రషోమాన్ పునర్వీక్షణానుభవం

“పునర్వీక్షణానుభవం” – అంటే ఏమిటి? అసలా పదం ఉందా? అది దుష్ట సమాసమా? ఇలాంటివన్నీ అడగదల్చుకునేవాళ్ళకి: నాకు తెలీదు. Experiences on Revisiting Rashomon అన్న అర్థంలో వాడుతున్నానంతే.

సీరియస్ గా సినిమాని చూట్టం అన్నది నాకు అలవాటు లేని రోజుల్లో ..బహుశా ఏ 2005 ప్రాంతంలోనో మొదటిసారి చూశాను ఈ సినిమాని. మా ఇంట్లో కంప్యూటర్ తెరపై ఈ నలుపు తెలుపు చిత్రం చూస్తూ (నాకీ సినిమాని పరిచయం చేసిన) తమ్ముడు, నేను “భలే ఉందిగా ఈ సినిమా” అనుకోవడం గుర్తు ఉంది. ఆ తరువాతి నాలుగైదు సంవత్సరాల్లో, అకిరా కురొసవా దర్శకత్వం వహించిన ఇతర చిత్రాలు ఒక పదీ పదిహేనుకు పైగా చూశాను. మరి నాకంతగా విశ్లేషణాత్మకంగా చూడ్డం తెలియదు, చూడాలన్న తపనా లేదు కానీ, చాలా మట్టుకు సినిమాలు నాకు నచ్చాయి. అతని ఆస్థాన నటుల్లో ఒకడైన తొషిరో మిఫునే ని కొన్నాళ్ళు అభిమానించి, ఆరాధించి… ప్రస్తుతం మర్చిపోయాను కూడా. 😉 ఇంతలోపు, మళ్ళీ ఎందుకో “రషొమాన్” మీదకి మనసు మళ్ళింది నిన్న. గత వారం పదిరోజులుగా ఆ సినిమా గుర్తుకు వస్తూ ఉండడం కూడా ఓ కారణం ఇందుకు. మొత్తానికి సినిమా చూశాను…ఈ ఉపోద్ఘాతం, ఈ బ్లాగు టపా ఎందుకంటే, అప్పట్లో నచ్చిన అంశాలు, ఇప్పట్లో నచ్చిన అంశాలు అసలు పూర్తిగా వేరేగా ఉన్నట్లు తోచింది కనుక.

(సినిమా కథ కావాలనుకునేవారు వికీపేజీ చూడండి. సినిమా చూడాలనుకుంటే యూట్యూబులో rashomon అని వెదికితే ఆంగ్ల ఉపశీర్షికలతో దొరుకుతుంది)

అప్పట్లో ఏమి నచ్చాయి? (నాకు గుర్తున్నంతలో, ఏ వరుసా లేకుండా)
* కథ … అలాంటి కథనం నేనప్పటికీ ఎక్కడా చూడలేదు. ఒకే సంఘటనకి గల నాలుగు వర్షన్స్ తో కథ చెప్పేయడం. (తరువాత పోతురాజు/విరుమాండి చూశాక…. కొంచెం అతి-నేటివ్ గా ఉన్నా, అదింకా నచ్చింది, కమల్ సినిమా కనుక.)
* తొషిరో మిఫూనే -అవి విచిత్రమైన చేష్టలే అయినా, ఈ మనిషి నన్ను ఆకట్టుకున్నంతగా ఆ సినిమాలో మరెవ్వరూ నన్ను ఆకట్టుకోలేదు.
* సైనికుడి ఆత్మ ఒక medium ద్వారా మాట్లాడే సన్నివేశం
* కట్టెలు కొట్టేవాడు, యువ సాధువు, ఇంకో మనిషి – వీళ్ళ మధ్య జరిగే సంభాషణలు

ఇప్పుడేమి నచ్చుతున్నాయి? (ఇది మాత్రం నచ్చిన వరుసలో!)
* సైనికుడి పాత్రధారి నటన. బాబోయ్, కళ్ళతోనే ఎన్ని మాటలు మాట్లాడాడు అసలు!!
* కట్టెలు కొట్టేవాడు, యువసాధువు, ఇంకో మనిషి-వీళ్ళ మధ్య జరిగే సంభాషణలు.
* కథనం, చిత్రీకరణ, ముగింపు
* కట్టెలు కొట్టేవాడి పాత్ర – మామూలు జీవితంలాగే ఇతనిలోనూ కొన్ని రంగులున్నాయి..నలుపూ తెలుపు అన్న extremes కాకుండా!
* సైనికుడి ఆత్మ ఒక medium ద్వారా మాట్లాడే సన్నివేశం… అక్కడ medium పాత్రధారి ప్రదర్శన.
* ఏడవని సందర్భాల్లో భార్య పాత్రధారి మౌనంగా చూపే స్పందనలు.
* Toshiro Mifune (ఒకప్పటిలాగ ఇప్పుడు హీరో వర్షిప్ భావన కలుగలేదు!)

ఇప్పుడేమి నచ్చడం లేదు?
* అంతకు ముందు అనిపించలేదు కానీ, ఆ వికటాట్టహాసాలు, ఆ నిర్విరామ శోకాలు – చిరాకు తెప్పిస్తున్నాయి.
* Male chauvinism కొట్టొచ్చినట్లు కనబడుతోంది, పాత్రల చిత్రీకరణలో, డైలాగుల్లో. ఆ భార్య పాత్ర విపరీతమైన Stereotyped పాత్రలా తోస్తోంది.

ఉచిత వ్యాఖ్యానం: ఆ యువసాధువు మరీ సున్నితమనస్కుడు. అదొక్కటే కాదు…సినిమాలాగే నలుపు, తెలుపుల్లో చూస్తున్నాడు కాబోలు జీవితాన్ని అనిపించింది… క్లైమాక్సు సన్నివేశాల్లో కట్టెలు కొట్టేవాడితో సంభాషణ విన్నాక. “మరీ ఇలా ఉంటే పెపంచికంలో బతకడం కష్టమేమో మేస్టారూ!” అని చెప్పాలనిపించింది. మరి నేను బ్రతకడంలో పరమ వీర అనుభవం ఉన్న వెయ్యేళ్ళ మనిషిని కనక! 🙂

ఉచిత వ్యాఖ్యానం 2: నిజం చెప్పాలంటే, ఆ కట్టెలు కొట్టేవాడు ఆ చిన్న కత్తిని తన వద్ద ఉంచుకోడంలో అంత ఘోర పాపమేమీ కనబడలేదు నాకు (అతనికి అది దొరికిన చోట ఒక శవం తప్ప ఇంకెవరూ లేరు కనుక). కానీ, ఆ ఇంకో మనిషి ఏడుస్తున్న పసిగుడ్డు దగ్గరి కిమోనో కోట్టేయడం మాత్రం అది నేననుకునేంత అసహజం కాకపోయినా, దారుణం అనిపించింది. ఇవి రెండూ ఆ నలుపు-తెలుపు సినిమాలోని నలుపు-తెలుపు మనస్తత్వం ఉన్న పాత్రలు చూసినట్లు ఒకే రంగు సంఘటనలు కావు, రెంటినీ ఒకే విధంగా చూడలేము, రెంటికీ ఒకే విశేషణం అమరదు అని నా అభిప్రాయం.

ఈ వ్యాసం చదివిన వాళ్ళెవరైనా ఈ సినిమా ఇంకా చూసి ఉండకపోతే తప్పకుండా చూడండి! కాస్త నెమ్మదిగా సాగుతుంది ఇప్పటి సినిమాలతో పోలిస్తే…కానీ, ఓపిగ్గా చూస్తే, rewarding experience.

***
తదుపరి పునర్వీక్షణం – బహుశా ఇకిరు.

Advertisements
Published in: on September 21, 2013 at 9:23 am  Comments (11)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2013/09/21/rashomon/trackback/

RSS feed for comments on this post.

11 CommentsLeave a comment

 1. నేనూ ఆ మధ్యలో ఈ రషోమాన్ ఎఫెక్టుకు గరైనవాణ్నే. ఈ ఎఫెక్టుకు గురయ్యే చాలా సినిమాలు కూడా వచ్చాయట. అలా వచ్చిన వాటిల్లో వాంటేజ్ పాయింట్ కూడా చూశా. కానీ 1950లలోనే అంతటి టెక్నిక్కుతో అలాంటి అద్భుత సినిమా తీయగల్గడం నిజంగా గొప్ప విషయమే. ఒక హత్యను నలుగురి (Bandit, Samurai, Wife & Woodcutter) దృక్కోణంలో చెప్పించి దానికొక అద్భుతైమన క్లైమాక్స్ ఇవ్వగలగడం నిజంగా గొప్ప విషయమే. నాలుగు వెర్షన్స్ కూడా తమ తమ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ను జోడించి సంఘటనను చెప్పడం ద్వారా హ్యూమన్ సైకాలజీని టచ్ చేస్తాడు దర్శకుడు. క్లైమాక్సులో ఉడ్ కట్టర్ (ఖరీదైన కత్తి తస్కరించి) అండ్ కామన్ మ్యాన్ (పసికందు విలువైన వస్తువులు దొంగిలించి) ఇద్దరూ కూడా చిన్నపాటి దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులుగా కళ్లముందే కనిపించడంతో షాక్ తిన్న యువ సాధువుకు ఒక్కసారిగా మానవాళిపైనే విశ్వాసం సన్నగిల్లే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో చివర్లో అక్కడ పిల్లాడిని నేను తీసుకెళ్తానని అని ఉడ్ కట్టర్ అన్నప్పుడు, వెంటనే యువసాధువు నిరాకరిస్తాడు. అయితే తనకు అప్పటికే ఆరుగురు సంతానం ఉన్నారని, తను మరీ అంత దుర్మార్గుణ్ని కాదని చెప్పి, ఒప్పించి, ఆ పసికందును పశ్చాత్తాపానికి గురైన ఉడ్ కట్టర్ తీసుకెళ్లడంతో కథ ముగుస్తుంది. ఒకే సంఘటన తాలూకు వివరాల్ని నలుగురు భిన్న వ్యక్తులు ఎలా వ్యక్తీకరిస్తారనే హ్యూమన్ సైకాలజీని, సమాజంలో ఏవిధంగా మానవ విలువలు కనుమరుగైపోతున్నాయనే చేదునిజాల్ని, మానవత్వంపై నమ్మకాన్ని పునరుద్ధరించాల్సిన ఆవశ్యకతను దర్శకుడు అకిరా కురసోవా అద్భుతంగా కళ్లకు కట్టారు ఈ సినిమాలో. నిజంగా అందరూ చూడాల్సిన ఆణిముత్యం! మీ పురర్వీక్షణానుభవం వివరాలు చదివాక గుర్తుకొచ్చిన విషయాల్ని ఇక్కడ రాయాలనిపించింది. థాంక్యూ 🙂

  • నాగరాజ్ గారూ, మీరు ఈ సినిమాకి మూలమైన Ryūnosuke Akutagawa కథలు చదివారా? నేను ఇన్నాట్లికి ఇవ్వాళే చదివాను. సినిమాకంటే కథలలో ఇంకా ఎక్కువ షేడ్స్ ఉన్నాయి 🙂 అయితే, నాకు కథా, సినిమా రెండూ వేటికవే నచ్చాయి అనుకోండి, అది వేరే విషయం. చక్కటి దర్శకుడి చేతిలో పడితే, కథతో లిబర్టీస్ తీసుకున్నా కూడా సినిమా గొప్పగానే ఉంటుందని నా వీక్షణానుభవాల్లో తెలుసుకున్న విషయం.

 2. మంచి చిత్రం పరిచయం చేసినందుకు ధన్యవాదాలు .
  ఇలాంటి సినిమానే అనుకుంటా పేరు గుర్తు లేదు కాని, అందులో కూడా స్టొరీ వివిధ పాత్రల ద్వారా చెప్తారు .
  అమెరికా అధ్యక్షుడు హత్య అనుకుంట ఆ సినిమా లో, సినిమా స్టొరీ అంతా ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ( అతనే హీరో అనుకుంట ) ద్వారా , ఒక చిన్న పిల్ల ద్వారా , ఒక టూరిస్ట్ ద్వారా , హంతకుడు ద్వారా, ఇలా మూడు నాలుగు వెర్షన్స్ లో సినిమా చూస్తాం, చివర క్లైమాక్స్ లో అందరిని కలపడం ఒక ట్విస్ట్ . సినిమా చూసినా తరువాతా భలే ఉందే అనుకున్న . కాని అలంటి సినిమాలు ఇంకా ఉన్నాయని నాకు తెలియదు తెలిసిన ఎలా వెతకాలో తెలియదు. మీరు పరిచయం చేసినా ఈ సినిమా నా వీక్ ఎండ్ టైం పాస్ .

  • మీరంటున్న సినిమా “Vantage Point” అనుకుంటానండి. ఈ సినిమా నేను చూడలేదు… ఇతరులు చెప్పినదాన్ని బట్టి, వికీ పేజీని బట్టి ఊహిస్తున్నాను అంతే. తమిళంలోనూ ఒక సినిమా ఉంది ఇలాంటిదే… “అందనాళ్” అని. దాని గురించి నా బ్లాగు టపా ఇదిగో:
   https://vbsowmya.wordpress.com/2013/03/16/andanaal/

  • Yeah. Thats Vantage Point only 🙂

 3. Sowmya garu
  I wateched this movie. I loved it.
  Later on I remember reading a detail article on this in eemaata. If you did not read it already it is good and touch many details.

  • Yes, I read that eemata.com article you mentioned (the one by Vishnubhotla Lakshmanna?) some time back. Thanks.

 4. ఈ సినిమా చూస్తున్నప్పుడు చాలా కష్టపడ్డా…నిద్రను ఆపుకోలేకపోయా:-) తరువాత రివ్యూలు చదివి, ఇది గొప్ప సినిమానే కాని నా తెలుగు సినిమా బుర్ర తట్టుకోలేకపోయిందని గ్రహించా. ఏమైనా నాకు ఈ సినిమా కన్నా పోతురాజే నచ్చింది.

  • మీకు ఆసక్తి ఉంటే తమిళ సినిమా “అందనాళ్” చూడండి డింగు గారూ… చాలా నచ్చింది నాకు. కాన్సెప్టు ఇలాంటిదే కానీ, గొప్ప నేటివిటీతో తీశారు. అలాగే, చాలా ఆసక్తికరంగా ఉంటుంది చివరి దాకా.

 5. […] I realized recently that my thoughts on what I liked about Rashomon changed significantly from my first […]

 6. pl watch AAROHANAM (2012) Tamil movie


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: