Philosophies of Language and Linguistics-3

(ఈ టపాలు ఈ పుస్తకం గురించి నేను రాసుకుంటున్న నోట్సు. ముందు భాగాలు – ఇక్కడ)
*****

2) Aristotle – On Interpretation (App 360-350 before our time):

భాషకు సంబంధించి అరిస్టాటిల్ రచనల్లో ప్రస్తావన ప్లాటో కంటే ఎక్కువగా ఉంటుందట. Categories, On Interpretation, Analytics (Prior, Posterior) అన్న నాలుగు పుస్తకాల్లోనూ ఆయన భాషను గురించి తన అభిప్రాయాలు రాసాడట. వీటిల్లో Categories పుస్తకం శబ్దార్థశాస్త్రం (semantics) ప్రధానాంశంగా సాగితే, Analytics రెండు పుస్తకాలు తర్కం (logic) ప్రధానంగా సాగుతాయట.

మొత్తానికి, విషయానికొస్తే, ఈ పుస్తకంలో అరిస్టాటిల్ చెప్పేది –

1) ఈ పదాలు/పేర్లన్నీ – ప్రపంచంలో ఉన్న వస్తువులకి మనిషి మస్తిష్కంలో ఏర్పరుచుకునే చిహ్నాలు, వస్తువులు ఒకటే అయినా, చిహ్నాలు మనుషుల ప్రాంతాలను బట్టి మారవచ్చు.
2) ఒక పేరు/పదాన్ని స్వతంత్రంగా చూస్తే తప్పొప్పుల ప్రసక్తి ఉండదు. ఏవన్నా విధేయాలతో (Predicates) కలిస్తే తప్ప అటువంటి నిర్ణయం తీసుకోలేము
3) పదాలకి ఏర్పడే పేర్లు (నామవాచకాలు) సంప్రదాయంగా ఏర్పడేవే కానీ, దైవ నిర్ణితాలు కావు
4) క్రియలు కూడా ఇంచు మించు నామవాచకాల లాగానే – స్వతంత్రంగా చూడలేమని అరిస్టాటిల్ అభిప్రాయ పడ్డట్లు చెబుతారు (ఈ విషయంలో ఈ పరిచయకర్త నిశ్చయంగా రాయలేదు ఏ విషయమూ)
5) ప్లాటో ప్రతి పదానికి – ఇది తప్పు/ఇది వొప్పు అని నిర్ణయించినట్లే (అదే, దైవ నిర్ణితమైనవే కరెక్టు అని), వాక్యాలని గురించి కూడా అన్నాడు. అయితే, అరిస్టాటిల్ వాక్యాల దాకా వచ్చినా కూడా తప్పొప్పుల ప్రసక్తి లేదంటాడట. వాక్యం ఏదో ఒక విషయాన్ని గురించి – ఉందనో, లేదనో, ఔననో, కాదనో ఇలాగ సమాచారాన్ని చెబుతుందంతే – అని అన్నాడట.

ఈ లెక్కలో, అరిస్టాటిల్ ఆలోచనా విధానం ఆధునిక భాషా శాస్త్ర సిద్ధాంతాలకి దగ్గరలో ఉందని తీర్మానించారు ఈ వ్యాసంలో.

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/10/18/philosophies-of-language-and-linguistics-3/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: