అంద నాళ్ (ఆ రోజు) అను ఒక 1954 నాటి తమిళ చిత్రం

శివాజీ గణేశన్ తొలిరోజుల నాటి సినిమాలేవన్నా చూడాలని వెదుకుతూ ఉంటే ఈ సినిమా కనబడ్డది. ఆంగ్ల వికీ పేజీలో-“It is arguably the first film-noir in Tamil cinema and is the first Tamil film to be made without songs.” అన్న వాక్యం నన్ను ఆకట్టుకుంది. తరువాతి వాక్యం – “The film was inspired by the 1950 Akira Kurosawa film Rashômon. However, in contrast to Rashômon, the film’s climax provides a solution to the murder using an Indian proverb as a vital clue.” మరింత ఆకట్టుకుంది. ఆ కారణాల వల్ల యూట్యూబులో ఈ సినిమాని దొరకబుచ్చుకుని చూశాను.

కథ చాలా వివరంగా ఆ వికీ పేజీలోనే ఉంది కానీ, సినిమా చూడాలనుకునే వాళ్ళు దయచేసి మొదటి పేరా దాటి వెళ్ళి చదవకండి.🙂

కథ చెప్పకుండా, సంక్షిప్తంగా సినిమా గురించి చెప్పాలంటే: కథ 1943లో..రెండో ప్రపంచ యుద్ధ కాలంలో…జపాను వారు చెన్నై నగరంపై బాంబులు వేసిన అక్టోబర్ 11 నాటి నుండి మొదలవుతుంది. ఆ రోజున రేడియో ఇంజినీరు రాజన్ (శివాజీ గణేశన్) హత్య చేయబడతాడు. పోలీసు-సీఐడీ వారు మొత్తం ఐదుగురిని అనుమానితులుగా తీర్మానిస్తారు – పక్కింటాయన చిన్నయ్యన్, రాజన్ తమ్ముడు పట్టాభి, పట్టాభి భార్య హేమ, రాజన్ ప్రేయసి అంబుజం, రాజన్ భార్య ఉష (పండరీ బాయి!).విచిత్రంగా, వీళ్ళలో ఒక్కోరికీ ఒక్కో వర్షన్ ఉంటుంది – “ఏం జరిగింది?” అన్న దానికి. చెయిన్ రియాక్షన్ లాగా, ఒక్కొక్కరూ ఒక్కొక్కరిని అనుమానిస్తారు. అసలు జరిగిందేమిటి? అసలు హంతకులు ఎలా దొరికిపోయారు? అన్నది తెల్సుకోవాలంటే సినిమా చూడాలి.

ఈ సినిమా రషొమన్ సినిమా, The Woman in question అన్న ఆంగ్ల సినిమాల నుండి “స్పూర్తి” పొందింది. స్పూర్తి మాత్రమే పొందింది. దేనికీ కాపీ కాదు. వాటి నుండి ఆలోచనలు తీసుకుని, చక్కటి కథ, స్క్రీన్ ప్లే తో తీసిన నిఖార్సైన తమిళ సినిమా ఇది.

నన్ను ఆకట్టుకున్న అంశాలు/నటులు:
* సినిమాలో ఒక పాట, ఒక ఫైటు ఇలాంటి అంశాలేవీ లేకుండా, మొత్తం సినిమాని థ్రిల్లర్ నవల తరహాలో తీయడం. (అఫ్కోర్సు, దీనివల్లో, మరి దేనివల్లో సినిమా వ్యాపారపరంగా అంతగా ఆడలేదంట!)
* కథాంశం కూడా, నాకు కొత్తగా అనిపించింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో చెన్నై పై జపాను వాళ్ళ దాడుల గురించి మా తాతయ్య (వాళ్ళు చెన్నైలో ఉండేవారు అప్పట్లో) చెబుతూ ఉంటే వినడమే కానీ, ఆ నేపథ్యంలో ఇలా ఒక థ్రిల్లర్ సినిమా చూడ్డం బాగుంది. ఆ కాలపు సినిమాలకి, ఈ కాలపు సినిమాలకీ కూడా మన సినిమాలలో (నేను చూసిన వాటిలో) ఇది విభిన్నమైన కథాంశం అనే నా అభిప్రాయం. ఇక ఒక్కొక్కరి దృక్కోణం ఒక్కోలా ఉండటాన్ని చూపే తరహా కథలు నాకెప్పుడూ ఇష్టమైన అంశం కనుక, కథనం కూడా నన్ను ఆకట్టుకుంది.
* సి.ఐ.డీ గా వేసిన జావర్ సీతారామన్ నాకు ఈ సినిమాలో అందరికంటే నచ్చిన నటుడు. ఈయనే ఈ సినిమాకి రచయిత కూడా.
* డైలాగులు కూడా చాలా ఆసక్తికరంగా, ఒక్కోచోట చక్కటి హాస్యంతో ఉండి, ఆకట్టుకున్నాయి నన్ను.
* పండరీ బాయి ని చూడగానే గుర్తించలేకపోయాను కానీ, గొంతు వినగానే గుర్తుపట్టేశా. ఆ తరహా softness అనాలో, మరేమనాలో కానీ…అది ఆమె ట్రేడ్ మార్క్ కాబోలు!🙂
* నిజానికి శివాజీ గణేశన్ ఈ సినిమాలో ఇంకోళ్ళు కథ చెబుతున్నప్పుడు మాత్రమే కనబడతాడు ..సినిమా మొదట్లో హత్య చేయబడతాడు కదా మరి! కొంచెం నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. తెరపై కనబడ్డంత సేపూ నన్ను ఆకట్టుకున్నాడు.
* తక్కిన నటీనటులందరూ కూడా తమ తమ పాత్రలకి న్యాయం చేశారు.

ఈకలేరడం

తక్కిన విషయాలు ఎలా ఉన్నా, రాజన్ రేడియో సామగ్రిని మొత్తం పోలీసులు ఎలా మిస్సయ్యారు? అన్నది నాకు అర్థం కాలేదు. ఎంత ఆ హత్య చేసిన వ్యక్తి మొత్తానికి ఎలాగో మొత్తం మాయం చేసేసి ఉండొచ్చు అని సమాధానపరుచుకుందాం అన్నా కూడా, అలాంటి ఒక అవకాశం ఉందా అక్కడ? అన్నది నా ఊహకు అందడం లేదు.

ఇలాంటిదే ఇంకొకటి – ఆ పక్కింటాయన తూపాకీ పేలిన శబ్దం వినగానే రోడ్లమ్మట పరిగెత్త్కుంటూ వచ్చేసి పోలీసుల్ని పిలవడం… కొంచెం వింతగా అనిపించింది నాకైతే. (ఏమాటకామాటే… ఈ నటుడు భలే గొప్ప కామెడీ చేశాడు!)

మొత్తానికి మాత్రం, నాకు చాలా ఆసక్తికరంగా అనిపించిన సినిమా. రిలీజైన అరవై ఏళ్ళ తరువాత కూడా తాజాగా అనిపించిన సినిమా. సబ్టైటిల్స్ లేవు కానీ – ఇదిగో ఇక్కడ నుండి పధ్నాలుగు భాగాల్లో చూడవచ్చు యూట్యూబులో.

Published in: on March 16, 2013 at 10:54 am  Comments (1)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2013/03/16/andanaal/trackback/

RSS feed for comments on this post.

One CommentLeave a comment

  1. ఈ సినిమా నా కాలేజీ రోజుల్లో ఆదివారం మధ్యాహ్నం దూరదర్శినిలో వచ్చింది. అప్పట్లో ఇలాంటి క్లాసిక్స్ వచ్చేవి ఆ పూట. దర్శకత్వం వీణ బాలచందర్ అనుకుంటాను. నలుపు తెలుపుల్లో ఇంత సస్పెన్స్ థ్రిల్లర్ చూట్టం ఆశ్చర్యంగా అనిపించింది.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: