లెక్కల దేశం కబుర్లు-2

ఈ గంటలకి గంటలు అర్థ్రరాత్రయ్యేదాకా డిన్నర్లు తినే సంప్రదాయం వీళ్ళంతా ఏదో మాయ జరిగి మానేస్తే బాగుణ్ణు అని మనసారా కోరుకుంటున్నా కూడా, కొంతలో కొంతైనా రాసుకుందాం అని బ్లాగుతున్నా.

ఉదయాన్నే Ancient Stageira అని ఒక బీసీల నాటి పల్లెకి వెళ్ళాము. మేమున్న ప్రాంతం నుండి ఒకటీ-రెండు కి.మీ. ఉంటుందంతే. వెళ్ళే ముందు అది అరిస్టాటిల్ వాళ్ళ ఊరని మాత్రమే తెలుసు. కానీ, అక్కడ త్రవక్కాలు చేస్తున్న ఆర్కియాలజిస్టు ఒకావిడ వచ్చి మాకు ఆ ప్రాంతం చరిత్ర చెప్పేదాకా అర్థం కాలేదు అక్కడ ఉన్న ఆ కూలిపోయిన కట్టడాలు,విరిగిపోయిన పెంకులూ ఇవన్నీ ఏమిటో! క్రీస్తు పూర్వం 700 నాటి రోజుల నుండీ ఉన్న నగరమట. మధ్యలో ఒకదశలో నగరాన్ని ఫిలిప్ రాజు నాశనం చేసేసి, ఆ తర్వాత మళ్ళీ అరిస్టాటిల్ మీద గౌరవంతో పునర్నిర్మించాడట! కొన్ని మొదటి స్టగీరా నాటి రిమైన్స్, కొన్ని రెండో కాలం నాటివి – ఒక గ్రీకు గుడి తాలూకా (ఇప్పుడు రాళ్ళూ రప్పలే ఉన్నాయి. ఇంకేం లేవు) అవశేషాలు కూడా ఉన్నాయి ఇంకా! ఇంకా వీళ్ళేవో త్రవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. నాకు మాత్రం మంచి హైకింగ్ ట్రిప్ అనిపించింది. ఆ కొండలు ఎక్కుకుంటూ, కింద ఉన్న సముద్రాన్ని, చుట్టుపక్కల ఉన్న కొండలు-గుట్టల్ని చూసుకుంటూ -బాగుండింది.

ఇంతకీ అసలు సంగతి – అది అరిస్టాటిల్ ఊరని లిఖితమైన రుజువులు ఉన్నాయి కానీ, అలాగని చెప్పేసి అక్కడ అరిస్టాటిల్ ఇల్లూ, సమాధీ ఇవన్నీ మార్క్ చేసి ఉన్నాయి అనుకునేరు 🙂 అలాంటివి వీళ్ళకి ఇంకా నిర్థారణగా తెలియవంట. ఒక సమాధి అవశేషాలు చూపించి – ఇది అరిస్టాటిల్ ది అయ్యే అవకాశం ఉంది కానీ, రుజువులేవీ ఇంకా దొరకలేదు అన్నది అర్కియాలజిస్టు అమ్మాయి. ఒకతను అరిస్టాటిల్ ఇల్లేది? అని అడిగాడు. నువ్వు కనుక్కో – నీకు పెద్ద మొత్తంలో ప్రైజు గ్యారంటీ అని జవాబు వచ్చింది. 😉

అక్కడ్నుంచి వచ్చాక కాసేపటికే క్లాసులు మొదలయ్యాయి కానీ, గ్రీస్ ఎంచక్కా మన దగ్గర్లాగే ఉంది – అన్న భావన ఇంతలోపే కలిగేసింది నాకు సూపర్ మార్కెట్కి వెళ్ళగానే. కుటుంబం కుటుంబం అక్కడే ఉన్నారు, మన పచారీ కొట్లు ఇళ్ళ బయటి గదుల్లో పెట్టుకున్నట్లు. పిల్ల ఏడుస్తూ ఉంటే, ఆడిస్తున్న తల్లి, కౌంటర్లో ఇంకో మనిషితో కబుర్లు చెప్పుకుంటున్న ఒకాయన…ఎక్కడ పడితే అక్కడ ఇళ్ళ బయట మీటింగులు పెట్టుకుని కనిపిస్తున్న మనుషులు.. దుమ్ము, మట్టి నిండిన రోడ్లు (:P)…చిల్లర కావాలంటే పక్క షాపుకి వెళ్ళి తెచ్చే అమ్మాయి…

అయితే, వీటన్నింటికంటే నాకు నచ్చింది ఊరిని ఆనుకుని ఉన్న సముద్రం. ఇంత ఖాళీగా ఉన్న సముద్రాన్ని ఎప్పుడూ చూడలేదు నేను. ఇది టూరిస్టు సీజన్ కాదా? లేకపోతే ఈ ప్రాంతం జనం విరగబడి వచ్చే గ్రీసు తీరప్రాంతాల్లో లేదా? అని సందేహం కలిగింది. ఏదైతేనేమి… ఒడ్డున మోకాలి వరకు నీళ్ళొచ్చేదాకా మాత్రం నడుస్తూ గడిపాను సాయంత్రం. రాత్రెలాగో సోషల్ డిన్నర్ పేరుతో మింగేయబడింది అనుకోండి, అది వేరే సంగతి! 🙂

Advertisements
Published in: on September 25, 2012 at 8:15 am  Comments (4)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/09/25/greece-2/trackback/

RSS feed for comments on this post.

4 CommentsLeave a comment

  1. “లెక్కల దేశం కబుర్లు” వ్రాసే విధానం చాలా బాగుంది.

  2. Nice….

  3. 3 వ భాగం కోసం ఎదరుచూస్తూ……

    • అనివార్య కారణాల వల్ల 3 ఉండదేమో అనిపిస్తోంది. 🙂


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: