పెణ్, ఇందిర, సుహాసిని, నేను!

సాధారణంగా మేధావులు ఆడిపోసుకుంటూంటారు కాని, ఈ ఫేస్‌బుక్ వల్ల కొన్ని ఉపయోగాలున్నాయి. వాటిలో ఒకటేమిటంటే కొన్ని గొప్ప entertainment మార్గాలు తెలుస్తాయి. సినిమాలు, పుస్తకాలు వంటివన్నమాట. అలాగే నాకు “పెణ్” అన్న తమిళ టీవీ సీరియల్ గురించి తెలిసింది.

ఈ “పెణ్” అన్నది నటి-దర్శకురాలు సుహాసిని రాసి, దర్శకత్వం వహించిన కథల సంకలనం. యూట్యూబులో ఎనిమిది విడియో ఎపిసోడ్లు కనబడ్డాయి. రేవతి, శోభన, అమల, రాధిక వంటి ప్రముఖ నటీ నటులు అందరూ చెరో ఎపిసోడ్ లో ప్రధాన పాత్రలు ధరించారు. నాకైతే గొప్పగా నచ్చాయి కథలన్నీ. ప్రత్యేకం నన్ను ఆకట్టుకున్నవేమిటి? అని అడిగితే –

1. కథాంశాలు, కథల్లోని పాత్రలు – రోజు వారి జీవితంలో కనబడేవే. పాత్రలైతే నగరాల్లోని మధ్యతరగతి తమిళ కుటుంబాలు ఎలాగుంటాయో అలాగే ఉంటాయి, ప్రవర్తిస్తాయి. మామూలుగా అందరిళ్ళలో కనబడే తగాదాలు, సరదాలు, కష్టాలు, నష్టాలు – ఇవే కనబ్డ్డాయి కథల్లో.

2. కథలన్నింటిలో స్త్రీ పాత్రలు ప్రధాన పాత్రలు. కథలన్నీ స్త్రీల చుట్టే తిరుగుతాయి. మన సినిమాలు, మన సీరియళ్ళూ చిన్నప్పట్నుంచి చూస్తున్నా – ఇలాంటి కథాంశాలు అరుదనే చెప్పాలి. స్త్రీలు ప్రధాన పాత్రలుగా ఉండే ప్రస్తుత టీవీ సీరియళ్ళను చూసి సంతోష పడాల్సిన అంశాలేవి లేవు. వీటన్నింటి మధ్య, నన్ను కథాంశాల ఎంపికలోనే సుహాసిని చాలా ఆకట్టుకుంది.

3. నటీనటులు అందరూ ఎంతో ప్రతిభావంతులైన వారు. నటనారంగంలో పేరున్న వారు. వీరందరూ కలిస్తే ఇంక ఇంత మంచి కథలకి లోటేమిటి?

4. నేపథ్య సంగీతం (ఇళయరాజా) ది ఎక్కడెక్కడ అవసరమో అక్కడ మట్టుకే మెరిస్తే, ఆ మొదట్లో టైటిల్ విడియో అయితే అద్భుతమైన ఆలోచన!

“పెణ్” కథలు చూడాలన్న ఆసక్తి ఉంటే యూట్యూబులో Tamil serial penn అని వెదికితే కనిపిస్తాయి. సబ్-టైటిల్స్ లేవు కానీ, చాలా వరకు విషయం అర్థం కావొచ్చు – విషయాలు దైనందిన జీవితంలోనివి కనుక. అదీ వాటి కథ. ఆ విధంగా, చూసిన ఎనిమిది ఎపిసోడ్లలో మూడు తెగ నచ్చగా, మూడింటిలో పలు అంశాలు నచ్చాయి. దానితో ఇక సుహాసిని దర్శకత్వం వహించిన ఏకైక చలన చిత్రం “ఇందిర” చూడక తప్పింది కాదు.

ఆ సినిమా సుహాసిని గురించి నాకు “పెణ్” చూసాక కలిగిన అభిమానాన్ని గౌరవం దాకా తీసుకెళ్ళిపోయింది. ఏం సినిమా అండి అసలు! మొదటి సినిమా లా ఉందా దర్శకురాలికి? చాలా అనుభవం ఉన్న వాళ్ళలా ఉంది! నటీనటులు కూడా బాగా సరిపోయారు పాత్రలకి. అనూ హాసన్ కి తొలిసినిమా అయినా, ఇంత భారీ పాత్రని బానే నిభాయించింది. ఆవిడ పాత్రకి రాసిన డైలాగులు కొన్ని గొప్పగా ఉన్నాయి అసలు!

ఈ సినిమా పాటలు చిన్నప్పుడు విన్నాను. Nila Kagiradhu పాట ని తరువాత కూడా చాలాసార్లే విన్నాను. ఎప్పుడూ సినిమా చూసే బుద్ధి పుట్టలేదు. అలా ఎలా మిస్సయ్యాను! అని కొన్ని క్షణాలు దిగులు చెందాను కూడా ఇప్పుడు సినిమా చూశాక! సరే, సినిమా పాటలు చాలా బాగున్నాయని ఇప్పుడు మళ్ళీ కొత్తగా కనుక్కున్నాను. ముఖ్యంగా నాకు నచ్చిన పాట Ini Accham Accham Illai. గొప్ప పాట! కొరత ఏమిటంటే – సినిమా తెలుగులో చూడగలిగుంటే ఇంకా బాగుండేది. నా అమోఘమైన భాషా ప్రావిణ్యం వల్ల నాక్కొన్ని చోట్ల డైలాగులు, పాటల్లోని వాక్యాలు అర్థం కాలేదు😦 మొత్తానికైతే మంచి దేశీవాళీ సినిమా అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా!

మొత్తానికి సుహాసిని అంటే నాకు విపరీతమైన గౌరవ భావం, భక్తి భావం ఏర్పడిపోయింది ఇంక! సాధారణంగా నేను “అబ్బ! ఎలాగైనా వీరిని కలవాలి” అనుకున్న మనుషుల్లో నేను అలా అనుకునే నాటికింకా జీవించి ఉన్నవారు చాలా తక్కువ. వాళ్ళలోకి సుహాసిని ని కూడా చేర్చుకున్నాను దెబ్బకి!🙂

చివరగా, ఒక ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకి సుహాసిని ఇచ్చిన సమాధానంతో ఇంక ముగిస్తాను.

****
Question: You write for Mani, you dub for his films… what do you think of his cinema?

Answer: “Can we leave Mani out of this discussion? In none of Mani’s interviews is my work ever discussed. We are not a couple who feels one person is superior to the other; ours is a relationship of equals. Mani is as proud of my work as he is of his own. I’m not getting angry but I do not feel the need to go on and on about Mani.

I am a curator for a couple of big international film festivals. I recommend South Indian cinema to them. But I don’t recommend any of Mani’s movies because they recommend themselves. Whether I am acting, judging films or doing my show, nobody asks Mani how involved he is with those aspects of my career. So why should I be constantly asked questions about him”

Source: Times of India
****

Published in: on August 23, 2014 at 8:41 pm  Comments (1)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2014/08/23/penn-indira-suhasini-nenu/trackback/

RSS feed for comments on this post.

One CommentLeave a comment

  1. ఇంటర్వ్యూలో ఆమె సమాధానం చాలాబావుంది. కలల జంటే ఐతే వీళ్ళు.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: