గ్రీస్ లో క్రిస్మస్ సెలవులు-4

సాంటోరినీ ద్వీపంలో ఆఫ్-సీజన్ పర్యటన:
****
పొద్దున్నే ఏడున్నరకి ఒక రేవులో ఫెర్రీ ఎక్కాము. ఏడున్నర గంటలు సముద్రంలో ప్రయాణం – మధ్యలో కిందకి దిగడం ఉండదు. కిటికీలోంచి బైటకి చూస్తూ కూర్చోవాలి అనమాట. కాసేపు అలా ఖాళీ దొరికినందుకు ఆనందం, కాసేపు ఆ కారణానికే చిరాకు, మధ్య మధ్య వాదోపవాదాలు-తగువులు, వీటి నడుమ ఫెర్రీలో చాలా తరుచుగా కనబడ్డ వివిధ దేశీ కుటుంబాలను చూస్తూ “ఈ సీజన్ లో కూడా ఇండియంస్ కనిపిస్తూనే ఉన్నారు సుమీ!” అని ఆశ్చర్యం, మధ్య మధ్యన ఆద్యంతం లేకుండా సాగుతున్న సముద్రాన్ని చూసి, ఎక్కడో‌ దూరాన కనిపిస్తున్న ఏవో తీరాలను చూసి నిట్టూర్పులు – ఇలా సాగింది మా ప్రయాణం.
Sant-1

Sant-2

సరే, ఎట్టకేలకి సాంటోరినీ పోర్టులో దిగాము. పోర్టు నుండి మా హొటెల్ ఉండే ప్రాంతం-Fira కి వెళ్ళాలి. ఘాట్ రోడ్డులాగుంది. అలా పైకి, పైకి పైపైకి కొండెక్కాక ఎట్టకేలకి ఫిరాలోని మా హోటెల్ కి చేరుకున్నాము. ఆ హోటెల్ బాల్కనీలోంచి చూస్తే ఒక అగ్నిపర్వతం! పూర్వకాలంలో ఎన్నో ఏళ్ళ క్రితం ఆ పర్వతం బద్దలయ్యే ఇదివరకటి శాంటోరిని, ఒక నాగరికతా నాశనమైపోయాయని అంటారు.

Sant-3

ఇంత దగ్గర్లో ఒక అగ్నిపర్వతాన్ని పెట్టుకుని అంత ప్రశాంతంగా ఎలా బ్రతుకుతున్నారో ఇక్కడంతా! అనుకున్నాము. చుట్టుపక్కల చూస్తేనేమో సందు లేకుండా ఎక్కడ పడితే అక్కడ ఇళ్ళు!
sant-4

సరే, మేము చేరుకుని సెటిల్ అయ్యేసరికి ఇంతలోపే చీకటి పడ్డం మొదలైంది. కాసేపలా నడిచి, ఎక్కడన్నా డిన్నర్ చేద్దాం అనుకున్నాము. ఫిరా మీద నుంచి సాంటోరినీ సెంటర్లోకి రావడానికి కార్లు వెళ్ళే మార్గం కాక వాకింగ్ మార్గం ఇంకోటుంది. సముద్రాన్ని, అగ్నిపర్వతాన్ని చూస్తూ కిందకి దిగొచ్చి. కార్లు వెళ్ళే రోడ్లో వెళ్తే అవి మనమీదుగా వెళ్ళిపోతాయి – అలా ఉందక్కడ!

ఈ ప్రాంతాల్లో ఈ నీలం రంగు చర్చిలు చాలా కనబడాయి.
Sant-5

Sant-11

ఆఫ్-సీజన్ ఐనందువల్ల చాలామటుకు రెస్టారెంట్లు మూసేసి ఉన్నాయి. చాలాసేపు తిరిగితే కానీ, ఒక తెరిచి ఉన్న స్థలం కనబడలేదు. సిటీ బస్సులు కూడా కనబడలేదెక్కడా. చివరికి తరువాతి రోజు తెలుసుకున్నాము – సెంటర్ నుండి చుట్టుపక్కల ప్రాంతాలకి వెళ్ళే చివరి బస్సు సాయంత్రం నాలుగుకి అని 🙂 . అన్నింటికంటే నాకు విచిత్రంగా తోచినదేమిటంటే – అక్కడ కనబడ్డ ఒక ఏటీఎం కూడా మూసేశారు! దానిమీద ఏప్రిల్లో తెరుస్తాం‌ అని ఒక స్టిక్కర్ అంటించారు 🙂 ఇప్పటి దాకా ఏటీఎం కి అన్నాళ్ళు సెలవులిస్తారని తెలియదు నాకు! అలాగ ఈవేళంతా వాకింగ్ చేస్తూ గడిపాము.

తర్వాతి రోజు ఉదయాన్నే ఈ అగ్నిపర్వతం ఉన్న ప్రాంతానికి వెళ్ళాలని అనుకున్నాము. వెళ్ళాలంటే బోటులో వెళ్ళాలి. బోటెక్కాలంటే మేము దిగిన రేవు కాకుండా ఇంకో రేవుకి వెళ్ళాలి. మేమున్న చోటు నుండి కూడా బైటకొస్తే రేవు కనిపిస్తుంది అదిగో కింద:
Sant-6

మొత్తానికి వీలైనంత నడిచి, ఆపైన అక్కడో కేబుల్ కార్ ఉందని గమనించి అందులోనూ ఓసారి ప్రయాణిద్దాం‌ అనుకుని, రేవు చేరుకున్నాము.
Sant-7

బోట్లో కొన్ని నిముషాలు ప్రయాణించి అగ్నిపర్వతం ప్రాంగణంలోకి అడుగుపెట్టాము. అది ఇప్పుడు దాదాపు నిద్రాణమైనదే అయినా, కొంచెం భయమేసింది నాకైతే.
Sant-8
ఇక్కడ ఒక చిన్న హైక్ చేసి కొంచెం పైకి ఎక్కితే లావా ని చూడగలరంట. మాకు ఎంత దూరం వెళ్ళినా కనబడలేదు కానీ, ఒకచోట మట్టుకు acid వాసన బాగా వచ్చింది. ఆ బోట్ మళ్ళీ ఇంకో రౌండ్ వచ్చేట్టయితే ఇంకాస్త ముందుకెళ్ళి చూసేవాళ్ళం కానీ, అతను ముందే చెప్పాడు-ఆఫ్ సీజన్ కనుక ఇప్పుడు మిస్ ఐతే ఇంక మళ్ళీ రేపే! అని. దానితో మాకన్నా ముందు బయలుదేరి, ఆ నల్లరాళ్ళని చూసి మురిసిపోతూ అడుగడుక్కీ ఆగకుండా హైక్ పూర్తిచేసుకు వచ్చిన వారి నుండి లావా వర్ణన విని తృప్తి పడాల్సి వచ్చింది.

Sant-9

వెనక్కి వస్తున్నప్పుడు బోట్ నడిపే అతను ఒకచోట ఆపాడు. ఆపి, ఈ అగ్నిపర్వతం మనం అనుకున్నంత సైలెంట్ ఏం‌కాదు అని, అక్కడ ఉన్న నీళ్ళను ఒక బకెట్తో తీసి, తాకి చూడమన్నాడు. వెచ్చగా ఉన్నాయి! అంతకుముందంతా చల్ల నీళ్ళు, పైగా బైట కొంచెం చలిగా ఉంది కూడానూ!
Sant-10

ఇదంతా అయ్యాక, మళ్ళీ యధావిధిగా Random walks చేసుకుంటూ, కాసేపు తరువాత పక్క టవున్-Oia కి వెళ్ళి అక్కడా తిరిగి తిరిగి వచ్చాము. అది మాత్రం పరమ ఖాళీగా ఉంది. కనీసం మా హొటెల్ ప్రాంతంలో ఎవరో మనుషులైనా కనబడతారు!

ఆసియా టూరిస్టులు – మన దేశమే కాదు, చైనా, జపాన్ దేశస్థులు కూడా -చాలా మంది కనబడ్డారు సాంటోరినిలో. డిసెంబర్ ఆసియా టూరిస్టుల సీజన్ కాబోలు. ఈ సాంటోరినీ వాసులూ కొట్లు కట్టేసే బదులు మనల్ని టార్గెట్ చేయాలేమో! అనుకున్నాము 🙂 అయితే, ఇవి అటుపెడితే, ఈ ప్రాంతంలో వెజిటేరియన్ ఆహారం మట్టుకు చాలా రుచిగా ఉండింది. ఆపరంగా నాకు చాలా నచ్చిందీ ప్రాంతం. పీక్ సీజన్ లో వస్తే మొత్తం కిక్కిరిసి పోయి ఉంటారు కాబోలు జనం – అందుకే ప్రతి రెణ్ణిమిషాలకీ ఒక రెస్టారెంటు కనిపిస్తోందిక్కడ. ఇంకా నయం – ఒక విధంగా ఇలా ఖాళీగా ఉన్నప్పుడు రావడం కూడా నయమేనేమో.

Akrotiri చూడాలని చాలా అనుకున్నాం కానీ, ఈ ఆఫ్-సీజన్ ప్రయాణం వల్ల, వాళ్ళు వాళ్ళ పనివేళలు బాగా తగ్గించేయడంతో కుదర్లేదు. ఇలా ఆఫ్-సీజన్ లో వెళ్తే వేరే ఒక లాభం ఉంది. ఇక చేసేదేం‌ ఉండదు కనుక ఊరికే అలా నడుస్తూ రిలాక్స్ అవొచ్చు 😉 రెండ్రోజులూ అదే చేశాము.

ఇక తరువాతి రోజు ఫ్లయిట్లో ఏథెంస్ చేరుకున్నాము మళ్ళీ. ఇక్కడ మరో నాలుగురోజులుండి, జనవరి ఒకటోతేదీకి తిరిగి జర్మనీ చేరుకోవాలన్నది మా ప్లాను.

(సశేషం)

Advertisements
Published in: on March 29, 2014 at 5:25 pm  Comments (1)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2014/03/29/greecevacation-4/trackback/

RSS feed for comments on this post.

One CommentLeave a comment

  1. […] రెండవ, మూడవ, నాల్గవ […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: