Queen of the desert

నిన్న నికోల్ కిడ్మన్ నటించిన Queen of the Desert అన్న సినిమా చూశాము. Werner Herzog దర్శకుడు. అతని సినిమాలు నేను ఇదివరలో ఏవీ చూడలేదు కానీ, అతని గురించి చాలా విని/చదివి ఉన్నందువల్ల – అదేమిటి, ఈయన హాలీవుడ్ లో పెద్ద రిలీజులు కూడా తీస్తాడా? అన్న ఆశ్చర్యం కూడా సినిమా చూడ్డానికి ఒక కారణం. సినిమా ఒక బయోగ్రఫికల్ డ్రామా అనే చదివినా కూడా, బయోపిక్ అని అనుకున్నాను నేను..దర్శకుడి పేరు వల్ల. Gertrude Bell అన్న ఆవిడ జీవితాన్ని సినిమాగా తీశారు అన్నారు. నాకు బెల్ గురించి మొదట్లో తెలీదు. సినిమా సందర్భంగానే తెలుసుకున్నాను. చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఇప్పుడు ఈ నేపథ్యం లో సినిమా కెళ్ళి వచ్చాము. కట్ చేస్తే:

a) ఆవిడ కథ ఏమిటి? ఆ సినిమాలో ఆ కథ ఎంత? ఆవిడ జీవితంలో ఉన్న డ్రామా ని కథలో చూపించకుండా కొత్త డ్రామా అంతా పెట్టడం ఏమిటి? అప్పుడది జీవిత గాథ ఎలా అవుతుంది? ఈ విధమైన cinematic liberties అందరూ తీసుకుంటూనే ఉంటారు అనుకుందాము.. కానీ Herzog?? అనేకమంది గొప్ప దర్శకుల చేత గొప్ప దర్శకుడు అనిపించుకున్న Herzog? హాలీవుడ్ అందరినీ అలా మార్చేస్తుంది అనుకోవాలా? ఆయన సినిమాలేవీ చూడనందువల్ల నేనిలా ఏదేదో ఊహించుకుంటున్నానో ఏమిటో!

b) ఆ డ్రామా సంగతి అటుపెడితే, ఒక్కోచోట సినిమానా డాక్యుమెంటరీ నా? అని సందేహం కలిగేలా ఉంది కథనం. బహుశా గొప్పోళ్ళు అంతే, మనకి అర్థం కారు అని సరిపెట్టుకోవాలేమో.

c) ఇవి అటు పెడితే, సినిమటోగ్రఫీ మట్టుకు అద్భుతం. ఆ ఎడారులు, అరేబియా ప్రాంతాలు, భవనాలు-ఇళ్ళ ఇంటా బయటా – ఎంత గొప్పగా చూపించారో!! చూడ్డానికి రెండు కళ్ళూ చాల్లేదు.

d) నికోల్ కిడ్మన్ – 48 ఏళ్ళ మనిషి సినిమా మొదట్లో టీనేజర్ లాగ కనిపిస్తుంది😮 అలా ఎలా కనిపిస్తారో! సినిమా అంతా ఆమె పాత్ర రూపురేఖలు, ఆహార్యం మారిన తీరు, దానిని ఆవిడ ప్రదర్శించిన తీరు- అద్భుతమే. బాగా ఎమోషనల్ దృశ్యాల్లో కూడా ఆట్టే కన్నీటి బొట్లు రాల్చకుండానే, నోటి నుండి మాట రాకుండానే ఆవిడ నటించిన తీరు నన్ను ఆశ్చర్యపరిచింది. ఇంకా చెప్పుకుపోవచ్చు కానీ, ఆమె కోసం ఈ సినిమా చూసినట్లైంది లాస్టుకి🙂

ఆ విధంగా, వికీపీడియాలాంటి చోట చదివినపుడు కూడా బాగా ఆసక్తికరంగా అనిపించిన కథ సినిమాలో మట్టుకు కొంచెం సాధారణంగా అనిపించింది అనమాట నాకు. కానీ, Gertrude Bell అంటే ఒక విధమైన కుతూహలం కలిగింది. అందువల్ల ఈ Herzog గారిని క్షమించదల్చుకున్నా.

Published in: on September 30, 2015 at 5:34 pm  Comments (1)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2015/09/30/queen-of-the-desert/trackback/

RSS feed for comments on this post.

One CommentLeave a comment

  1. Neeru yelanti movies istapadatharu ?


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: