ETS సంస్థ వారు TOEFL పరీక్ష విద్యార్థులు రాసిన వ్యాసాలను కొన్నింటిని పరిశోధనల నిమిత్తం విడుదల చేశారు. అందులో 11 భాషలకు చెందిన వాళ్ళు రాసిన ఆంగ్ల వ్యాసాలు ఉన్నాయి. వ్యాసాలు రాసిన వారి ఆంగ్ల ప్రావీణ్యాన్ని మూడు వర్గాలుగా విభజించారు (beginner, intermediate, advanced). మా డిపార్టుమెంటులో దాన్ని వాడేవాళ్ళు ఉన్నందువల్ల నాకు దానికి access ఉంది. దానితో నేనూ ఏదో కాలక్షేపానికి unix command line సాయంతో (నేను వాడినవి – aspell, awk, sort) తెలుగు వాళ్ళ ఇంగ్లీషు రాతల్లో ఉండే వర్ణక్రమ దోషాలు – వాటిలోని వెరైటీ గురించి పరిశీలిద్దాం అనుకున్నాను. ప్రస్తుతం పోస్టులో కింద కనబడే సంగతులు ఈ corpusలో తెలుగువాళ్ళు రాసిన తొమ్మిదొందల వ్యాసాల ఆధారంగా వచ్చిన సంఖ్యలు. తొమ్మిదొందలే ఎందుకు? మిగితా ఎందుకు వాడలేదు అంటే – రేప్పొద్దున దీని ఆధారంగా ఎవళ్ళన్నా ఏదన్నా థియరీ సృష్టిస్తే, దాన్ని టెస్టు చేయడానికి మరి కొత్త వ్యాసాలు ఉండాలి కదా! ఇప్పటికిప్పుడు తెలుగు వాళ్ళ ఆంగ్ల వ్యాసాలు వెదుక్కోడం కన్నా ఆల్రెడీ ఉన్నవి వాడుకుందాం ఫస్టు అన్న ఉద్దేశంతో తొమ్మిదొందలే వాడుకున్నా, ఉన్న పదకొండు వందల్లో. మచ్చుకి ఓ పది పదాలకి తెలుగు వారి ఆంగ్లంలో ఉన్న వివిధ స్పెల్లింగులు ఇవిగో:
ఒక చిన్న హెచ్చరిక: వీటిలో చాలా మటుకు టైపింగ్ పొరబాట్లో, మరేవో అయి ఉంటాయి కనుక దయచేసి దీన్ని బట్టి ఎవో థియరీలు ఊహించుకుని దానికి నన్ను బాధ్యురాలిని చేయకండి. నేనేమి పరిశోధనాపత్రం సమర్పించడంలేదు అని గమనించ ప్రార్థన!
academic:
acadamic 20
acadamics 1
acadamis 1
academig 1
acadimic 1
acadmic 1
acaemics 1
accadamic 2
accademic 5
acedemic 7
further
furrter 1
furter 1
furthur 3
futher 7
futhur 1
increase
incerease 1
incerese 1
incraese 1
incrase 2
increae 1
increse 5
knowledge:
knbowledge 1
knlowdge 12
knoldege 1
knoledge 4
knolwedge 1
knoweledge 1
knowkedge 1
knowldege 1
knowldge 2
knowlede 3
knowledege 5
knowledgw 1
knowlegde 5
knowlege 12
knowlendge 1
knowlwdge 1
knwledge 1
konowledge 1
konwledge 1
learning
leaniong 1
learing 5
learnig 5
learnin 3
learnind 1
learniong 1
leerning 1
maintenance
maintainance 2
maintainence 1
maintanance 1
maintance 1
maintanence 2
opportunity
oppertunity 1
opportinuity 1
opportuinity 2
oppourtunity 1
oppurtines 1
oppurtiny 1
oppurtunity 9
oppuryunity 1
particular
perticulal 1
perticular 30
pertucular 1
paricular 2
paritcular 2
people
peeople 2
peoeple 1
peole 10
peolpe 1
peolple 2
peope 3
peopel 4
peoplr 1
peple 8
peploe 1
pepole 2
young (1379)
yong 9
yonug 1
youbg 1
youg 2
youn 3
yound 1
younge 1
youngh 1
youngs 1
ఇలాంటి తరుచుగా కనబడే పదాలకి కూడా ఇంత వెరైటీగా రాస్తారనుకోలా! అదొక్కటే ఈ బ్లాగు టపా రాసుకోవడానికి కారణం. ఎవరన్నా భాషావేత్తలో, మరొకరో ఈ అంశం గురించి ఆసక్తి కలిగి ఉన్న పక్షంలో మొత్తం లిస్టు కావాలంటే వ్యాఖ్య వదలండి. కావాలంటే ఈమెయిల్ పంపగలను.
Good observation Soumya garu. It might be useful in someway.
good insight. please do observe the title of the post. for me “telugu tappulu” seems not finding the essence of the post, can it be telugu vaari tappulu? 🙂
Sunita garu – there is a research area (Second Language Acquisition) which studies if these mistakes are because of the influence of the writer’s native language 🙂 By saying “telugu tappulu”, I was referring to the possibility of some of these having their origin in that. I will change, anyway. Thanks for reading.
very good.good morning madum.
Dear Sowmya garu, Very good observation.
మీరు వొద్దన్నా సరే నేను ఒక ధియరీ వూహించుకునేశానోచ్:-)
—————————————-
మెకాలే గారు అలవాటు చేశాదని ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఇట్టా అత్ప్పులు రాస్తున్న ఇంగ్లీష్ మని అవసరమా,అస్సలు అఖ్ఖర్లేదు.సుబ్బరంగా మాత్ర్భాషలో నేర్చుకోకుండా ఇన్నేఅళ్ళ పాటు అఘోరించింది ఇదా?మాతృభాసహలో విద్యాబోధన గురించిన ఉద్యమానికి ఇలాంతి పనులు మంచి పునాది వేస్తాయి,యేమంటారు?
—————————————-
అందుకే అట్టాంటి వార్నింగులు ఇవ్వకూడదండీ సౌమ్య గారూ:-)
మీరు వొద్దన్నా సరే నేను ఒక ధియరీ వూహించుకునేశానోచ్:-)
—————————————-
మెకాలే గారు అలవాటు చేశాడని ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఇట్టా తప్పులు రాస్తున్న ఇంగ్లీష్ మనకి అవసరమా,అస్సలు అఖ్ఖర్లేదు – కదూ!సుబ్బరంగా మాతృభాషలో నేర్చుకోకుండా ఇన్నేళ్ళ పాటు అఘోరించింది ఇదా?మాతృభాషలో విద్యాబోధన గురించిన ఉద్యమానికి ఇలాంటి పనులు మంచి పునాది వేస్తాయి,యేమంటారు?
—————————————-
అందుకే అట్టాంటి వార్నింగులు ఇవ్వకూడదండీ సౌమ్య గారూ:-)
మరైతే తెలుగువాళ్ళు తెలుగు రాయడంలో చేసే తప్పుల జాబితా ఒక్కటి సృష్టించాల్సిందే ఇక! 🙂