ఉత్తరాంధ్ర పై గోరేటి వెంకన్న పాట

ఆమధ్య విడుదలైన ఆర్.నారాయణ మూర్తి సినిమా “పీపుల్స్ వార్” లో ఉత్తరాంధ్ర పై గతంలో “శ్రీరాములయ్య” తో వచ్చిన “నను గన్న నా తల్లి రాయలసీమా” పాట తరహాలో ఒక పాట ఉంది. ఆ పాట లాగానే ఇది కూడా చక్కటి తెలుగులో, తేలిక పాటి భాషలో, గొప్ప వాక్యాలు రాసే గోరేటి వెంకన్న గారే వ్రాశారు. పాట వినగానే నచ్చింది. ఒక రెణ్ణిమిషాల విడియో యూట్యూబులో చూశా…అదీ విపరీతంగా నచ్చింది. గత కొన్ని రోజుల్లో బోలెడు సార్లు విన్నా, కొంతమంది చేత వినిపించా. పాట వల్ల నేను తెలుసుకున్న సంగతులూ తక్కువేమీ కాదు. కొన్ని పదాలు/ప్రయోగాలు కూడా మొదటిసారి విని తెలుసుకున్నాను. ఉండబట్టలేక టైపు చేసి నాకు తెలిసినంతలో, తెలుసుకున్నంతలో వివరణ ఇస్తూ, ఈ పాట వినమని ఉద్భోదిస్తూ కొంతమంది స్నేహితులకి ఈమెయిల్స్ కూడా పంపా. ఇప్పుడీ బ్లాగు టపా ప్రధానంగా ఆ ఈమెయిల్ లో ఉన్నదే! ఇక ఆట్టే వ్యాఖ్యానించకుండా ఇదిగో – ఇక్కడ పెట్టేస్తున్నా సాహిత్యం. అలాగే, బ్రాకెట్లలో నాలాగా కొన్ని చోట్ల అర్థం కాని వారి కోసం రిఫరెన్సులు కూడా జతచేస్తున్నా.

పాట రాగా.కాం లో ఇక్కడ వినండి. యూట్యూబులో రెండున్నర నిముషాల వీడియో ఉంది – చూడండి తప్పకుండా, గొప్పగా ఉంది నాకైతే. మొత్తం వీడియో ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తున్నా.

*****
మముగన్న మా యమ్మ ఉత్తరాంధ్రమ్మో, ఉత్తరాంధ్రమ్మో
పసిడి సిరుల కొమ్మ బంగారు బొమ్మో ఉత్తరాంధ్రమ్మా

అరటి ఆకుల వన్నె వరి పాల వెన్న
సిగ్గులొలికే బుగ్గ సిగకొప్పులో మొగ్గ
అద్దమోలె మెరిసే ఉద్దానమమ్మో ఏమందమమ్మో
****
నాగవళ్ళి వంశధార చంపావతి
గోస్తాని తాండవ పంప శారద నదుల
పొంగేటి నవ్వుల గంగ మాయమ్మో ఉత్తరాంధ్రమ్మా
నింగి సాగర తీర బంధమోయమ్మో ఉత్తరాంధ్రమ్మో
(Nagavalli, Vamshadhara, Champavathi, Gosthani, Tandava, Pampa, Sarada – Rivers)

ఆలమందల అరుపు పాడి పంటల మెరుపు
పూల తేనెలొలుకు జీడి మామిడి పలుకు
చిరుగాలి మురిపాన అరకు లోయ కులుకు (Araku Valley)
బొర్రా గుహల వింత ఇల పాల పుంత (Borra Caves)
దక్షిణాదిలోని ఎత్తైన కొండా మహేంద్ర గిరి (Mahendra Giri)
తరగని ఖనిజాల సిరుల పూదండా ఉత్తరాంధ్రమ్మో

***
తెలుగు తల్లీ నేల ఉత్తర వాకిలి – పంపా తీరమ్ము అన్నవర ద్వారంబు (Annavaram)
అనకాపల్లీ తల్లి అమ్మ నూకాలమ్మ – అడిగితే అభయమ్ము అది తీపి బెల్లంబు (Anakapalle – Nookambika/Nookalamma Temple – Also famous for jaggery market)
ఎత్తు మొక్కులనంది, మేటి వరములిచ్చె- పాటి గల దేవుడు సింహాద్రి అప్పన్న (Simhadri Appanna Temple – Narasimhaswami)
సిరుమాను తిరునాళ్ళు అపర కుంభమేళ- పైడితల్లీ లీల మహిమగల్లా నేల (Sirumanu near Vijayanagaram; Paiditalli Ammavaru -Vijayanagaram)
అరసవెల్లి సూర్య భగవాను పాదాల తలవంచి తాకేటి తొలిసంజ కిరణాలు (Arasavelli)
వేణుగోపాలుని లోగిలోయమ్మో ఉత్తరాంధ్రమ్మా (Bobbili Venugopala Swami Temple or Salihundalam Venugopalaswamy temple… I dont know)
నీడలా నడయాడే దేవతోయమ్మో ఉత్తరాంధ్రమ్మా
*****
నాట్యపు రేరాణి కళావరాణి, జాలరి నృత్యమ్ము సంపత్తు సొంతంబు (“Kalavar Ring” Saride Lakshminarasamma, Dr. Dasari Yethiraja Sampath Kumar)
బుర్రకథకే నేటి కుమ్మరి ఘనపాటి (కుమ్మరి మాష్టారు – Dara Appala Narasayya)
హరికథకే కర్త ఆదిభట్ల చిరుత (హరికథా పితామహుడు – ఆదిభట్ల నారాయణ దాసు)
సరిగమల రారాజు సాలూరి వారూ (సాలూరి రాజేశ్వరరావు)
నాదమై నడచిన ద్వారమూ వయోలిను (Dwaram Venkataswamy Naidu)
జగమంత మ్రోగిన మన బొబ్బిలి వీణ- గాన కోకిల సుశీలమ్మ పుట్టిన నేల (P.Susheela)
పాట లోకమ్మేలి ఊగేనే ఉయ్యాల – గాన గాంధర్వుడు ఘంటశాలను మెచ్చి (Ghantasala)
సంగీతమే నేర్పి ఉప్పొంగినాదో విజయనగరమమ్మా (విజయనగరం సంగీత, నృత్య కళాశాల)
సంగీత సాహిత్య సేవ జేసిందో ఉత్తరాంధ్రమ్మా
******

ఆధునిక కవనానికాద్యుడు గురజాడ (Gurajada)
జనము నానుడి నుడుగు ఎలుగెత్తేనే గిడుగు (Gidugu Rammurthy)
మరో ప్రపంచాన్ని చూపిన శ్రీశ్రీ (SriSri)
భావ కవితా ధాటి కృష్ణ శాస్త్రీ మేటి (Krishna Sastri)
మర్మమెరిగిన కాలము చాసో కథన బలము (Cha. Somayajulu)
కలియుగ భీముండు మన కోడి రాముండు (Kodi Rammurthy)
గాయాల పెనుగోత కారా యజ్ఞం గాథ, నిజముతో జతకట్టే రావిశాస్త్రి భుజము (Kalipatnam Ramarao, Raavi Sastri)
ఉరిమే ఉప్పెన పాట వంగపండమ్మో వంగపండమ్మా (Vangapandu PrasadaRao)
జజ్జనకరీ జనక జానపదమమ్మో ఉత్తరాంధ్రమ్మో
*****

పెద్దపులి బొబ్బిలి తాండ్ర పాపారాయ యద్ధమాడిన నేల వైరి తలలే రాల (Tandra paparayudu)
అల్లూరి విల్లమ్ము లెక్కుపెట్టిన గడ్డ – సాయుధ పోరుకు పాదులేసిన అడ్డ (Alluri Sitaramaraju)
సత్యము, కైలాసం ఎత్తినా బందూకు – తామాడ మల్లిక్కు త్యాగాల రణబాట (వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం; తామాడ గణపతి, కదం మల్లిక్ ??)
పంచాది నిర్మల, కృష్ణమూర్తుల తెగువ – తేజేస్వరుడు అగ్ని కణమయ్యి మెరువ (పంచాది నిర్మల, పంచాది కృష్ణమూర్తి, చౌదరీ తేజేశ్వర్ రావు???- Naxal leaders during Srikakulodyamam.)

పాణిగ్రాహీ జముకు – భూస్వాములకు వణుకు (Subbarao Panigrahi; జముకు – “జముకుల కథలు చెప్పేవాళ్లు. ఆకారంలో డబ్బాలాంటి వాద్యం పట్టుకుని ఇద్దరో ముగ్గురో కలిసి పాటపాడుతూ కథచెబుతారు. జముకుల కథలతోనే జనాన్ని రెచ్చగొట్టడం సులభం.” – Andhrabharathi.com)
సర్దారు గౌతు లచ్చన్న – ఆ గర్జన (Gouthu Lacchanna)

తెన్నేటి ఘన నేత – జాతీయోద్యమ గీత-నీతి గల్లా బ్రతుకు నిలయముత్తరాంధ్ర (తెన్నేటి విశ్వనాథం?)
జిలుగు వెలుగుల ప్రగతి శిఖరమమ్మో విశాఖమమ్మా -తెలుగు తల్లి నొసటి తిలకమోయమ్మో విశాఖమమ్మా

******

ఏవన్నా పేర్ల విషయంలో పొరబడి ఉంటే, దయచేసి ఇక్కడ వ్యాఖ్య వదలండి.
ఏదో, పాట చాలా బాగా రాశారని, చక్కటి తెలుగుతో పాటు – ఉత్తరాంధ్ర సంస్కృతి గురించి కూడా బోలెడు సంగతులు తెలియజేసారని ఇక్కడ పెట్టానంతే. అంతకుమించి వేరే ఏ ఉద్దేశమూ లేదు. ముందే చెప్పేస్తున్న మరో విషయం: ఈ పాటకి, గోరేటి వెంకన్న ఇతర రచనలకి సంబంధం లేకుండా ఆంధ్ర/సీమ/తెలంగాణ అంటూ ఏదో ఒకటి వాదులాడి గొడవ పెట్టుకోవాలని చూస్తున్న వారి వ్యాఖ్యలు డిలీట్ చేయబడతాయి (అవునండీ; ఈ మధ్య అలాంటివి కూడా చూశా కొన్ని బ్లాగుల్లో. ఉత్త పుణ్యానికి నోటికొచ్చింది వాగే వ్యాఖ్యలు!)

Advertisements
Published in: on October 1, 2012 at 6:00 am  Comments (13)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/10/01/goretivenkanna-on-uttarandhra/trackback/

RSS feed for comments on this post.

13 CommentsLeave a comment

 1. ఉత్తరాంధ్ర (విజయనగరం జిల్లా) కు చెందిన నాకు మంచి పాటని వినే భాగ్యం కల్పించారు.సినిమాల్లో ఇటువంటి పాట ఒకటి ఉందని తెలియదు నాకు. అయితే ఇటువంటి పాటలు ప్రాతీయ దురభి మానాన్ని పెంచకుండా ఉన్నంతవరకూ మంచిదే. నా మట్టుకు నేను ఏ ప్రాంతపు చరిత్రను చాటే పాటలైనా ఇష్టం గానే వింటాను. Thank you.

  • పాట రాసినాయనే ఉత్తరాంధ్రకు చెందినాయన కాదు. కనుక, కనీసం రాయడం వరకూ అయితే దురభిమానంతో రాయబడలేదు. ఇక వినేవాళ్ళ సంగతి మనం చెప్పలేము.

 2. మొదటి చరణంలో వచ్చిన ఉద్దానమమ్మో ఏమందమమ్మో అన్న దానిలో ఉద్దానం అనే మాట శ్రీకాకుళం జిల్లా లోని ఒక అందమైన ప్రదేశాన్ని సూచిస్తుంది.మంచి వృక్ష సంపద తో అలరారే ఈ ప్రాంతాన్ని ఉద్యానమని పిలిచే వారనుకుంటా. దాని భ్రష్ట రూపమే ఉద్దానం.

 3. పాట చాలా బావుంది. మీరు దీన్ని నలుగురి కీ పరిచయం చెయ్యడం ఇంకా బావుంది. . థాంకులు.

 4. Sahityam chala bagundi. Thanks for introducing such a lovely song.

  G.V.Subrahmanyam

 5. చాలా బాగుంది. సినిమా విజయవంతం కాకపొవడంతో ఇంత మంచి పాట మరుగున పడిపోయింది. మీ వంటి వారి పుణ్యమా అని, వెంకన్న గారి సాహితీ సౌరభాన్ని అస్వాదించగలిగాం, ఉత్తరాంధ్ర వైభవాన్ని పునస్మరణ చేసుకొగలిగాం.

 6. పాట బాగానే ఉంది.కాని ఏదో లిస్టు చదివినట్లుంది కాని కవితా లక్షణాలు తక్కువగా ఉన్నవి.(జానపదగీతమని సరిపెట్టుకున్నా).ఐతే ఇలాటివి స్టేజి మీద నృత్యంచేస్తూ పాడితే ఉత్తేజకరంగా ఉంటాయి.నేను ఉత్తరాంధ్రకు చెందిన వాడినే.పాటలో పేర్కొన్న వన్నీ కరెక్టుగానేఉన్నాయి.కాని కృష్ణశాస్త్రిగారి విషయంలోనే సందేహం.కళింగసీమ అంటే మొదట్లో గోదావరి ,మహానదుల మధ్య దేశం.అలా తీసుకొంటే ప్రస్తుతపు తూర్పు గోదావరి జిల్లా అంతా వస్తుంది.కాని ఇప్పుడు ఉత్తరాంధ్ర అంటే విశాఖ,విజయనగరం ,శ్రీకాకుళం జిల్లాలు మాత్రమే.
  ఉత్తరాంధ్ర అంటే నాకు అభిమానమే కాని ,ఇతర ప్రాంతాలమీద వ్యతిరేకత లేదు.ఆ మాటకొస్తే ఆం.ప్ర.లో అన్నిప్రాంతాలు,జిల్లాలలో కూడా గొప్పవాళ్ళు జన్మించారు.చూడదగ్గ ప్రదేశాలు monuments ఉన్నవి.ఉత్తరాంధ్ర అంత ‘ ‘ రిచ్’ కాకపోయినా సముద్రం, కొండలు ,నదులు పొలాలు ,తోటలతో ,బౌద్ధ,హిందు,స్థూపాలు,దేవాలయాలతో మనోహరంగా ఉంటుంది.కాని సామెత చెప్పినట్లు మన తెలుగునాట ‘ అంగట్లో అన్నీ వున్నా ‘ ! పాట పరిచయానికి ధన్యవాదాలు.

 7. here you go

  • @Upads: I already linked to this bit in the post. What am looking for is the video of the full song.

 8. తెన్నేటి ఘన నేత – జాతీయోద్యమ గీత-నీతి గల్లా బ్రతుకు నిలయముత్తరాంధ్ర

  తప్పకుండా తెన్నేటి విశ్వనాథం గారి గురించే ఈ మాట.

  గోరేటి వెంకన్న పాటలు చాలా అద్భుతం ఉంటాయి. ఆయన పాడుతున్నప్పుడు చూడాలి, వింటున్న వాళ్ళని ఒక ట్రాన్స్ లోకి తీసికెళ్ళిపొయ్యే ఆవేశం ఉంటుంది. ఆయన భావజాలంతో పరిచయం, అభిమానం లేకపోయినా, ఆయన వీడియోలు చూడటం నాకు ఇష్టమైన హాబీ.

 9. ఆ “బ్రాకెట్”ల్లో “ఇంగ్లీష్” లోవి ఎందుకుట? ఏదో కంకరరాళ్ళపైన నడుస్తున్నట్లుంది!

  • …That was to give English spellings so that its easy for people to search if they want. Also, since I give Telugu Wiki links for English Spellings, the article can come in search results for both English as well as Telugu queries.

   Finally, Shoes veskondi 🙂 🙂 (Kidding.)

 10. జాగ్రత్తగా “Censor” చెయ్యబడ్డ బూజు పట్టిన చరిత్ర పుస్తకాల మడతల్లో దొరకని విప్లవ యోధులు – అడవితల్లి ఆణిముత్యాలు శ్రీ సుబ్బారావు పాణిగ్రాహి, వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం, పంచాది నిర్మల, కృష్ణముర్తి మొదలైన త్యాగధనుల గురించి ఈ మాతరానికి చెప్ప సంకల్పించిన “గోరటి” కి సలాం!!


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: