ఇంద్రగంటి మాయా బజారు

నాకు చాన్నాళ్ళ బట్టీ ఇంద్రగంటి మోహనకృష్ణ తీసిన “మాయాబజార్” సినిమా చూడాలనున్నా కుదరలేదు. ఈమధ్యే యూట్యూబులో కనబడ్డంతో, మొత్తానికి చూసాను. సినిమా కొంచెం వెరైటీగా ఉంది… ఆట్టే నాకు నచ్చలేదు కానీ, కొన్ని ఆసక్తికరమైన సంగతులు ఉన్నాయి..అవి రాసుకుందామని ఈ టపా.

కథా కమామిషూ చెప్పాలంటే, హీరో రాజా ఒక మహా సహృదయం కల మనిషి. తాను తిన్నా, తినకపోయినా అందరినీ ఆదుకునేస్తూ ఉంటాడు. ఇట్టాంటి మనిషికి ఊడిగం చేస్తే గానీ జనాల పాపపు సొమ్ముల్ని మోసే తనకు విమోచనం ఉండదని కుబేరుడు తెలుసుకుని ఇతనికి సాయం చేయడం మొదలుపెడతాడు. అచిరకాలంలొనే ఇతగాడు కోట్లకి పడగెత్తి, అయినా కూడా ఇంతే దయార్ద హృదయంతో కొనసాగుతూ ఉంటాడు. మధ్యలో ఎక్కడ నుంచి వస్తోందో? ఎందుకొస్తోందో? రాజా అంటే అంత ప్రేమ దేనికొ? అర్థం అవకపోయినా – హుందాగా, తెరకే ఒక అందాన్నిచ్చేలా ఉన్న భూమిక. ఇతగాడి అదృష్టం ఇలాగే కొనసాగిందా? రాజా-భూమిక చివ్వరికి పెళ్ళి చేస్కున్నారా? అసలు కుబేరుడు శాపవిముక్తుడయ్యాడా? అసలు ఇంతకీ exact nature of the curse ఏమిటి? – ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి ఆ సినిమా చూడండి యూట్యూబులో. mayabazar indraganti అని వెదికితే దొరుకుతుంది. అక్కడ మామూలుగానే కథ, కథనం చాలా వీకు. మళ్ళీ అందులో నేను కాస్త ఉప్పందిస్తే మీరు చూడ్డానికేమీ మిగలదు కనుక ఇంతకంటే వివరాలు ఇవ్వను..

మొత్తానికి నాకు ఆసక్తికరంగా అనిపించిన నాలుగు అంశాలు:

* చాలా చోట్ల సంభాషణల్లో వాడిన భాష బాగుంది. “నీకోసం ఎదురుచూస్తూ ఒక మన్వంతరం గడిచిపోయింది” వంటి డైలాగులు ఆట్టే తెలుగు సినిమాల్లో, అందునా ఇప్పటి సినిమాల్లో కనబడవు .. కనుక, ఈ తెలుగు డైలాగుల కోసం మాత్రం నేను మళ్ళీ ఎప్పుడన్నా చూస్తానేమో ఈ సినిమాని..అనిపించింది నాకు. ముఖ్యంగా క్లైమాక్సు దృశ్యాల్లో డైలాగులు నాకు చాలా నచ్చాయి.ఈ మోహనకృష్ణ గారు ఈసారి మంచి కథని ఎంచుకుని ఇలా చక్కగా సంభాషణలు రాస్తే మళ్ళీ చూడాలనుంది.

* పాటల్లో సాహిత్యం కూడా నేను గమనించినంతలో బాగుంది. పాటలు కూడా బాగానే ఉన్నాయి – మోత లేకుండా ప్రశాంతంగా అనిపించాయి కొన్నైతే. అయితే, నేనాట్టే శ్రద్ధ పెట్టి వినలేదు..మళ్ళీ వినాలేమో.

* సినిమా మొత్తంలో నన్ను అందరికంటే ఆకట్టుకున్న నటుడు ధర్మవరపు. ఆయన సొంత గళంలోనే పద్యాలు, పాటల పల్లవులూ అవీ పాడుకున్నట్లున్నారు సినిమాలో.. వినసొంపుగా ఉన్నాయవి.

* సినిమా చివ్వర్లో అందరూ కలిసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం పెట్టడం… ఎప్పుడో నలుపు-తెలుపు సినిమాల కాలంలో శుభం కార్డు పడే ముందు ఇలాంటి దృశ్యాలు ఉండేవి 🙂 🙂 ఇన్నాళ్ళకి చూశా మళ్ళీ అలాంటి దృశ్యం ఒక ప్రధాన స్రవంతి చిత్రంలో.

ఇలాంటి ట్రివియా ఇంకొన్ని ఉన్నాయి కానీ, మొత్తానికి కుబేరుడు, హీరో, హీరోయిన్ – అన్న కాన్సెప్ట్ కొంచెం కొత్తగా, మంచి ఫాంటసీ కథకి వస్తువు కాగల సత్తా ఉన్నట్లు తోచినా, ఈ సినిమాకి కథ అంత గొప్పగా లేదని నాకనిపించింది. ఈ సినిమా చూస్తే, కేవలం ఆ సంభాషణల్లో వాడిన భాష కోసం చూడొచ్చు.ఇంతకీ సినిమాకి మాయాబజారు పేరు పెట్టుకోవడం మాత్రం పబ్లిసిటీ జిమ్మిక్కే అనిపించింది. అంత మాయలేం లేవు అక్కడ.

Advertisements
Published in: on June 21, 2013 at 2:55 pm  Comments (8)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2013/06/21/indragantimayabazar/trackback/

RSS feed for comments on this post.

8 CommentsLeave a comment

 1. sowmya meeru chaala medhavi.

  • ఏదో మీ దయ!

 2. సౌమ్య గారూ!
  అంత చూడ తగ్గ సినిమా కాదంటూనే మీ కాలం, కాలమ్ వృధా చేశారేమో! ‘అంకురం’ లాంటి సినిమా (చూసే ఉంటారు, లేదంటే చూసైనా సరే) పై సమీక్ష వ్రాయండి. మీ రచనా వ్యాసంగ పటిమకు పరమార్ధం, అది చదివిన వాళ్ళకు మార్గదర్శనం అవుతాయి. ధన్యవాదాలు.
  gksraja.blogspot.in

  • రాజా గారు: చూడదగదని సినిమాల గురించి, నచ్చని పుస్తకాల గురించి రాయడం సమయం వృథా అని చాలా మంది ఎందుకు అనుకుంటారో నాకు అర్థం కాదు. వాటి గురించి రాసుకోవడం నేను తప్పనిసరిగా భావిస్తాను. కారణాలు రెండు:
   1. ఎందుకు నాకు నచ్చలేదు? ఏది నాకు నచ్చలేదు? అన్న విషయంలో నాకు స్పష్టత వస్తుంది కనుక.
   2. ఆ సినిమా/పుస్తకం చూడాలనుకుంటున్న ఇతరులెవరైనా ఈ టపా చూస్తే వాళ్ళకి పనికి వస్తుందని నేను అనుకుంటున్నాను కనుకా.

   ఇంతకీ, ఈ సినిమాలో నాకు నచ్చిన అంశాలు ఉన్నాయి – ఉదా. ఇందులో వాడిన భాష. అది కూడా రాశాను ఇక్కడ. కనుక సినిమా నాకు నచ్చలేదని అనను. ఇంతకంటే బాగా తీసి ఉండొచ్చని మాత్రమే అంటాను.

   ఇక, అంకురం విషయం – నేను మళ్ళీ చూసినప్పుడు నాకు ఆ సినిమా గురించి ప్రత్యేకం చెప్పుకోవాల్సిన విషయాలు ఏమన్నా ఉంటే రాస్తాను. మీ సలహాకు ధన్యవాదాలు.

 3. నాకు నచ్చిన ఫ్లాప్ మూవీ ఇది. టీవీలో వచ్చినప్పుడు చూస్తూ ఉంటా.

 4. ఏది నచ్చిందో చెప్పడంతో పాటు ఏది ఎందుకు నచ్చలేదో చెప్పడం కూడా అవసరం అసలే పొగడ్తలు మెచ్చుకోళ్ళు తిని తిని మొహంమొత్తి ఉన్నామాయే!ఇంద్రగంటి నా మిత్రపుత్రుడు!ఆ సినిమా నేను చూసి స్పందిస్తాను!అంకురం తెలుగులో వచ్చిన మంచిసినిమాల మాలలో ఒకటి!ఉమామహేశ్వరరావు అనుకుంటాను దర్శకుడు!పాపం చిరునామాలేకున్డాపోయాడు!

 5. ఈ చిత్రాన్ని చూడ్డానికి విడుదల అయిన మొదటి వారంలోనే మెహదీపట్నము నుండి మల్కజిగిరి దాకా వెల్లాను, ఎకాఎకిన చిత్రాన్ని కొలవలేక పోయినా, అక్కడక్కడా అద్బుతః. భూమిక కథానాయికగా చాలా గమ్మత్తుగా అనిపించింది ఈ చిత్రం లో, చూసి బాగా సిగ్గుపడిపోయాను :).

 6. Nice one. http://www.screentalent.wordpress.com


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: