సత్యజిత్ రాయ్ పై నండూరి

నండూరి రామమోహనరావు గారి సంపాదకీయ వ్యాసాలలో సత్యజిత్ రాయ్ మరణ సందర్భంగా రాసిన వ్యాసం ఒకటి నాకెంతో ఇష్టం. ఎందుకు? అంటే ప్రత్యేకంగా ఇదీ అని కారణం చెప్పలేము. “ఆహా, ఓహో” అనినట్లు ఉండదు. ఆయనలోని బహుముఖ ప్రజ్ఞకు పెద్ద పీట వేసినట్లు ఉంటుంది. అలాగే, అన్నింటికంటే ముఖ్యంగా, సత్యజిత్ రాయ్ గురించి (కనీసం నేను విన్న, ఇపుడు నా దృష్టిలో హాస్యాస్పదం అయిన) ఒక విమర్శకు ఇది సమాధానం చెబుతుంది. 🙂

నాలుగైదేళ్ళ క్రితం, ఒకళ్ళ ఇంట్లో ఉన్నాను. అప్పుడప్పుడే నాకు సత్యజిత్ రాయ్ పుస్తకాలు కొంచెం తరుచుగా దొరకడం, నేను చదవడం, అభిమానిని కావడం మొదలైంది. ఆ ఫలానా వారు ఏదో అడిగితే మాటల సందర్భంలో ఇలాగ నేను సత్యజిత్ కథలు చదువుతున్నా అని, నాకు నచ్చుతున్నాయి అనీ అన్నాను. దానికి వారు – “వాడు (అవును, అలాగే అన్నారు) అంటే నాకు అలర్జీ. దేశం లో ఉన్న దరిద్రాన్ని చూపించి పేరు తెచ్చుకున్నాడు” అన్నారు. (సరిగ్గా ఇదే డైలాగు కాదు కానీ, ఇలాంటిది). నాకు ఏమి చెప్పాలో తోచింది కాదు. నిజంగా అప్పటికి నేను “పథేర్ పాంచాలి” తప్పితే మరే సినిమా చూడలేదు. నాకు సినిమా ఎంత నచ్చినా, చాలా జీవంతో కూడి కనిపించినా, అందులో దరిద్రమే కాకుండా ఇంకా చాలా అంశాలు కూడా ఉన్నట్లు తోచినా (ఉదా, దుర్గ-అపు ల మధ్య ఆటపాటలు పుస్తకం గా చదివినప్పుడు ఎన్ని సార్లు చదువుకుని తరించానో!): అప్పటికి ఇంకా (ఇప్పటికంటే) చిన్న వయసు, ఆయనకు దాదాపు నా తండ్రి వయసు; పైగా నిజంగానే రాయ్ సినిమాలు నేను చూడలేదు- కనుక ఏమీ జవాబు చెప్పలేక పోయాను. కానీ, తరువాత ఇతర రాయ్ సినిమాలు చూస్తున్నప్పుడు – “అదేమిటి, ఆయన అలా అన్నాడు? ఈ సినిమాలు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఎంత వైవిధ్యంతో ఉన్నాయి? పైగా రాయ్ తన సినిమాలు చాలా వాటికి సంగీతం కూడా తానే కూర్చుకుంటారు. కొన్నింటిలో గానం కూడా చేసారు (అగంతుక్ లో ఉత్పల్ దత్ కు ఈయనే పాడారని విన్నాను.). ఇవి అటు పెడితే, మంచి రచయితా, చిత్రకారుడు, పత్రికా సంపాదకుడు, అనువాదకుడు, విమర్శకుడు గట్రా గట్రా. ఇంత మేధావి రాయ్ ని పట్టుకుని దేశంలో దారిద్ర్యాన్ని చూపి పేరు తెచ్చుకున్నాడు అంటాడా!” అనేసి మనసు రగిలిపోయింది. (ఇది “భానుమతి ఎన్టీఆర్, ఎఎన్నార్ లను పట్టుకుని ఏకవచనంలో సంబోధిస్తుంది. అంత పొగరుబోతుల రచనలు చదవాల్సిన ఆగత్యం నాకు లేదు” అని ఇదివరలో అన్న మరో మేధావి స్నేహితుడి వాదం లాగానే ఉంది నాకు.).

కొన్నాళ్ళ క్రితం నండూరి వారి సంపాదకీయాలలో రాయ్ మరణ సందర్భంలో వచ్చిన సంపాదకీయంలో చదివిన ఈ చివరి పేరా ఎట్టకేలకు ఇలాంటి తరహా విమర్శకు సమాధానం చెప్పింది నాకు:

“చివరగా ఒక మాట. ప్రపంచమంతా జేజేలు పలికింది కానీ, భారతీయ చలనచిత్ర ప్రముఖులు మాత్రం ఆయనను సరిగా అర్థం చేసుకొనకపోవడం దురదృష్టం. భారతీయ దారిద్ర్యాన్ని తన చిత్రాలలో ప్రదర్శించి పాశ్చాత్యుల ప్రశంసలు సంపాదించుకున్న వాడిగా ఆయనను కొందరు పరిగణించడం వారి మేధా దారిద్ర్యానికి చిహ్నం. తానూ కళాఖండాలు తీస్తున్నానని ఆయన ఎన్నడూ అనుకోలేదు. అందరూ చూసి ఆనందించే చిత్రాలు తీయడమే తన ధ్యేయమని, వ్యాపార విజయ దృక్పథం ఉన్నంత మాత్రాన కళామూల్యాలు లోపించనక్కరలేదని ఆయన విశ్వాసం. ఆ మాటకు వస్తే తనకు స్పూర్తి ఇచ్చిన వారిలో అమెరికన్ డాక్యుమెంటరీ చిత్ర నిర్మాత రాబర్ట్ ఫ్లాహేర్టీ, సోవియట్ దర్శకుడు అలెక్జాండర్ డోవ్జెంకో లతో పాటు ఎందఱో హాలీవుడ్ దర్శకులు కూడా వున్నారనేవాడు రాయ్. సత్యజిత్ రాయ్ భారతీయ సృజనాత్మకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు. నేడు ఆయన లేడు. ఆయన చిత్రాలు ఉన్నాయి. ఆయన ప్రతిభ ఉంది.”
-April 25, 1992.

Advertisements
Published in: on August 31, 2012 at 6:00 am  Comments (8)  

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/08/31/satyajitray/trackback/

RSS feed for comments on this post.

8 CommentsLeave a comment

 1. An extraordinary man like Satyajit Ray is always above common man thinking and critics. We must feel proud of having such directors in our country and I personally feel that Art has no limitations on subjects.

  • Of course Ray did not purposely showed poverty in India. But Apu trilogy was based on a novel which depicted real condition of a poor family .Foreigners had an idea that India was a very poor and backward country.Probably Ray’s film strengthened that idea.But Satyajit Ray also produced children’s films and detective stories besides realistic stories.We should also note that great directors like
   Charlie chaplin and Vittoria de sica depicted poverty and misery in
   U.S.A. and Italy.No doubt Ray was one of the greatest directors of
   movies.
   Reg.Bhanumati ;she was senior to A.N.R. and N.T.R. in film world.Probably that was the reason she addressed them in singular.

 2. Sowmya Garu! Good one. Particularly, Bhanumati matter. There are audians, readers looking at the cast these days, but not for the real stuff of the book or movie. Where can I read the entire article of Sri Nanduri? Thank you.
  Raja. gksraja.blogspot.com

  • >>Where can I read the entire article of Sri Nanduri?
   -The entire book is freely available on DLI here.

 3. @Sowmya ok…

 4. నేను కూడా మీలాగానే సత్యజిత్ రే గురించి విన్నాను కాని అప్పుడే ఊ హ తెలిసి , సినిమా , ప్రపంచం అర్ధమవుతున్న రోజుల్లోనే భారతీయ సినిమాల్లో మణి పూసలనదగిన క్లాసికల్ సినిమాలు DD1 లో చూసినందున, అసలు ,నకిలీల తేడా బాగా తెలిసింది

  ________________________________

 5. రే సినిమాలు ఒకటి రెండు చూసే సాహసం చేశాను కానీ నా వల్ల కాలేదు. కానీ అతని కథలు నాకు బాగా నచ్చాయి. ఫతిక్ చంద్ నవల కూడా బాగా నచ్చింది. ఆ నవలలో ప్రకాశవంతమైన అంతర్ముఖీనత్వం ఫీల్ అయ్యను నేను.

 6. మరి మీరే సినిమాలు చూడ ప్రయత్నించారో! నేను చూసినవన్నీ దాదాపుగా నచ్చాయి నాకు – ఒకట్రెండు మినహాయిస్తే!


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: