Women Writing in India (Volume-1) – 2

(ఈ సిరీస్ లో మొదటి భాగం ఇక్కడ చూడవచ్చు)
*****

11) Gul-Badan Begum (1523-1603): ముఘల్ వనిత. హుమయూన్ సోదరి. బాబర్ కూతురు. “హుమయూన్ నామా” పేరిట ఈవిడ పర్షియన్ భాషలో రాసిన చరిత్ర పుస్తకం తక్కిన చరిత్ర పుస్తకాల లాగ కాక, దైనందిన రాచరికపు జీవితంలోని సాధక బాధకాల గురించి ఒక మహిళా దృక్కోణంలో చెప్పింది అంటారు ఈ సంపాదకులు. (నిజం చెప్పొద్దూ, ఇక్కడ ఈవిడ గురించి రాసింది చదవగానే, ఆ హుమయూన్ నామా మీదకి మనసుపోయింది నాకు!)

12) Chandrabati (1550-1600): ఎక్కువగా భక్తి-ఆధ్యాత్మిక సంప్రదాయాల నుంచి కవిత్వం వెలువడుతున్న రోజుల్లో రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ రాసిన బెంగాలీ కవయిత్రిగా చంద్రాబతి ని గురించి వర్ణించారు సంపాదకులు. ఖిల్జీ కాలం లో మొదలై అక్బర్ పాలనలో కొనసాగిన కొన్ని చట్టాల గురించి, వాటి వల్ల మహిళలకి ఎదురైన సమస్యల గురించి తన Sundari Malua లో రాసారట. ఇందులో 1247 పద్యాలు ఉన్నాయట.

13. Bahinabai (1628-1700): ఈవిడ మరాఠీ లో అభంగ్ కవితలు రాసారు. వ్యక్తిగత జీవితం, వివాహం మొదలుకుని ఆధ్యాత్మిక అనుభవాల దాకా వివిధ అంశాలపై అభంగ్ లు రాసారు. “Unlike many of the women saints in the bhakti period, Bahinabai does not present herself as the one who breaks free of constraints of marriage and wanders abroad in search of God, who is imaged as a lover. Her bhakti is not the ecstatic release of a Mirabai or an Akkamahadevi. Perhaps out of sagacity, perhaps out of timidity, she reconciled her duties to her husband with ther devotion to God and his saints.” – అని వ్రాసారు ఆవిడ గురించి సంపాదకులు.

14. Sanciya Honnamma (late 17th Century): మైసూర్ రాజా వారి ఆస్థానంలో సేవకురాలిగా పని చేసే వారట. ఆస్థాన కవి సింగరాచార్య ఈవిడలోని ఆసక్తిని గమనించి చదవడం-వ్రాయడం నేర్పారట. ఈ నేపథ్యంలోంచి చూస్తే, ఈవిడ రాసిన Hadibedaya Dharma (ఇల్లాలి బాధ్యతలు) లోని పద్యాలు ఇప్పటికీ ప్రజలలో నానుతున్నాయంటే విశేషంగానే అనిపిస్తుంది. ఈవిడకి చదువు చెప్పిన గురువు ఈవిడ తెలివితేటలకి మురిసి – “సరససాహిత్యద వరదేవత” (Goddess of exquisite poetry) అన్న బిరుదు ఇచ్చారట. తేజస్విని నిరంజన ఆంగ్లానువాదం చేసిన ఒక కన్నడ కవిత జత చేశారు ఈ పరిచయంతో – అందులో “Wasn’t it a woman who bore then? wasn’t it a woman who raised them? Then why do they always blame woman?…” అంటూ Song of a married woman లో రాసారు.

15. Muddupalani (1730-1790): తంజావూరు నాయకరాజు ప్రతాపసింహుడి కొలువులో భాగమైన ముద్దుపళని రాసిన “రాధికా సాంత్వనం” పుస్తకం ఆ కాలంలో ఎటువంటి వివాదమూ రేపకపోయినా, తరువాతి కాలంలో దీర్ఘకాల నిషేదానికి గురయింది (కొంచెం వివరం ఇక్కడ). ఈ పుస్తకాన్ని గురించి బెంగళూరు నాగరత్నమ్మ రాసిన అభిప్రాయాలు ఈ వ్యాసంలో “బెంగళూరు నాగరత్నమ్మ – రాధికాసాంత్వనం” అన్న సెక్షన్ లో చదవవచ్చు. ఆ పుస్తకాన్ని ప్రచురిస్తూ రాసిన ముందుమాటను ఇక్కడ చదవవచ్చు.

16. Mahlaqa Bai Chanda (1767-1824): నిజాం రాజుల కొలువులో ఉంటూ, గాయనిగా, కవయిత్రిగా పేరు తెచ్చుకున్న tawaif ఈవిడ. (“Etymologically, tawaif is the plural of the Arabic word taifa, meaning group. But the word tawaif as a singular in Urdu is the term for a prostitute.” – అని వివరణ ఉంది పుస్తకంలో.) ఈవిడ రాసిన గజల్ కవితలు మరణానంతరం Gulzar-e-Mahlaqa అన్న పేరుతో ప్రచురితమయ్యాయి. ఈవిడ ఉర్దూ లో కవిత్వం చెప్పిన మొదటి మహిళ అని కొందరు విమర్శకుల అభిప్రాయం.

17) Tarigonda Vemkamamba (1800-1866): యక్షగాన పద్ధతిలో ఎన్నో పాటలు రాసిన కవయిత్రి. తన కాలంలో ప్రసిద్ధి చెందినా ప్రస్తుత కాలంలో అంత సాహితీ చర్చకు నోచుకోని రచయిత్రి అని సంపాదకుల అభిప్రాయం. మీనా కథానాయికగా ఈవిడపై ఒక తెలుగు సినిమా కూడా వచ్చిందని అప్పట్లో పత్రికల్లో చదివాను. ఈవిడ గురించి నిడదవోలు మాలతి గారి బ్లాగులో రాసిన పరిచయ వ్యాసాలు ఇక్కడ మరియు ఇక్కడ చదవవచ్చు. కొన్నాళ్ళ క్రితం టీ.టీ.డీ వారి దుకాణాంలో ఈవిడ జీవితాన్ని గురించిన ఒక పుస్తకం కూడా చూశాను కానీ, ప్రస్తుతానికి వివరాలు గుర్తులేవు. అదింకా మార్కెట్లో ఉందని మాత్రం చెప్పగలను.

ఇవికాక, వివిధ అంశాలపై వివిధ భారతీయ భాషల్లో స్త్రీల మధ్య ప్రాచుర్యంలో ఉన్న జానపద గీతాల ఆంగ్లానువాదాలు కూడా పొందుపరిచారు పుస్తకంలో. వీటి రచయిత/త్రు లెవరో మనకి తెలియదు కానీ, ఇతివృత్తాలలో మాత్రం చాలా వైవిధ్యం ఉందనిపించింది. ఇక్కడితో – Literature of the ancient and medieval periods ముగిసి Literature of the reform and nationalist movements మొదలైంది. ఆ కాలపు రచయిత్రుల గురించి రాబోయే టపాలలో!

Advertisements
Published in: on September 11, 2012 at 7:00 am  Leave a Comment  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/09/11/women-writing-in-india-volume-1-2/trackback/

RSS feed for comments on this post.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: