Philosophies of Language and Linguistics-13 (Last)

(ఈ టపాలు ఈ పుస్తకం గురించి నేను రాసుకుంటున్న నోట్సు. ముందు భాగాలు – ఇక్కడ.
అన్నట్లు, ఇది ఈ బ్లాగులో 600వ టపా! 🙂)
*****
నాకు సంబంధించినంత వరకూ – ఈ విభాగం అసలు పుస్తకానికి అనుబంధం మాత్రమే. ప్రస్తుతానికి ఈ రెండు వ్యాసాల చర్చావిషయమైన “Is a science of language possible? మీమాంస గురించి నాకాట్టే అవగాహన లేదు కనుక, అలాగే, ఈ పుస్తకాన్ని ఆ ప్రశ్నకి జవాబుగా మొదలుపెట్టలేదు కనుకా, చివరి రెండు వ్యాసాల గురించీ కలిపి ఒకే టపా రాసుకుంటున్నా.


11) Karl Popper – The Logic of Scientific Discovery

అసలుకి ఏదైనా “సైన్సు” అనిపించుకోవడానికి కావాల్సిన లక్షణాలు ఏమిటి? – అన్నది సూత్రీకరించిన వాడు Karl Popper ఎప్పుడో ఇరవైయ్యవ శతాబ్దపు తొలి అర్థంలో సూత్రీకరించిన ఈ లక్షణాలే నేటికీ ప్రామాణికం.

Popper తన పుస్తకం మొదట్లోనే తన సూత్రాల గురించి క్లుప్తంగా చెబుతాడని, ఇవి ఈ ఆయన philosophy of science లో ముఖ్యాంశాలుగా అర్థం చేసుకోవచ్చునని వ్యాస రచయిత అభిప్రాయం.

“A scientist, whether a theorist or experimenter, puts forward statements, or systems of statements, and tests them step by step. In the field of empirical sciences, more particularly, he constructs hypotheses, or systems of theories, and tests them against experience by observation and experiment”

-ఈ లక్షణాలని బట్టి భాషాశాస్త్రాన్ని శాస్త్రం అనగలమా? లేదా అన్నది ఈ వ్యాస విషయం. నాకు అనగలం అనే అనిపించింది (కనీసం computational linguistics ని.) కానీ, వ్యాస రచయిత ఈ లెక్కలో linguistics ని సైన్సు అనలేం అని చాలా సేపు వివరించారు. ఎలాగైనా, అది సైన్సా? కాదా? అన్న మీమాంస గురించి నేను ఆలోచించడం లేదు కనుక, ఈ విషయం గురించి ఆట్టే బ్లాగలేను.

అయితే, చివ్వర్లో పాపర్ అన్న విషయం నాకు ఆసక్తికరంగా అనిపించింది.

“Science never pursues the illusory aim of making its answers final, or even probable. Its advance is, rather, towards an infinite yet attainable aim: that of ever discovering new, deeper, and more general problems, and of subjecting our ever tentative answers to ever renewed and ever more rigorous tests.”

(పుస్తకం గూగుల్ ప్రివ్యూ ఇక్కడ). అలాగే, ఆయన రచనల గురించి, భావజాలం గురించీ, ఆధునిక సైన్సుపై ఆయన ప్రభావం గురించీ ఆయన వికీ పేజీలో చక్కటి ఇంట్రో ఉంది.

*****
12) Thomas Kuhn – The Structure of Scientific Revolutions

Thomas Kuhn
రాసిన ఈ పుస్తకం గురించి చెబుతూ, పాపర్ థియరీకి, కున్ థియరీకి మధ్య ఉన్న వైరుధ్యాన్ని గురించి వ్యాస రచయిత ఇలా రాశారు.

“whereas Popper rules out any kind of historicism – mostly due to the fact that such historicism ultimately leads to some sort of irrational/subjective/emotional conclusions – not only as far as the (exact) sciences are concerned, Kuhn provides a still plausible attempt to describe what a true science looks like by analyzing the history and consequently also the sociology of a number of exemplary sciences as especially Physics or some sub-disciplines thereof. According to Kuhn, we are able to make out socio-historical regularities within the emergence and development of our modern exact sciences. Those regularities Kuhn calls ‘paradigms’….”

****

“The pre-paradigm period, in particular, is regularly marked by frequent and deep debates over legitimate methods, problems, and standards of solution, though these serve rather to define schools than to produce agreement”
-అన్న కున్ వాక్యాలు ఉటంకిస్తూ, భాషాశాస్త్రం ప్రస్తుతం ఈ స్టేజీలో ఉందనీ, దాన్ని social science స్థాయి నుండి genuine science స్థాయికి తీసుకువెళ్ళడానికి ఇంకా చాలా రోజులు పడుతుందని అభిప్రాయపడ్డారు. అయితే, నాకు వ్యక్తిగతంగా – ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అన్న భావన లేదు కనుక (అవునండీ, అజ్ఞానం వల్లే.), అసలీ పోలిక దేనికి? అన్న సందేహమే వెంటాడింది ఈ రెండు వ్యాసాలు చదువుతున్నప్పుడు. కానీ, ఈ పుస్తక రచయిత ఆ “స్టేటస్” చాలా ముఖ్యం అని భావిస్తున్నట్లు మాత్రం అర్థమైంది.

చివ్వర్లో కోట్ చేసిన Kuhn వాక్యాలు నా మట్టుకు నాలో – చాలా ఆలోచనలు రేకెత్తించాయి.

“Scientific knowledge, like language, is intrinsically the common property of a group or else nothing at all. To understand it we shall need to know the special characteristics of the groups that create and use it”

ఈ పోలికలతో సంబంధం లేకుండా, ఈ రెండు వ్యాసాలు మాత్రం ఆయా రచనల గురించి ఆసక్తిని రేకెత్తించాయి. అర్థం చేసుకోగలనన్న నమ్మకం కలిగిన రోజున చదువుతానేమో!

ఈ రెండో పుస్తకం గురించిన వికీ పేజీ ఇక్కడ.
********
(ఇదీ విషయం. పుస్తకం తప్పక చదవాల్సింది అనను – ఇంతకంటే సులభగ్రహ్యంగా ఉండే పుస్తకాలు ఉండొచ్చు. అయితే, నా మట్టుకు నేను చాలా విషయాలు తెల్సుకున్నాను.)

Advertisements

Philosophies of Language and Linguistics-12

(ఈ టపాలు ఈ పుస్తకం గురించి నేను రాసుకుంటున్న నోట్సు. ముందు భాగాలు – ఇక్కడ)
*****

10) Steven Pinker: The Language Instinct (1994)

చోంస్కీ ప్రతిపాదనలతో కొనసాగుతూ – భాష తాలూకా మానసిక కోణాన్ని గురించి దృష్టి పెడుతుంది ఈ పుస్తకం. భాషకీ – పరిణామ వాదానికి ముడిపెడుతూ, భాషాశాస్త్రం కూడా natural science లో భాగంగా చూడాలంటాడు Pinker. అయితే, భాష గురించి మరింతలోతైన పరిశోధన చేయడంలో ఆసక్తిలేకపోయినా, ఊరికే సాధారణ కుతూహలం కొద్దీ చదివేవారికి కూడా అర్థమయ్యేలాగా ఈ విషయాల్ని చెప్పే ప్రయత్నంలో – ఈయన రాసినవి populist గా అయిపోవడమే కాక unscientific గా అయిపోయాయని ఈ వ్యాస రచయిత అభిప్రాయం.

సరే, ఈ పుస్తకం ప్రధానంగా – భాష అన్నది మనలో innate గా ఉంటుందనీ, అలాగే, మెదడులో కొన్ని భాగాలు కొన్ని భాష సంబంధిత కార్యాలకి నియమైతమై ఉంటాయని, cradle of language అంటూ ఏదీ లేదనీ, language determines thought – అన్నది తప్పనీ : ఇలా, సాగుతాయి ఆయన వాదనలు.
(ఈ పుస్తకంలోని ఆలోచనల్ని క్లుప్తంగా చెప్పిన వికీపేజీ ఇదిగో)

Pinker’s “The language instinct” thus might have given us further plausible argumentative evidence for the innateness hypothesis of language, but it is the author’s exaggerated egalitarianism shining through across the entire book which renders it a publication of diminished scientific value

-అని ముగిసింది వ్యాసం.

చూడబోతే, Aristotle, Saussure, Wittgenstein తప్ప ఈ వ్యాస రచయిత అందరినీ విమర్శించినట్లే ఉన్నాడు. సరే, ఆయన ఒపీనియన్స్ అటు పెడితే, మొత్తం ఒక క్రమంలో భాష గురించిన ఆలోచనలు (పాశ్చాత్య) శాస్త్రవేత్తల్లో, తత్వవేత్తల్లో ఎలా రూపాంతరం చెందుతూ వచ్చాయో అర్థమయింది నాకు. పుస్తకంలో రెండో భాగం – Is a science of language possible?” అన్న టైటిల్ కింద ఉన్న ఈ క్రింది వ్యాసాలు.

1. Karl Popper – The logic of scientific discovery
2. Thomas Kuhn – The structure of scientific revolutions
3. Would a science of language be possible according to Popper’s and Kuhn’s criterion?

అసలుకి ఈ భాగం దాకా నేను రాగలనని ఊహించలేదు కనుక (అర్థం కాక ముందుకుసాగనేమో అనుకున్నాను) – సంతోషం ఇక్కడి దాకా వచ్చినందుకు 🙂 🙂

Philosophies of Language and Linguistics-11

(ఈ టపాలు ఈ పుస్తకం గురించి నేను రాసుకుంటున్న నోట్సు. ముందు భాగాలు – ఇక్కడ)
*****

9) Noam Chomsky: Knowledge of Language (1986)

అప్పటిదాకా భాషదీ – మస్తిష్కానికి మధ్య ఉన్న సంబంధాన్ని పరిశోధనకి అనర్హంగా భావిస్తూ వస్తున్న థియరీలు డామినేట్ చేస్తూ ఉండగా, చోంస్కీ తన సిద్ధాంతాన్ని మొత్తం దానిపైనే ఆధారపడి రూపొందించాడు అంటూ మొదలుపెడతాడీ రచయిత వ్యాసాన్ని.

1) Externalised Language, Internalised Language – అని రెండింటిని గురించి వివరిస్తాడట ఇందులో. Internalised – అన్నది ఈ పుస్తకంలో ప్రధానంగా చోంస్కీ ప్రతిపాదించే సిద్ధాంతమైతే, Externalised అన్నది మామూలుగా అప్పటికి అందరు భాషాశాస్త్రవేత్తలూ వెళ్తున్న దారట. I-language అంటే – ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు, వాక్యం చెబుతున్నప్పుడు – చెబుతున్న వ్యక్తి మెదడులో ఉన్న అంతర్గత structure అట.

2) E-Language అన్నది బాహ్య దృష్టికి కనబడే విషయాలని మాత్రమే అధ్యయనం చేస్తే, I-Language అన్నది అంతర్గతంగా మాట మట్లాడే మనిషి మెదడులో ఉండే భాషా నిర్మాణాన్ని అధ్యయనం చేస్తుందట. అక్కడి నుండే Universal Grammar అన్న ప్రతిపాదనకు వస్తాడు చోంస్కీ (క్లుప్తంగా: వ్యాకరణాన్ని నేర్చుకోవడం అనేది మనకి సహజంగా అబ్బే గుణమని చెప్పడం. వివరాలకి వికీ పేజీ ఇక్కడ).

3) కనుక – ఇక్కడ అందరికీ భాష అన్నది అంతర్గతంగా ఒకే విధమైన structure తో ఉంటుంది కానీ, దాన్ని trigger చేసి set చేసేందుకు వాడే parameters బట్టి వివిధ భాషల మధ్య తేడాలు – అని ఈయన థియరీ. ఈ parameter setting ఆయా వ్యక్తులు పెరిగే సామాజిక వాతావరణం బట్టి ఉంటుందన్నమాట.

-ఇంకా ఈ వ్యాసంలో చోంస్కీ ఇతర రచనలని కూడా తీసుకుని, ఆయన ఆలోచనలు ఎలా మారుతూ వచ్చాయి, తాను చెప్పిన వాటిని తానే మారుస్తూ సాగడం గురించీ కూడా ఉంది. ఈ విషయాలే Understanding Linguistics చదువుతున్నప్పుడు – 60లలో చోంస్కీ సిద్ధాంతాలు సంచలనం సృష్టించినా, కాలక్రమేణా ఆయన సిద్ధాంతాలు ఒకదాన్ని మించి ఇంకొకటి కాంప్లికేటెడ్ అయిపోతూ ఎవరికీ అర్థం కాకుండా అవ్వడం మొదలైందని చదివాను.

**
“Chomskyan (cognitive) Linguistics also forms the basis of Steven Pinker’s book “The Language Instinct” which subsequently was responsible for the popularization of linguistics as an academic discipline”
-అంటూ ముగిసిందీ వ్యాసం. Pinker అంత పాపులర్ లింగ్విస్టు ఇంకొకరు లేరేమో అని నాకు ఎన్నాళ్ళ నుండో ఉన్న అనుమానం. అసలుకి ఏ విధంగానూ భాష గురించి ఆసక్తి లేని వారు కొంతమంది కూడా పింకర్ పుస్తకాలు ఇష్టంగా చదవడం చూశాను (ఎటొచ్చీ, నేనే ఒక్క పుస్తకమూ పూర్తిగా చదవలేకపోయాను అతనిది ఎందుకోగానీ!!).

కొంత ఇతర ఘోష:
Natural Language Processing పరిశోధనల్లో – కంప్యూటర్ సైంటిస్టులూ, లింగ్విస్టులూ కలిసి పనిచేస్తారు. గత ఏడాది Chomsky ఒక సమావేశంలో చేసిన వ్యాఖ్యానాలకి వ్యతిరేకంగా గూగుల్ రిసర్చి డైరెక్టర్ Peter Norvig తన వెబ్సైటులో “On Chomsky and the Two Cultures of Statistical Learning” అని ఒక వ్యాసం రాశాడు. తరువాత దీని గురించి ఇప్పటిదాకా కూడా కమ్యూనిటీ చర్చించుకుంటూనే ఉంది. దీని గురించి “Norvig vs. Chomsky and the Fight for the Future of AI” అన్న పేరుతో ఒక వ్యాసం ఇక్కడ చదవొచ్చు. మొన్న మొన్నటి దాకా కూడా ఈ వ్యాసం కొన్ని గ్రూపుల్లో సర్కులేట్ అవుతూనే ఉండింది. కొన్ని అంతర్జాల గ్రూపుల్లో చర్చలింకా వాడిగా సాగుతూనే ఉన్నాయి – రెండు రోజుల క్రితం కూడా చూశానొకచోట. ఇక్కడ చోంస్కీ గురించి చదువుతూ ఉంటే, ఇదంతా గుర్తు వచ్చింది.

Philosophies of Language and Linguistics-10

(ఈ టపాలు ఈ పుస్తకం గురించి నేను రాసుకుంటున్న నోట్సు. ముందు భాగాలు – ఇక్కడ)
*****

8) John Searle – Speech Acts

ఆ మధ్యన Understanding Linguistics అనే Teach yourself series పుస్తకం చదువుతూ ఉండగా, Linguistics లో సంకేత ప్రయోగ శాస్త్రం (Pragmatics) అన్న విభాగం గురించి పరిచయం చేస్తున్నప్పుడు ఈయన పేరు మొదటిసారి విన్నాను. ఈ “స్పీచ్ ఆక్ట్ థియరీ” గురించి ఆ పుస్తకంలో ఇచ్చిన వివరణ నాకు అన్నింటికంటే సులభంగా అర్థమయ్యేలా అనిపించిన వివరణ. కనుక, అక్కడి నుంచే మొదలుపెట్టి ప్రస్తుత వ్యాసానికి వస్తాను.

“When a person utters a sequence of words, the speaker is often trying to achieve some effect with those words, an effect which might in some cases have been accomplished by an alternative action. The words ‘get back!’ might convey the same notion as a push. .. .. In brief, a number of utterances behave somewhat like actions. .. .. ..this overall approach is known as speech act theory.”
– From Chap 9 – Using Language, Jean Aitchison‘s “Understanding Linguistics”.

ఇక, అసలు విషయానికొస్తే, ప్రస్తుత వ్యాసం John Searle రాసిన Speech Acts గురించి. (ఈ కాన్సెప్టు, చరిత్ర, దీని తాలూకా ప్రముఖ తత్వవేత్తలు ఇత్యాది వివరాలకి వికీ పేజీ చూడండి). విశేషాలు:

1. “Speaking a language is engaging in a (highly-complex) rule-governed form of behavior. To learn and master a language is (inter alia) to learn and to have mastered these rules”
– ఇక్కడ సియర్లే ఫోకస్ – “how to do things with words” అన్న అంశంపైన అంటారు రచయిత. అయితే, ఇదే అసలైన అధ్యయనం అని ఈయన పట్టుబట్టడు అంటూ –

2. “A great deal can be said in the study of language without studying speech acts, but any such purely formal study is necessarily incomplete”
-అన్నాడని చెబుతారు.

3. ఒక్కొక్కసారి భాషా పరమైన పరిమితుల వల్ల, మనం అనుకునేది స్పష్టంగా చెప్పలేకపోయినా, in principle, చెప్పగలగడం, ఒకవేళ ఒక భాషలో ఫలానా భావాన్ని వ్యక్తపరిచే పదం లేకపోతే, కొత్త పదాలు సృష్టించగలగడం కూడా అసాధ్యం కాదనీ సియర్లే అభిప్రాయం.
(ఇక్కడ నాకు “అనువాద సమస్యలు” లో రా.రా. అభిప్రాయాలు, ప్రముఖ లింగ్విస్టు Guy Deutscher అభిప్రాయాలు ఒకదానివెంబడి ఒకటి గుర్తొచ్చాయి. నాకు అర్థమైనంతలో మొదటిది అశాస్త్రీయం – భాషా శాస్త్రం అధ్యయనం చేసి నిపుణులు అనిపించుకున్న వారు అలా చెప్పరు – నేను చదివినంతలో. కానీ, విచిత్రంగా, అలాంటి అభిప్రాయాలతో చదువరులని కన్విన్స్ చేయడం చాలా తేలిక!)

4. ఈయన కూడా Wittgenstein, Saussure లకు మల్లే భాష ని ఆట తో పోల్చి, దానికున్న రూల్స్ మాత్రం రెండు రకాలుగా విభజించాడు-
“Regulative rules regulate a pre-existing activity, and activity whose existence is logically independent of the rules. Constitutive rules constitue (and also regulate) an activity the existence of which is logically dependent on the rules”
– నాకు స్పష్టంగా అర్థం కాలేదు ఇక్కడ, వ్యాసరచయిత వివరణ చదివాక కూడా. అయితే, ఈ విషయంలో Searle భావజాలాన్న్ సమ్మరైజ్ చేస్తూ రచయిత ఇలా రాశారు:
Searle’s discussion of rules in connection with chess and language lead him to the overall summary that – 1) languages are conventional 2) illocutionary acts are (generally) rule-governed and 3) language as a whole is rule-governed. (illocutionary act అంటే complete speech act అంట)

5.”We learned how to play the game of illocutionary acts, but in general it was done without an explicit formulation of rules, and the first step in getting such a formulation is to set out the conditions for the performance of a particular illocutionary act”
-బహుశా, ఇదే పైన చెప్పిన వాటికి సమ్మరీ ఏమో!

6. “In the systematic study of language, as in any systematic study, one of our aims is to reduce the maximum amount of data to the minimum amount of principles”
-ఈ ఆలోచనా విధానమే machine learning వెనుక కూడా ఉందేమో అనిపించింది ఇది చదివాక.

7. “Entities such as universals do not lie in the world, but in our mode of representing the world”
-“Linguistic Universal” గురించి చెప్పినట్లు ఉన్నారు. ఆసక్తికరంగా అనిపించింది నాకు.

**

“Naturally, in summarizing positive aspects of Searle’s theory of language, we must not forget the importance he ascribes to context as far as the meaning is concerned. And it is also with regard to meaning that Searle emphasized that “the characteristic intended effect of meaning is understanding”.

A final hint of Searle’s open-mindedness in respect of language can be seen in the fact that he takes linguistics not to be a science, but simply a systemic study adhering to certain methodological principles which we may also find in the (natural sciences)

Noam Chomsky would certainly not agree to that opinion as we shall be able to see in the discussion of his book “knowledge of language” which is to be analyzed next”

– అని ముగిసిందీ వ్యాసం.

Philosophies of Language and Linguistics-9

(ఈ టపాలు ఈ పుస్తకం గురించి నేను రాసుకుంటున్న నోట్సు. ముందు భాగాలు – ఇక్కడ)
*****
7) Willard Van Orman Quine : Word and Object

(మొదలుపెట్టే ముందు మూడు డిస్ క్లెయిమర్లు)
1) వ్యాసరచయితకి క్వైన్ మీద అంత సదభిప్రాయం ఉన్నట్లు లేదు
2) క్వైన్ పుస్తకం పేరు word and object అయినా, నాకు అర్థమైనంతలో ఈ పుస్తకం logic గురించి.
3) ఈ వ్యాసం చదివినా, క్వైన్ వికీ పేజీ చదివినా – నాకు ఈయన రచనల గురించి – దానికి భాషతో ఉన్న సంబంధం గురించీ పూర్తిగా అర్థం కాలేదు.

ఇక వివరాల్లోకి వెళ్తే –
1) మనం భాష ఎలా నేర్చుకుంటాం? అన్న అంశానికి పరిశోధకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. Broadly speaking, వీటిని రెండు వర్గాల్లోకి చేర్చవచ్చు – భాష మనిషికి సహజంగా అబ్బే గుణం అని ఒక వర్గం; భాష మనిషికి శిక్షణ వల్లనే అబ్బుతుందని మరొక వర్గం అంటారు. వీళ్ళ మధ్య పరిశోధనలు, వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి – విషయం ఏమిటంటే, క్వైన్ “శిక్షణ” వాదన సమర్థకుడు. (“…inculcated in the individual by training on the part of the society…”)

2) గతంలో ప్రస్తావించిన బ్లూంఫీల్డ్ కు మల్లే ఈయన కూడా – “…the idea of the mental counterpart of a linguistic form, is worse than worthless for linguistic science…” అన్నాడు. (బ్లూంఫీల్డ్ గురించిన వ్యాసం చదివినప్పుడూ, ఇప్పుడూ వచ్చిన అనుమానం – నిజమా?? మరి psycholinguistics ఏం చేస్తుంది?? అని.)

3) Russell కు మల్లే, ఈయన కూడా – logic is more important than ordinary language అని అభిప్రాయపడ్డాడు.

4) భాష లేకపోతే ఆలోచన లేదు (వ్యాస రచయిత మాటల్లో – “if there were no language, there would be no (conscious) thought and/or mind”) అని ఈయన అభిప్రాయపడ్డాడు.(Russell కూడా ఇదే విధంగా అన్నట్లు ముందు వ్యాసంలో రాశారు)

5) ఒకానొక చోట క్వైన్ ..we must credit the child with a sort of pre-linguistic quality space.. అనడం utter contradiction to his deep rooted behavioristic stance అని రచయిత అభిప్రాయపడ్డారు.

6) క్వైన్ వ్యాఖ్యానం ఈ పుస్తకం రెండో అధ్యాయం లో – భాష అన్నది ఒక ..just one of the forms of human behavior అన్నట్లు సాగిందనీ, కానీ, “..quite the opposite is the case, if there were no language, there would be no concept of behavior.” అనీ వ్యాస రచయిత అభిప్రాయపడ్డాడు.

7) ఒక చోట క్వైన్ ఇచ్చిన వివరణ నాకు ఆయన దృష్టిలో logic మాత్రమే ముఖ్యం అని వ్యాసరచయిత ఎందుకు అభిప్రాయపడ్డాడో – అర్థమయ్యేలా చెప్పింది 😉
“Our ordinary language shows a tiresome bias in its treatment of time. Relations of date are exalted grammatically as relations of position, weight and color are not. This bias is of itself an inelegance, or breach of theoretical simplicity”

8) “A sentence is not an event of utterance, but a universal; a repeatable sound pattern, or repeatedly apporximable norm”
-అన్న క్వైన్ మాటలని వ్యాస రచయిత విమర్శించారు. అయితే, సమాంతరంగా నేను భారతీయ సంప్రదాయంలో భాషా శాస్త్రం గురించి చదువుతున్నాను – అందులో భర్తృహరి కూడా ఇంచుమించు ఇదే అర్థం వచ్చేలా ఒక థియరీ ప్రతిపాదించాడు – వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం అన్న ముక్క గురించి ఆలోచిస్తూ. ఆకాలంలోనూ ఈ విషయంలో – భర్తృహరి స్కూల్, (కుమరిల) భట్ట స్కూల్, ప్రభాకర స్కూల్ – మూడు భిన్న ఆలోచనలు ఉండేవి అంట (పుస్తకం: Word and the World, India’s contribution to the study of Language – B.K.Matilal). ఈ చర్చ గుర్తు వచ్చింది. మరీ అంత తేలిగ్గా కొట్టి పడేయనక్కర్లేదేమో అనిపించింది దానితో. బహుశా, ఇతర వాదాలు Dominant కాబోలు అనుకున్నా.

-నాకు అర్థమైన విశేషాలు ఇవీ. అయితే, ఈ పుస్తకంతో ముందుకుసాగే కొద్దీ, నేను Matilal పుస్తకం వైపు ఆకర్షితురాలిని అవుతున్నాను అన్నది మాత్రం నిజం. 😛

Philosophies of Language and Linguistics-8

(ఈ టపాలు ఈ పుస్తకం గురించి నేను రాసుకుంటున్న నోట్సు. ముందు భాగాలు – ఇక్కడ)
*****

6) Bertrand Russell :An Inquiry into Meaning and Truth

ఈ పుస్తకం భాషకి సంబంధించినది కాదు కానీ –
“In 1940, Russell delivered the so-called “William James lectures” at Harvard University, in which he tried to theoritically establish the link between language and theory of knowledge (epistemology) or rather the philosophy of science. However, due to Russell’s lifelong preoccupation with mathematics and logic, the outcome of these lectures [..] hardly transcend the scope of formal logic. Yet if Russell’s “Inquiry of meaning and truth” is seen contrastively with Wittgenstein’s works, it may still yield some useful insights in to the nature of language which is why it was chosen to be discussed here..”
-అన్నది వ్యాస రచయిత ఇచ్చిన వివరణ. వ్యాసం లో సింహ భాగం భాష గురించి రసెల్కు గల అభిప్రాయాలు అంతగా లోతు లేనివని విమర్శనాత్మకంగా సాగినందువల్ల, అలాగే ఈ పుస్తకంలో ప్రధాన ఫోకస్ భాష గురించి కానందువల్లా, ఈ పుస్తకం గురించి ఇతరత్రా ఏదీ చదవలేదు నేను. (అంటే, ప్రస్తుతం నేను ఫిలాసఫీ గురించి కాదు కదా చదువుతున్నది! అందుకని)

ముఖ్యాంశాలు, వ్యాస రచయిత మాటల్లోనే:

1. “The concepts of truth and meaning [..] are of prime importance to Russell as far as language is concerned and he wishes to investigate those concepts more closely with their application to epistemology as well as to science. During this, he adopts the position of a quite strict empiricism which also blinds him to a certain degree in respect of other relevant factors of language’s nature.”

2. “Although he concedes that ‘a given word, say dog, may be uttered, heard, written or read by many people on many occasions’, he is not interested in those “occasions” at all, but purely in the denotation and (concrete) meaning of a specific word, thereby reducing language to mere logic.”

3. “The association between word and object is just like any other habitual association. […..] ..Association and habit are not specifically connected with language; they are characteristics of psychology and physiology generally. How they are to be interpreted is, of course, a difficult and controversial question, but it is not a question which specifically concerns the theory of language” – Russell.
-దీని గురించి వ్యాఖ్యానిస్తూ, ఆయన అభిప్రాయలు మరీ అమాయకంగా ఉన్నాయని రచయిత అభిప్రాయపడ్డారు. ఆయితే, difficult and controversial అన్న భాగాన్ని మాత్రం అంగీకరించారు.

4. ఈయన కూడా unambiguous గా ఉండే perfect language కోసం కలలు కన్నారట (చాలా మంది తత్వవేత్తలకి మల్లే. చాలామందంటే – నేను చదివిన కొద్ది పుస్తకాల్లో తారసపడ్డ వాళ్ళలో చాలా మందని భావం)

5. “An assertion has two sides, subjective and objective. Subjectively, it ‘expresses’ the state of the speaker, which may be called a ‘belief’, which may exist without words, and even in animals and infants who do not possess language” – అన్న Russell మాటలని రచయిత బాగా విమర్శించారు.

“It would usually be between ages two and three, a phase when humans develop active language including self-awareness. If we did not develop those two things, we would be living an animalistic life of mere instinct and conditioned response, something Russell dares to call ‘belief’. If certain people claim that they sometimes think in the absence of language, they are not sincere with themselves or want to appear particularly “creative”. Human consciousness is language, we humans cannot escape language and we very often tend to project language to other non-sentient creatures”
-రసెల్ మాటలకి ఈ విధంగా సాగిన వ్యాస రచయిత స్పందన నాకు చాలా కుతూహలాన్ని రేకెత్తించింది. ఎవరు కరెక్టు? ఎవరు తప్పు? అన్నవి నిర్ణయించేంత పరిజ్ఞానం నాకు ఇంకా లేదు కానీ, human consciousness is language అన్న భాగం మాత్రం విపరీతంగా ఆకర్షించి, ఆలోచింపజేస్తోంది నన్ను. ఓ పక్క Wittgenstein – Language disguises thought అనడం గుర్తువస్తోంది.

6. “…Since we use language and can use it correctly, without being aware of the process by which we acquired it..” అంటూ సాగిన రసెల్ వ్యాఖ్యని ఉటంకిస్తూ, ఈ ముక్క Noam Chomsky తదనంతర కాలంలో ప్రతిపాదించిన Universal Grammar సిద్ధాంతానికి దగ్గరగా ఉందని వ్యాసరచయిత అభిప్రాయపడ్డారు.

******
“We could therefore claim that Russell must have thought a science of language to be possible along the lines of other empirical sciences, but apparently he did not seem all too interested in the pursuit of purely linguistic research as he saw natural language as considerably inferior to what he was really keen to investigate, namely logical syntax.

If we also want to summarize a comparison between Wittgenstein and Russell concisely and in metaphorical terms, we would have to say that Wittgenstein was able to jump off the scaffolding of logic whereas Russell got trapped in the covering net around it.”
-అన్న రచయిత వాక్యాలతో ముగింసిందీ వ్యాసం.

Philosophies of Language and Linguistics-7

(ఈ టపాలు ఈ పుస్తకం గురించి నేను రాసుకుంటున్న నోట్సు. ముందు భాగాలు – ఇక్కడ)
*****
5) Leonard Bloomfield : Language

Leonard Bloomfield 20వ శతాబ్దంలో అత్యంత ప్రసిద్ధి చెందిన భాషా శాస్త్రవేత్తల్లో ఒకరు. భాషని ఒక పద్ధతి ప్రకారం అధ్యయనం చేయడం గురించి ఒక సంప్రదాయాన్ని ఏర్పరిచి, ఈ క్రమంలో ఎన్నో భాషలపై అధ్యయనాన్ని మొదలుపెట్టించిన వాడు. ఈయన ప్రవేశపెట్టిన పద్ధతిని – Structural Linguistics అంటారు. తరువాతి కాలంలో Noam Chomsky ప్రవేశపెట్టిన సిద్ధాంతాల ప్రభావంలో మరుగున పడే వరకు Bloomfield ప్రభావం అప్పటి భాషా శాస్త్ర పరిశోధనల్లో ప్రస్ఫుటంగా కనబడేది.

ఇక పుస్తకం విషయానికొస్తే, ముఖ్యాంశాలు:

1. “the methods and results in linguistics, inspite of their modest scope resemble those of natural science, the domain in which science has been most successful. It is only a prospect, but not hopelessly remote, that the study of language may help us towards the understanding and control of human events”.
-“control” దాకా వెళ్ళడం ఇప్పట్లో ఊహించలేము కానీ, భాషాధ్యయనానికి ఒక శాస్త్రీయమైన కట్టుబాటు ఉండాలి ప్రతిపాదించడం బ్లూంఫీల్డ్ చేసిన ముఖ్యమైన పని అంటారు ఈ వ్యాస రచయిత.

2. “The mentalistic theory, which […] still prevails both in the popular view and among men of science, supposes that the variability of human conduct is due to the interference of some non-physical factor .. ..”
-అంటూ సాగి, మొత్తానికి ఈ విధమైన ఆలోచనా విధానం భాషాశాస్త్ర అధ్యయనంలో పనికిరాదు అనడం బ్లూంఫీల్డ్ సూత్రీకరణల్లో మరొక ప్రధానమైన ఆలోచన అంటారు ఈవ్యాస రచయిత.

3. బ్లూంఫీల్డ్ ప్రకారం భాషాధ్యయనంలో రెండు ప్రధాన భాగాలు – phonetics, semantics. మొదటి దానిలో అర్థంతో నిమిత్తం లేకుండా – మాటలు ఎలా పుడుతున్నాయి? ఏ విధమైన శబ్దాలు వస్తున్నాయి? ఏ శరీరభాగాల వల్ల ఈ శబ్దాలు వస్తున్నాయి? వంటివి పరిశోధిస్తే, రెండవది ఈ శబ్దాలకి వాటి అర్థాలు ఎలా వస్తాయి? ఏ సందర్భంలో ఏ అర్థం వస్తుంది? వంటి అంశాలు పరిశోధిస్తుంది. అయితే, ఈయన ప్రకారం ఒక భాషని అధ్యయయనం చేయడంలో ఈ రెండో అంశం పట్టించుకోనక్కర్లేదట.
-ఈ పద్ధతిలో ఈయన ప్రభావంలో ఆ కాలంలో వరుసగా: ఒక భాష ఎంచుకుని ఆ భాష మాట్లాడే వారి ఉచ్చారణల నుండి ఆ భాషకు సంబంధించిన వివరాలు డాక్యుమెంట్ చేయడం, వ్యాకరణం రాయడం – ఇలా సాగింది భాషాశాస్త్ర ప్రయాణం చాలా ఏళ్ళు. ఇలాగ ఫోకస్ మొత్తం భాష structure గురించే తప్ప, శబ్దార్థాల గురించి లేకపోవడం వల్ల దీన్ని Structural Linguistics అన్నారు. (అన్నట్లు, ఈ విధంగా detailed descriptions తయారు చేసే విషయంలో ఈయన పాణిని రచనల నుండి కూడా ప్రభావితం అయ్యాడట.)

ఇలా భాషాశాస్త్రం కొనసాగుతూ ఉండగా, 50లు-60ల నాటికి Noam Chomsky వచ్చి – ఇలాక్కాదు, ఈ విధమైన description చాలదు, దీనితో పాటు అసలు భాషలో మనం ఎన్ని విధాలైన patterns generate చేయవచ్చు అన్నది కూడా అధ్యయనం చేయాలి. ఊరికే కొన్ని samples తీసుకుని వాటి వర్ణన ఇచ్చేస్తే చాలదు – అని కొత్త సిద్ధాంతం మొదలుపెట్టాడు. దాన్ని Generative Linguistics అన్నారు. తదనంతర కాలంలో భాషాశాస్త్ర గతిని మార్చివేసిన సిద్ధాంతంగా దీన్ని చెప్పుకుంటారు. (ఈయన గురించి కూడా ఈ పుస్తకంలో ఒక వ్యాసం ఉంది.)

-ఈ టపాలో అసలు వ్యాసంలో వ్యాసరచయిత చెప్పిన సంగతుల కంటే ఈ పుస్తకం గురించిన ఇతర సంగతులే ఎక్కువున్నాయి. అందుకు కారణం ఏమిటంటే –
1) ఈ వ్యాసంలో చెప్పదల్చుకున్న విషయం రెండు మూడు సార్లు చదివినా నాకు స్పష్టంగా అర్థం కాక, నేను వికీ పేజీలు, ఇతర పరిచయ వ్యాసాలూ చదువుకోవడం.
2) వ్యాసంలో రచయిత ఫోకస్ కొంచెం విమర్శనాత్మకంగా ఉండడం వల్ల నేనేదైనా మిస్సవుతున్నానేమో అన్న అనుమానం.

మొత్తానికి, భాష గురించిన ఆలోచనల పరిణామంలో ఇదొక ముఖ్యమైన మలుపే అనిపించింది. ఒక పద్ధతిలో భాషని అధ్యయనం చేయడాన్ని గురించి పునాదులు వేసిన స్టేజీ ఇదే.
ఈ Language పుస్తకం సంగతి తెలియదు కానీ, An Introduction to the study of Language అన్న మరొక బ్లూంఫీల్డ్ పుస్తకం మాత్రం ఆర్కైవ్.ఆర్గ్ సైటులో ఇక్కడ దిగుమతి చేసుకోవచ్చు.

ఈ బ్లాగు టపా రాసేందుకు ఉపయోగపడ్డ మరొక వ్యాసం – Jean Aitchison రాసిన Understand Linguistics పుస్తకంలో ఆధునిక భాషాశాస్త్రం ఎలా అభివృద్ధి చెందిందో క్లుప్తంగా చెప్పిన మూడవ అధ్యాయం.

Philosophies of Language and Linguistics-6

(ఈ టపాలు ఈ పుస్తకం గురించి నేను రాసుకుంటున్న నోట్సు. ముందు భాగాలు – ఇక్కడ)
*****
నిన్న మొదలుపెట్టిన Ludwig Wittgenstein రచనల గురించిన వ్యాసానికి కొనసాగింపు ఇది.

4 b) Ludwig Wittgenstein – Philosophical Investigations

చిత్రం ఏమిటంటే, విట్గెన్స్టైన్ తన మొదటి పుస్తకంలో ప్రస్తావించిన అంశాల్లో చాలావాటిని ఈ రెండో పుస్తకంలో (రెంటికీ మధ్య ముప్పై ఏళ్ళ ఎడం ఉంది) ఖండించాడట. ఈ పుస్తకంలోని ముఖ్యాంశాలు: (పుస్తకం వికీ లంకె ఇక్కడ)

1) ఈయన పేరుతో బాగా ప్రసిద్ధి చెందిన Language games అన్న కాన్సెప్టు ప్రతిపాదించింది ఇందులోనే. (“…I shall also call the whole, consisting of language and the actions in to which it is woven, a “language game”…). ప్రధానంగా ఆ కాన్సెప్టును వివరించడమే ఈ పుస్తకంలో అన్నింటికంటే ముఖ్యమైన అంశం అంటారు ఈ వ్యాస రచయిత. ఇదివరలో (మొదటి పుస్తకంలో) భాషని తర్కబద్ధంగా ఉండేలా చేయాలి – అన్నట్లుగా అనిపించేలా సాగిన ఆలోచనకి వ్యతిరేకదిశలో సాగుతాయట ఇక్కడ. పైగా, “language must not be studied isolated, but together and connected with other “actions” or rather activities.” అనడం ఈ మార్పును సూచిస్తుందని రచయిత అభిప్రాయం. ఈ సందర్భంలోనే విట్గెన్స్టైన్ ఇచ్చిన మరో స్టేట్మెంట్ – “The meaning of a word is its use in the language”.
-ఈవిధంగా భాషని ఒక ఆటతో (విట్గెన్స్టైన్ చదరంగం తో పోల్చాడు) పోల్చడం Saussure, రాబోయే వ్యాసాల్లో పరిచయం కాబోయే John Searle కూడా సూచించారట.

2) కాలక్రమంలో భాష మార్పు చెందడం గురించి Saussure కు మల్లే అలాంటి మార్పుల్ని వ్యక్తులుగా మనం స్పష్టంగా గమనించలేమనే అభిప్రాయపడ్డాడట.

3) అలాగే, మనిషికి పుట్టుకతో ఈ “ఆట” (language game) లో పాల్గొనగలిగే నేర్పు వుంటుందనీ, అయితే, “ఆట”కి సంబంధించిన నియమాలు మాత్రం తన సాంఘిక ఇరుగుపొరుగులైన ఇతర “ఆటగాళ్ళ” నుండి వస్తుందని విట్గెన్స్టైన్ అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో కూడా Saussure అభిప్రాయలతో దగ్గరితనం ఉందట.
భాషలో “convention” గురించి చెబుతూ – “The common behavior of mankind is the system of reference by means of which we interpret an unknown language.” అన్నాడు.

4) ఒక ఉదాహరణ ఇస్తూ, ఒక పరిశోధకుడు ఏదో కొత్త భాష మాట్లాడే ప్రాంటానికి వెళ్ళాక అక్కడి మనుషుల భాషని అధ్యయనం చేయాలనుకుంటే ఏం చేస్తాడు? “..what this researcher is about to observe first is the way the natives behave while speaking: by taking behavioral patterns, he will try to know the language.” -అంటూ ఈ ఉదాహరణ గురించి వ్యాస రచయిత విశదీకరించినపుడు నాకు మళ్ళీ – మొదటి తరం Machine Translation శాస్త్రవేత్తలు బహుశా ఈ భాగం వల్ల కూడా ప్రభావితం అయ్యి ఉండొచ్చు అనిపించింది. ఇప్పటికీ వివిధ భాషల మధ్య రూపొందించే Statistical Machine Translation Systems వెనుక ఉండే ప్రాథమిక ఆలోచన ఈ Patterns అర్థం చేసుకోవడమే అని నేను అనుకుంటాను.

5) “If the technique of a game of chess did not exist, I could not intend to play a game of chess.” – అన్న వాక్యం మళ్ళీ ముందు పుస్తకంలో చెప్పిన – “The limits of my language mean the limits of my world. (5.6); We cannot think what we cannot think; so what we cannot think we cannot say either (5.61)” – అన్న వాక్యాల్ని గుర్తు తెచ్చింది. ఎందుకో గానీ, అందరూ ఈయన రెండు పుస్తకాల మధ్య inconsistency ఉందంటున్నారు – అందరూ అనేంత లేదేమో?? అని మొదటిసారి సందేహం వచ్చింది. అది ఈయన్ని చదివితే కానీ తీరదు ఎలాగో!

6) “Even if someone had a particular capacity only when, and only as long as, he had a particular feeling, the feeling would not be the capacity” అంటాడట ఒక చోట. దాన్ని ఈ వ్యాస రచయిత విట్గెన్స్టైన్ గత పుస్తకంలో అన్న Language disguises thought వాక్యంతో పోల్చవచ్చని అభిప్రాయపడ్డారు.

7) విట్గెన్స్టైన్ రెండో పుస్తకం (అంటే ప్రస్తుతం చెబుతున్న Philosophical Investigations) పాశ్చాత్య తత్వ శాస్త్రవేత్తల్లో చాలా ప్రభావం చూపిందట. ఇక్కడ నుండి కొత్త భాషా శాస్త్ర సిద్ధాంటాలు (Speech act theory – Searle దీని గురించి కూడా ఈ పుస్తకం లో రాబోయే కాలంలో వస్తుంది.)

“Is it thinkable that we, as researchers of language, may not be able to do anything else than to engage in more or less systematic anthropological studies in to the most important feature?”
-అన్న వ్యాస రచయిత వాక్యాలతో విట్గెన్స్టైన్ రచనల గురించిన పరిచయం ముగిసింది.

మొత్తానికి, ఈ రౌండు చదువులు అయిపోయాక బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఈ విభాగంలో చదువులకి వెనక్కి రాగానే, విట్గెన్స్టైన్ ను చదవాలని నిర్ణయించుకున్నాను. విట్గెన్స్టైన్ రీడర్లు ఉంటాయి కదా – వాటితో మొదలుపెట్టాలని ఆలోచన.

Philosophies of Language and Linguistics-5

(ఈ టపాలు ఈ పుస్తకం గురించి నేను రాసుకుంటున్న నోట్సు. ముందు భాగాలు – ఇక్కడ)
*****
నాలుగో అధ్యాయంలో రెండు పుస్తకాల గురించిన వివరాలు ఉన్నాయి. జర్మన్ తత్వవేత్త లుడ్విగ్ విట్గెన్స్టైన్ రాసిన రెండు పుస్తకాలలో భాషను గురించిన ప్రస్తావన ఎంత ఉంది? ఏమని ఉంది? అన్నది ఈ వ్యాసం టాపిక్. మొదటి టపాలో చెప్పినట్లు – ఈయన రాసినది చాలా కొంచెం అంట కానీ, తొలి తరం యాంత్రిక అనువాద (Machine Translation) శాస్త్రవేత్తలు ఈయన భావాల వల్ల ప్రభావితం అయ్యారట. ఆ పుస్తకాల పేర్లు – Tractacus Logico Philosophicus; Philosophical Investigations. ఈ రెంటిలోని మొదటి పుస్తకం గురించి ఈ టపా.

4 a) Ludwig Wittgenstein – Tractacus Logico-Philosophicus (1921)
(పుస్తకాన్ని గురించిన అవగాహన కోసం వికీ లంకె ఇక్కడ).
1) ఈయన తర్కానికి భాష కంటే తక్కువ విలువని ఆపాదించాడట. (” ..Wittgenstein, even at that stage, did not see logic as more important than natural language. .. .. Logic therefore is nothing more than some kind of linguistic basis for the things that “we wish” to say in our everyday life” అని రచయిత అన్వయం.)

2) మన భాషా సామర్థ్యం లేకపోతే మనం ప్రపంచాన్ని గురించి ఆలోచించలేమని విట్గెన్స్టీన్ అంటాడట. (“..language creates the “things” of the world by stating certain facts about it… States of affairs can only be expressed by language. They owe their very existence to language.”)

3) “It is as impossible to represent in language anything that ‘contradicts logic’ as it is in geometry to represent by its co-ordinates a figure that contradicts the laws of space or to give the co-ordinates a point that does not exist” (3.032) – ఇది ఆయన ప్రతిపాదించిన సూత్రాల్లో ఒకటి. చాలా ఆసక్తికరంగా అనిపించింది నాకు. అంటే ఏమిటి? ఒకదానికొకటి సంబంధంలేకుండా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ పోవచ్చు కదా భాషలో – మొత్తంగా చూస్తే అది తర్క విరుద్ధం అవ్వదా? అని నాకు సందేహం కలిగింది. ఈ విషయం గురించి కొంచెం వివరణ ఉంటే బాగుండేది కానీ, బహుశా అది మన మెదడుకు మేతేమో!

4) వాటి తాలూకా images కీ మధ్య మన మస్తిష్కంలో ఏర్పడే బంధాల గురించి – విట్గెన్స్టీన్ అభిప్రాయాలు కూడా గతవ్యాసంలో చెప్పిన Saussure అభిప్రాయాలకి దగ్గరలో ఉన్నాయట.

5) ఈయన కూడా ప్లాటో తప్ప పుస్తకంలో ఇప్పటిదాకా వచ్చిన మిగితావారి లాగానే – పదాలకి-అవి సూచించే వస్తువులకీ మధ్య ఉండే సంబంధం సంప్రదాయమే తప్ప absolute truth అనడానికి ఏమీ లేదనే తీర్మానించాడట.

6) మామూలు భాషలో కొన్ని పదాలకి అర్థాలు వేరైనా అవి ఒకే వస్తువును సూచించడం; ఒకే పదానికి వేర్వేరు అర్థాలుండడం వంటివి భాషలోని లోటుపాట్లుగా భావించి, ఇలాంటి ambiguities కి తావు లేని Logical sign language ఒకటుండాలని ప్రతిపాదించాడు. (ఈ విధంగా అయోమయాలకి తావులేని భాషలు కనిపెట్టాలన్న కోరికతో ఇప్పటి దాకా తొమ్మిదొందల పైచిలుకు కృత్రిమ భాషల సృష్టి జరిగిందంటే ఆశ్చర్యంగా ఉన్నా నమ్మక తప్పదు. ఈ విషయం గురించి – In the land of invented languages అని ఒక పుస్తకం చదివాను కొన్నాళ్ళ క్రితం. దాని గురించిన పరిచయం ఇక్కడ).

7) భాష అన్నది ఎన్ని క్లిష్టమైన ఉపక్రియలున్న ప్రక్రియో తెలియకుండానే మనుషులు వాడేస్తూ ఉంటారు. దాని స్వభావాన్ని; దాని వెనుక ఉన్న తర్కాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం – అని అభిప్రాయపడ్డాడు. (Logicను అర్థంచేసుకోవడం భాషను అర్థం చేసుకోవడం కంటే తేలిక అని మొదట్లో వ్యక్తపరచిన అభిప్రాయాన్ని మళ్ళీ ఇక్కడ ప్రస్తావించారు ఈ వ్యాస రచయిత. యాంత్రికానువాద శాస్త్రవేత్తలని ప్రభావితం చేసిన అంశాల్లో ఇది ఒకటి కావొచ్చని నా ఊహ.)

8) తత్వశాస్త్రంలో ఉన్న కొన్ని ప్రశ్నలు కేవలం భాషా తర్కాన్ని (Language Logic) సరిగా అర్థం చేసుకోలేకపోయినందువల్లే వచ్చాయని; కనుక తత్వ శాస్త్రం మొత్తం critique of language అనీ ఈయన అనడం బాగా పేరు పొందిన స్టేట్మెంట్.

9) “Language disguises thought.” – మన ఆలోచనలని భాష ద్వారా మాత్రమే వ్యక్తపరచగలం. కానీ, ఆలోచన అన్నది మాత్రం ఒక black box. దాన్ని మనం నేరుగా access చేయడం కుదరదు.

10) అయితే, ఒక్క పక్క ఇలాగ అంటూనే – “Infact, all the propositions of our everyday language, just as they stand, are in perfect logical order..” (5.5563) అంటాడట ఆయనే మళ్ళీ. దీన్నే ప్రస్తావిస్తూ, ఈ వ్యాస రచయిత ఇది ఈ పుస్తకంలోని contradiction అన్నారు.

11) ఇక, విట్గెన్స్టీన్ అన్న The limits of my language mean the limits of my world. (5.6); We cannot think what we cannot think; so what we cannot think we cannot say either (5.61) – అన్నవి బాగా వాదోపవాదాలకి చోటిచ్చే వ్యాఖ్యలని రచయిత అభిప్రాయపడ్డారు. ఇదివరలో Through the language glass చదువుతున్నప్పుడు ఇదిగో ఇంచు మించు ఇదే ముక్క మీద దాదాపు రెండొందల సంవత్సరాలుగా (అంటే ఈయన ఈ స్టేట్మెంట్ ఇవ్వడంతో సంబంధం లేకుండా భాషా వేత్తల మధ్య) వాదోపవాదాలు జరుగుతున్నాయని చదవడం గుర్తొచ్చింది.

-మొత్తానికి ఇప్పటిదాకా ఈ పుస్తకం ద్వారా పరిచయం అవుతున్న ఆలోచనల్లో ఇంత వివరంగా నాకు అర్థమై, ఆలోచింపజేసి, అసలు ఒరిజినల్ చదవాలి అనిపించేలా చేసింది ఇదే. Tractacus… గూటెంబర్గ్ ప్రాజెక్టులో చదివేందుకు లభ్యం. లంకె ఇక్కడ. ఇది నేను ఎప్పుడో చదవాలి అని నిర్ణయించుకున్నానిక ఈ వ్యాసం చదివాక!

Philosophies of Language and Linguistics-4

(ఈ టపాలు ఈ పుస్తకం గురించి నేను రాసుకుంటున్న నోట్సు. ముందు భాగాలు – ఇక్కడ)
*****

3) Cours de linguistique générale – Ferdinand De Saussure (1916)

ప్లాటో అరిస్టాటిల్ ల కాలం నుండి ఒక్క గెంతులో ఇరవైయవ శతాబ్దానికి వచ్చేశారు ఈ పుస్తకంలో. ఆధునిక భాషాశాస్త్రం ఇదిగో, ఇప్పుడు చెప్పబోయే పుస్తకంతోనే మొదలైంది అంటారు. మధ్యలో భాషా శాస్త్రం గురించి ఆట్టే చర్చల్లేవా? లేదంటే భాషా శాస్త్రమే లేదా? ఈ మధ్య కాలంలో యూరోపు, అమెరికాలని వదిలేస్తే, ఇతర ప్రాంతాల్లో భాషా శాస్త్రం గురించి ఎవరూ అభ్యసించలేదా? – ఇన్ని రకాల ప్రశ్నలకి ఇప్పుడే సమాధానాలు వెదకడం మొదలుపెడుతున్నా.

విషయానికొస్తే పుస్తకంలో ప్రస్తుతం ప్రస్తావనలో ఉన్న పుస్తకం – 20వ శతాబ్దపు భాషాశాస్త్ర పితగా అభివర్ణించబడే Ferdinand de Saussure రాసినట్లు భావించే Cours de linguistique générale (Course in General Linguistics) గురించి. రాసినట్లు భావించే – అని ఎందుకంటున్నానంటే, ఆ పుస్తకం ఆయన మరణానంతరం ఆయన క్లాసులో ఇచ్చిన ఉపన్యాసాల నోట్సులని సంకలించి ఆయన విద్యార్థులు ఇద్దరు రూపొందించారు. దీని వల్ల మనం పూర్తిగా సస్యూర్ మాటల్లో చదవము అని పరిశోధకులు అంటారు.

ముఖ్యాంశాలు –

1) గతంలో గ్రీకు తత్వవేత్తలు అనుకున్నట్లు – భాష అంటే పేర్ల మూలాలు కనుక్కోవడం మాత్రమే కాదు (Language is not a nomenclature) అని గట్టిగా చెప్పాడు Saussure.

2) ఒక పేరుకీ, దాని తాలూకా వస్తువుకి మధ్య ఉన్న సంబంధాన్ని నిర్వచించడం అంత తేలిక కాదు అనీ, దానిలో భౌతిక, మానసిక కోణాలు కూడా ఉన్నవనీ మొదటిసారి సూచించాడు. భౌతికమైనవి – పదాలు పలకడంలో పుట్టే శబ్దం లాంటివి. మానసికమైనవి – ఈ శబ్దాలు వినడం వల్ల మెదడులో కలిగే associations వంటివి. ఈ రెంటీనీ #Signifier (Sound Image), Signified (Mental image) అనీ అన్నారు.

“By postulating that the linguistic sign is something actually present in the mind/brain, Saussure sees language as a psychological fact.” -అన్నారీ రచయిత.

అయితే, వీటి రెండింటి మధ్య గల సంబంధం – convention అనే ఈయన కూడా ప్రతిపాదించారు (దైవ నిర్ణితం అనకుండా)

3) తర తరాల మధ్య భాష మార్పు చెందినా, ఉన్నట్లుండి జరిగిపోయి మనుషులు దాన్ని గుర్తుపట్టే విధంగా భాష మార్పు చెందదని Saussure మరొక ప్రతిపాదన.

4) భాషకు సంబంధించి ప్రతి మనిషిలోనూ (వాడేభాష వాడు? అన్న దానితో సంబంధం లేకుండా) ఒక అంతర్గత సామర్థ్యం ఉంటుందని Saussure అనుకుని ఉండొచ్చని రచయిత speculation.

5) LANGAGE, LANGUE, PAROLE అని మూడ కాన్సెప్ట్స్ ఉన్నాయి. Langage అంటే మాటకి పనికి వచ్చే అవయవాలూ గట్రా. langue అంటే భాషా శాస్త్రం. parole అంటే మాట్లాడ్డం అనే ప్రక్రియ జరగడం.

“Saussure in his characterization of language with its somehow dichotomic parts of LANGAGE, LANGUE and PAROLE is undecided in a certain way when it comes to answering the question whether either the social or the individual side of an immensely complex phenomenon as is the case with language has to be emphasized”
-అంటూ ముగింపు వాక్యాలు పలికారు ఈ పుస్తక పరిచయానికి.

*****
(ఈ వ్యాసం చదివి అర్థం చేసుకోవడం బాగా కష్టమైంది. ఆఖరుకి వికీ పేజీలే ఒకటికి రెండుసార్లు చదివితే, ఆ పుస్తకం గురించి అర్థమైంది. Text Complexity గురించి పనిచేసే నాకు ఇదొక కేస్-స్టడీ అయ్యేలా ఉందనిపించింది ఆఖర్లో 😉 )