Women Writing in India (Volume-1) – 5

(ఈసిరీస్ లో మిగితా టపాలు ఇక్కడ చూడవచ్చు)
*******

38) Bahinabai Chaudhari (1880-1951): ఇంటిపనులు చేసుకుంటూ పాటలు పాడుకునే జానపద సంప్రదాయంలో మరాఠీలో ఎన్నో పాటలు రాశారు. ఒకసారి అమ్మ పాటను విన్న కొడుకు వాటిని కాగితాల్లోకి ఎక్కించడం మొదలుపెట్టాడు. చాలా కాలం తరువాత, అది ప్రముఖ రచయిత పి.కె.ఆత్రే చేతిలో పడి, బహినాబాయి గురించి ప్రపంచానికి తెలిసింది.

39) Nirupama Devi (1883-1951): బెంగాలీ రచయిత్రి. వితంతువుగా తన మతం విధించిన సాంఘిక ధర్మాలు పాటిస్తూనే, ఖాళీ దొరికినప్పుడు రచనలు చేశారట. కథలు, నవలలు వ్రాసారు. తన కాలంలో అవార్డులూ, అభిమానులూ కూడా ఉన్నారు. కొన్నాళ్ళు మహిళా సంఘాలలో పని చేశారు.

40) Sughra Humayun Mirza (1884-1954): సుగ్రా హుమయూన్ మీర్జా గురించి మహిళావరణంలో ఉంది. అక్కడికీ, ఇక్కడికీ జనన-మరణ తేదీల్లో తేడా ఉందనుకోండి, అది వేరే సంగతి. ప్రముఖ ఉర్దూ రచయిత్రి. కథలు, నవలలు, యాత్రాకథనాలు, కవిత్వం, వ్యాసాలు – ఇలా అన్ని రకాల రచనలూ చేశారు. మహిళాభ్యుదయం కోసం ఎంతో కృషి చేశారు.

41) Nanjanagudu Tirumalamba (1887-1992): బాలవితంతువు అయిన తిరుమలాంబను తండ్రి చదువుకొమ్మని ప్రోత్సహించాడు. ఆతరువాత ఆవిడ క్రమంగా కన్నడలో రచనలు చేయడం మొదలుపెట్టారు. ఆవిడ రచనల్లో వితంతువుల, బాల్య వివాహాల సమస్యలను గురించి చర్చించారు. కన్నడలో మహిళల కోసం తొలి పత్రిక (కర్నాటక నందిని) ని స్థాపించారు. ఒక ప్రచురణాలయం కూడా నడిపారు. అయితే, సంప్రదాయానికి అనుగుణంగా వితంతు వివాహాలని వ్యతిరేకించారట.

42) Janaki Bai (1889-?): ఉర్దూలో కవిత్వం రాశారు. ఆవిడ గురించి ఆట్టే వివరాలు తెలియవు. నర్తకి, గాయనిగా అలహాబాదులో పేరు తెచ్చుకున్నారట. ఇంతలో ఆవిడ అభిమానుల్లో ఒకరు ఆవిడ తనకోసం మాత్రమే ఆడి-పాడాలి అనుకుంటే, ఆమె తల్లి ఒప్పుకోలేదట. అతగాడు కోపంతో వచ్చి జానకీబాయిని 56సార్లు కత్తితో పొడిచాడట. అప్పట్నుంచి ఆమెకి Janakibai Capancuri (Janaki Bai, of the Fifty-Six Knives) అన్న పేరు వచ్చిందట.

43) Indira Sahasrabuddhe (1890-?): మరాఠీ రచయిత్రి. రాసిన నవలలు కొన్నే అయినా, అన్నింటిలోనూ మహిళా గళాన్ని బలంగా వినిపించారని సంపాదకుల అభిప్రాయం. “Indira Sahasrabuddhe is a name unfamiliar to students of Marathi literature, but she, together with Geeta Sane and, somewhat later, Vibhavari Shirurkar, were the formative voices in what might be considered a feminist tradition in Marathi Literature.” – అంటారు సంపాదకులు.

44) Nazar Sajjad Hyder (1894-1967): రచయితల కుటుంబంలో పుట్టి, చిన్న వయసులోనే రచనలు చేయడం ప్రారంభించిన ఈవిడ తరువాతి కాలంలో ఆకాలంనాటి సామాజిక సమస్యలను స్పృశిస్తూ నవలలు రాశారు. పత్రికా సంపాదకత్వ బాధ్యతలు కూడా వహించారు. ఉర్దూ బాలికలకి స్కూళ్ళు కూడా స్థాపించారు.

45) Kalyanamma (1894-1965): కన్నడ రచయిత్రి, సంఘ సేవిక, పత్రికా సంపాదకురాలు. నంజనగుడు తిరుమలాంబ కు సమకాలికురాలు. బెంగళూరులో శారదా స్త్రీ సమాజాన్ని స్థాపించి స్త్రీ అభున్నతి కోసం విశేష కృషి చేశారు. “సరస్వతి” పత్రికను ఒంటిచేత్తో నడిపారు. కథలు, నవలు, వ్యాసాలు చాలానే రాశారు. వాటిల్లో ప్రధానంగా బాలవితంతువుల సమస్యలను చర్చించారు.

46) Tallapragada Viswasundaramma (1899-1949): “It is rare that patriotism, imagination and the ability to write poetry are combined in one person”, Cherla Venkatasastry wrote of Tallapragada Viswasundaramma, who is spoken of as the first woman poet of modern Telugu literature” – అని మొదలైంది ఈవిడ గురించిన వ్యాసం. స్వతంత్ర సంగ్రామంలో చురుగ్గా పాల్గొంటూ కవితలు రాశారు.

47) Mary John Thottam (Sr Mary Begina, 1901-1985): “Many women in Kerala, who would not regard themselves as readers of poetry would have read, and perhaps committed to memory, Mary John Thottam’s 1928 autobiographical poem “Lokame Yatra”…” అంటూ మొదలైంది ఈవిడ గురించిన పరిచయం. ప్రముఖ మలయాళ కవయిత్రి.

48) Sudha Chauhan (1924): స్వతంత్ర సమరయోధులైన తల్లిదండ్రులకు పుట్టి, జాతీయ భావాలున్న వాతావరణంలో పెరిగిన సుధ పిల్లల కోసం హిందీలో రాసిన కవితలకి ప్రసిద్ధి. అలాగే, తన తల్లిదండ్రుల జీవిత చరిత్ర Mila Tej se Tej కూడా పేరుపొందింది. ఇక్కడ ఈ పుస్తకం నుండి కొంత భాగం మనిషా చౌదరి అనువదించారు. అది చదువుతూ వుంటే, వీళ్ళ అమ్మ (ప్రముఖ హిందీ కవయిత్రి సుభద్రా కుమారి చౌహాన్) గురించి విపరీతమైన కుతూహలం కలిగింది. సరిగ్గా ఈ ఎఫెక్టుకోసమే ఈవిడ పరిచయాన్ని సుభద్ర గారి పరిచయానికి ముందు ఉంచారట సంపాదకులు 😉

49) Subhadra Kumari Chauhan (1904-1948): స్కూల్లో చదువుకునేటప్పుడు ప్రచారసభ పరీక్షలు రాసేటప్పుడు తరుచుగా ఈవిడ కవితల గురించి వినడం/చదవడం జరిగేది. ఆ వయసులో చదివినందువల్ల ఆట్టే వస్తువిషయాలు గుర్తులేవు కానీ, పేరు మాత్రం గుర్తుండిపోయింది. స్వతంత్ర సమరంలో చురుగ్గా పాల్గొన్నారు. కథలు కూడా రాశారు. పిల్లల కోసం కూడా కొన్ని కవితలు రాశారు. వికీ లంకె ఇక్కడ.

50) Vibhavari Shirurkar (Malathibai Bedekar, 1905-2001): ఈవిడ గురించి Daughters of Maharashtra పుస్తకంలో మొదట్లోనే ప్రస్తావించారు (ఆ పుస్తకం గురించిన పోస్టులలో కూడా ఈవిడ గురించి రెండు ముక్కల పరిచయం రాశాను). ప్రముఖ అభ్యుదయ రచయిత్రి.

ఇవి కాక, మధ్యలో రెండు Anonymous వ్యాసాలు కూడా జతచేశారు. ఈ రెండూ ఆకాలం నాటి విధవరాళ్ళ జీవితాల గురించి, వారి జీవన పరిస్థితుల గురించీ అవగాహన కలిగించేవే. కొన్ని కొన్ని సార్లు కుటుంబ సభ్యుల ప్రవర్తన ఎంత అమానుషంగా ఉంటుందో! అనిపించింది ఈ వ్యాసాలు చదువుతూ ఉంటే. మొదటిది ప్రసంగం కనుక, కొంచెం generic గా తెలుస్తుంది వాళ్ళ జీవితం గురించి. రెండవది ఆత్మకథాత్మక ధోరణి లో సాగుతుంది – ఒక్కోచోట చదువుతూ ఉంటేనే భయమేసింది.

*****
(ఇంకొక పది మంది రచయితలు మిగిలి ఉన్నారు పుస్తకంలోని ఈ భాగంలో. వారి గురించి వచ్చే టపాలో).

Advertisements
Published in: on September 14, 2012 at 7:00 am  Leave a Comment  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/09/14/women-writing-in-india-volume-1-5/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: