The Word and the World – 3

(ఈ టపాలు ఈ పుస్తకం గురించి నేను రాసుకుంటున్న నోట్సు. ఈ సిరీస్ లో తక్కిన టపాలు ఇక్కడ.)
************

Chapter-2 : On Grammar and Linguistic Studies

ఇందులో నాలుగు ఉపశీర్షికలు ఉన్నాయి.
1) పాణిని, యాస్కుడు
ప్రాచీన భారతంలో వ్యాకరణాధ్యయనం ఇతర అధ్యయనాలకి ప్రవేశద్వారం అని భావించేవారు. వేదాధ్యయన పాఠ్యప్రణాళికలో గల ఆరు వేదాంగాలలో వ్యాకరణం ఒకటి (తక్కిన ఐదు: శిక్ష, కల్పము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిషము – ఈ పెద్ద పెద్ద వికీపేజీలు చదవడానికి ఓపిక లేకుంటే వివిధ వేదాంగాల గురించి ఒక చిన్న పరిచయం కోసం ఈమాటలో సురేశ్ కొలిచాల గారు నిర్వహించే “పలుకుబడి” సిరీస్ మొదటి వ్యాసంలో చూడవచ్చు.).

ఈ కారణం వల్ల భారతదేశంలో వ్యాకరణ శాస్త్ర అధ్యయనం చాలా లోతుగా జరిగింది. నాలుగువేల సూత్రాలతో కూడిన సంస్కృత వ్యాకరణం – పాణిని రాసినది – ఎప్పుడో క్రీ.పూ. ఐదవ శతాబ్దం నాటిదైనా ఇప్పటికీ “One of the greatest monuments of human intelligence” (Bloomfield, 1933) అని పొగడబడే అద్భుత రచన. పాణిని వ్యాకరణ సూత్రాల్లో ప్రధాన భాగం వాక్యాలకి మూలకేంద్రాలైన క్రియల నిర్మాణం గురించి ఉంటుంది. వాక్యల్లో కనబడే ఈ క్రియారూపాలని -మూలధాతువు, దాని ప్రత్యయాలు అని రెండు భాగాలుగా విభజించవచ్చు అన్న అంశం ఈ సూత్రాల్లో ముఖ్యమైనది.

ఈ అంశం గురించే పదమూలాలు పరిశోధించే నైరుక్తులకు (Etymologists) పాణినీయులకి (Grammarians who follow Panini) మధ్య వాదోపవాదాలు జరిగేవట. నైరుక్తుల ప్రకారం – అన్ని నామవాచకాలూ ఏదో ఒక క్రియా ధాతువు నుండే పుట్టినవి. ఈ వాదాన్ని యాస్కుడు తన నిరుక్తంలో అతనికి పూర్వుడైన శకటాయనుడి వాదంగా చెబుతూ, సమర్థిస్తాడు. యాస్కుడే గర్గ్యుడనే మరొక సంస్కృత పండితుడి సిద్ధాంతాల గురించి కూడా ప్రస్తావించాడట. ఆయన శకటాయనుడికి మల్లే కాక – కొన్ని నామవాచకపదాలు ఎక్కడనుంచో వేరే పదాల నుండి పుట్టినవి కావనీ, వాటికి అవే మూలాలనీ అన్నాడట – ఈ వ్యూపాయింట్ ని యాస్కుడు ఒప్పుకోలేదు లెండి. కానీ, పాణిని వ్యాకరణంలో ఈ వ్యూపాయింట్కి తగ్గట్లు కొన్ని పదాలకి ధాతు-ప్రత్యయ విభజన లేకుండా ఉండడాన్ని అంగీకరించాడట. ఈ విధమైన సూత్రీకరణల ద్వారా పాణిని ఎన్నో ప్రశ్నలు రేకెత్తించారని తరువాతి భాష్యకారులు వీటిని లోతుగా అధ్యయనం చేశారనీ ఈ రచయిత రాశారు. అలాగే, పాణిని పరిశోధనలు ఆధునిక భాషాశాస్త్ర అభివృద్ధి క్రమంలో కూడా ప్రధాన పాత్ర పోషించాయని కూడా అంటారు. అయితే, ఈ ధాతు-ప్రత్యయ విభజనలు దాటి – వాక్య నిర్మాణం, పదార్థ శాస్త్రం (syntax, semantics) వంటి అంశాల మీద పాణిని కి ఎక్కువ ఆసక్తి లేదని తేల్చారు రచయిత.

ఈయనే తొలి వైయాకరణుడు అనలేము – ఈయనకి ముందు వారి ప్రస్తావన కూడా ఈయన రచనల్లో ఉంది కానీ, అవి అలభ్యం(మరిన్ని వివరాలకి అష్టాధ్యాయి వికీ పేజీ ఇక్కడ).

2) వ్యాకరణం అధ్యయనం చేయడం దేనికి?
దీనికి ప్రాధాన కారణం – శబ్దమూలాలని అధ్యయనం చేసి, ఏది సరైన పదం, ఏది తప్పు? అన్నది తెలుసుకోవడం అని పాణిని వ్యాకరణానికి ఒక వ్యాఖ్యానం రాసిన కైయతుడి అభిప్రాయం. అయితే, పతంజలి తన వ్యాఖ్యానంలో వ్యక్తపరచిన ప్రధాన కారణాలు ఇవి – “protection of scriptural texts in their pristine purity (raksha), transformation of word affixes to suit ritual context (uha), recitation of Scriptures (agama), a simpler way of learning the language (laghu), a way of learning about the proper meanings when ambiguous words are used (asamdeha)”

అయితే, మొత్తానికి ఇవీ కారణాలు అని ప్రత్యేకం ఎక్కడా చెప్పకపోయినా, వేదాంగం కావడం వల్ల వ్యాకరణ శాస్త్రం ప్రాముఖ్యతను సంతరించుకుందని రచయిత అభిప్రాయం. ఆ కాలంలో వ్యాకరణ అధ్యయనం పై ఉన్న చులకన భావాన్ని పోగొట్టడానికి పాణిని వ్యాకరణాన్ని ఒక శాస్త్రం అయ్యేలా ఈ గ్రంథం రాశాడని కూడా ఒక వాదన ఉంది. మొతానికి, పాణిని అభిప్రాయంలో – “language reveals its own secret to one who studies grammar just as the faithful wife reveals her beautiful body to her husband”

3) భాష నేర్చుకోవడం
భాషలోని పదాలని ఎలా నేర్చుకుంటాము? అంటే – దానికి వివరణగా విశ్వనాథుడు సిద్ధాంతముక్తావళిలో చెప్పినట్లు గా చెప్పుకునే ఒక పద్యాన్ని ఉదహరించారు. ఆ ప్రకారం,
“The ancients say that the meaning of a word is learnt from – a) grammar b)analogy c) a lexicon d)the statement of a reliable person e) the speech behavior of elders f) the remaining part of the sentence
g) explanation and h) proximity with well-known words”
-ఇంత వివరంగా ఆ కాలంలోనే రాసారంటే నాకు చాలా గొప్పగా అనిపించింది. అయితే, నేను ఒకళ్ళిద్దరు లింగ్విస్టిక్స్ విద్యార్థులని అడిగా – ఇదంతా వాళ్ళకి ఏదో ఒక తరగతిలోనైనా చెప్పి ఉంటారు కదా అని. నేను విన్న దాని ప్రకారం వాళ్ళ కరికులంలో లేదంట! విదేశాల్లో సరే, కానీ, మన దేశంలో కరికులం లో ఎందుకు లేదో నాకర్థం కాలేదు మరి.

4) సమానార్థకాలు, నానార్థాలు

సమానార్థక పదాల గురించి ఆట్టే వాదోపవాదాలు లేకపోయినా, నానార్థాల గురించి ప్రాచీనుల మధ్య రకరకాల సిద్ధాంతీకరణలు జరిగాయట. ఆ నానార్థ పదం నిజానికి వేర్వేరు అర్థాల గల పదాలకి అన్నింటికీ కలిపి ఒక dummy word అని ఒక వాదం, ఒకే పదానికి చాలా అర్థాలు ఉండే కేసు అని మరొక వాదం ఉండేవట. నిజానికి ఒక పదానికి వాడుక వల్ల ఏర్పడ్డ కొన్ని secondary meanings బాగా వ్యాప్తి చెంది, మరొక primary meaning అవుతాయనీ, అది సహజం అని చాలమంది ప్రాచీనులు అభిప్రాయ పడ్డారు. అయితే, వీళ్ళలోనూ మీమాంసకులనే వారు (ఉదా: కుమరిల భట్టు) సమానార్థకాలనీ, నానార్థాలనీ – రెంటినీ “అపభ్రంశాలు”గా పరిగణించేవారట. అలాగే, ఒకదాన్ని primary meaning ఒకదాన్ని secondary meaning అనీ అనడానికి కూడా వీళ్ళు వ్యతిరేకులట. వీళ్ళ ప్రకారం రెండూ ప్రధాన అర్థాలేనట. మరి వీళ్ళ థియరీకి వ్యతిరేకంగా ఒకే పదానికి మళ్ళీ వేరే అర్థాలు ఎలా ఉంటాయి? అన్న విషయాన్ని వివరించడానికే – అపభ్రంశాల ప్రస్తావన అనమాట!

“In fact the richness of linguistic devices to convey meanings is too great; these theories cannot exhaustively explain them. Theories are selective and within limits they can give some explanatory account for certain phenomena. It is too ambitious to expect a wholesale resolution to all problems.”
-ముఖ్యంగా ఈ చివరి ఉపశీర్షిక చదువుతున్నప్పుడు (అజ్ఞానంతోనైనా) నా మనసులో మెదులుతున్న ఆలోచనలకి అక్షరరూపం ఇస్తూ రచయిత రాసిన ఈ వాక్యాలతో ముగిసిందీ వ్యాసం.

Advertisements
Published in: on November 14, 2012 at 7:00 am  Comments (1)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/11/14/the-word-and-the-world-3/trackback/

RSS feed for comments on this post.

One CommentLeave a comment

  1. […] అనిపించింది. ఇదివరలో దీని గురించి బి.కె.మతిలాల్ గారి పుస్తకంలో ప్రస్తావించారు కానీ ఇంత వివరంగా […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: