గుండెల్లో మంచమ్మాయి -1

అది ఒక వసంత ఋతు చలికాలము నాటి రాత్రి. వసంత ఋతు చలికాలమేమిటి తమ వదనం? అని మీరు అనుకొనవచ్చును. కానీ, మీకు తెలియనిది ఏమనగా, ఆ కాలమున చీకటి పడదు. చలీ తగ్గదు. అట్టి సందర్భంలో విరక్తితో ఒకతె అంకోపరి తెరిచెను. అప్పుడు, ఆమెకు అక్కడికి దగ్గర్లోని ఒక కుగ్రామంలాంటి చిన్న నగరం నుండి వచ్చిన ఒక విద్యుల్లేఖ కనిపించినది. కుగ్రామమనెడి చిన్న నగరమేమిటి తమ వదనం? అని మళ్ళీ అనవచ్చును మీరు. నగరానికి చేరువలో ఉన్న కారణాన అన్ని సౌకర్యాలు కలిగినప్పటికీ, నిజానికి కుగ్రామమైన ప్రాంతమది. అట్టి నగరమనున మనం మాటలాడుకొను ఒకతెకొక స్నేహితురాలు. వృత్తి పరిశోధన, ప్రవృత్తి నా గురించి శోధించెడివారికి సాయం చేయుట.

కొద్ది దినముల క్రితము, నేను ఎంతో కష్టముపడి, తెలుగు తెలుగువలె మాట్లాడుట నేర్చుకుని, కొంచెం వయసు ఎక్కువైననూ చిన్న వయసు పాత్ర వేసి, అటులనే వేరొకరి నెత్తిని టోపీ పెట్టుటకు మనసు ఒప్పుకొనకపోవుట వలన స్వయముగా నా(న్న?) ధనం వెచ్చించి ఒకానొక చిత్రరాజము తీయ సంకల్పించితిని. అన్నియు చక్కగా కుదిరినవి. తెలుగు కథ, తెలుగు మాట్లాడు నటులు, యాస, భాష, ప్రాంతీయ గ్రామీణ పదజాలముతో నిండిన సంభాషణలు, మంచి, చెడు అన్ని రకముల పాత్రలూ, ఇన్నీ పెట్టి … అన్నీ నేనై, నేనే అన్నియై …. నన్ను మించినది కథయై… దానికి ఒక తెలుగు నామధేయము ఖోడా (Note: Not a typo) ఏర్పరచి తీస్తిమి.

బొచ్చా, మచ్చా, కచ్చా, ఇవి కాక బుజ్జి, బజ్జి, గజ్జి, పులి, సింహం, కుక్క, నక్క, పంజా, మాంజా, ఇట్టి పెక్కు చిత్రరాజములు వచ్చును. కాని, ఇతరములు మాత్రమే చచ్చును. ఇట్టివన్నీ పుచ్చును అని మేము ఆశించిననూ, ఇవి అందరికీ నచ్చును. జలప్రళయాల్లో చిక్కి కూడా మేము తెలుగు చిక్కగా మాట్లాడుకొనిన, నా స్వభావ స్వరూపములు మార్చి మరీ కష్టపడిననూ వంకలు పెట్టెదరు. వారు నాకు తమ్ములవలే ఉండుట యదార్థమే. ఎంత కష్టపడిననూ, ఎవరి పరిమితులు వారివన్నది యదార్థమే. నా కష్టం తేటతెల్లముగా కనిపించెననీ, నా భాష కావాలసిన స్థాయికి మార్పు పొందలేదని జనము గుసగుసలాడుటా యదార్థమే! మా ఆస్థాన నటిని తాను నటించనంత వరకు మాత్రమే చూసి తట్టుకొనగలమన్న మాటా యదార్థమే. ఆవిడకి ఒకే వంకర నవ్వు తప్ప వేరేదీ తెలియదన్న మాటా యదార్థమే. అయినచో నేమి? ఇతర యదార్థముల మాటేమి? కోళ్ళ పందెములమీద పాట పెడితే కోళ్ళ పేర్లు ఎన్ని పలికితిమి? బెస్తవారి పాటలో బెస్త పదములెన్ని ఉన్నవి? ఇట్టి యదార్థములు మనకేల? మనకి మన పంచి డైలాగులు కావలె. మనకి విదేశీ సందర్శనాలు కావలే వంద రూపాయలకు. మనకి రంగు రంగుల దుస్తుల్లో కథానాయకులు; బట్టలు కొనుక్కోడానికి, కూడు తినడానికి కూడా దిక్కులేని కథానాయికలు – వీరందరూ లేని యదార్థములు యదార్థములా??

ఇట్టి చిత్రరాజములు మెచ్చి, ప్రస్తుతం మాట్లాడుకుంటున్న దానిని మెచ్చని అట్టివారికి సభ్య సమాజమున తిరిగెడి హక్కు లేదని మదీయ ప్రియనేస్తంబు నిశ్చితాభిప్రాయము. ఏమందురు? ఇచ్చటి విషయములు ఈ ఇంటావిడ మాటలు కావు సుమండీ. గుండెల్లోని గోదారిలో పడిపోయి ఈదుకొంటూ ఆవిడ మా ఊరు వచ్చినది. రాగానే, బ్లాగు బ్లాగంటూ స్పృహ తప్పినది. నడిరేతిరి లో సగం స్పృహలో “అమ్మా, మీరెవరో కానీ, కొంచెం ఈ విషయాలు ఫలానా చోట రాసి పెట్టెదరా?” అని అడిగినది. నేను అవాక్కైతిని. నా అభిమాని నన్నే గుర్తు పట్టకపోవుట గొప్ప ఘోరము కాదూ? భాష మారినందువలన గుర్తించలేకపోయినది కాబోలు, అమాయకపు అభిమాని. అయినను, ఏమాటకామాటే చెప్పుకోవలెను – అంత కష్టము లోనూ మమ్ములను తలుచుకోవడం మిక్కిలి ఆనందం కలిగించినది. ఇన్నాళ్ళ నా శ్రమకి తగ్గ ఫలితం ఇట్టి గుప్త అభిమానులే కలిగిస్తుంటిరి. అట్టి మరొక అభిమాని గురించి కూడా తెలిపినది. వారి రచనను ఇక్కడ చూడుడు. ప్రస్తుతమునకు ఇదియె విషయము. ఇంటావిడ స్పృహలోకి వచ్చిన పిదప దీనికి కొనసాగింపు రాగలదు. స్వస్తి.

Published in: on May 28, 2013 at 9:42 pm  Comments (5)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2013/05/28/gundellomanchammai/trackback/

RSS feed for comments on this post.

5 CommentsLeave a comment

 1. Satire బాగుంది.. కొనసాగింపు కోసం వెయిటింగ్ మంచమ్మాయ్! 😀

 2. హహహహ ఈ గుప్త అభిమానుల కాన్సెప్టేదో బాగుందండీ :-)))
  వెయిటింగ్ ఫార్ నెక్స్ట్ పార్ట్.

 3. గుప్త అభిమానం కేక

  మీరు మంచు కొండండోయ్

 4. > అది ఒక వసంత ఋతు చలికాలము నాటి రాత్రి. వసంత ఋతు …

  🙂

 5. మంచమ్మాయి ఇలాంటి టపాళు ఖూఢా రాస్థుంధా?


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: