సంస్కృత భాషావేత్తల ప్రకారం పదాల వర్గీకరణ

“Indian Theories of Meaning” పుస్తకం చదవడం ఇంకా నెమ్మదిగా కొనసాగుతోంది. పదాలను దాటి, వాక్యం ఎలా ఉద్భవిస్తుంది అన్న Sphota theory గురించిన చర్చల దాకా వచ్చాను. ఆ చర్చ నాకు ఆట్టే ఆసక్తికరంగా తోచలేదు – theory మాత్రమే ఎక్కువగా ఉన్నట్లు తోచి ఆట్టే ఆలోచించలేదు. మధ్య మధ్యలో కొన్ని అంశాలు (శబ్దానికి, అర్థానికి సంబంధం గురించి చర్చ) వంటివి కొంచెం pragmatics గురించి ఆలోచనలు కలిగించాయి కానీ, ఎక్కువ భాగం నేను relate చేసుకోలేకపోయాను. కానీ దానికి ముందు పదాల వర్గీకరణ గురించి రాసిన అధ్యాయం గురించి తరువాత చాలాసార్లు అనుకున్నాను. దాని గురించిన టపా ఇది.

ప్రాచీనుల ప్రకారం పదాలలో నాలుగు వర్గాలంట: యౌగిక, రూఢ, యోగారూఢ, యౌగికారూఢ.

౧. యౌగిక: వ్యుత్పత్తి ని బట్టి ఉన్న అర్థం చెప్పగలిగే పదాలు. “It’s meaning is determined by those of its component parts, and does not signify anything more or less than the meanings of its parts”. ఇలాంటి పదాల అర్తాలు వ్యుత్పత్తి, వ్యాకరణం తెలిస్తే గ్రహించవచ్చన్నమాట. రచయిత “derivative” అని అనువదించారు ఈపదాలని ఇంగ్లీషులోకి. నాకైతే compositional సబబేమో అనిపించింది. (principle of compositionality గుర్తొచ్చి.)

ఇందులో మూడు రకాలంట మళ్ళీ. కృదంత, తద్దిత, సమస్త పద. క్రియా పదాలకి ప్రత్యయాలు (suffixes) జోడించగా ఏర్పడేవి కృదంత యౌగికాలు (వచ్చాడు, వస్తారు వంటివి అనుకుంటాను) అనబడు primary derivatives, నామవాచకాలకి ప్రత్యయాలు జోడిస్తే ఏర్పడేవి తద్దికాలు అనబడు secondary derivatives, రెండు లేదా ఎక్కువ పదాల కూర్పుతో ఏర్పడే సమస్త పదాలు (compound words).

౨. రూఢ: conventional అన్నారు. అర్థానికి, వ్యుత్పత్తికీ సంబంధం లేని పదాలు (కుక్క, పిల్లి ఇట్లాంటివి). కొన్ని సందర్భాల్లో వీటికి క్రియా ధాతువులో (verbal roots), ప్రత్యయాలో (suffixes) ఉన్నట్లు అనిపించినా వీటిని వాటి నుంచి వచ్చిన derivatives అని చెప్పలేము.

౩. యోగరూఢ: Derivative meaning, conventional meaning రెండూ ఒకటైన పదాలు. ఉదాహరణలుగా: పంకజం, కృష్ణసర్పం అన్న పదాలు చెప్పారు. పంకజం – మనం కమలం (lotus) ను అంటాము. వ్యుత్పత్యర్థం బురదలో పుట్టినది అన్నది కమలానికీ వర్తిస్తుంది. కృష్ణసర్పం/నల్లత్రాచు కూడా అలాగే. భారతీయ భాషావేత్తల ప్రకారం “conventional usage restricts the application of the derivative sense” పంకజం అని బురదలో పుట్టిన ప్రతిదాన్ని అనము కదా, అనగలిగినా కూడా. ఇది చదివాక యౌగిక పదాలకి “derivative” అని వాడ్డమే సబబు కాబోలు అనిపించింది.

౪. యౌగికారూఢ/రూఢయౌగిక: ఒక పదానికి వ్యుత్పత్యర్థం, రూఢికార్థం వేరుగా ఉన్నప్పుడు, రెండూ సరైన అర్థాలే అయినప్పుడు అది యౌగికారూఢం. ఉదాహరణగా ఆశ్వగంధ అన్న పదం ఇచ్చారు – derivation బట్టి చూస్తే గుర్రం తాలూకా వాసన, convention బట్టి చూస్తే చెట్టు పేరు.

కొంతమంది ఐదో రకం పదాలను కూడా చెబుతారట – నిరూఢలక్షణాలని – “words commonly used in their metaphorical sense”.

చివరగా, Brhaddevata అన్న గ్రంథం ప్రకారం ఒక పదాన్ని ఐదు రకాలుగా వర్ణించవచ్చట:
– Derived from the root
– Derived of the derivative of the root
– Derived from compound meaning
– derived from a sentence
– confused derivation.

అదీ పదాల వర్గీకరణ కథ.

(ఒక్క గమనిక: ఆ పుస్తకం చదువుతున్నాను గాని, నాకు ఆసక్తికరంగా తోచినవి, ఎంతోకొంత అర్థమైనవి, నాకు ప్రస్తుత Natural Language Processing పాఠ్యాంశాలతో, పరిశోధనలతో సామ్యం ఉన్నట్లు తోచినవీ మాత్రమే బ్లాగులో పంచుకుంటున్నాను. ఆయా పుస్తకాల సారాన్ని జాతి జనులకి బోధించడం నా కర్తవ్యం కాదు- గమనించగలరు. అసలింతకీ ఈ పుస్తకం చేసినదే అది – ప్రాచీనుల రచనల సారాన్ని క్లుప్తంగా చెప్పడం.)

Advertisements
Published in: on August 12, 2017 at 6:47 pm  Comments (5)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2017/08/12/%e0%b0%b8%e0%b0%82%e0%b0%b8%e0%b1%8d%e0%b0%95%e0%b1%83%e0%b0%a4-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b7%e0%b0%be%e0%b0%b5%e0%b1%87%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%b2-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%95%e0%b0%be/trackback/

RSS feed for comments on this post.

5 CommentsLeave a comment

 1. కృదంత తద్ధితాలు రెండూ నామ గుణ వాచకాలకు (nouns, adjectives) సంబంధించినవే. కృదంతాలు క్రియలనుండి ఏర్పడినవి, తద్ధితాలు వేరే నామగుణ వాచకాలనుండి ఏర్పడినవి. తెలుగులో ఉదాహరణలు:
  కృదంతాలు: ఆడు-ఆట, పాడు-పాట, పండు-పంట, కూయు-కూత, చేయు-చేత, అలుగు-అలక, ఎరుగు-ఎరుక మొదలైనవి
  తద్ధితాలు: చుట్టము-చుట్టరికము, పేద-పేదరికము, చెలి-చెలిమి, చిన్న-చిన్నతనము, అందము-అందగాడు మొదలైనవి

  • ఈ పుస్తకంలో అలాగే రాశారండి – కృదంతాలు క్రియల కి ప్రత్యయాలు చేరిస్తే ఏర్పడ్డవని, తద్ధితాలు నామవాచకాలకి ప్రత్యయాలు జోడిస్తే ఏర్పడేవని. ఇంతకీ మీరు వీటి సంస్కృత మూలాలు చదివారా, వ్యాఖ్యానాలా? మొన్న పోస్టులో కూడా పుస్తకంలోని ఉదాహరణలకి, మీ వివరణలకి మధ్య కొంచెం తేడా ఉండింది. అందుకని అడుగుతున్నా.

 2. నేను కాస్త వివరంగా రాయాల్సింది 🙂
  పుస్తకంలో రాసిన దానితో ఇబ్బంది లేదండి. కృదంతాలు క్రియలకు ప్రత్యయాలు చేరిస్తే ఏర్పడినవే. అయితే అలా ఏర్పడే పదాలు క్రియలు కావు, నామ, గుణ వాచకాలు. మీరు ఉదాహరణగా ఇచ్చిన “వచ్చాడు”, “వస్తారు” వంటి పదాలు క్రియా పదాలు. అందుకు అవి సరైన ఉదాహరణలు కావు.
  పాణిని ప్రత్యయాలను రకరకాలుగా విభజిస్తాడు. అందులో “తిఞ్”లు (conjugation suffixes) verb rootsతో చేరి క్రియాపదాలను (verbs) ఇస్తాయి. మీరు ఇచ్చిన ఉదాహరణలు రెండూ అవి. వీటిని తిఞన్తాలు అంటారు.
  “కృత్” ప్రత్యయాలు (primary derivative suffixes) verb rootsతో చేరినప్పుడు నామ, గుణ వాచక పదాలు ఏర్పడతాయి. నేను ఇచ్చిన తెలుగు ఉదాహరణలు బాలవ్యాకరణంలోనివి. ఇంగ్లీషులో run-runner, see-sight మొదలైనవి. వీటిని కృదంతాలు అంటారు.

  కిందటిసారి ఇచ్చిన వివరణ, ఉదాహరణలు (చాలావరకూ) కావ్యప్రకాశంలోనివి.

  • “తిఞ్” కాదు, “తిఙ్”.

  • Oh, okay. got it. ఈయన క్రియకి ప్రత్యయాలు అన్నాడు కానీ అవి నామ/గుణ వాచకాలని రాయలేదు లెండి. అయితే, ఉదాహరణ వంటవాడు (pacaka) అన్న పదం తీసుకున్నాడు – మీ వివరణకి ఆ ఉదాహరణ సబబుగానే ఉంది.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: