పి.బి.శ్రీనివాస్ ఉదయం – ఈమాట.కాం వల్ల!

నిన్నటి ఉదయం అంతా ఈమాట పత్రికలో పి.బి.శ్రీనివాస్ గారిపై వచ్చిన వ్యాసాలు చదువుతూ, వారి పాటలు వింటూ గడిచింది. అక్కడికి నేను ఏదో ఆయన వీరాభిమానిని అనుకునేరు. ఏదో, అందరి పాటలు వింటూనే ఆయనవీ వినడమే గానీ, ఆయన రంగు రంగుల పెన్నులు పెట్టుకుంటారు, జరీ తలపాగా ధరిస్తారు, పలు భాషల్లో నిష్ణాతుడు, వాళ్ళ మనవడు బాలనటుడిగా చేశాడు అన్నవి తప్పిస్తే నాకు ఆయన గురించి ఏమీ తెలియదు. ఈమాట.కాం వెబ్ పత్రిక వారు ఈ నెల సంచికలో పి.బి.ఎస్. గురించి ప్రత్యేక వ్యాసాలు, పి.బి.ఎస్. స్వయంగా రాసిన వ్యాసాలు చేర్చడం తో, నేను ఆసక్తిగా చదవడం మొదలుపెట్టాను.

ఇవిగో ఆ వ్యాసాలు:

1. ప్లే బ్యాక్ సింగర్ పి.బి.ఎస్ అని – విష్ణుభొట్ల లక్ష్మన్న, జెజ్జాల కృష్ణమోహన రావు, పరుచూరి శ్రీనివాస్ గార్లు రాసిన వ్యాసం : ఇందులో ఒక యాభై పాటలకన్నా లంకెలు ఉండి ఉంటాయి … నాలుగైదు భాషల నుండి. చాలామట్టుకు వాటి గురించిన వివరాలు కూడా జతచేశారు. చాలా తక్కువ వ్యవధిలో (కళ్ళుతిరిగేలా) బోలెడు పాటల వివరాలతో కూర్చిన వ్యాసం ఇది. ఈ వ్యాసం చదువుతూ, ఆ పాటలు వింటూ పూర్తి చేయాలంటే ఒక నాలుగైదు గంటలు పట్టొచ్చు కనుక, వ్యాసం చదువబోయేవారు దానికి సిద్ధం కండి.

2. సంగీత సాహిత్య శ్రీనివాసుడు – ఏల్చూరి మురళీధరరావు గారి వ్యాసం: చదవగానే… “వావ్!” అనుకున్నా. పి.బి.ఎస్. లోని మేధావి ని పరిచయం చేసిన వ్యాసం… నాకు మొత్తం అర్థమైపోయిందని చెప్పలేను కానీ, ఇది మాత్రం అద్భుతమైన వ్యాసం. బహుశా, నేను మళ్ళీ వచ్చి మళ్ళీ మళ్ళీ చదవబోయే వ్యాసం అనుకుంటున్నాను.

3. హాయిగా పాడుదునా – సాలూరి రాజేశ్వర రావు పై పి.బి.ఎస్. విజయచిత్రలో 60లలో రాసిన వ్యాసం. ఆసక్తికరంగా ఉంది. పి.బి.ఎస్. ఆట్టే క్లిష్టత లేకుండా, మానవభాషలో రాశారు కనుక నా బోంట్లకి కూడా అర్థమైపోయిందని సంతోషం!

4. చలనచిత్ర సంగీత సాహిత్య పోకడలు – మరో పి.బి.ఎస్. వ్యాసం. ఇది కూడా ఆసక్తికరంగా చదివించింది.

– ఆ విధంగా, నా శనివారం ఉదయాన్ని పి.బి.ఎస్., ఈమాట ఆక్రమించారు. నేను ఆరింటికేమో మొదలుపెట్టి, ఈ కార్యక్రమం ముగించుకుని తల తిప్పేసరికి 12 కావొస్తోందని గ్రహించా! 😛 ఈ మధ్య కాలంలో తెలుగు, అందునా పత్రికలు, అందునా ఈమాట జోలికి అసలు వెళ్ళలేదు కనుక, నా స్థాయికి ఇది రికార్డే అనిపించి, ఇలా బ్లాగు రాసుకుంటున్నా 🙂

Advertisements
Published in: on May 5, 2013 at 8:59 am  Comments (5)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2013/05/05/pbsrinivas/trackback/

RSS feed for comments on this post.

5 CommentsLeave a comment

 1. మీరు వ్రాసినది చదివి ఇదిగో, ఇప్పుడే ఈ-మాట లోకి వెళ్ళిచూశాను. నిజమేనండి, నాలుగింటికి నాలుగు వ్యాసాలూ ఆణిముత్యాలే. థాంక్స్…

 2. మీరు కొత్తగా శ్రీనివాస్ గారి గురించి తెలుసుకొన్నట్లు ఉన్నది . అయన పాడిన తెలుగు సినిమా పాటల్లో నాకు బాగా నచ్చినవి,తరుచూ వినేవి;-1.ఏమి రామ కథా శబరీ 2.ఓహో గులాబిబాలా 3.వెన్నెల రేయీ ఎంతో చలీ 4.ఆ నాటి కథ ఒక కలా 5.ఘంటసాల,పాణిగ్రాహి తో కలిసి పాడిన ‘ మదిశారదాదేవి మందిరమే ‘

 3. నాలుగు వ్యాసాలూ చాలా సమగ్రంగా ఉన్నాయి!! థాంక్స్ ఫర్ షేరింగ్..
  మీరనుకున్నట్టే నాక్కూడా పి.బి.ఎస్ అంటే జరీ తలపాగానే 🙂
  ఇక్కడ ఒక సంగీత కార్యక్రమంలో కలవడం జరిగింది.. మాటల పుట్ట అసలు! ప్రసిద్ధ గాయక గాయనీమణులను కలుసుకున్న దానికంటే ఈయనతో నాలుగు మాటలు మాట్లాడటం నాకు చాలా సంతోషాన్నిచ్చింది!

 4. >> “అందునా ఈమాట జోలికి అసలు వెళ్ళలేదు కనుక,”

  అంత కోపం తెప్పించే పని ఈమాట ఏం చేసిందండీ!?!?

  Madhav

  • కోపం కాదండీ.. అంత భారీ వ్యాసాలు చదివే ఓపిక, సమయం లేక కొన్ని నెలలుగా పత్రిక పెద్దగా చూడలేదంతే.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: