లెక్కల దేశం కబుర్లు-1

నేనేదో గణితం గురించి చెప్తున్నాను అనుకునేరు….ఒక సమ్మర్స్కూల్ కోసమని గ్రీస్ దేశంలోని ఒలింపియాడా అన్న చిన్న ఊరికి వచ్చాను ఇవ్వాళే. ఎయిర్పోర్టులో అంత అనిపించలేదు కానీ, అక్కడ్నుంచి దార్లో వస్తున్నంత సేపూ ఏదో లెక్కల ప్రపంచంలో తిరుగుతున్నట్లు తోచింది. ఎందుకంటే ఆ లిపిలో ఉన్న అక్షరాల్లో చాలా మట్టుకు గణిత, సైన్సు పాఠాల్లో కనబడే ఫార్ములాల్లో ఉండేవే. అందుకే పేర్లూ, బ్యానర్లు గట్రా చూస్తూ ఉంటే.. లెక్కల ప్రపంచంలో ఉన్నట్లు తోచింది. అందుకే లెక్కల దేశం అనేసా 🙂

గ్రీసు దేశానికి యూరోపు టూరిస్టులు ఎందుకంత విరగబడి వస్తారు? అన్నది కొంచెం అర్థమయింది విమాన ప్రయాణంలో. ఉదయం ఆరింటికి ఎక్కిన ఫ్లయిటు కనుక, నేను ఫ్లయిటెక్కి కునికిపాట్లు పడుతున్నా. ఆ కునికిపాటలోనే రకరకాల రంగులు మారుతూ సూర్యుడు ఉదయించడం చూసి తరించి మళ్ళీ కళ్ళుమూసా. ఒక గంటన్నరా అలా గడిచాక కిటికీ లోంచి చూస్తే, కింద అంతా కొండల మయం. కొండల్లేని చోట్ల ఏవో నదులో, సముద్రమో, వాగులో…ఏవిటో…అది చూస్తూ ఉంటే నాకు ఎందులో గ్రీకు దేవతల కథలే గుర్తొచ్చాయి. కాసేపటికి విమానం థెసలోనికీ విమాణాశ్రయంలో దిగబోతోందనగా కిందకి చూసినప్పుడు కనబడ్డది మాత్రం మర్చిపోలేను. సముద్రతీరంలో ఒళ్ళు విరుచుకున్న అమీబా లా అనిపించింది నాకా నగరం 😛 😛 😛

* ఎయిర్పోర్టు నుండి నాతో పాటు ఇంకో ముగ్గురుకి కలసి ఒక షేర్డ్ టాక్సీ ఏర్పాటు చేశారు ఈ నిర్వహకులు. నేను అందరికంటే ముందే ఊడిపడ్డా కనుక, ఐదు గంటలు కాలక్షేపం చేశా ఎయిర్పోర్టులో. కాఫీల అనుభవాలు అయ్యాయి రెండు.. ఇంకో గంటలో ఆ టాక్సీ వాడు వస్తాడనగా, కాఫీ తాగుదాం అనేసి వెళ్ళా. ఫిల్టర్ కాఫీ అని ఉండింది మెనూలో. కింద ఇన్స్టంట్ హాట్ కాఫీ అని రాసి ఉంది. పైన గ్రీక్ కాఫీ అని రాసి ఉంది. ఆ గ్రీక్ కాఫీ ఈ ఐదుగంటల వెయిటింగు మొదటి గంటలో తాగా. పొడితో సహా ఇచ్చేస్తున్నారు. బాబోయ్, అది మన వల్ల కాదు అనుకుని, ఫిల్టర్ కాఫీ అని అడిగా ఈసారి – పొగలు కక్కుతున్న కాఫీని ఊహిస్తూ. ఓకే, అనేసి తావీద్ మహిమ అన్నట్లు ఒక కప్ ఇచ్చాడు. అదేంటి, ఎక్కడ నుంచి తెచ్చాడూ? అనుకున్నా. పొగలు కక్కట్లేదేంటీ? అని కూడా అనుకున్నా కానీ, చల్లారిపోయిన కాఫీని కూడా ఇలాగ బాహాటంగా మెనూ ఐటెంగా అమ్ముతారని ఊహించలేదు!

* చాలాసేపటికి ఆ టాక్సీ అతను వచ్చాడు మా పేర్లు గల కార్డు ముక్క పట్టుకుని. ఆ మిగితా ముగ్గురు నాకు ఇంకా పరిచయం లేనివాళ్ళు, పైగా అబ్బాయిలు. కాసేపటికి వాళ్ళంతా ఆయా దేశ ప్రాంతాల నుండి వచ్చాక నలుగురం పోగయ్యి ఇక బయలుదేరదాం అనుకుంటూన్నప్పుడు వెంటనే టాక్సీ అతను “ఐ విల్ క్యారీ ది లేడీ’స్ లగేజ్” అంటూ నా సూట్కేసు పట్టుకున్నాడు. నేను అవాక్కయ్యా. మనం అడిగితే సాయం చేస్తారేమో కానీ, ఇలాంటి బంపర్ ఆఫరా? అనుకుని – ఏదో అనబోయేంతలో – “గ్రీసులో అంతే. ఆడవాళ్ళని లగేజీ ఎత్తనివ్వం.” అనేసి ఆయన నవ్వాడు. ఏమిటో, చాలారోజులకి అలా pamper చేయబడ్డందుకేమో కానీ, గ్రీకు మరియాద భలే నచ్చేసింది. మనవాళ్ళూ చేస్తారు కానీ, ఫోజు కోసం చ్సేస్తారని నాకు మహా వీర అనుమానం ఎప్పట్నుంచో! 😉 😉

* ఈ ఊరి పక్కనే అరిస్టాటిల్ పుట్టినఊరు ఉంది 🙂 రేపు క్లాసులు మధ్యాహ్నం నుంచి కనుక పొద్దున్న అలా నడిచి రావాలని ఇక్కడ ప్లాను చేసారు. ఆయనప్పుడెప్పుడో పుడితే నువ్విప్పుడెళ్ళి చూసేదేంటి? అనకండి. ఏదో, ఈ ఊరు వచ్చే ముందు నుంచి ఎక్కడ పడితే అక్కడ ఆ అరిస్టాటిల్ విషయం చెప్పుకుంటూనే ఉన్నారు కనుక, అలా నిర్ణయమైపోయింది. నాకూ కుతూహలంగానే ఉంది – అరిస్టాటిల్ అంతటి అరిస్టాటిల్ వాళ్ళ ఊరా! అని.

* ఏ ముక్కకాముక్కే. నాకేమిటో మనదేశం ఒకటే గుర్తొచ్చింది ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే దారిపొడవునా. ఆ చిన్న చిన్న రోడ్లు, రంగుల రంగుల అక్షరాల్లో షాపుల పేర్లు, మనలాంటి ఇళ్ళలాగే ఉన్న వీథులు, సండే కూడా తీసున్న సూపర్ మార్కెట్లు, వీథి కుక్కలు (అయితే, సైలెంటుగా ఉన్నాయి లెండి!!), వీథి పిల్లులు, కాకాహోటెళ్ళ లాంటి హోటెళ్ళు : ఇలాగ, భలే ఉంది. వీటన్నింటికీ ఒడ్డున బీచి! బీచి ఒడ్డున ఇవన్నీ కూడాననుకోండి! 😉

* ఈ ఊరినిండా హాలిడే-అపార్ట్మెంట్లే ఉన్నాయా ఏమిటి? అని డౌత్ వచ్చింది. ఇవ్వాళ్టికైతే, ఈ హాలిడే అపార్ట్మెంట్లూ, చిన్నా పెద్దా రెస్టారెంట్లూ, సూపర్మార్కెట్లూ తప్ప ఇంకేవీ కనబడలేదు!

* వచ్చేస్తున్నా, నా ఫేవరెట్ టాపిక్- శాకాహారం దగ్గరికి. ఇప్పటికైతే శాకాహారులకి ఈదేశంలో పర్వాలేదనిపించింది. ఇవ్వాళ ఘాట్ రోడ్డులాంటి రోడ్లలో ఈఊరు చేరేసరికి కార్-సిక్నెస్ మూలాన ప్రాణం కలత పడింది, అందువల్ల ఎక్కువ అన్వేషించలేదు, అది వేరే విషయం. బీచిలో నడుస్తూ ఉంటే బన్ను తింటున్న కుక్క వైపు సైలెంటుగా ఫిలసాఫికల్ లుక్కులిస్తున్న రెండు పిల్లుల్ని చూసి కడుపు సగం నిండిపోవడంతో, మిగితా సగం కోసం ఆట్టే శ్రమపడకుండా, ఈక్లాసులకే వచ్చిన మరొకరితో కలిసి (వాళ్ళకి సలాడ్ల గొప్పదనం గురించి లెక్చర్ ఇచ్చి) ఒక చిన్న కాకాహోటెళ్ళో ప్రసిద్ధి చెందిన గ్రీక్ సలాడ్ మింగి, మింగించి దాన్ని జర్మనీలోనే బాగా చేసేలా ఉన్నారు అని తీర్మానించా 🙂

* ఇంతకీ, నాదో సందేహం : ఇంగ్లీషుకి తెలుగులో ఆంగ్లం అన్న పదం ఎక్కడ నుంచి వచ్చింది? అని ఈ గ్రీకు భాషలో ఆంగ్లికా అంటున్నారు ఇంగ్లీషుని.

Advertisements
Published in: on September 23, 2012 at 7:53 pm  Comments (9)  
Tags:

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/09/23/%e0%b0%b2%e0%b1%86%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%b2-%e0%b0%a6%e0%b1%87%e0%b0%b6%e0%b0%82-%e0%b0%95%e0%b0%ac%e0%b1%81%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-1/trackback/

RSS feed for comments on this post.

9 CommentsLeave a comment

 1. గ్రీసులో మీ అనుభవాలు బాగున్నావి.మా అబ్బాయి ఈమధ్య ఈజిప్టు,గ్రీసు చూసివచ్చ్హాడు.గతవైభవమే ఎక్కువ కాని ప్రస్తుతం ప్రముఖదేశాలు కావని చెప్పాడు.గ్రీసు యూరపియన్ సంస్కృతికి మూలం fountainhead అనుకోడం వల్ల యూరప్,అమెరికాల నుంచి యాత్రికులు ఎక్కువగా వస్తారట.ఇక రెండో సంగతి; anglo-saxon లలో తెగ angles అనేవారినుంచి ఆంగ్ల,ఆంగ్లో అనే పదాలు వచ్చాయి.వాళ్ళే ఇంగ్లిష్ వాళ్ళయారు.

 2. చక్కగా వివరించారు, మీ అనుభూతులను…..

 3. wth .. “ఇంగ్లీషుకి తెలుగులో ఆంగ్లం అన్న పదం ఎక్కడ నుంచి వచ్చింది? అని ఈ గ్రీకు భాషలో ఆంగ్లికా అంటున్నారు ఇంగ్లీషుని.” .. i explained this to you a week or two ago x-(

  • Sorry Sorry…Now I remember! 🙂

 4. నేను ఏథెన్స్ లోని హొలార్గోస్ అనే ఊళ్ళో కొంత కాలం ఉన్నాను. హెల్లాస్ నాకు నచ్చిన ప్రదేశాల్లో ఒకటి.

 5. ఫోజు కోసం చ్సేస్తారని నాకు మహా వీర అనుమానం ఎప్పట్నుంచో…generalization …i hope you were kidding!

 6. “సముద్రతీరంలో ఒళ్ళు విరుచుకున్న అమీబా లా అనిపించింది నాకా నగరం”
  ఇది చదవగానే గూగులుపటాల్లోకెళ్ళి ఆదేశం చూసొచ్చా. మీపోలిక ఎలా ఉందంటే: మనదేశం, భూమి, సూర్యమండలం, పాలపుంత,…ఇలా పోతూ విశ్వాన్నంతా ఒక్క ఫోటోలో చూపిస్తారే – సరిగ్గా దానికి వ్యతిరేకంగా – ఓపిపీలికం అమీబాని “zooమ్” చేసి దానికో ‘ఒళ్ళు విరుచుకొనే’ చైతన్యాన్ని కలిగించి వర్ణించారు…కేక!!

  .

 7. “ఇంగ్లీషుకి తెలుగులో ఆంగ్లం అన్న పదం ఎక్కడ నుంచి వచ్చింది? అని ఈ గ్రీకు భాషలో ఆంగ్లికా అంటున్నారు ఇంగ్లీషుని”
  మీకు తెలిసే ఉంటుంది, ఇటాలియన్ భాషయందు ఇంగ్లీషుని ఇంగ్లీస్ ‘inglese’ అంటారుట. మనోల్లు ఇంగిలిపీసు అన్నట్టు!

 8. […] చేరుకున్నాము. ఇదివరలో నేనోసారి గ్రీస్ వెళ్ళాను ఒక సమ్మర్ స్కూల్ నిమిత్తం. అయితే, […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: