Women Writing in India (Volume-1) – 7 (Last)

(ఈసిరీస్ లో మిగితా టపాలు ఇక్కడ చూడవచ్చు)
*******
మొత్తానికి పుస్తకం చాలా ఉపయోగకరంగా ఉంది. ఎందరో రచయితల గురించి, వాళ్ళ వాళ్ళ నేపథ్యాల గురించి, రచనల గురించి తెలుసుకున్నాను. సంపాదకులు ప్రతి సెక్షన్ కి ముందు రాసిన పరిశోధనా వ్యాసాలు మాత్రం ఇంకా నాకు చదవడానికి కష్టంగానే ఉన్నాయి (ఒక్క ఇంట్రో వ్యాసం తప్ప). కొందరి ఆత్మకథల నుండి ఎంచిన అంశాలు చూస్తే, ఒక్కొక్కసారి కల్పిత కథల కంటే నిజజీవితాల్లోనే బోలెడు డ్రామా ఉంటుంది కదా అనిపించింది. చివర్లో చదివినందుకో ఏమో కానీ, Kudiyedathu Thatri కథ నన్ను బాగా కదిలించింది. (అది నిజజీవిత గాథ. గూగుల్ చేస్తే కనిపిస్తుంది). ఈ పుస్తకం గురించి కొంచెం వివరంగా పరిచయం తరువాతెప్పుడన్నా రాయాలని ఉంది కానీ, ప్రస్తుతానికి భవిష్యత్ కాలంలో ఎప్పుడో ఒకప్పుడు చదవాలి అనుకుంటున్న జాబితాలోకి చాలామందే చేరినట్లు ఉన్నారు. నన్ను ఆకట్టుకున్న కొందరి పేర్లైనా ఇక్కడ రాసుకోవాలి అని ఈ టపా:

కవితలు:
తెరిగాథ (క్రీ.పూ. ఆరవ శతాబ్దం నాటి బౌద్ధ భిక్షువులు)
సంగం కవయిత్రులు (ప్రత్యేకించి అవ్వయ్యార్)
అక్క మహాదేవి
తరిగొండ వెంగమాంబ
తల్లాప్రగడ విశ్వసుందరమ్మ
మేరీ జాన్ తొట్టం
సుభద్ర కుమారీ చౌహాన్
మహాదేవి వర్మ
మోక్షొదాయిని ముఖోపాధ్యాయ్ (దొరకదనుకుంటా కానీ ప్రయత్నించాలి)

ఆత్మకథలు, జీవిత చరిత్రలు, ఇతర వ్యాసాలు:
రాససుందరి దేవి (ఆత్మకథ: అమార్ జీబన్)
సావిత్రీ బాయి ఫూలే జీవిత కథ
పండిత రమాబాయి రచనలు
రమాబాయి రనడే ఆత్మకథ
లక్ష్మీబాయి తిలక్ ఆత్మకథ
సుధా చౌహాన్ రాసిన తన తల్లిదండ్రుల జీవితకథ
గుల్ బదన్ బేగం రాసిన హుమయూన్ నామా

కథలు/నవలలు:
కాషిబాయ్ కనిత్కర్
శరత్ కుమారి చౌధురాణి
రొఖెయ షకావత్ హుసేన్
ఇందిరా సహస్రబుద్ధే
నంజనగుడు తిరుమలాంబ
మాలతి బేడేకర్ (విభావరి శిరూర్కర్)
దరిశి అన్నపూర్ణమ్మ
మహాదేవి వర్మ
ఆషాపూర్ణ దేబి
లలితాంబికా అంతర్జనం
సరస్వతి బాయి రాజ్వడే

…ఏదో వీళ్ళలో కొందరి రచనలైనా రాబోయే కాలంలో చదవగలను అని ఆశిస్తున్నా.
(అన్నట్లు, ఈ పోస్టులన్నీ నేను మర్చిపోకుండా ఉండటం కోసమే. పబ్లిక్ గా ఎందుకు నోట్సు రాస్తున్నా అంటే, ఇంకెవరికైనా కూడా పనికిరావొచ్చు అని. మీలో ఎవరన్నా ఇక్కడేదో పాండిత్య ప్రదర్శన జరిగిపోతోంది అని భావిస్తే, పాండిత్య ప్రదర్శనలు ఇలా ఉండవు – అది తెలియకపోవడం మీ సమస్య.)

ఇక ఇప్పటికి ఈ టపాలకి ముగింపు. మళ్ళీ ఇలాంటి పుస్తకం గానీ, దీని రెండో భాగం గానీ చదవడం సంభవిస్తే, మళ్ళీ రన్నింగ్ కామెంటరీ మొదలవుతుంది 🙂

Advertisements
Published in: on September 17, 2012 at 7:00 am  Comments (1)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/09/17/women-writing-in-india-volume-1-7-last/trackback/

RSS feed for comments on this post.

One CommentLeave a comment

  1. వినాయక చవితి శుభాకాంక్షలు!


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: