వంశవృక్షం (తెలుగు) సినిమా నుండి ఒక సంభాషణ

సంక్రాంతి దాకా ఏవీ రాయకూడదనే అనుకున్నా కానీ, ఎస్.ఎల్.భైరప్ప గారి నవల వంశవృక్ష ఆంగ్లానువాదం, తరువాత వంశవృక్షం తెలుగు సినిమా వెండితెర నవల, తరువాత వంశవృక్ష కన్నడ సినిమాలో కొన్ని భాగాలూ – అన్నీ చూశాక ఒకే దృశ్యం అన్నింటిలోనూ గొప్పగా ఉన్నట్లు తోచింది. పదే పదే గుర్తొచ్చింది. అది సరస్వతి తన మామగారిని – “నా కొడుకు ను నాతో పంపేయండి” అని అడిగే దృశ్యం. (నవల, సినిమా (ముఖ్యంగా తెలుగు వర్షన్) రెండింటి మధ్య చాలా తేడాలున్నాయి కానీ, ఈ ఒక్క దృశ్యం విషయంలో మాత్రం ఒకదాన్ని మించి ఒకటి ఉన్నట్లు తోచాయి నాకు.)

దానితో, తెలుగు వెండితెర నవల (సినిమాకి: నవలీకరణ – శ్రీరమణ; సంభాషణలు – ముళ్ళపూడి వెంకటరమణ) లోని ఈ భాగాన్ని టైపు చేస్తున్నా. ఇది కాపీరైట్ ఉల్లంఘన అయిన పక్షంలో తెలియజేయగలరు. ఇక, ఈ అంశంపై అనేక వాదోపవాదాలు – వ్యతిరేక దృక్కోణాలు ఉండడం సహజం. అయితే, ఆ వాదోపవాదాలలో మాత్రం నేను పాల్గొనను అని ముందే మనవి చేసుకుంటున్నాను.

***************


“మావగారూ! గోదావరికి మనమెంత పాత్ర తీసుకెళితే అంతే నీరు దక్కుతుందని మీరు నాకోసారి చెప్పారు”
ఆచార్యులవారు ఆమె జవాబుకి నివ్వెరపోయి చూశారు.

“కఠినంగా మాట్లాడాను. మన్నించండి.” మామగారి నివ్వెరపాటు గమనించిన సరస్వతి అంది.

“తప్పేమీ లేదమ్మా. నేను తీసుకువెళ్ళిన పాత్రలో ఈ ఫలం తప్పకుండా వుందని నాకు నమ్మకం ఉంది. చూడమ్మా – సృష్టికి క్షేత్రం, బీజం రెండూ అవసరమే. అయినా, జన్మించే మొక్క బీజాన్ని బట్టి ఉంటుంది. వరి నాటికే పుట్టే మొక్కను వరిమొక్కే అంటారు గానీ గోధుమ అనరు. క్షేత్రం పేరు చెప్పుకోరు. మా అబ్బాయి మాధవుడు మా యింటివాడు. వాడి బిడ్డ వాడి యింటికి చెందుతాడు. బిడ్డలెపుడు తల్లికిగాని, తండ్రికిగాని చెందరు. వారు కుటుంబం ఆస్తి. నువ్వు కుటుంబంలో భాగంగా ఉంటే ఆ బిడ్డపై నీకు సర్వాధికారాలు ఉంటాయి. నువ్వు కుటుంబాన్ని కాదని అలా వెళ్ళినపుడు – ఆ బిడ్డని వాడి ఆస్తిని ఇంకో ఇంటికి తీసుకెళ్ళే హక్కు నీకు లేదు. ”

ఆచార్యులవారు ఆస్తి అనగానే సరస్వతి ఒక్కసారి తలెత్తి “నాకా ఆస్తి వద్దని ముందే చెప్పాను” అన్నది తీవ్రంగా. ఆచార్యుల వారు గంభీర వదనంతో –
“నీకలా చెప్పే అధికారం లేదు. నీ బతుకు నువ్వు దిద్దుకున్నట్టే వాడి బతుకు వాడూ దిద్దుకుంటాడు. వాడికా జ్ఞానం వచ్చేవరకూ వాడు పుట్టినచోట వాడికి లభించే సంస్కారం, చదువు, సంప్రదాయంతో పాటు వాడికి గల ఆస్తిని కూడా కాపాడి వప్పజెప్పడం కన్నవాళ్ళ ధర్మం. రేపు వాడు పెద్దవాడయ్యాక నా ఆస్తిని ఎందుకు వదిలేశావని నిన్ను అడిగితే…? నా చదువు సంస్కారాలను నాకు తెలీని స్థితిలో ఎందుకు మార్చావని అడిగితే…? నీ మీద కోపిస్తే …? నిన్ను ద్వేషిస్తే ..?”

ఆయన మాటలకు సరస్వతి నివ్వెరపోయింది. ఆచార్యులవారు విశ్వవిరాట్ రూపంలా ఉన్నారు. భయపడుతూ చేతులు జోడించి, మెల్లగా లేచి నిలబడింది సరస్వతి. ఆయన ప్రశాంతంగా చూశి మందహాసం చేశారు.

“అమ్మా, సరస్వతీ! కలవరపడకు – ధర్మమీమాంస వద్దన్నావు కాబట్టి సాధక బాధకాలు మట్టుకే చెప్పాను. నీ బిడ్డను లాక్కుపోయే అధికారం నీకు లేనట్టే, తీసుకుని దానమిచ్చే అధికారం నాకూ లేదు. చెట్టులోని ఓ కొమ్మ ఓ రెమ్మని దానమివ్వలేదు. కాని ధర్మం వేరు – చట్టం వేరు. చట్టప్రకారం తల్లిగా నీ బిడ్డను తీసుకువెళ్ళే హక్కులు నీకే ఉంటాయి. వాటికోసం నేను కోర్టుకు వెళ్ళి నా వంశగౌరవాన్ని రచ్చకెక్కించను. అంతేగాదు – నా వంశం నిలబెట్టడం కోసం బిడ్డని దానమిమ్మని యాచించను. నా మీద, లోపల ఏడుస్తున్న ముసలిదానిమీద జాలిపడమని అర్థించను. నా యింటి దీపం ఆరిపోతే, నా బతుకు చీకటవుతుంది కానీ, లోకం చీకటవదు”

****
***

Advertisements
Published in: on December 1, 2012 at 7:22 pm  Comments (8)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/12/01/vamshavriksham/trackback/

RSS feed for comments on this post.

8 CommentsLeave a comment

 1. ద్వితీయ వివాహం చేసుకున్న తల్లి,లేదా భర్త నుండి విడిపోయిన స్త్రీ బిడ్డ కోసం ప్రాకులాడిన సందర్భాలలో ఇలాంటి ప్రశ్నలనే ఎదుర్కోవలసి వస్తుంది.
  నిజ జీవితానికి ఈ సంభాషణలకి ఎటువంటి వైరుద్ధ్యం లేదు.

  అందుకే నవల చదివినా..లేదా చిత్రం చూసినా ..మిమ్మల్ని ఆ దృశ్యం వెంటాడి ఉంటుంది.

  మంచి దృశ్యాన్ని, సంభాషణల్ని మళ్ళీ గుర్తుచేశారు. ధన్యవాదములు.

 2. You reminded me that good film. Thank you.

 3. ఖలీల్ జిబ్రాన్ చెప్పినట్లు పిల్లలు మన నుంచి వస్తారు కానీ వారు మన సొంతం కాదు అన్న మాట ఎందుకో గుర్తు వచ్చింది.

 4. IR antaru gaa…Kothaga rekkalochena paatedi ?
  –Gopikrishna

  • I have no clue what you mean. But, you can find the song in Raaga.com or youtube or anywhere.

 5. powerful scene. Even as I read the words above, I remembered Somayajulu’s voice/performance.

 6. When I was watching that song late night, VB ekkadekkado tamila moolallonchi IR ni lakkosthundi…ee paata ela miss ayyunda anipichindandi…

 7. నీ బిడ్డను లాక్కుపోయే అధికారం నీకు లేనట్టే, తీసుకుని దానమిచ్చే అధికారం నాకూ లేదు. చెట్టులోని ఓ కొమ్మ ఓ రెమ్మని దానమివ్వలేదు. కాని ధర్మం వేరు – చట్టం వేరు.

  చాలా గొప్ప మాట……నాకు తెలుసు…భార్యాభర్తలు…ఇద్దరు విడిపోయి..ఇద్దరు మొగపిల్లలను…వారిద్దరి తల్లుల దెగ్గర..వదిలేసి…….వేరే పెళ్ళిళ్ళు చేసుకొని.తరిగి పిల్లల్ని కన్నారు…నెలకి…తల్లికి…డబ్బులు పడేస్తుంటారు………….ఇక్కడ ధర్మం, చట్టం..రెండు …జయించాఏమో


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: