శ్రీనివాస కళ్యాణం అను ఇటీవలి చిత్రరాజం

శ్రీనివాస కళ్యాణం అని ఒక సినిమా. పేరు చూసి, ట్రైలర్ చూసి అందులో హీరో (నితిన్) ని చూడగానే గుండెళ్ళో రైళ్ళు పరిగెత్తాయి. సినిమా అంతా ఏయొక్క పుణ్యకార్యం అతగాడితో సహా ఇప్పుడు చాలా మందికి పలకనలవి కాని పదమో, ఆయొక్క పుణ్యకార్యం గురించి. కానీ, ఓ సగటు తెలుగు సినీ అభిమానిగా తప్పదు కదా… చూశాను.

మొదటి పది నిముషాలు ఓ పెళ్ళి దృశ్యం. పెళ్ళంటే‌ పెద్ద పండగ, పెళ్ళైతే ఇంటికి ఓ కొత్త తరం వస్తుంది, పెళ్ళి ఇది, పెళ్ళి అది. అని ఊదరగొట్టేశారు (ఇక్కడ బ్రహ్మోత్సవం గుర్తు వచ్చింది). కొంచముంటే సడెన్ గా స్క్రీను మీద ప్రశ్నలు ప్రత్యక్షమై, ఇవి పాసైతేనే మిగితా సినిమా చూడ్డానికి అర్హులంటారేమో అని ఒక పక్క హడలి చచ్చి, ఓ పక్క అపుడు ఎస్కేప్ అయిపోవచ్చులే అనుకుంటూ‌ ఆశగా బతికాను. అలాంటిదేం జరగలేదు. సీను ఇంకో ఊరికి మారింది. ఈ పెళ్ళి చిన్నప్పుడు చూసిన నితిన్ బాబు పెద్దయ్యాక వేరే ఊర్లో ఫ్యామిలీ ఈజ్ ఎవ్రీథింగ్ టైపులో (ఇక్కడ నాకు రవితేజ “టచ్ చేసి చూడు” గుర్తువచ్చింది) అందరికీ ఉపదేశాలు ఇస్తూ, మధ్య మధ్య ఉద్యోగం చేస్తూ, ఓ బాగు అడ్డంగా వేసుకుని సైకిల్ తొక్కుకుంటూ ఒక పాట కూడా పాడాడు – అవతలి వాళ్ళ కోణం అర్థం చేసుకోవాలని (ఇక్కడ శ్రీమంతుడు గుర్తు వచ్చింది). మామూలుగానే హీరో హీరోయిన్ కలిసారు, ప్రేమించుకున్నారు. కట్ చేస్తే మళ్ళీ పల్లెటూరు – ఓ మరదలు, ఒక పెద్ద కుటుంబం, వాళ్ళ తాలూక అభిమానాలు, ఆప్యాయతలు (ఇక్కడా సీ.వా.సి.చెట్టు, శతమానం భవతి వంటివి గుర్తువచ్చాయ్) వగైరా. అందరూ మంచోళ్ళే. ఇవతలకి కట్ చేస్తే, ఒకాయనుంటాడు – హీరోయిన్ నాన్న. పెద్ద బిజీ బిజినెస్ మాన్. ఇంక బాగా సక్సెస్ఫుల్ ఫెలో, రిచ్ ఫెలో అంటే వాడు చెడ్డోడే అయి ఉండాలి. తప్పదు. అదే మన తెలుగు సినిమా ఆత్మ అంటే. తక్కిన సినిమా అంతా
అ) హీరో ఆయనకి పలకడం చేతకాకపోయినా చెప్పేసే గొప్ప గొప్ప కొటేషన్ లతో
ఆ) హీరో కుటుంబం షుగర్ పేషంట్లు కూడా సిగ్గుపడేంత తియ్యటి అభిమానాలతో
ఈ చెడ్డాయనని మంచాయనగా మార్చేయడం. అది షరా మామూలు. గత ౨౦౨౦౨౦౦౦౧ సినిమాల్లో చూసినదే.

ఇకపోతే, సంప్రదాయాలు ఆద్యంత రహితాలు, వాటిల్లో మార్పు రాదు. నువ్వు మారొచ్చు, నీ లైఫ్ స్టైల్ మారొచ్చు, నువ్వు రకరకాల సుఖాలకి అలవాటు పడొచ్చు, రకరకాల కష్టాలు పడొచ్చు. కానీ, పెళ్ళిళ్ళలో చేసే పనులు మాత్రం అజరామరంగా అలాగే, మార్పుల్లేకుండా జరుగుతూ ఉండాలి. ఎన్ని మారినా అవి మారకూడదు. కానీ మార్పు మాత్రం మానవ సహజం. సంప్రదాయాలు కాలానుగుణంగా‌ మార్చకూడదు. అవతలి వాళ్ళకి ఎట్లున్నా డామినెంట్ కుటుంబం (అంటే పెళ్ళిళ్ళలో మగపెళ్ళివారు) వాళ్ళకి ఎలా అనిపిస్తే అలా చేసి తీరాలి. అదే సంప్రదాయం. సంప్రదాయమంటే అజరామరం. మీకు అర్థమౌతోందా నేను చెప్పేది?‌ (బిగ్బాస్ చూసినవాళ్ళు ఇక్కడ గీతామాధురి వాయిస్ మార్ఫ్ చేసుకొండి). రిజిస్టర్ పెళ్ళిళ్ళు చేసుకోడాన్ని చూపలేదు కానీ, డెస్టినేషన్ పెళ్ళిళ్ళని బాగా వెటకరించారు. షరామామూలుగా అందరూ మహా రిచ్చి. అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అందరూ‌ అభిమానాలు ఆప్యాయతలతో పడి చచ్చిపోతూంటారు. అందరికీ ఊర్నిండా స్నేహితులు, శేయోభిలాషులుంటారు. అయితే, బ్రహ్మోత్సవంలో రావు రమేశ్ లాగ ఇందులో కూడా ఒకళ్ళు ఉండాల్సింది. మిస్సయ్యారు. మొత్తానికి తిన్నగా తెలుగు మాట్లాడ్డం‌, తెలుగు భోజన వర్ణన – ఈరెంటిని మాత్రం వదిలేస్తే తెలుగు లోగిళ్ళు, తెలుగు సంప్రదాయాలు, తెలుగు తనం, తెలుగు అభిమానాలు, తెలుగు ఆప్యాయతలు, తెలుగు తిక్కా, తెలుగు పైత్యం – అన్నీ సమపాళ్ళలో కలిపి ఎదుట నిలబెట్టిన సినిమా.

సినిమా నుండి ఇంటికి తీస్కెళ్ళాల్సిన ముఖ్యమైన పాయింటేమిటంటే – ఇక్కడ ఆధునిక ఇరవై ఒకటి ఆ పైన శతాబ్దాల తెలుగు భాషాభివృద్ధికి తొలి అడుగులు పడాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పుడు నాలుక మందం పోను పోనూ ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయి కనుక ఆయొక్క “అందరూ తప్పక చేసుకోవాల్సిన పుణ్యకార్యానికి” ళ లేని పదం ఒక్కటి కనిపెట్టాలి. వీళ్ళు దాన్ని గురించి చెప్పే కబుర్లని బట్టి నాకు తోచిన ఒక పదం – ఇహిప్పోకరసియా. మీకు తోచినవి మీరు కూడా చెప్పండి. పదానికి కావాల్సిన అర్హతలు:
– నాలుక ఎంత మందంగా ఉన్నా పలుకగలిగే పదమై ఉండాలి.
– ణ/ళ వంటి కాంప్లికేటెడ్ అక్షరాలు లేకుండా, చూడ్డానికి అందంగా కనబడే అక్షరాల కూర్పు కావాలి.
– వినగానే మనలో భక్తిభావం కలగాలి. వీథిలో ఏ‌ దంపతులని చూసిన చేతులెత్తి నమస్కరించాలి అనిపించాలి (హిందూ, ఆడా-మగా సంబంధాలు, అవీ కులాంతరం మతాంతరం కానివి, వీలైనంత ధనిక దంపతులైతేనే సుమా!).
– వినగానే కలిగిన సైకిక్ వైబ్రేషన్ వల్ల అర్జెంటుగా ఒక్క ఇహిప్పోకరసియా (దాని సమానార్థకం ఏదో) అన్నా చేసుకోవాలి అనిపించాలి.
– ఆల్రెడీ అయిన వాళ్ళైతే వాళ్ళావిడకి పట్టుచీర నగలు, వాళ్ళాయనకైతే పంచే-ఉత్తరీయం వంటి సంప్రదాయక దుస్తులు ఇవ్వాలనిపించాలి. అత్తమామలకి, తల్లిదండ్రులకి వారి వారి వయసుకి, గౌరవానికి తగిన కానుకలు, పసుపు కుంకుమలు పెట్టి అందించి ఆశీర్వాదాలు తీసుకోవాలి అనిపించాలి.
– ఇహిప్పోకరసియా గురించి అందరికీ అరగంటకి తగ్గకుండా చెప్పేంత సంస్కృత పద్యాలు-అర్థాలు చెప్పాలి అనిపించాలి (దీనికి ముందు మనం నేర్చుకోవాలి. అమీర్పేటలో సైటు రిసర్వ్ చేసుకుని కోచింగ్ సెంటర్ పెట్టాలి ఎవరన్నా మొదట).
(ఇంకా కొన్ని ఉన్నాయి. కానీ అంత స్పష్టంగా రాయడానికి రావట్లేదు. అందువల్ల ఇవి చాలు ఇప్పటికి.)

జలుబా? తలనొప్పా? ముక్కు దిబ్బడా? – చూడండి తెలుగు సినిమా! అన్న సలహా ఒక విధమైన స్వపీడనానందంగా (అదేనండి, masochism) అభివర్ణించవచ్చు. అయితే దానివల్ల ఉన్న మహ గొప్ప ఉపయోగం ఏమిటంటే – మన అసలు నొప్పి ఉన్నట్లుండి చిన్నదిగా కనిపించడం మొదలవుతుంది. నిన్న రాత్రి – ఇవాళ పొద్దున కలిపి నాకు జరిగింది అదే. ఎప్పుడో‌గాని ఇలా సత్వర స్పందనలతో వరుస టపాలు రాసేంత తీరిక దొరకదు. ముందు రెండ్రోజులు సెలవిచ్చిన ఆఫీసు వాళ్ళకి, లాంగ్ వీకెండుకూ ఈ టపా అంకితం. అందరికీ కెనెడియన్ థాంక్స్ గివింగ్ శుభాకాంక్షలు!

Published in: on October 6, 2018 at 5:04 pm  Comments (12)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2018/10/06/srinivasa-kalyanam/trackback/

RSS feed for comments on this post.

12 CommentsLeave a comment

 1. మహేశ్ బాబు: తప్పు చేస్తున్నారు నాయుడు గారు
  నాయుడు: తెలుసయ్యా ! మాన్లేపోతున్నా. పూర్వం పెట్టి కల్చేవా”న్ని”.
  మహేశ్: నేను మాట్లాడేది సిగరెట్ల గురించి కాదు
  నాయుడు: కొంపదీసి తెలుగు సినిమాల గురించా ఏంటి?
  ఎమార్వో: according to current tastes these films will be blockbusters, you know ?
  మహేశ్: అంటే ఈ విషయం లో మీరు ఏమీ చెయ్యలేరా?

 2. ఒకప్పుడు వరసపెట్టి చెత్తసినిమాలు వస్తుంటే చూడ్డానికి సరైన సినిమాయే రావట్లేదని కొన్నాళ్ళు విసుక్కొని విసుక్కొని, నేనే మా స్నేహితుడొకాయనా కలసి ఒక మంచి నిర్ణయానికి వచ్చేసాం! ఏదో ఒక సినిమా చూడటమే. బాగుంటే ఇబ్బంది లేదు. బాగుండ లేదనుకోండి – ఆ సినిమాలో పాత్రధారులూ, గాత్రధారులూ, సూత్రధారులూ వగైరా వాళ్ళు సినిమా సరిగ్గాతీ(చే)యలేక పడుతున్న అవస్థను ఇంచక్కా నవ్వుకుంటూ ఎంజాయ్ చేయటమే. ఇలా జ్ఞానోదయం అయ్యాక ఇంకే సినీమా కూడా మమ్మల్ని ఆట్టే ఇబ్బంది పెట్టలేదు. ఆ జ్ఞానంసహాయంతో అప్పట్లో బోలెడు సినిమాలు (ముఖ్యంగా కృష్ణ సినిమాలు) చూసి బాగా అనందించామనీ గుర్తు.

  • హహ, బాగా చెప్పారు. నేనూ చేస్తున్నది అదే‌ అనుకుంటా. చూస్తాను, నచ్చితే ఆహా అనుకుంటా, లేదంటే ఇదిగో ఇలా … పోస్టులు అవీ రాస్తా అనమాట.

 3. ఈమధ్య కాలంలో ణ,ళ,శ అక్షరాలను ఎవరూ సరిగ్గా పలకటమూ లేదు సరిగ్గా వ్రాయటమూ లేదండీ. మీరు గమనించారో లేదు మాలికలో కనిపించే వ్యాఖ్యలనిండా పెల్లి, వాల్లు వంటి మాటలమూటలే. వచ్చే తరాలవాళ్ళకి నోటికీ చేతికీ వచ్చే తెలుగక్షరాలు సగానికి తగ్గిపోతాయి. ఆపై తరానికి తెలుగే కనుమరుగు అవుతుందని అనుకుంటూన్నాను.

  • Oh, నేను మాలిక చూడ్డం లేదండి ఈమధ్య. అవును, నాలుకే మందం అయిందనుకున్నాను. వేళ్ళు కూడా మందమైపోతున్నాయి అనమాట.

 4. సినిమా పెద్ద సూపర్ హిట్ ఏమి కాదు గాని… పర్లేదు అనిపించింది.

 5. సౌమ్య గారూ, మీరు మాలిక చూడ్డం లేదంటున్నారు. చాలా అదృష్టవంతులు. మాలిక చూడటం ఒక వ్యసనం ఐతె, మాలికలో వ్యాఖ్యలపేజీ చూడటం మాత్రం దుర్వసనం అనే చెప్పాలి ప్రస్తుతపరిస్థితుల్లో. మాలికవారు చవకబారు భాషను వాడే బ్లాగర్లను (అంటే సదరు బ్లాగర్ల వ్యాఖ్యలనూ వారి బ్లాగులనూ కూడా) నిర్మొగమాటంగా సంపూర్ణంగా నిషేదించి తీరాల్సిందే. తప్పదు మరి.

 6. Nice Blog, It’s Useful for Everyone. More Information Visit Our Website ..

  TeluguVilas

  Thanks..,

 7. No articles in 2019??

  • haha, no Babji, I will try writing soon!

 8. Looking forward for it 🙂

 9. Bohat Busy hoogayeh madam.
  iss baar bohat lambi chutti marrey.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: