Women Writing in India (Volume-1) – 3

(ఈసిరీస్ లో మిగితా టపాలు ఇక్కడ చూడవచ్చు)
*******
నిన్నటితో, Literature of the Ancient and Medieval Periods ముగిసింది. ఇపుడు Literature of the Reform and Nationalist Movements మొదలైంది. ఇక్కడ కూడా, ఈ రచనాకాలాన్ని పరిచయం చేస్తూ సంపాదకులు రాసిన వ్యాసం గురించి కాకుండా, నేరుగా రచయిత్రుల గురించే రాస్తున్నా. ఆ వ్యాసాల గురించి తరువాత ..

18) Jogeswari (early 19th Century): ఈవిడ బెంగాలీ కబియల్ కవయిత్రి. (“Kabigan is a form of poetic duel or repartee, invariably spontaneously composed, which flourished between the middle of the eighteenth and the middle of the nineteenth centuries.”-అని వివరించారు ఈ పద్ధతి గురించి. కబిగన్-లలో పాల్గొనే కవులు కబియల్ అనమాట). కబియల్ ల గురించి రాసిన రచనలో కూడా ఈవిడ ప్రస్తావన లేదట. ఈవిడ జీవితం గురించీ, రచనల గురించి లభ్యమయ్యే సమాచారం తక్కువ. అప్పటి సమాజంలో మహిళల పరిస్థితిని ప్రతిబింబించే రచనలు చేశారు.

19) Bhabani (early 19th Century): tarja, jumur అన్నవి బెంగాలీ జానపదరీతుల్లో ప్రముఖమైనవి. పేదవారి జీవితాన్ని, సమస్యలని ప్రతిబింబిస్తూ, అప్పటి ఉన్నత వర్గాలను పీడించే సమస్యల ప్రస్తావన లేకుండా సాగుతాయట వీటిలోని పాటలన్నీ. పట్టన వాసపు మధ్య తరగతి జీవితం సామాజికంగా శక్తివంతంగా మారాక, ఇటువంటి రీతులన్నీ క్రమంగా “improper” అనీ చెడ్డ పేరు తెచ్చుకున్నాయట. ఇంతకీ, వీటికి బాగా ప్రచారం ఉన్న కాలంలో భబానీ ఒక ప్రముఖ కళాకారిణి. విరివిగా ప్రదర్శనలిచ్చేవారట.

20) Rassundari Devi (1810-?): బెంగాలీలో మొదటి ఆత్మకథ ఈవిడే రాసారట! ఒక మామూలు గృహిణి అయిన ఈవిడ వంటింట్లో పని చేసుకుంటూనే చదవడం, రాయడం నేర్చుకున్నారు. ప్రధానంగా తన దైనందిన జీవితంలోని సంఘటనల గురించే రాసినా, ఆ కాలం నాటి ఆడవారి పరిస్థితుల గురించి ఇదొక నిక్కచ్చి వ్యాఖ్యానం అని సంపాదకుల అభిప్రాయం. (Amar Jiban అన్న ఈ పుస్తకానికి ఆంగ్లానువాదం ఏదైనా ఉందో లేదో చెప్పలేదిక్కడ! నాకు మాత్రం చదవాలని కుతూహలంగా ఉంది. ఇక్కడ Enakshi Chatterjee అనువాదం చేసిన చాప్టర్లు కొన్ని చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.)

21) Hannah Catherine Mullens (1826-1861): బెంగలీలో వచ్చిన తొలి నవల Phulmani O Karunar Bibaran (The story of Phulmani and Karuna) రాసారట. 1852లో ఈ నవల మూడువేల ప్రతులు ముద్రితమై, తరువాత మలి ముద్రణలు కూడా పొంది, వివిధ ప్రాంతీయ భాషల్లోకి కూడా అనువాదం చేయబడిందట. ఈవిడ ప్రధానంగా క్రిస్టియన్ మత సంబంధిత అంశాల గురించి రాసినట్లు ఉన్నారు. బహుశా ఈ కారణం చేతనే చదువుకొన్న హిందూ పాఠకులు ఈవిడ గురించి తరువాతి కాలంలో పట్టించుకోలేదు అని రాసారు సంపాదకులు. క్రిస్టియన్ మతం గురించే కాక, ఆడవారి జీవితాల్లో ఎదురయ్యే ఆరోగ్య సమస్యల గురించి కూడా తన రచనల్లో ప్రస్తావించారట. Madhuchhanda Karlekar అనువాదం చేసిన కొన్ని చాప్టర్లు చదివాక, Phulmani O Karunar Bibaran గురించి కూడా కుతూహలం కలిగింది నాకు :-).

22) Savithribai Phule (1831-1897): ఆధునిక మహారాష్ట్ర లో తొలి మహిళా ఉపాధ్యాయురాలు. 1848లోనే తన భర్త జ్యోతిబా పూలే తో కలిసి మహిళలకోసం స్కూలు స్థాపించారు. సంఘ సంస్కరణలో చురుగ్గా పాలు పంచుకోవడమే కాదు, ఎన్నో కవితలు, జ్యోతీబా పూలే జీవితచరిత్ర కూడా వ్రాసారు. పూలే ఉపన్యాసాల సంకలనానికి సంపాదకత్వం వహించారు. ఆవిడ ఉపన్యాసాలు కూడా పుస్తకాలుగా వెలువడ్డాయి. (ఇక్కడ రాసిన పరిచయం, తరువాత అనుబంధంగా ఇచ్చిన సావిత్రి బాయి లేఖ అనువాదం చదివాక – కినిగె.కాంలో సావిత్రిబాయి పై ఉన్న రెండు పుస్తకాలు – “నేనూ..సావిత్రిబాయిని“, “సామాజిక విప్లవకారిణి సావిత్రీబాయి” త్వరలో చదవాలి అని నిశ్చయించుకున్నాను)

23) Muktabai (1841-?): ఈవిడ గురించి ఏ వివరాలు అందుబాటులో లేవు. ఫూలేలు స్థాపించిన పాఠశాలలో చదువుకున్నారనీ, ఇక్కడ అనుబంధంగా ఇచ్చిన వ్యాసం తనకి పధ్నాలుగేళ్ళ వయసున్నప్పుడు రాశారనీ తప్ప మరే విషయాలూ తెలిసినట్లు లేవు.

24) Mokshodayani Mukhopadhyay (1848-?): తనకాలంలో బాగా పేరుపొందినా, ప్రముఖుల కుటుంబానికి చెందినదైనా – ఈ రచయిత్రి గురించి ఎక్కువ వివరాలు లభ్యం కావడం లేదట. “Banga Mahila (The Woman of Bengal)” పేరుతో బెంగాలీ మహిళల గురించి 1870లలో ఒక పత్రిక నడిపారట. హేమచంద్ర బందోపాధ్యాయ అన్న ప్రముఖ బెంగాలీ రచయిత Bangalir Meye (The Bengali Woman) పేరిట, ఒక వ్యంగ్య కవిత రాశాడట. అది అప్పట్లో చాలా పేరు తెచ్చుకుందట. అదే సమయంలో మహిళల నుండి వ్యతిరేకతను కూడా ఎదుర్కుందట. దానికి కౌంటర్ గా మోక్షొదాయిని Bangalir Babu (The Bengali Babu) అని మరొక కవిత రాశారట 🙂 అయినా, ఇప్పుడీ కవిత లో కొంతభాగం మాత్రమే లభ్యం. బంకిం చంద్రుడు తన పత్రికలో ఈ కవితను గురించి ప్రస్తావిస్తూ రాసిన సంపాదకీయం లో వాడిన టోన్ నాకు విపరీతమైన చిరాకు పుట్టించింది కానీ (..”I am always afraid to praise poems written by women, since it might instigate other women to desert their household duties and take up the pen…… “..”But women have got so used to being extolled for what they are-their beauty, their culinary abilities, their beautiful needle work-that it may not be worth their while to receive praise from unknown men..”) మొత్తానికి ఆ బంగాలిర్ బాబు కవిత మాత్రం కేక (ఆంగ్లానువాదం-సుప్రియా చౌదరి)

25) Tarabai Shinde (1850-1910): Stri Purush Tulana అన్న ఈవిడ మారాఠీ వ్యాసం రాసిన కాలంలో బాగా ప్రాచుర్యం పొందిందట. తరువాత 1975లో S.G.Malshe కనుగుఒనే దాకా, మరుగున పడిపోయింది. సంపాదకుల ప్రకారం – ఈవిడ మొదటి భారతీయ ఫెమినిస్టు విమర్శకురాలు. “The critic Maya Pandit describes her writing as ‘racy and absolutely full of fire’…” అని రాసారు సంపాదకులు ఈవిడ గురించి చెబుతూ. అయితే, ఇది తప్పితే ఆవిడ మరింకేవన్నా రాసారా లేదా? అన్నది ఇక్కడ ప్రస్తావించలేదు.

26) Swarnakumari Devi (1856-1932): తన జీవిత కాలంలో విశేషంగా పేరుపొందిన రచయిత్రి, పత్రికా సంపాదకురాలు. బెంగాలీ లో సైన్సు రచనలను తన పత్రికలో ప్రోత్సహించేవారట. సాంఘిక కార్యకలాపాల్లో కూడా చురుగ్గా పాల్గొన్న స్వర్ణకుమారి రబీంద్రనాథ్ టాగోర్ సోదరి. వారిద్దరి మధ్యా సంబంధాల గురించి కూడా ఈ వ్యాసంలో ప్రస్తావించారు – నాక్కొంచెం ఆసక్తికరంగా అనిపించింది ఆ కథ. అలాగే, ఆశ్చర్యకరంగాకూడా. ఈవిడ గురించిన వికీ పేజీ ఇక్కడ.

27) Pandita Ramabai Saraswati (1858-1922): “The greatest woman produced by modern India and one of the greatest Indians in all history” – అని ఈవిడ గురించి A.B.Shah రాశారట. తన జీవితకాలంలో విశేష పేరు ప్రఖ్యాతి తెచ్చుకోవడంతో పాటు, బోలేడు విమర్శలని కూడా ఎదుర్కున్నారట. ఈవిడ గురించి ఇలాగ రెండు ముక్కల్లో చెప్పడం నా వల్ల కావడంలేదు కానీ, ఈ వికీ పేజీ చూడండి. ఊరికే జీవితకథ రెండు పేజీల్లో చదవగానే – “అద్భుత వ్యక్తి” అనిపించే వ్యక్తులు అరుదుగా ఉంటారేమో… ఈవిడ గురించి ఇక్కడ రాసింది చదివాక నాకు అలాగే అనిపించి, మరింత తెలుసుకోవాలి అనిపించింది.

***
మిగితా వారి గురించి రాబోయే టపాలలో. ఏమాటకామాటే – పుస్తకం మాత్రం విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది నాకు పలువురు రచయిత్రులపై.

Advertisements
Published in: on September 12, 2012 at 7:00 am  Leave a Comment  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/09/12/women-writing-in-india-volume-1-3/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: