Philosophies of Language and Linguistics-7

(ఈ టపాలు ఈ పుస్తకం గురించి నేను రాసుకుంటున్న నోట్సు. ముందు భాగాలు – ఇక్కడ)
*****
5) Leonard Bloomfield : Language

Leonard Bloomfield 20వ శతాబ్దంలో అత్యంత ప్రసిద్ధి చెందిన భాషా శాస్త్రవేత్తల్లో ఒకరు. భాషని ఒక పద్ధతి ప్రకారం అధ్యయనం చేయడం గురించి ఒక సంప్రదాయాన్ని ఏర్పరిచి, ఈ క్రమంలో ఎన్నో భాషలపై అధ్యయనాన్ని మొదలుపెట్టించిన వాడు. ఈయన ప్రవేశపెట్టిన పద్ధతిని – Structural Linguistics అంటారు. తరువాతి కాలంలో Noam Chomsky ప్రవేశపెట్టిన సిద్ధాంతాల ప్రభావంలో మరుగున పడే వరకు Bloomfield ప్రభావం అప్పటి భాషా శాస్త్ర పరిశోధనల్లో ప్రస్ఫుటంగా కనబడేది.

ఇక పుస్తకం విషయానికొస్తే, ముఖ్యాంశాలు:

1. “the methods and results in linguistics, inspite of their modest scope resemble those of natural science, the domain in which science has been most successful. It is only a prospect, but not hopelessly remote, that the study of language may help us towards the understanding and control of human events”.
-“control” దాకా వెళ్ళడం ఇప్పట్లో ఊహించలేము కానీ, భాషాధ్యయనానికి ఒక శాస్త్రీయమైన కట్టుబాటు ఉండాలి ప్రతిపాదించడం బ్లూంఫీల్డ్ చేసిన ముఖ్యమైన పని అంటారు ఈ వ్యాస రచయిత.

2. “The mentalistic theory, which […] still prevails both in the popular view and among men of science, supposes that the variability of human conduct is due to the interference of some non-physical factor .. ..”
-అంటూ సాగి, మొత్తానికి ఈ విధమైన ఆలోచనా విధానం భాషాశాస్త్ర అధ్యయనంలో పనికిరాదు అనడం బ్లూంఫీల్డ్ సూత్రీకరణల్లో మరొక ప్రధానమైన ఆలోచన అంటారు ఈవ్యాస రచయిత.

3. బ్లూంఫీల్డ్ ప్రకారం భాషాధ్యయనంలో రెండు ప్రధాన భాగాలు – phonetics, semantics. మొదటి దానిలో అర్థంతో నిమిత్తం లేకుండా – మాటలు ఎలా పుడుతున్నాయి? ఏ విధమైన శబ్దాలు వస్తున్నాయి? ఏ శరీరభాగాల వల్ల ఈ శబ్దాలు వస్తున్నాయి? వంటివి పరిశోధిస్తే, రెండవది ఈ శబ్దాలకి వాటి అర్థాలు ఎలా వస్తాయి? ఏ సందర్భంలో ఏ అర్థం వస్తుంది? వంటి అంశాలు పరిశోధిస్తుంది. అయితే, ఈయన ప్రకారం ఒక భాషని అధ్యయయనం చేయడంలో ఈ రెండో అంశం పట్టించుకోనక్కర్లేదట.
-ఈ పద్ధతిలో ఈయన ప్రభావంలో ఆ కాలంలో వరుసగా: ఒక భాష ఎంచుకుని ఆ భాష మాట్లాడే వారి ఉచ్చారణల నుండి ఆ భాషకు సంబంధించిన వివరాలు డాక్యుమెంట్ చేయడం, వ్యాకరణం రాయడం – ఇలా సాగింది భాషాశాస్త్ర ప్రయాణం చాలా ఏళ్ళు. ఇలాగ ఫోకస్ మొత్తం భాష structure గురించే తప్ప, శబ్దార్థాల గురించి లేకపోవడం వల్ల దీన్ని Structural Linguistics అన్నారు. (అన్నట్లు, ఈ విధంగా detailed descriptions తయారు చేసే విషయంలో ఈయన పాణిని రచనల నుండి కూడా ప్రభావితం అయ్యాడట.)

ఇలా భాషాశాస్త్రం కొనసాగుతూ ఉండగా, 50లు-60ల నాటికి Noam Chomsky వచ్చి – ఇలాక్కాదు, ఈ విధమైన description చాలదు, దీనితో పాటు అసలు భాషలో మనం ఎన్ని విధాలైన patterns generate చేయవచ్చు అన్నది కూడా అధ్యయనం చేయాలి. ఊరికే కొన్ని samples తీసుకుని వాటి వర్ణన ఇచ్చేస్తే చాలదు – అని కొత్త సిద్ధాంతం మొదలుపెట్టాడు. దాన్ని Generative Linguistics అన్నారు. తదనంతర కాలంలో భాషాశాస్త్ర గతిని మార్చివేసిన సిద్ధాంతంగా దీన్ని చెప్పుకుంటారు. (ఈయన గురించి కూడా ఈ పుస్తకంలో ఒక వ్యాసం ఉంది.)

-ఈ టపాలో అసలు వ్యాసంలో వ్యాసరచయిత చెప్పిన సంగతుల కంటే ఈ పుస్తకం గురించిన ఇతర సంగతులే ఎక్కువున్నాయి. అందుకు కారణం ఏమిటంటే –
1) ఈ వ్యాసంలో చెప్పదల్చుకున్న విషయం రెండు మూడు సార్లు చదివినా నాకు స్పష్టంగా అర్థం కాక, నేను వికీ పేజీలు, ఇతర పరిచయ వ్యాసాలూ చదువుకోవడం.
2) వ్యాసంలో రచయిత ఫోకస్ కొంచెం విమర్శనాత్మకంగా ఉండడం వల్ల నేనేదైనా మిస్సవుతున్నానేమో అన్న అనుమానం.

మొత్తానికి, భాష గురించిన ఆలోచనల పరిణామంలో ఇదొక ముఖ్యమైన మలుపే అనిపించింది. ఒక పద్ధతిలో భాషని అధ్యయనం చేయడాన్ని గురించి పునాదులు వేసిన స్టేజీ ఇదే.
ఈ Language పుస్తకం సంగతి తెలియదు కానీ, An Introduction to the study of Language అన్న మరొక బ్లూంఫీల్డ్ పుస్తకం మాత్రం ఆర్కైవ్.ఆర్గ్ సైటులో ఇక్కడ దిగుమతి చేసుకోవచ్చు.

ఈ బ్లాగు టపా రాసేందుకు ఉపయోగపడ్డ మరొక వ్యాసం – Jean Aitchison రాసిన Understand Linguistics పుస్తకంలో ఆధునిక భాషాశాస్త్రం ఎలా అభివృద్ధి చెందిందో క్లుప్తంగా చెప్పిన మూడవ అధ్యాయం.

Advertisements

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/10/29/philosophies-of-language-and-linguistics-7/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: