Women Writing in India (Volume-1) – 6

(ఈసిరీస్ లో మిగితా టపాలు ఇక్కడ చూడవచ్చు)
*******

51) Homvati Devi (1906-1951): తొలి తరం హిందీ రచయిత్రుల్లో ఒకరు. వీళ్ళ ఇంట్లో అనేక సాహితీ చర్చలు జరిగేవట ఆ కాలంలో. అయితే, ఈవిడ రాసిన నాలుగు కథలు మాత్రం దొరికాయట సంపాదకులకి. వాటిలో ఒక కథకి అనువాదం ఉంచారు. సెంటిమెంటుతో పిండేసినట్లు అనిపించింది నాకు (అప్పట్లో పరిస్థితులు అలాగే ఉండేవి కానీ, అలాంటి కథలు చదివి చదివి … బహుశా నాకు బోరు కొట్టేసిందేమో!)

52) Geeta Sane (1907-1991): ఈవిడ 1930లలోనే ఫెమినిస్టు దృక్కోణంతో రచనలు చేశారు అంటారు సంపాదకులు. ఇక్కడ ఆవిడ గురించిన పరిచయంలో ఆవిడ నవలల గురించి చిన్న పరిచయాలు రాశారు. ఆ కథాంశాలు, అలాగే ఆవిడ జీవితం గురించి రాసిన పరిచయం – రెండూ చదివాక ఈవిడ తన కాలానికి చాలా అభ్యుదయ, విప్లవ భావాలతో ఉన్న వ్యక్తి అనిపించింది.

53) Darisi Annapurnamma (1907-1931): పాతికేళ్ళైనా నిండకుండానే మరణించిన దరిసి అన్నపూర్నమ్మ గారు సాంఘిక దురాచారల పై వ్యాసాలు, కథలూ రాశారు. అప్పటి మహిళా ఉద్యమాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు. “Unlike many others who took up issues already raised by the reform movement,Annapurnamma supported the idea of divorce. She felt it was better for the incompatible couple to seperate.” -ఈ ముక్క చదివాక చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ కాలంలో ఈ విషయంపై పబ్లిక్ స్టాన్స్ తీసుకున్న వారు – అందునా మహిళలు ఉన్నారంటే! ఇక్కడ అనువదించిన కథ క్షణకాలంలో పరిస్థితులు మారిపోయి మరీ నాటకీయంగా ముగిసినట్లు అనిపించింది.

54) Mahadevi Varma (1907-1987): హిందీ సాహిత్యంతో ఏకాస్త పరిచయం ఉన్నవారైనా మహాదేవి వర్మ పేరు వినే ఉంటారు అని నా నమ్మకం. చిన్నప్పుడు మొదట మా అమ్మ మాటల్లో పరిచయమైన ఈవిడ మళ్ళీ ప్రచార సభ పరీక్షల పాఠ్య పుస్తకాల్లో కనిపించారు. ఇప్పుడాట్టే గుర్తులేవు కానీ, మామూలుగా ఈవిడ కవయిత్రిగానే కాక, పత్రికా సంపాదకురాలిగా; విద్యావేత్తగా, సామాజిక కార్యకలాపాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొన్న వ్యక్తి. ఈవిడ గురించిన వికీ పేజీ ఇక్కడ. “A certain amount of disservice has been done to Mahadevi Varma’s work and her writing by the mystique that has grown around her as a modern day Mirabai. As a result, her poetry has been discussed mainly in devotional terms, the critical emphasis placed on its Romantic agony rather than on the cultural renaissance it augured or indeed on the explicit and vigorous femist concerns it embodied” అన్నారు సంపాదకులు. అంతా విన్నాక, ఈవిడ రచనలు (కవిత్వం కానివి) ఏవన్నా చదవాలన్న కుతూహలం కలిగింది నాకు 🙂

55) Kuntala Kumari Sabat (1908-1938): ఆధునిక ఒరియా లో తొలి మహిళా రచయిత్రి, ఫెమినిస్టు రచయిత్రి అని అంటారట ఈవిడని. తన చిన్న జీవితకాలంలోనే అనేక కవితలు, కథలు, నవలలు రాశారు. దేశభక్తి పూరితాలైన ఆవిడ కవితలు కొన్ని ఇప్పటికీ జనం నోళ్ళలో నానుతున్నాయట. నాకు ఈవిడ గురించి రాసిన చిన్న పరిచయం చదువుతూ ఉంటే అచ్చమాంబ గారు గుర్తొచ్చారు.

56) Kamla Chaudhry (1908-?): జాతీయోద్యమంలో పాల్గొంటూ, అప్పటి సాంఆజిక, మహిళా సమస్యలను ప్రతిబింబిస్తూ హిందీలో రచనలు చేశారు. స్త్రీల మానసుల్లో జరిగే సంఘర్షణలు కూడా తన కథల్లో చూపారు. ఇక్కడ అనువదించిన కథ “కర్తవ్య” నాకు చాలా నచ్చింది. వాస్తవికంగా కూడా అనిపించింది.

57) Ashapurna Debi (1909-1995): ప్రముఖ బెంగాలీ రచయిత్రి (వికీ పేజీ ఇక్కడ). జ్ఞానపీఠం సహా అనేక అవార్డులు అందుకున్నారు. శతాధిక నవలలు, అనేక కథలూ రాశారు. సంపాదకులు రాసిన పరిచయంలో కొన్ని వాక్యాలు నన్ను ఆకర్షించాయి. ఈవిడ రచనలు కూడా ఏవన్నా చదవాలి అన్న కుతూహలాన్ని కలిగించాయి:
“The profile of her career reads so much like that of a writer of popular romances that we must emphasize that she is not one.”
“Barring notable exceptions such as the scholar and writer Nabaneetha Deb Sen, critics have either dismissed Ashapurna Debi’s writing as “domestic” or ignored it totally. Obviously, a critic trained or indoctrinated in to the perspectives of the “mainstream” is not sensitive to the questions, however broad their import, that arise in a woman’s world, or appreciative of what is at stake in the struggles and victories that take place within it.”

58) Lalithambika Antherjanam (1909-1987): ప్రముఖ మళయాళ రచయిత్రి. సంప్రదాయ నంబూద్రి కుటుంబాలలో మహిళల అణిచివేత గురించి తన కథల్లో, నవలల్లో విస్తృతంగా రాశారు. రైతు కుటుంబంలో ఇల్లాలిగా బధ్యతలు నిర్వహిస్తూనే రాత్రుళ్ళు తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. నంబూద్రి సమాజంలో Kudiyedathu Thatri అన్న మహిళను “దారి తప్పిన మహిళగా” అభివర్ణిస్తారు. ఆవిడ పేరు కూడా ఎత్తడానికి జనం సాహసించని రోజుల్లో లలితాంబిక ఆవిడని గురించి కథ కూడా రాశారు (ఈ తత్రి కథ నిజంగానే కొంచెం షాకింగ్ గా ఉంది. ఈ కథ గురించి, అసలీ స్మార్త విచారం సంప్రదాయం గురించి ఈ వికీ పేజీలో చూడవచ్చు.) ఇంతకీ, ఈ Thatri గురించి లలితాంబిక రాసిన Praticaradevatha (The Goddess of Revenge) అన్న కథకు ఆంగ్లానువాదం ఈ పుస్తకంలో ఉంది. తప్పకుండా చదవవలసిన కథ.

59) Shyamala Devi (1910-1943): పదేళ్ళ పబ్లిక్ కెరీర్ లోనే కన్నడలో కథలు రాసి, మహిళల కోసం కృషి చేసి, పత్రికా బాధ్యతలు కూడా నిర్వహించిన వీరి కథ చదివితే మళ్ళీ అచ్చమాంబ గుర్తొచ్చారు.

60) Saraswati Bai Rajwade (1913-?): కన్నడలో కథలు రాశారు. అలాగే, మాతృభాష మరాఠీ నుండి, తమిళ, హిందీల నుండి కథలను కన్నడంలోకి అనువదించారు. పత్రికను కూడా నడిపారు.

***
(ఇంకొక్క టపా రాసి ప్రస్తుతానికి ఈ సిరీస్ ముగిస్తాను. కొన్నాళ్ళాగి Volume-2 చదవాలి అనుకుంటున్నాను.)

Advertisements
Published in: on September 15, 2012 at 7:00 am  Leave a Comment  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/09/15/women-writing-in-india-volume-1-6/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: