Women Writing in India (Volume-1) – 4

(ఈసిరీస్ లో మిగితా టపాలు ఇక్కడ చూడవచ్చు)
*******

28) Kashibai Kanitkar (1861-1948): పెళ్ళయ్యాక చదవడం నేర్చుకున్న కాశిబాయి తరువాత మరాఠీలో అనేక నవలలు, కథలు, వ్యాసాలు, విమర్శలు రాశారు. Hari Narayan Apte తో స్నేహం ఇరువురి రచనలని ప్రభావితం చేసిందని విమర్శకుల అభిప్రాయం. వివిధ భాగాల్లో ఆవిడ ఆత్మకథ కూడా రాసారు.

29) Sarat Kumari Chaudhurani (1861-1920): ప్రముఖ బెంగాలీ రచయిత్రి. విశ్వకవి టాగోర్ ఈవిడని బాగా ప్రోత్సహించారట. ఇక్కడ తిస్తా బాగ్చీ అనువాదం చేసిన Adorer, na anadorer కథ ఆడపిల్లల గురించి పాత తరం-కొత్త తరం ఆడవాళ్ళ మధ్య వాదోపవాదాలుగా సాగింది. చాలా ఆసక్తికరంగా ఉంది.

30) Krupa Sattianandan (1862-1894): బాంబే ప్రెసిడెన్సీలో మతం పుచ్చుకున్న తొలితరం కుటుంబాలకి చెందిన క్రిపా ఆంగ్లంలో రాసిన ఆత్మకథాత్మక నవల Saguni ఆకాలంలో విశేష జనాదరణ పొందింది. రెండో నవల పూర్తిచేసేలోపే చిన్నవయసులోనే అనారోగ్యంతో మరణించారు. వివిధ జాతుల ప్రజల మధ్య 19వ శతాబ్దంలో సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండేవో ఆవిడ రచనలో చూడవచ్చట.

31) Ramabai Ranade (1862-1924): రమాబాయి మరాఠీలో తాను రాసిన ఆత్మకథ Amachya Ayushyatil Kahi Athawani కి ప్రసిద్ధి. ఇది తన భర్త మహదేవ్ గోవింద్ రనడే తో తన జివితం గురించి రాసినది. పెళ్ళయ్యాకే చదువుకోవడం నేర్చుకున్నా కూడా చురుగ్గా చదువుకుని, ఆంగ్ల మరాఠీలలో ప్రావీణ్యం సంపాదించారు. మహిళా సంఘాల్లో పాల్గొని హక్కుల కోసం పోరాడారు. రనడే మరణం తరువాత ఆయన వ్యాసాలు, ప్రసంగాలని పుస్తకంగా తెచ్చారు. ఇక్కడ ఆవిడ ఆత్మకథలోని ఒక భాగం అనువాదం చేశారు. నిజంగా సంపాదకులు అన్నట్లు, ఆధునిక భర్తలది మరొక రకం నియంతృత్వం కాబోలు అనిపించింది తొలినాళ్ళలో రమాబాయ్ పట్ల ఆమె భర్త నిష్కర్షగా ప్రవర్తించిన విధానం చూస్తూంటే (చదువు విషయం లో…వగైరా)

32) Binodini Dasi (1863-1841): బెంగాలీ నాటకరంగంలో విశేష పేరుప్రఖ్యాతులు గడించారు. “Her autobiography is a major document of the Bengali theatre and among the earliest first person records we have of a woman who remained single and worked for a living” -అన్నారు సంపాదకులు.

33) Cornelia Sorabji (1866-1954): బాంబే యూనివర్సిటీ తొలి మహిళా గ్రాడ్యుయేటు. తరువాత ఆక్స్ఫర్డ్ వి.విద్యాలయం వెళ్ళినా మహిళ అన్న కారణంగా లా డిగ్రీ రావడంలో వివక్షను ఎదుర్కున్నారు. అక్కడ అనేకమంది ప్రముఖులతో పరిచయాలు ఉండేవట. తిరిగొచ్చాక సామాజిక సమస్యల గురించి కృషి చేశారు. ఆవిడ జీవితకాలంలో రాసుకున్న డైరీలు తరువాత చాలా పేరొందాయి. తన జ్ఞాపకాలను కూడా పుస్తకంగా రాసారు. అనేక వ్యాసాలు కూడా వ్రాసారు. చివరి రోజుల్లో చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కున్నారట.

34) Lakshmibai Tilak (1868-1936): లక్ష్మిబాయి తిలక్ రాసిన ఆత్మకథ గురించి ఇప్పటికీ మరాఠీ సాహిత్యంలో చెప్పుకుంటారట. ప్రముఖ మరాఠీ రచయిత నారాయణ వామన్ తిలక్ భార్య ఈవిడ. ఆయన మతం పుచ్చుకోవడం, దానికి ఈవిడ స్పందన, ఆ తరువాత ఈవిడ కూడా ఆ మతాన్ని అధ్యయనం చేయడం, పండిత రమాబాయికి మల్లే ఇరు మతాల మధ్య పోలికలతో సందేహలు తలెత్తడం – ఇదంతా చదువుతూ ఉంటే ఆ ఆత్మకథ కూడా చదవాలి అనిపిస్తోంది నాకు 😉 (కహో నా ప్యార్ హై సినిమా తరువాత ఐదేళ్ళకి హృతిక్ కాల్షీట్లు బుక్ అయినట్లు, నాకూ ఈ పుస్తకం చదివాక కొన్నేళ్ళ పాటు రీడింగ్ లిస్ట్ బుక్ అయిపోయేలాఉంది!)

35) Bandaru Acchamamba (1874-1904): తొలి తెలుగు కథ రాసిన వ్యక్తి. చిన్న వయసులోనే మరణించినా ఇంతలోపే ఆవిడ సాధించినవి తల్చుకుంటే నాకు స్పూర్తివంతంగా అనిపిస్తుంది. అచ్చమాంబ గారి జీవిత చరిత్రను రాసిన సత్యవతి గారు తను ఈ (ప్రస్తుతం నేను చదువుతున్న) పుస్తకం చదివాకే తాను అచ్చమాంబ గురించి రిసర్చి మొదలుపెట్టాను అని రాయడం చూసాకే నేనీ పుస్తకాన్ని తప్పకుండా చదవాలి అనుకుని చదవడం మొదలుపెట్టా నిజానికి. అచ్చమాంబ గారి పుస్తకం గురించి, ఆవిడపై అంతర్జాలంలో ఉన్న వ్యాసాల గురించి లంకెలకి ఈ పుస్తకం.నెట్ వ్యాసం చూడండి.

36) Sarojini Naidu (1879-1949): ప్రముఖ స్వాత్రంత్ర్య సమరయోధురాలు, రాజకీయ నాయకురాలు, రచయిత్రి. భారతకోకిల గా పేరుపొందరు. ఈవిడ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదనుకుంటా…స్కూల్లో అందరూ చదివే ఉంటారు..

37) Rokeya Sakhawat Hossain (1880-1932): ఆంగ్లంలో, బెంగాలీలో మహిళా దృక్కోణంలో రచనలు చేశారు. ఈవిడ రాసిన Sultana’s Dream ఎంతో పేరొందింది. దానితాలూకా అనువాదమే ఇక్కడ ఇచ్చారు కూడా. ఆవిడ మరణానంటరం ఆవిడ గురించి ఏర్పాటు చేసిన సభలో అన్న మాటలు – “If such intelligence, culture, and independence could have been reared in a person who grew up and lived in the dark confines of the home with its many restrictions and suppressions, what have Bengali Muslims to be fearful about?” 🙂
****

(మిగిలిన వారి గురించి రాబోయే టపాలలో!)

Advertisements
Published in: on September 13, 2012 at 7:00 am  Leave a Comment  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/09/13/women-writing-in-india-volume-1-4/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: