Philosophies of Language and Linguistics-4

(ఈ టపాలు ఈ పుస్తకం గురించి నేను రాసుకుంటున్న నోట్సు. ముందు భాగాలు – ఇక్కడ)
*****

3) Cours de linguistique générale – Ferdinand De Saussure (1916)

ప్లాటో అరిస్టాటిల్ ల కాలం నుండి ఒక్క గెంతులో ఇరవైయవ శతాబ్దానికి వచ్చేశారు ఈ పుస్తకంలో. ఆధునిక భాషాశాస్త్రం ఇదిగో, ఇప్పుడు చెప్పబోయే పుస్తకంతోనే మొదలైంది అంటారు. మధ్యలో భాషా శాస్త్రం గురించి ఆట్టే చర్చల్లేవా? లేదంటే భాషా శాస్త్రమే లేదా? ఈ మధ్య కాలంలో యూరోపు, అమెరికాలని వదిలేస్తే, ఇతర ప్రాంతాల్లో భాషా శాస్త్రం గురించి ఎవరూ అభ్యసించలేదా? – ఇన్ని రకాల ప్రశ్నలకి ఇప్పుడే సమాధానాలు వెదకడం మొదలుపెడుతున్నా.

విషయానికొస్తే పుస్తకంలో ప్రస్తుతం ప్రస్తావనలో ఉన్న పుస్తకం – 20వ శతాబ్దపు భాషాశాస్త్ర పితగా అభివర్ణించబడే Ferdinand de Saussure రాసినట్లు భావించే Cours de linguistique générale (Course in General Linguistics) గురించి. రాసినట్లు భావించే – అని ఎందుకంటున్నానంటే, ఆ పుస్తకం ఆయన మరణానంతరం ఆయన క్లాసులో ఇచ్చిన ఉపన్యాసాల నోట్సులని సంకలించి ఆయన విద్యార్థులు ఇద్దరు రూపొందించారు. దీని వల్ల మనం పూర్తిగా సస్యూర్ మాటల్లో చదవము అని పరిశోధకులు అంటారు.

ముఖ్యాంశాలు –

1) గతంలో గ్రీకు తత్వవేత్తలు అనుకున్నట్లు – భాష అంటే పేర్ల మూలాలు కనుక్కోవడం మాత్రమే కాదు (Language is not a nomenclature) అని గట్టిగా చెప్పాడు Saussure.

2) ఒక పేరుకీ, దాని తాలూకా వస్తువుకి మధ్య ఉన్న సంబంధాన్ని నిర్వచించడం అంత తేలిక కాదు అనీ, దానిలో భౌతిక, మానసిక కోణాలు కూడా ఉన్నవనీ మొదటిసారి సూచించాడు. భౌతికమైనవి – పదాలు పలకడంలో పుట్టే శబ్దం లాంటివి. మానసికమైనవి – ఈ శబ్దాలు వినడం వల్ల మెదడులో కలిగే associations వంటివి. ఈ రెంటీనీ #Signifier (Sound Image), Signified (Mental image) అనీ అన్నారు.

“By postulating that the linguistic sign is something actually present in the mind/brain, Saussure sees language as a psychological fact.” -అన్నారీ రచయిత.

అయితే, వీటి రెండింటి మధ్య గల సంబంధం – convention అనే ఈయన కూడా ప్రతిపాదించారు (దైవ నిర్ణితం అనకుండా)

3) తర తరాల మధ్య భాష మార్పు చెందినా, ఉన్నట్లుండి జరిగిపోయి మనుషులు దాన్ని గుర్తుపట్టే విధంగా భాష మార్పు చెందదని Saussure మరొక ప్రతిపాదన.

4) భాషకు సంబంధించి ప్రతి మనిషిలోనూ (వాడేభాష వాడు? అన్న దానితో సంబంధం లేకుండా) ఒక అంతర్గత సామర్థ్యం ఉంటుందని Saussure అనుకుని ఉండొచ్చని రచయిత speculation.

5) LANGAGE, LANGUE, PAROLE అని మూడ కాన్సెప్ట్స్ ఉన్నాయి. Langage అంటే మాటకి పనికి వచ్చే అవయవాలూ గట్రా. langue అంటే భాషా శాస్త్రం. parole అంటే మాట్లాడ్డం అనే ప్రక్రియ జరగడం.

“Saussure in his characterization of language with its somehow dichotomic parts of LANGAGE, LANGUE and PAROLE is undecided in a certain way when it comes to answering the question whether either the social or the individual side of an immensely complex phenomenon as is the case with language has to be emphasized”
-అంటూ ముగింపు వాక్యాలు పలికారు ఈ పుస్తక పరిచయానికి.

*****
(ఈ వ్యాసం చదివి అర్థం చేసుకోవడం బాగా కష్టమైంది. ఆఖరుకి వికీ పేజీలే ఒకటికి రెండుసార్లు చదివితే, ఆ పుస్తకం గురించి అర్థమైంది. Text Complexity గురించి పనిచేసే నాకు ఇదొక కేస్-స్టడీ అయ్యేలా ఉందనిపించింది ఆఖర్లో 😉 )

Advertisements

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/10/23/philosophies-of-language-and-linguistics-4/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: