పరాశక్తి (శివాజీ గణేశన్ తొలి చిత్రం)

చాలారోజుల, నెలల బట్టి “పరాశక్తి” చూడాలనుకుంటూ, “మనకెక్కడ ఇందులోని ప్రాపగాండా అంతా భరించే ఓపిక?” అనుకుని వాయిదా వేస్తూ వచ్చాను. పోయిన వారం ఫేస్బుక్ లో కప్పాలోట్టియ తమిళన్ ప్రస్తావన రావడంతో, ఒక స్నేహితునితో సంభాషణలో “పరాశక్తి” ప్రస్తావన వచ్చింది. సరే, శివాజి సినిమా ఏదన్నా చూసి కొన్ని రోజులైంది కదా (అంతకు మూడ్రోజుల ముందే తిరువిళయాడళ్ లోని కొన్ని దృశ్యాలు చూసిన విషయం లెక్కలోకి తీసుకోకూడదు) అని, ఇంటికి వెళ్ళగానే “పరాశక్తి” చూశాను. మూడు గంటల సినిమా. దాదాపు ఎనభై శాతం సినిమా దాకా నేను “అబ్బ! ఏమి సినిమా! ఏమి నటన!” అన్న వావ్! ఫీలింగ్లోనే ఉన్నాను. శివాజి అద్భుతమైన నటన, కరుణానిధి పవర్ఫుల్ డైలాగులు (నాకు వందశాతం అర్థం కాలేదు కానీ, అర్థమైనంతలో చెబుతున్నా), అనవసరమే ఐనా బాగున్న పాటలు, కథలోని విషాదం – అన్నీ అలా నన్ను కట్టిపడేశాయి.

కథ క్లుప్తంగా చెప్పాలంటే: ముగ్గురు సోదరలు రంగూన్ లో జీవిస్తూంటారు. తమిళనాట జరగబోయే తమ చెల్లెలి పెళ్ళికి చాలా ఏళ్ళ తరువాత ఇండియా వెళ్దాము అనుకుంటూ‌ ఉంటారు. అది రెండో‌ ప్రపంచ యుద్ధం జరిగే సమయం. వీళ్ళందరికీ కలిసి వెళ్ళడానికి షిప్ లో స్థలం ఉండదు. దానితో గుణశేఖరన్ అన్న పేరుగల మూడో వాడిని పంపుతారు, మిగితా వాళ్ళు తరువాత వద్దాం అని. అతను మన శివాజీ. ఈ నౌక మధ్యలో అనేక ఇబ్బందులు పడి లాస్టుకి చాలా రోజుల తరువాత దేశంలోకి వస్తుంది. ఇతను వాళ్ళూరు వెళ్ళే ముందు ఒకరోజుకని ఒక హోటెల్లో ఆగుతాడు. ఇంతలోపు ఇతన్ని మోసం చేసి డబ్బులు కాజేస్తారు ఒక ముఠా వాళ్ళు. చేతిలో‌ డబ్బు లేదు. ఆకలి. ఎలా నెట్టుకురావాలో తెలీదు. ఈ పరిస్థితుల్లో అతను నగరంలో పిచ్చివాడి వేషం వేసి తిరుగుతూ పొట్టపోసుకుంటూ ఉంటాడు. ఇలాగే ఒకరోజు చివరికి వాళ్ళ చెల్లెలి అడ్రస్ కనుక్కుని అక్కడికి చేరుకుంటాడు. అక్కడ ట్విస్ట్ ఏమిటంటే – చెల్లి పెళ్ళయ్యాక, ఒక బాబుకి జన్మనిస్తుంది. ఆ టైములోనే ఆక్సిడెంటులో ఆమె భర్త, ఆ షాక్లో ఆమె తండ్రీ మరణిస్తారు. ఆస్థి మొత్తం వేలం వేస్తారు. ఆమె ఇడ్లీ కొట్టు పెట్టుకుని బ్రతుకుతూంటుంది. మరి తన ప్రసుత్త పరిస్థితిలో చెల్లి కళ్ళబడ్డం ఇష్టంలేక అతను తానెవరో చెప్పకుండానే ఆమెకి సాయం చేస్తూంటాడు. ఇంతలోపు మనకి మిగితా ఇద్దరు సోదరులూ ఎమయ్యారో తెలుస్తుంది. ఎవళ్ళకి వాళ్ళకి తక్కిన సోదరులు, సోదరి ఏమయ్యారో తెలియదు అనమాట. ఇదిలా ఉండగా, గుణశేఖరన్ కి ఒక హీరోయిన్ ఎంట్రీ‌ (పండరీబాయి). ఒకానొక సందర్భంలో ఆకలి బాధకి తాళలేక తన పిల్లవాడిని నదిలో పడేస్తుంది చెల్లి. దానితో భ్రూణహత్య నేరమని ఆమెని, సైడ్ ట్రాక్లో ఫలానా ఒకతన్ని కొట్టాడని గుణశేఖరుడినీ కోర్టులో ప్రవేశపెడతారు. జడ్జి – పెద్దన్న! రెండో అన్న కూడా వస్తాడు సీన్ లోకి. క్లైమాక్స్ దృశ్యం లో అందరూ కలుసుకుంటారన్నమాట. (మీకు బాగా వివరంగా కథ కావాలంటే – వికీ పేజీ చూడండి, లేదా సినిమా చూడండి).

సినిమా లో చాలా‌ రాజకీయ ప్రాపగండా ఉంది కానీ, మామూలుగా సినిమాలాగ తీశారు – డాక్యుమెంటరీలాగ కాకుండా. కనుక, కావల్సినంత నాటకీయత, నవరసాలూ – ఉన్నాయి. ముఖ్యంగా శివాజీని చూడ్డానికి రెండు కళ్ళూ చాలవనే చెప్పాలి🙂. ఇది తొలి సినిమానా ఇతనికి? నిండా పాతికేళ్ళైనా లేని నటుడు – ఇంత అనుభవం కలవాడిలా ఆ పాత్రలోకి ఒదిగిపోయాడా? అని ఆశ్చర్యపోయాను నేను. నిజమే, అతనికి రంగస్థల అనుభవం ఉంది. అయినా, తొలి సినిమా తొలి సినిమానే. సినిమా క్లైమాక్స్ దృశ్యంలో కోర్టులో వాదించే సీన్ ఉంది – అందరూ దాని గురించి ప్రముఖంగా చెబుతారు. కానీ, సినిమా మొత్తంలో అతను కనబడ్డ ఏ దృశ్యమైనా అదే స్థాయిలో ఉందని నా అభిప్రాయం. ఉన్న దానికి తోడు ఆ కథలోని ట్విస్టుల వల్ల, నాలాంటి hyper imaginative మనుషులు పూర్తిగా లీనమైపోయి, నవరసాలూ అనుభవిస్తారు అనమాట!‌:-)

కొన్నున్నాయి – నాకు నచ్చనివి:
౧. సినిమాలో ఆ ట్విస్టులు అవీ అటుపెడితే, పండరీబాయి పాత్ర ఎంట్రీ, హీరో-హీరోయింల మధ్య ప్రేమా, స్నేహం – ఇవన్నీ మరీ సడెన్ గా జరిగిపోయినట్లు, నాటకీయంగా, కృతకంగా అనిపించాయి నాకైతే.
౨. ఆ చివ్వరి అరగంటా ఎంత నాటకీయంగా ఉంటుందంటే…అంత నాటకీయంగా ఉంటుంది. నటీనటుల (ముఖ్యంగా గణేశన్) వ్యక్తిగత ప్రతిభావిశేషాలు కూడా ఆ భాగం “బోరు కొడుతుంది” అనకుండా ఆపలేకపోతున్నాయి నన్ను అంటే అర్థం చేసుకోవాలి మరి.
౩. మాట్లాడితే పాట. పాటలు బాగున్నాయి కానీ, అన్ని అక్కర్లేదేమో.

ఇంకెక్కువ రాయదల్చుకోలేదు కానీ – నాకైతే సినిమా మొత్తానికి నచ్చింది. ఆ చివరి అరగంటా కొంచెం విసుగు పుట్టించింది కానీ, దాని కారణంగా మొత్తం సినిమాని తీసిపారేయలేను. డైలాగుల కోసం, శివాజీ కోసం చూడవచ్చు.

Published in: on March 17, 2014 at 7:00 am  Comments (1)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2014/03/17/parasakti/trackback/

RSS feed for comments on this post.

One CommentLeave a comment

  1. నాకు నచ్చిన తమిళ సినిమాల్లో ఇదీ ఒకటీ. తమిళ సినిమాలోని డయలాగ్స్ ని మాత్రమే పుస్తకం తీసుకురావడం అన్నది ఈ సినిమాతోనే జరిగిందట! నన్ను చాలా ప్రభావితం చేసిన సినిమా అని చెప్పాలి. చివరి కోర్ట్ సీన్ లోని (నాటకీయత ఎక్కువే ఉన్నా) డయలాగ్ లు కంఠో పాఠంగా ఊపిరి తీసుకోకుండ చెప్పడానికి సాధన చేశాను ఆరు ఏడు తరగతులు చదివే రోజుల్లో🙂

    “శివాజి అద్భుతమైన నటన, కరుణానిధి పవర్ఫుల్ డైలాగులు, అనవసరమే ఐనా బాగున్న పాటలు, కథలోని విషాదం – అన్నీ అలా నన్ను కట్టిపడేశాయి.”
    — అవును🙂


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: