The Word and the World – 2

(ఈ టపాలు ఈ పుస్తకం గురించి నేను రాసుకుంటున్న నోట్సు. ఈ సిరీస్ లో తక్కిన టపాలు ఇక్కడ.)
************

Chapter-1 : Introduction

ఇది పుస్తకంలో చర్చించబోయే విషయాలకి (ముందుమాటలతో పోలిస్తే) కొంచెం వివరమైన నాందీ ప్రస్తావన. (నా అవగాహన లో తప్పులు ఉండవచ్చు. ఈ పుస్తకం గానీ, ఈ అంశాలపై ఇతర పుస్తకాలు చదివిన వారు గానీ వచ్చి సరిచేస్తే, నేర్చుకోగలను).

పాశ్చాత్యుల తత్వ శాస్త్రాధ్యయనంలో చాలాకాలం దాకా భాషాతత్వాన్ని గురించిన అధ్యయనానికి ఎక్కువ ప్రాముఖ్యం లేదు కానీ, భారతదేశంలో ఆదినుండీ వేదాధ్యయనంలో భాగంగా, వాటిని సరిగ్గా అర్థం చేసుకునేందుకు భాషాధ్యయనం తోడ్పడడం మూలాన భాషాతత్వ చర్చలు ఉండేవి. ఒక వాక్యమో, పదమో ఏదైనా – వినేవారికి ఎలాంటి జ్ఞాన్ని ఇస్తుంది? ఎలా ఇస్తుంది? పదాల-వాక్యాల సంబంధాలు ఏమిటి? పదాలను ఎలా విభజించాలి? సరైన అర్థ నిర్థారణ కోసం వీటిని ఏ విధంగా పరిశీలించాలి? అసలు ఒక వాక్యాన్ని గాని, పదాన్ని గాని మనం అర్థం చేసుకునే క్రమంలో తార్కిక-మానసిక షితులు ఏవన్నా ఎలా ప్రభావితం చేస్తాయి? భాషాశాస్త్ర సిద్ధాంతాలేమిటి? భాష తత్వమేమిటి? – ఇలాంటి ప్రశ్నల గురించి మన సంస్కృత పండితుల మధ్య విస్తృత అధ్యయనాలు, చర్చలు, వాదోపవాదాలు, సిద్ధాంతీకరణలు జరిగాయట.

ఇక, భర్తృహరి వంటి కొందరు వైయాకరణులు భాష,సృష్టి రెంటి పుట్టుకకి మూలం ఒకటే కనుక భాష పనితీరుని అధ్యయనం చేయడం ద్వారా సృష్టి ని తెలుసుకోవచ్చని అభిప్రాయ పడ్డారని ముందు టపాలో చెప్పాను కదా.

“At times, most excessive pre-occupation with language on the one hand and with philosophy on the other, may indeed be regarded as a characteristic of Indian civilization” (F.Staal, 1969, Sanskrit Philosophy of Language)
-అన్న వాక్యాలు ఉదహరిస్తూ, ఆ పుస్తకంలో భారతదేశంలో భాషాతత్వ అధ్యయనం గురించి వివరంగా వ్రాసారని చెప్పారు రచయిత.

ఇక్కడ నుండి వైయాకరణులు, వారి అధ్యయనాల గురించి పరిచయం చేసే తరువాతి అధ్యాయానికి మళ్ళారు. దాని గురించి వచ్చే టపాలో.

Advertisements
Published in: on November 13, 2012 at 7:00 am  Comments (2)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/11/13/the-word-and-the-world-2/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

 1. హలో అండీ !!

  ”తెలుగు వారి బ్లాగులు” తరుఫున మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు !!

  వెలుగు జిలుగుల దీపావళి నాడు ఆ లక్ష్మీ మాత కటాక్షం
  ఈ యావత్ భారతావనిలో ప్రతి ఒక్కరికీ కలగాలని ఆశిస్తూ …
  ఒక చిన్న విన్నపము ….!!

  రాబోయే నెల డిసెంబర్ 2 వ ఆది వారము (తెలుగు బ్లాగుల దినోత్సవం) లోపల ఒక వెయ్యి తెలుగు బ్లాగులను ఒకదరికి చేర్చాలని సంకల్పించటమైనది

  మీరు అనుమతించి నట్లైతే మీ బ్లాగును కూడా తెలుగు వారి బ్లాగుల సముదాయం లో జతపరిచేదము.
  మీ అంగీకారము తెలుపగలరు

  http://teluguvariblogs.blogspot.in/

 2. ఒక చక్కటి ప్రయత్నం అండీ మీది ! అభినందనలు.

  వ్యాపార ప్రకటనలు ఏవీ లేకుండా శారీరిక, మానసిక వైద్య విషయాల మీద తెలుగు వారికి అవగాహన ఎక్కువ చేయాలనే ఉద్దేశం తో ” బాగు.నెట్
  ( http://www.baagu.wordpress.com or http://www.baagu.net ) అనే బ్లాగును
  మొదలు పెట్టడం జరిగింది. ఈ బ్లాగును మీ సైటు ద్వారా తెలుగు వారందరికీ తెలియ చేయ గలరని ఆశిస్తున్నాను.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: