theories are selective and within limits they can give some explanatory account for certain phenomena. It is too ambitious to expect a wholesale resolution to all problems.”
-ముఖ్యంగా ఈ చివరి ఉపశీర్షిక చదువుతున్నప్పుడు (అజ్ఞానంతోనైనా) నా మనసులో మెదులుతున్న ఆలోచనలకి అక్షరరూపం ఇస్తూ రచయిత రాసిన ఈ వాక్యాలతో ముగిసిందీ వ్యాసం.

Published in: on November 14, 2012 at 7:00 am  Comments (1)  
Tags: ,

The Word and the World – 2

(ఈ టపాలు ఈ పుస్తకం గురించి నేను రాసుకుంటున్న నోట్సు. ఈ సిరీస్ లో తక్కిన టపాలు ఇక్కడ.)
************

Chapter-1 : Introduction

ఇది పుస్తకంలో చర్చించబోయే విషయాలకి (ముందుమాటలతో పోలిస్తే) కొంచెం వివరమైన నాందీ ప్రస్తావన. (నా అవగాహన లో తప్పులు ఉండవచ్చు. ఈ పుస్తకం గానీ, ఈ అంశాలపై ఇతర పుస్తకాలు చదివిన వారు గానీ వచ్చి సరిచేస్తే, నేర్చుకోగలను).

పాశ్చాత్యుల తత్వ శాస్త్రాధ్యయనంలో చాలాకాలం దాకా భాషాతత్వాన్ని గురించిన అధ్యయనానికి ఎక్కువ ప్రాముఖ్యం లేదు కానీ, భారతదేశంలో ఆదినుండీ వేదాధ్యయనంలో భాగంగా, వాటిని సరిగ్గా అర్థం చేసుకునేందుకు భాషాధ్యయనం తోడ్పడడం మూలాన భాషాతత్వ చర్చలు ఉండేవి. ఒక వాక్యమో, పదమో ఏదైనా – వినేవారికి ఎలాంటి జ్ఞాన్ని ఇస్తుంది? ఎలా ఇస్తుంది? పదాల-వాక్యాల సంబంధాలు ఏమిటి? పదాలను ఎలా విభజించాలి? సరైన అర్థ నిర్థారణ కోసం వీటిని ఏ విధంగా పరిశీలించాలి? అసలు ఒక వాక్యాన్ని గాని, పదాన్ని గాని మనం అర్థం చేసుకునే క్రమంలో తార్కిక-మానసిక షితులు ఏవన్నా ఎలా ప్రభావితం చేస్తాయి? భాషాశాస్త్ర సిద్ధాంతాలేమిటి? భాష తత్వమేమిటి? – ఇలాంటి ప్రశ్నల గురించి మన సంస్కృత పండితుల మధ్య విస్తృత అధ్యయనాలు, చర్చలు, వాదోపవాదాలు, సిద్ధాంతీకరణలు జరిగాయట.

ఇక, భర్తృహరి వంటి కొందరు వైయాకరణులు భాష,సృష్టి రెంటి పుట్టుకకి మూలం ఒకటే కనుక భాష పనితీరుని అధ్యయనం చేయడం ద్వారా సృష్టి ని తెలుసుకోవచ్చని అభిప్రాయ పడ్డారని ముందు టపాలో చెప్పాను కదా.

“At times, most excessive pre-occupation with language on the one hand and with philosophy on the other, may indeed be regarded as a characteristic of Indian civilization” (F.Staal, 1969, Sanskrit Philosophy of Language)
-అన్న వాక్యాలు ఉదహరిస్తూ, ఆ పుస్తకంలో భారతదేశంలో భాషాతత్వ అధ్యయనం గురించి వివరంగా వ్రాసారని చెప్పారు రచయిత.

ఇక్కడ నుండి వైయాకరణులు, వారి అధ్యయనాల గురించి పరిచయం చేసే తరువాతి అధ్యాయానికి మళ్ళారు. దాని గురించి వచ్చే టపాలో.

Published in: on November 13, 2012 at 7:00 am  Comments (2)  
Tags: ,

The word and the World – 1

కొన్నాళ్ళ క్రితం ఒక పుస్తకం చదవడం మొదలుపెట్టాను. దాని పేరు –

The Word and the World – India’s contribution to the study of language
Author: Bimal Krishna Matilal

ఎప్పుడో ఐదేళ్ళ క్రితం “విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు” పుస్తకం గురించి బ్లాగు టపా రాసినప్పుడు దాని కింద పరుచూరి శ్రీనివాస్ గారు ఈ పుస్తకం గురించి ప్రస్తావిస్తే, ఇన్నాళ్ళ తరువాత నేను ఆ సూచనను అందుకుని ఈ పుస్తకం మొదలుపెట్టాను. నా మట్టుకు నాకు చాలా ఆసక్తికరంగా సాగుతోంది ప్రయాణం. అన్నీ తేలిగ్గా అర్థమైపోతున్నాయి అనను. నాకు కావాల్సిన సమాచారం అంతా ఈ ఒక్క పుస్తకంలోనే దొరికేస్తోందనీ అనను. కానీ, కొన్ని వారాల బట్టీ రోజూ ఈ పుస్తకం ఎక్కడికెళ్ళినా సంచిలో వేసుకుని తిరుగుతున్నానంటే – పుస్తకం నాలో ఎంతో కుతూహలాన్ని అలా నిలుపుతోందనే లెక్క. ఈ పుస్తకం వల్లే ఐదేళ్ళ తరువాత తరగతి గదిలో కూర్చున్నా కూడా :-). ఈ నేపథ్యంలో, కనీసం ఇలా ఈ పుస్తకం గురించి నోట్సు రాసుకోవడం మొదలుపెడితే కొన్ని అంశాలు మరింత క్లియర్ గా అర్థం అవుతాయన్న ఆశతో మొదలుపెడుతున్నా.

