Philosophies of Language and Linguistics-2

(ఈ టపాలు ఈ పుస్తకం గురించి నేను రాసుకుంటున్న నోట్సు. మొదటి భాగం – పుస్తకం గురించి సంక్షిప్త పరిచయం – ఇక్కడ)
*****
1) Plato – Cratylus (app. 400-390 before our time):
ప్లాటో తన రచనల్లో భాష గురించి చెప్పింది చాలా తక్కువంట. అయితే, పాశ్చాత్యుల ఫిలాసఫీలో భాష మూలాల గురించి ప్రసక్తి వచ్చిన మొదటి లిఖిత ప్రతి ఇదేనట. ఈ పుస్తకం మూడు పాత్రల మధ్య పేర్లకీ, అవి వ్యక్తపరచే రూపాలకీ మధ్య సంబంధం గురించి చర్చలా నడుస్తుంది. అంటే – ఫలానా వస్తువుకో, మనిషికో ఉన్న పేరు ఎలా పెట్టారు? అది సబబేనా? కాదా? అసలుకి సబబు అంటే ఏంటిక్కడ? – ఇలాంటివన్నమాట. ఆధునిక భాషాశాస్త్ర దృష్టితో చూస్తే, వీటిల్లో చాలామట్టుకు పరిశీలనలు తేలిపోవచ్చు కానీ, కొన్ని ఉపయోగకరమైన అంశాలున్నాయి అంటారు ఈ వ్యాఖ్యానం రాసినాయన.

ఇందులో మూడు పాత్రలు:
హెర్మోజినిస్ – ఇతను: పేర్ల పుట్టుక కేవలం convention అనీ, ఒక గుంపు మనుషుల మధ్య ఒక వస్తువుకి ఒక పేరు ఏర్పడి వాళ్ళ నోళ్ళలో నాని, అదే స్థిరపడిపోతుంది కానీ, పేర్లకి కరెక్టు తప్పు అని చెప్పేందుకు ఏమీ లేదు అని ఈయన అంటాడు.
క్రెటిలస్ – “there is a kind of inherent correctness in names” అంటాడు.
వీళ్ళ మధ్య చర్చని నిర్వహించేది సోక్రటిస్.

మొదట్నుంచీ, ఇక్కడ చర్చ పదాల ఆవిర్భావం భాష ఆవిర్భావం ఒకటే అన్న ధోరణి లో సాగుతుంది అని అంటారు వ్యాఖ్యానకర్త. సోక్రటిస్ (అంటే ప్లాటో వ్యూ పాయింట్ సోక్రటిస్ మాటల్లో వింటామట) ఇందులో హెర్మోజినిస్ వాదం తప్పు అని తీర్మానిస్తాడు ఆఖర్లో.

ప్లాటో/సోక్రటిస్ అభిప్రాయంలో: “”Gods call things by the names that are naturally right.“..and that these naturally correct names should never be changed or give way to names which do not “fit” the object or person so named.” (బోళ్డ్ వాక్యం ప్లాటో ది, కొనసాగింపు వ్యాఖ్యానకర్తది) … నాకర్థమైన దాన్ని బట్టి ఈ పుస్తకం సారం ఇదే.

ఈ పుస్తకం లో ప్రధాన భాగం – వివిధ పదాలు ఎలా పుట్టాయో (అంటే దేవుళ్ళ పేర్లూ, వస్తువుల పేర్లూ వగైరా) – అన్వేషిస్తూ రకరకాల స్పెకులేషన్ల తరువాత – దేవుళ్ళు ఇచ్చిన పేర్లే కరెక్టు, వాటిని మార్చకూడదు ని తీర్మానించడం అట. ఆధునిక దృక్కోణం నుండి చూస్తే ఈ ప్రక్రియలో అధ్యయనం చేసిన పద్ధతి చాలాచోట్ల అజ్ఞానంతో చేసినట్లు అనిపిస్తుందని వ్యాఖ్యానకర్త అన్నారు.

చివ్వర్లో-

“Looking at the preserved Platonic dialogues we find that nowhere else the question about language and its nature is further elaborated – atleast, if we ignore some rather negligible bits in the Theaetetus as well as in the Sophist. This could suggest that Plato was not very interested in the topic, either because he thought it was not worthwhile to be investigated, or may be he was just afraid to tackle such a complex problem in more depth”

-అంటూ ముగిసిందీ వ్యాసం.

ప్లాటో కాలం లో భాష గురించిన ఆలోచనలు ఇలా ఉండేవన్న మాట – అనుకున్నాను. అంటే మొదట్లో పాశ్చాత్యుల మధ్య భాష గురించిన అభిప్రాయాలు ఇలా ఉండేవన్నమాట. కాలం గడిచేకొద్దీ ఫిలాసఫర్స్ అభిప్రాయాల్లో, భాష గురించిన ఆలోచనలు ఎలా మారుతూ వచ్చాయో, కొన్ని అభిప్రాయాలు అలాగే ఎలా కొనసాగాయో- ఈ పుస్తకంలోని వ్యాసాల ద్వారా నేనూ చదివి తెలుసుకుంటున్నాను… రాబోయే టపాల్లో నాకు అర్థమైనంతలో నోట్సు రాసుకోవాలనే అనుకుంటున్నా ఇంకా. మొత్తానికి ఈ వ్యాసంలో వ్యాఖ్యానం తో పాటు సమ్మరీ కూడా అర్థమయ్యే భాషలోనే ఉన్నట్లు తోచింది.

Advertisements

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/10/17/philosophies-of-language-and-linguistics-2/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: