Philosophies of Language and Linguistics-5

(ఈ టపాలు ఈ పుస్తకం గురించి నేను రాసుకుంటున్న నోట్సు. ముందు భాగాలు – ఇక్కడ)
*****
నాలుగో అధ్యాయంలో రెండు పుస్తకాల గురించిన వివరాలు ఉన్నాయి. జర్మన్ తత్వవేత్త లుడ్విగ్ విట్గెన్స్టైన్ రాసిన రెండు పుస్తకాలలో భాషను గురించిన ప్రస్తావన ఎంత ఉంది? ఏమని ఉంది? అన్నది ఈ వ్యాసం టాపిక్. మొదటి టపాలో చెప్పినట్లు – ఈయన రాసినది చాలా కొంచెం అంట కానీ, తొలి తరం యాంత్రిక అనువాద (Machine Translation) శాస్త్రవేత్తలు ఈయన భావాల వల్ల ప్రభావితం అయ్యారట. ఆ పుస్తకాల పేర్లు – Tractacus Logico Philosophicus; Philosophical Investigations. ఈ రెంటిలోని మొదటి పుస్తకం గురించి ఈ టపా.

4 a) Ludwig Wittgenstein – Tractacus Logico-Philosophicus (1921)
(పుస్తకాన్ని గురించిన అవగాహన కోసం వికీ లంకె ఇక్కడ).
1) ఈయన తర్కానికి భాష కంటే తక్కువ విలువని ఆపాదించాడట. (” ..Wittgenstein, even at that stage, did not see logic as more important than natural language. .. .. Logic therefore is nothing more than some kind of linguistic basis for the things that “we wish” to say in our everyday life” అని రచయిత అన్వయం.)

2) మన భాషా సామర్థ్యం లేకపోతే మనం ప్రపంచాన్ని గురించి ఆలోచించలేమని విట్గెన్స్టీన్ అంటాడట. (“..language creates the “things” of the world by stating certain facts about it… States of affairs can only be expressed by language. They owe their very existence to language.”)

3) “It is as impossible to represent in language anything that ‘contradicts logic’ as it is in geometry to represent by its co-ordinates a figure that contradicts the laws of space or to give the co-ordinates a point that does not exist” (3.032) – ఇది ఆయన ప్రతిపాదించిన సూత్రాల్లో ఒకటి. చాలా ఆసక్తికరంగా అనిపించింది నాకు. అంటే ఏమిటి? ఒకదానికొకటి సంబంధంలేకుండా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ పోవచ్చు కదా భాషలో – మొత్తంగా చూస్తే అది తర్క విరుద్ధం అవ్వదా? అని నాకు సందేహం కలిగింది. ఈ విషయం గురించి కొంచెం వివరణ ఉంటే బాగుండేది కానీ, బహుశా అది మన మెదడుకు మేతేమో!

4) వాటి తాలూకా images కీ మధ్య మన మస్తిష్కంలో ఏర్పడే బంధాల గురించి – విట్గెన్స్టీన్ అభిప్రాయాలు కూడా గతవ్యాసంలో చెప్పిన Saussure అభిప్రాయాలకి దగ్గరలో ఉన్నాయట.

5) ఈయన కూడా ప్లాటో తప్ప పుస్తకంలో ఇప్పటిదాకా వచ్చిన మిగితావారి లాగానే – పదాలకి-అవి సూచించే వస్తువులకీ మధ్య ఉండే సంబంధం సంప్రదాయమే తప్ప absolute truth అనడానికి ఏమీ లేదనే తీర్మానించాడట.

6) మామూలు భాషలో కొన్ని పదాలకి అర్థాలు వేరైనా అవి ఒకే వస్తువును సూచించడం; ఒకే పదానికి వేర్వేరు అర్థాలుండడం వంటివి భాషలోని లోటుపాట్లుగా భావించి, ఇలాంటి ambiguities కి తావు లేని Logical sign language ఒకటుండాలని ప్రతిపాదించాడు. (ఈ విధంగా అయోమయాలకి తావులేని భాషలు కనిపెట్టాలన్న కోరికతో ఇప్పటి దాకా తొమ్మిదొందల పైచిలుకు కృత్రిమ భాషల సృష్టి జరిగిందంటే ఆశ్చర్యంగా ఉన్నా నమ్మక తప్పదు. ఈ విషయం గురించి – In the land of invented languages అని ఒక పుస్తకం చదివాను కొన్నాళ్ళ క్రితం. దాని గురించిన పరిచయం ఇక్కడ).

7) భాష అన్నది ఎన్ని క్లిష్టమైన ఉపక్రియలున్న ప్రక్రియో తెలియకుండానే మనుషులు వాడేస్తూ ఉంటారు. దాని స్వభావాన్ని; దాని వెనుక ఉన్న తర్కాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం – అని అభిప్రాయపడ్డాడు. (Logicను అర్థంచేసుకోవడం భాషను అర్థం చేసుకోవడం కంటే తేలిక అని మొదట్లో వ్యక్తపరచిన అభిప్రాయాన్ని మళ్ళీ ఇక్కడ ప్రస్తావించారు ఈ వ్యాస రచయిత. యాంత్రికానువాద శాస్త్రవేత్తలని ప్రభావితం చేసిన అంశాల్లో ఇది ఒకటి కావొచ్చని నా ఊహ.)

8) తత్వశాస్త్రంలో ఉన్న కొన్ని ప్రశ్నలు కేవలం భాషా తర్కాన్ని (Language Logic) సరిగా అర్థం చేసుకోలేకపోయినందువల్లే వచ్చాయని; కనుక తత్వ శాస్త్రం మొత్తం critique of language అనీ ఈయన అనడం బాగా పేరు పొందిన స్టేట్మెంట్.

9) “Language disguises thought.” – మన ఆలోచనలని భాష ద్వారా మాత్రమే వ్యక్తపరచగలం. కానీ, ఆలోచన అన్నది మాత్రం ఒక black box. దాన్ని మనం నేరుగా access చేయడం కుదరదు.

10) అయితే, ఒక్క పక్క ఇలాగ అంటూనే – “Infact, all the propositions of our everyday language, just as they stand, are in perfect logical order..” (5.5563) అంటాడట ఆయనే మళ్ళీ. దీన్నే ప్రస్తావిస్తూ, ఈ వ్యాస రచయిత ఇది ఈ పుస్తకంలోని contradiction అన్నారు.

11) ఇక, విట్గెన్స్టీన్ అన్న The limits of my language mean the limits of my world. (5.6); We cannot think what we cannot think; so what we cannot think we cannot say either (5.61) – అన్నవి బాగా వాదోపవాదాలకి చోటిచ్చే వ్యాఖ్యలని రచయిత అభిప్రాయపడ్డారు. ఇదివరలో Through the language glass చదువుతున్నప్పుడు ఇదిగో ఇంచు మించు ఇదే ముక్క మీద దాదాపు రెండొందల సంవత్సరాలుగా (అంటే ఈయన ఈ స్టేట్మెంట్ ఇవ్వడంతో సంబంధం లేకుండా భాషా వేత్తల మధ్య) వాదోపవాదాలు జరుగుతున్నాయని చదవడం గుర్తొచ్చింది.

-మొత్తానికి ఇప్పటిదాకా ఈ పుస్తకం ద్వారా పరిచయం అవుతున్న ఆలోచనల్లో ఇంత వివరంగా నాకు అర్థమై, ఆలోచింపజేసి, అసలు ఒరిజినల్ చదవాలి అనిపించేలా చేసింది ఇదే. Tractacus… గూటెంబర్గ్ ప్రాజెక్టులో చదివేందుకు లభ్యం. లంకె ఇక్కడ. ఇది నేను ఎప్పుడో చదవాలి అని నిర్ణయించుకున్నానిక ఈ వ్యాసం చదివాక!

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/10/25/philosophies-of-language-and-linguistics-5/trackback/

RSS feed for comments on this post.

3 CommentsLeave a comment

  1. Excellent Sowmya! References are really useful, interesting. Keep it up.

  2. Thanks! ఎవరో ఒకరు చదువుతున్నారన్నమాట అయితే!!:P

  3. […] – ఇక్కడ) ***** నిన్న మొదలుపెట్టిన Ludwig Wittgenstein రచనల గురించిన వ్యాసానికి కొనసాగింపు […]


Leave a reply to gksraja Cancel reply