జిల్లేళ్ళ బాలాజీ గారి తెలుగు కథ “సిక్కెంటిక” కి నా ఆంగ్లానువాదం అవుట్లుక్ పత్రిక వీకెండర్ పేజీలలో ఈ ఆదివారం నాడు వచ్చింది. ఆ కథ, అనువాదం గురించి ఏవో నా నాలుగు ముక్కలు రాస్కుందామని ఈ పోస్టు. ఇదే పేరు గల కథాసంకలనంలో ఉంది ఇది. పుస్తకం ఈబుక్ కినిగె.కాం లో కొనుగోలుకి లభ్యం.
నేను ఈ కథని ఏప్రిల్ లో చదివినట్లు ఉన్నా. అంతకుముందు ఈ రచయిత పేరు విన్నాను కానీ అనువాదకుడిగా. ఆయన కథలు కూడా రాశారని నాకు తెలియదు. ఏదో వందలోపు ఉన్న పుస్తకాలు ఉంటే కొందామని బ్రౌజు చేస్తూ ఉంటే కనబడి కొన్నానంతే. మొదటి నాలుగైదు కథలు చదవగానే ఆకట్టుకున్నాయి. తర్వాతివి మళ్ళీ అంత నచ్చలేదు. ఈ నచ్చినవాటిల్లో ఈ కథ ఎక్కువ నచ్చింది. అందుకు ప్రధాన కారణం ముగించిన పద్ధతి. సాధారణంగా కొంచెం పాజిటివ్ ముగింపు చూపే వాటిని అంత సీరియస్ గా తీసుకోరేమో మన వాళ్ళు అని నా అనుమానం. కానీ నాకు వ్యక్తిగతంగా అలాంటివి ఇష్టం. సరే, ఈ కథ నచ్చింది కానీ నేను మధ్యలో ఇండియా ప్రయాణం వగైరా పనుల్లో బిజీగా ఉండి పట్టించుకోలేదు. మధ్యలో కథ గురించి చాలాసార్లు అనుకున్నా. దానితో మళ్ళీ జూన్లో ఈ కథ ఇంకోసారి చదివా – అనువాదం చేయడానికి ఎలా ఉంటుంది? అన్న ఆలోచనతో. అపుడు ఇంక ప్రయత్నిద్దాం అనుకుని బాలాజీ గారి అనుమతి తీసుకుని మొదలుపెట్టా.
ఆంగ్ల ఎడిటర్ల సూచనలు ఎలా ఉంటాయి? మనం ఏం చూసుకోవాలి? ఇలాంటివి ఆంగ్లంలో రాయాలనుకుంటున్న తెలుగు వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈమధ్య మాటల సందర్భంలో అర్థమైంది. అందుకని అనువాదం ప్రాసెస్ గురించి కొన్ని మాటలు రాసుకుంటున్నా:
భాష నాకు తేలిగ్గానే ఉండింది కానీ అసలు ఆ సవరాలు తయారు చేసే పద్ధతి అదీ అక్కడ కథలో రాసినది నాకు అనువాదానికి చాలదు అనిపించింది. దీనికోసం ఒకట్రెండుసార్లు బాలాజీ గారిని వివరించమని ఈమెయిల్స్ పెడితే చెప్పారు. మొదట ఇది నా అవగాహన కోసం మాత్రమే అనుకున్నా కానీ తరువాత నాకే ఇట్లా ఉంటే ఆంగ్లంలో అసలు మరీ అయోమయంగా ఉంటుందేమో అని ఆ ప్రాసెస్ వివరిస్తూ రెండు వాక్యాలు చేర్చాను ఆ సందర్భంలో…రచయిత అనుమతితో.
కొన్ని పదాలు.. ఉదా..జడగంటలు వంటివి…ఆంగ్లంలోకి ఎలా అనువదించాలి? అన్న ప్రశ్న వచ్చింది. దానికో సమానార్థకం వాడ్డం, పదం ఉంచేసి బ్రాకెట్లలోనో ఫుట్నోట్లలోనో వివరణ ఇవ్వడం, లేకపోతే అసలు ఇంగ్లీషు వాళ్ళకి ఇదంతా ఎందుకనుకుని ఆ పదం ఎత్తేసి ఏదో డెకరేటివ్ ఐటెం అనో నా బొందనో ఒక మాట రాసేయడమో – మూడు మార్గాలున్నాయి. మూడోది నాకు సెట్టవదు. సరే, ఇలాంటివి ఏం చేయొచ్చు? అనుకుంటూ ఉండగా బహుశా ఇలాంటివి కొంత వివరణ వాక్యంలోనే జతచేసి చూడొచ్చేమో అని సూచించారు కొత్తపాళీ గారు ఒక చాట్ లో. ఇదేదో బాగుందనుకుని “jadagantalu, the bells that hang from long, plaited hair” అని పెట్టా. ఇది ఒక పెద్ద పత్రిక ఎడిటర్లకి కూడా నచ్చింది (వీళ్ళు అనువాదాన్ని రిజెక్టు చేశారు కానీ మంచి సూచనలు ఇచ్చారు – కింద రాస్తా). సరే, ఇది బాగానే ఉన్నట్లుందని ఇలా ఫిక్స్ అయ్యా ఈ కథకి. అయితే ఇలా చేసినపుడు ఆ తెలుగుపదాన్ని నేను ఇటాలిక్స్ లో పెట్టా. అవుట్లుక్ వాళ్ళు ఇటాలిక్స్ తీసేసారు. నో కామెంట్స్.
ఈ కథని మొదట ఒక ఆంగ్ల పత్రికకి పంపాను. అందులో సింహ భాగం యురోపియన్ భాషల కథలే అయినా కొన్ని మనవాళ్ళవి ఉన్నాయి అన్న ధైర్యంతో పంపాను. వీళ్ళు స్పందిస్తూ కొన్ని ప్రోత్సాహకరమైన వాక్యాలు రాశారు. “In general, the translation is skillfully done and the story reads well. We particularly admired the skill with which you approached sentence beginnings, especially because there seems not to be much connective tissue across sentences. The dangers inherent in monotonous sentence subjects are neatly dodged in this translation.” అయితే, మన కథలని అనువాదం చేస్తున్నపుడు ఉండే ముఖ్యమైన ఇబ్బందుల్లో టెన్స్ ఒకటని ఇదివరలో మాలతి గారు రాసిన వ్యాసంలో వివరించారు.
ఇదే సమస్య నేను ఈ కథ అనువాదం చేస్తున్నపుడు గమనించాను. గతంలో అనువాదం చేసిన కథల్లో ఇన్నిసార్లు గతానికి, వర్తమానానికి, దూరపు గతానికి, మొన్నటి గతానికి ఇట్లా మారడం లేదు. చదవడానికి ఇబ్బంది పడలేదు కానీ అనువాదం చేయడంలో ఇది నాకు అంత పట్టుబడలేదు. ఆ విషయం ఆ ఎడిటర్లు కూడా ఎత్తారు. “we would ask you to give more thought to the way tense is handled. We feel there are ways to deftly handle tense in translation from languages where tense is mutable, but we’re not sure that is being achieved here” వర్తమానం, వర్తమానం కానిది అన్న తరహాలో ఆలోచించి టెన్స్ గురించి మరోసారి చూడమని సలహా ఇచ్చారు. అది చదివి కొంచెం అది అటూ ఇటూ మార్చాను నేను వాక్యాల్లో రెండో వర్షన్ సిద్ధం చేసే ముందు.
ప్రధానంగా ఇవే ఈ అనువాదంలో ప్రత్యేకంగా చూసినవి. ఇలా మొదటి వర్షన్ కి వచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి రెండో వర్షన్ సిద్ధం చేసి అవుట్లుక్ కి పంపాను (నేను మొత్తం ఫీడ్బాక్ పెట్టడం లేదు. నిజంగా ఎవరికన్నా తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే చెప్పండి – ఈమెయిల్ చేస్తాను). వీళ్ళు భలే తొందరగా స్పందించారు. వెంటనే వేసేసారు కానీ ఎడిటోరియల్ కామెంట్స్ అంటూ ఏం పంపలేదు. బహుశా సుమారుగా ఉంది అనుకుంటే వాళ్ళు మార్పులు చెప్పరేమో మరి. నాకు చెప్పకుండా ఏం మార్పులు చేసినట్లు లేరు, నేను గమనించినంతలో.
నా కథకి మరొకరు బొమ్మ వేయడం నేను చూశాను (2011 లో, “రచన” మాసపత్రికలో). నా పేరిట వచ్చిన పుస్తకాలకి (రెండు అనువాదకురాలిగా, ఒకటి రచయితగా టెక్నికల్ పుస్తకం) కవర్ డిజైన్లు గొప్పగా చేయడం చూశాను. అయితే, గత ఏడాదిగా చేస్తున్న ఈ అనువాదాలలో కథకి బొమ్మ వేయడం ఇదే మొదటిసారి. అనువాదానికి వేసిన బొమ్మ, ఒరిజినల్ లోని బొమ్మ పక్క పక్కనే కింద ఉన్నాయి.
ఒరిజినల్ బొమ్మ నాకు సూటిగా, సింపుల్ గా నచ్చింది. చాలా నచ్చింది కథ చదువుతున్నపుడు. అనువాదానికి వేసిన బొమ్మ బాగా సృజనాత్మకంగా, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంది. ఆర్టిస్టు పేరు ఆర్తి వర్మ. మూలకథలో చిత్రకారులు ఎవరో తెలియదు. అట్లా ఈ కథ నేను అనువాదం చేసిన వాటిల్లో మొదటి ఇలస్ట్రేటెడ్ కథగా నాకు ప్రత్యేకం అనమాట.
నేనొక పొరబాటు చేశాను. రచయిత ఫేస్బుక్ పేజిలో జిల్లేళ్ళ అన్న పదం జె అక్షరంతో మొదలవుతోంది. కానీ కినిగె వెబ్సైటులో, ఆయన ఈమెయిల్ లో జి అక్షరంతో మొదలవుతోంది. అది నేను ఇప్పుడు ఈ పోస్టు రాస్తున్నపుడు గమనించాను. అవుట్లుక్ పత్రిక లో జి తో మొదలయ్యే స్పెల్లింగే వచ్చింది. ఆయన చూశాకే కదా నేను పంపింది అన్న విషయం గుర్తువచ్చింది కానీ బహుశా ఆయన్ని ఒకసారి అడిగి ఉండాల్సింది ఏమో అనిపించింది.
ఇక నాకు ప్రతి అనువాదం ఏదన్నా పత్రిక్కి పంపుతున్నపుడు ఒక విధమైన జంకు ఉంటుంది – నాకు నచ్చిన కథ తెలుగేతరులకి నచ్చుతుందా? లేకపోతే మామూలుగా అనిపించి చప్పరించేస్తారా? అని. ఈసారి కూడా అది ఉండింది. అది కూడా సినిమాలు, ఓటీటీ, అవార్డులొచ్చే కథలూ పుస్తకాలూ ఇలాంటివన్నీ చూశాక నాకు హింసా, రొమాన్సు, ఆవేదన, ఆవేశం, సంక్లిష్టమైన మానసిక సంఘర్షణ అన్నీ సమపాళ్ళలో నూరితే తప్ప దాన్ని గొప్ప వస్తువుగా అంగీకరించరేమో అన్న అనుమానం పీకుతోంది. కామెడీ అయితే అసలు దాని దిక్కుక్కూడా చూడరేమో అని ఒక అనుమానం కూడా ఉంది కానీ అలాంటిదెపుడైనా అనువాదం చేస్తే అపుడు తెలుస్తుంది. ఇన్ని అనుమానాల మధ్య వాళ్ళు వేసుకోవడంతో మనకథల్లో వేరే భాషల వాళ్ళకి నచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయి అన్న నమ్మకం పెరిగింది.
అనువాదానికి అంగీకరించి, నా ప్రశ్నలకి ఓపిగ్గా సమాధానం చెప్పి, చివర్లో అనువాదం మొదటి ప్రతి చూసి ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు బాలాజీ గారికి ధన్యవాదాలు. ఇక నేను మధ్యమధ్యలో మెసెంజర్ లో ఈ టాపిక్స్ మీద కెలుకుతూ ఉంటా అనిల్ అట్లూరి గారిని, కొత్తపాళీ గారిని. విసుక్కోకుండా నన్ను ఎంగేజ్ చేస్తారు. ఆ చర్చలు నాకు ఉపయోగకరంగా అనిపిస్తాయి అనువాదాలు చేసేటప్పుడు. వాళ్ళకి కూడా మరోసారి ధన్యవాదాలు.
ఈ బ్లాగులో రాసినవి మరోచోట వాడుకోవాలనుకుంటే, చెప్పి వాడుకోవడం, అక్కడ ఇక్కడి లంకె ఇవ్వడం చేస్తే : మర్యాదస్తుల లక్షణం అనిపించుకుంటుంది. :)
If you want to use something from here, please relieve yourself of the strain of copying the whole content and forgetting to credit..by just giving my blog link.
సిక్కెంటిక – అనువాదం, అనుభవం
జిల్లేళ్ళ బాలాజీ గారి తెలుగు కథ “సిక్కెంటిక” కి నా ఆంగ్లానువాదం అవుట్లుక్ పత్రిక వీకెండర్ పేజీలలో ఈ ఆదివారం నాడు వచ్చింది. ఆ కథ, అనువాదం గురించి ఏవో నా నాలుగు ముక్కలు రాస్కుందామని ఈ పోస్టు. ఇదే పేరు గల కథాసంకలనంలో ఉంది ఇది. పుస్తకం ఈబుక్ కినిగె.కాం లో కొనుగోలుకి లభ్యం.
నేను ఈ కథని ఏప్రిల్ లో చదివినట్లు ఉన్నా. అంతకుముందు ఈ రచయిత పేరు విన్నాను కానీ అనువాదకుడిగా. ఆయన కథలు కూడా రాశారని నాకు తెలియదు. ఏదో వందలోపు ఉన్న పుస్తకాలు ఉంటే కొందామని బ్రౌజు చేస్తూ ఉంటే కనబడి కొన్నానంతే. మొదటి నాలుగైదు కథలు చదవగానే ఆకట్టుకున్నాయి. తర్వాతివి మళ్ళీ అంత నచ్చలేదు. ఈ నచ్చినవాటిల్లో ఈ కథ ఎక్కువ నచ్చింది. అందుకు ప్రధాన కారణం ముగించిన పద్ధతి. సాధారణంగా కొంచెం పాజిటివ్ ముగింపు చూపే వాటిని అంత సీరియస్ గా తీసుకోరేమో మన వాళ్ళు అని నా అనుమానం. కానీ నాకు వ్యక్తిగతంగా అలాంటివి ఇష్టం. సరే, ఈ కథ నచ్చింది కానీ నేను మధ్యలో ఇండియా ప్రయాణం వగైరా పనుల్లో బిజీగా ఉండి పట్టించుకోలేదు. మధ్యలో కథ గురించి చాలాసార్లు అనుకున్నా. దానితో మళ్ళీ జూన్లో ఈ కథ ఇంకోసారి చదివా – అనువాదం చేయడానికి ఎలా ఉంటుంది? అన్న ఆలోచనతో. అపుడు ఇంక ప్రయత్నిద్దాం అనుకుని బాలాజీ గారి అనుమతి తీసుకుని మొదలుపెట్టా.
ఆంగ్ల ఎడిటర్ల సూచనలు ఎలా ఉంటాయి? మనం ఏం చూసుకోవాలి? ఇలాంటివి ఆంగ్లంలో రాయాలనుకుంటున్న తెలుగు వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈమధ్య మాటల సందర్భంలో అర్థమైంది. అందుకని అనువాదం ప్రాసెస్ గురించి కొన్ని మాటలు రాసుకుంటున్నా:
ఇదే సమస్య నేను ఈ కథ అనువాదం చేస్తున్నపుడు గమనించాను. గతంలో అనువాదం చేసిన కథల్లో ఇన్నిసార్లు గతానికి, వర్తమానానికి, దూరపు గతానికి, మొన్నటి గతానికి ఇట్లా మారడం లేదు. చదవడానికి ఇబ్బంది పడలేదు కానీ అనువాదం చేయడంలో ఇది నాకు అంత పట్టుబడలేదు. ఆ విషయం ఆ ఎడిటర్లు కూడా ఎత్తారు. “we would ask you to give more thought to the way tense is handled. We feel there are ways to deftly handle tense in translation from languages where tense is mutable, but we’re not sure that is being achieved here” వర్తమానం, వర్తమానం కానిది అన్న తరహాలో ఆలోచించి టెన్స్ గురించి మరోసారి చూడమని సలహా ఇచ్చారు. అది చదివి కొంచెం అది అటూ ఇటూ మార్చాను నేను వాక్యాల్లో రెండో వర్షన్ సిద్ధం చేసే ముందు.
ప్రధానంగా ఇవే ఈ అనువాదంలో ప్రత్యేకంగా చూసినవి. ఇలా మొదటి వర్షన్ కి వచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి రెండో వర్షన్ సిద్ధం చేసి అవుట్లుక్ కి పంపాను (నేను మొత్తం ఫీడ్బాక్ పెట్టడం లేదు. నిజంగా ఎవరికన్నా తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే చెప్పండి – ఈమెయిల్ చేస్తాను). వీళ్ళు భలే తొందరగా స్పందించారు. వెంటనే వేసేసారు కానీ ఎడిటోరియల్ కామెంట్స్ అంటూ ఏం పంపలేదు. బహుశా సుమారుగా ఉంది అనుకుంటే వాళ్ళు మార్పులు చెప్పరేమో మరి. నాకు చెప్పకుండా ఏం మార్పులు చేసినట్లు లేరు, నేను గమనించినంతలో.
నా కథకి మరొకరు బొమ్మ వేయడం నేను చూశాను (2011 లో, “రచన” మాసపత్రికలో). నా పేరిట వచ్చిన పుస్తకాలకి (రెండు అనువాదకురాలిగా, ఒకటి రచయితగా టెక్నికల్ పుస్తకం) కవర్ డిజైన్లు గొప్పగా చేయడం చూశాను. అయితే, గత ఏడాదిగా చేస్తున్న ఈ అనువాదాలలో కథకి బొమ్మ వేయడం ఇదే మొదటిసారి. అనువాదానికి వేసిన బొమ్మ, ఒరిజినల్ లోని బొమ్మ పక్క పక్కనే కింద ఉన్నాయి.
ఒరిజినల్ బొమ్మ నాకు సూటిగా, సింపుల్ గా నచ్చింది. చాలా నచ్చింది కథ చదువుతున్నపుడు. అనువాదానికి వేసిన బొమ్మ బాగా సృజనాత్మకంగా, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉంది. ఆర్టిస్టు పేరు ఆర్తి వర్మ. మూలకథలో చిత్రకారులు ఎవరో తెలియదు. అట్లా ఈ కథ నేను అనువాదం చేసిన వాటిల్లో మొదటి ఇలస్ట్రేటెడ్ కథగా నాకు ప్రత్యేకం అనమాట.
నేనొక పొరబాటు చేశాను. రచయిత ఫేస్బుక్ పేజిలో జిల్లేళ్ళ అన్న పదం జె అక్షరంతో మొదలవుతోంది. కానీ కినిగె వెబ్సైటులో, ఆయన ఈమెయిల్ లో జి అక్షరంతో మొదలవుతోంది. అది నేను ఇప్పుడు ఈ పోస్టు రాస్తున్నపుడు గమనించాను. అవుట్లుక్ పత్రిక లో జి తో మొదలయ్యే స్పెల్లింగే వచ్చింది. ఆయన చూశాకే కదా నేను పంపింది అన్న విషయం గుర్తువచ్చింది కానీ బహుశా ఆయన్ని ఒకసారి అడిగి ఉండాల్సింది ఏమో అనిపించింది.
ఇక నాకు ప్రతి అనువాదం ఏదన్నా పత్రిక్కి పంపుతున్నపుడు ఒక విధమైన జంకు ఉంటుంది – నాకు నచ్చిన కథ తెలుగేతరులకి నచ్చుతుందా? లేకపోతే మామూలుగా అనిపించి చప్పరించేస్తారా? అని. ఈసారి కూడా అది ఉండింది. అది కూడా సినిమాలు, ఓటీటీ, అవార్డులొచ్చే కథలూ పుస్తకాలూ ఇలాంటివన్నీ చూశాక నాకు హింసా, రొమాన్సు, ఆవేదన, ఆవేశం, సంక్లిష్టమైన మానసిక సంఘర్షణ అన్నీ సమపాళ్ళలో నూరితే తప్ప దాన్ని గొప్ప వస్తువుగా అంగీకరించరేమో అన్న అనుమానం పీకుతోంది. కామెడీ అయితే అసలు దాని దిక్కుక్కూడా చూడరేమో అని ఒక అనుమానం కూడా ఉంది కానీ అలాంటిదెపుడైనా అనువాదం చేస్తే అపుడు తెలుస్తుంది. ఇన్ని అనుమానాల మధ్య వాళ్ళు వేసుకోవడంతో మనకథల్లో వేరే భాషల వాళ్ళకి నచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయి అన్న నమ్మకం పెరిగింది.
అనువాదానికి అంగీకరించి, నా ప్రశ్నలకి ఓపిగ్గా సమాధానం చెప్పి, చివర్లో అనువాదం మొదటి ప్రతి చూసి ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు బాలాజీ గారికి ధన్యవాదాలు. ఇక నేను మధ్యమధ్యలో మెసెంజర్ లో ఈ టాపిక్స్ మీద కెలుకుతూ ఉంటా అనిల్ అట్లూరి గారిని, కొత్తపాళీ గారిని. విసుక్కోకుండా నన్ను ఎంగేజ్ చేస్తారు. ఆ చర్చలు నాకు ఉపయోగకరంగా అనిపిస్తాయి అనువాదాలు చేసేటప్పుడు. వాళ్ళకి కూడా మరోసారి ధన్యవాదాలు.
Rate this:
Share this:
Like this:
Related
Tags: My Translation, Running Commentary
The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2022/08/15/sikkentika-wigmaker/trackback/
RSS feed for comments on this post.