నాకు జ్ఞానోదయం, సందేహోదయం ఈ పుస్తకానికి అరిందం చక్రబర్తి రాసిన ముందుమాట నుండే మొదలైంది. కనుక దాని నుంచే ఈ టపాలు మొదలుపెడుతున్నా.

****
“The nature of language as a major concern and linguistic analysis as a self-conscious method took center stage in Western philosophy only in the twentieth century. This celebrated “linguistic turn” had happened in Classical Indian Philosophy at least two thousand years ago. What Geometry was for ancient Greeks, Grammar was to the ancient Indians”
– మొదట్లోనే చెప్పిన ఈ మాటలే నన్ను ఈ పుస్తకాన్ని చదవడానికి ప్రేరేపించాయని అనుకుంటున్నా.

“When with the inspiring urge to multiply, the lonely primal person uttered those literally pregnant sounds – “bhür”, “bhuvah”, “svah” – those pronounced words brought forth their sempiternal referents. Since then, at least for the thinking humans, there is no world without the word.”
– ఈ భాగం నాకు పూర్తిగా అర్థం కాలేదు (ఈ పదాల ఉద్భవాల గురీంచి ఉన్న కథ ఏమిటో సరిగ్గా ఎక్కడా కనబడలేదు వెబ్ లో. కానీ, ఈ పుస్తకంలో అవన్నీ మనకి కొంచెం నేపథ్యం తెలుసునని అనుకున్నారు కనుక వీళ్ళేమో వివరం చెప్పలేదు.) అయినప్పటికీ, ఆసక్తికరంగా అనిపించింది. ఇది చదివాక, క్రింది వాక్యం చదవగానే – భర్తృహరి గురించి విపరీతమైన కుతూహలం కలిగింది. భర్తృహరి అంటే సుభాషితాలే తెలుసు కానీ, ఈ విషయం తెలుసుకోవడం ఇప్పుడే మొదలుపెట్టా.

“Bhartrhari … … argued intricately in defense of the Vedic view that the study of language is the best way to study the world because the world came out of the same-speech energy out of which language is also emerged.”
-భాష గురించి అధ్యయనం చేయడం వెనుక ఇలాంటి కోణం కూడా ఒకటి ఉందా! అని ఆశ్చర్యం కలిగింది.

“The Rigvedic ideal running through Patanjali’s “great commentary” on Panini upon which Bhartrhari wrote his famous illuminating gloss, is the reverse of trying to have control or command over language. Speech is supposed to be treated more like a delicate mysterious woman who is seen by very few among those who apparently see her and is not heard by many who hear her. To the lucky few who worship her through deep contemplation, she reveals herself like a willing wife opening herself to a patiently waiting husband.”
-ఇది మరొక ఆసక్తికరమైనన వ్యాఖ్య!

సరే, తరువాత పుస్తకంలో అధ్యాయాల వారీగా ఏముందో చెప్తూ సాగిందీ ముందుమాట. అవెలాగో నేనూ నాకు అర్థమైనంతలో నోట్సు రాసుకోవాలి అనుకుంటున్నా కనుక వాటి ప్రస్తావన ఇక్కడ చేయడం లేదు. మొదట ఒక overview లాగా వివిధ అంశాలు ప్రస్తావించి, రెండో విభాగంలో కొన్ని ప్రత్యేక సిద్ధాంతల గురించి ప్రస్తావించారు.

ఈ ముందుమాట తరువాత, రచయిత రాసిన ముందుమాట మరొకటుంది. అది చదువుతూ ఉంటే – ప్రాచీన భారతంలో వ్యాకరణం, పదాల వ్యుత్పత్తి వంటి అంశాలు మొదలుకుని language acquisition theories దాకా అనేక అంశాల గురించి వాదోపవాదాలు, వివిధ schools of thought ఉండేవని తెలిసి ఆశ్చర్యం కలిగింది. ఇన్నాళ్ళ బట్టి లింగ్విస్టుల మధ్య తిరుగ్తున్నా ఇప్పటిదాకా పాణిని తప్ప ఇంకొక్కరి పేరు ఎవరూ ప్రస్తావించలేదు నాతో – ఈ పుస్తకం మొదలుపెట్టాక నాకు పరిచయం ఉన్న లింగ్విస్టులని, లింగ్విస్టిక్స్ విద్యార్థులని కొంచెం వివరంగా ప్రశ్నించడం మొదలుపెట్టాక నాకు తెలిసింది ఏమిటి అంటే – భాషా శాస్త్ర అధ్యయనంలో కళాశాల సిలబస్లో ఈ సంస్కృత పండితుల గురించి ప్రస్తావన లేదట. ఇదీ ఆశ్చర్యమే నాకు. ఈ పుస్తకమైనా నాకు అర్థమైనంతలో – ఒక philosopher రాసినట్లు ఉంది కానీ, ఒక linguist కూడా వస్తే ఈ వ్యాసాలకి మరో కోణం ఉండేదేమో అన్న సందేహం కలిగింది. ఏమైనా, రచయిత అన్నట్లు –
“In classical India, different disciplines such as linguistics, philosophy, logic and even aesthetics or literary criticism were interconnected – more intimately than we are prepared to allow today.”
-అన్నది మాత్రం నిజం అని అర్థమైంది పుస్తకంతో ముందుకు సాగుతూంటే.

Published in: on November 12, 2012 at 7:00 am  Leave a Comment  
Tags: ,