డాటర్స్ ఆఫ్ మహారాష్ట్ర-7 (Last)

(మిగితా భాగాలు ఇక్కడ చూడవచ్చు)
******

61) Ujjwala Patil-Dhar (1955): ఈవిడ కథ చదివితే కలిగిన మొదటి భావన – “సాహసి!” అని. రైఫిల్ షూటింగ్ సాధన చేశారు. ఒలింపిక్స్ కి కూడా ఎంపికయ్యారు. ఇంతలో, sailiMg వైపు ఆకర్షితులయ్యారు. వివిధ సంఉద్రాల్లో ప్రయాణం చేస్తూ, ప్రయోగాలు చేస్తూ ఒకసారి చావు తప్పించుకున్నారు. Navigation, Sailing లను శాస్త్రీయంగా అభ్యసించారు. ప్రపంచం చుట్టి వచ్చారు sail boaTలో. పద్మశ్రీ అవార్డు గ్రహీత. మనిషి ఫొటో చూస్తే మాత్రం మామూలు మధ్య తరగతి గృహిణిలా అనిపిస్తారు – ఇదంతా చేశారంటే ఆశ్చర్యంగా అనిపించింది 🙂

62) Yamunabai Waikar (circa 1915): Lavni, Tamasha అన్న సంగీత-నృత్య కళల ప్రదర్శనలో చాలా పేరు సంపాదించారు. ఆడవాళ్ళు అడుక్కుతిని, తాగుబోతు మగవాళ్ళని పోషించే సంప్రదాయం గల కుటుంబం నుండి వచ్చి, సంగీత నాటక అకాడెమీ అవార్డూ, పదమశ్రీ అందుకునే దాకా ఎదిగారు!

63) Sharadini Dahanukar (1945): అలోపతి, ఆయుర్వేదం రెండింటినీ క్షుణ్ణంగా అభ్యసించి రెంటిని ఎలా కలపవచ్చో పరిశోధనలు చేశారు. ఆయుర్వేదం గురించి అవగాహన కలిగించేందుకు కృషి చేశారు. “My family do not laud me at breakfast everyday, but none resists or objects to my hoeing my own furrow” అంటారు 🙂

64) Gangutai Patwardhan (1900): “For the 97 years, Gangutai has lived life off the beaten track” అని మొదలైంది ఏడిటర్ల పరిచయం. గంగుతాయ్ కథ చదివాక, వాళ్ళన్న వాక్యం అక్షర సత్యం అనిపించింది. ఆకాలంలోనే బాగా చదువుకుని, తన కోర్కెలను అంగీకరించిన మనిషినే పెళ్ళిచేసుకున్నారు. తర్వాత కొన్నాళ్ళు విదేశాల్లో చదువుకుని వచ్చి, బరోడా మహిళా ట్రెయినింగ్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఉన్నారు.

65) Kanchan Sontakke (1948): నృత్య నాటకాలను వికలాంగుల సమస్యలను తీర్చేందుకు therapy లాగా రూపొందించడంలో పేరు పొందారు.

66) Navjot Altaf (1949): ప్రముఖ చిత్రకారిణి, శిల్పి. దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఫెమినిస్టు ఉద్యమంలో కూడా పాల్గొన్నారు.

67) Rohini Bhate (1924): ప్రముఖ నృత్య కళాకారిణి. ఈవిడ కథ చదువుతూ ఉంటే నృత్యమంటే ఎంత ప్రేమో కదా ఈవిడకి! అనిపించింది. నృత్యభారతి సంస్థను కథక్ శిక్షణ ఇస్తున్నారు ఈ పుస్తకం వచ్చేనాటికి.

68) Nalini Ladhake (1922): సంచార గిరిజన కుటుంబంలో పుట్టిన నళిని కొంచెం చదువుకుని మొదట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా మొదలుపెట్టి తరువాత చాన్నాళ్ళకి పై చదువులు చదువుకున్నారు. అంబేద్కర్ ప్రభావంలో చాలాకాలం సామాజిక కార్యకర్తగా పని చేశారు.

69) Durga Bhagawat (1910): “I was born with a frown, so was named Durga after tha angry Goddess” అంటూ తన కథ చెప్పిన దుర్గ వివిధ రంగాల్లో నిష్ణాతురాలు. సంస్కృత సాహిత్యం నుండీ వంటల ప్రయోగాల దాకా వివిధ రంగాల్లో విస్తృత పరిశోధనలు చేశారు. జానపద సాహిత్యం గురించి కూడా చాలా అధ్యయనం చేశారు. పుస్తకాలు రాసారు. అసలు ఆవిడ తన మాటల్లో చెప్పుకున్న కథ చదువుతూ ఉంటేనే తెలుస్తోంది ఆవిడలో ఎంత ఉత్సాహం ప్రవహిస్తోందో!


70) Shabana Azmi (1951):
ప్రముఖ నటి. నటనలోనే కాక సామాజిక సమస్యల గురించి కూడా పనిచేశారు.

71) Manaswini Lata Ravindra (1982): మరాఠీ సాహిత్య సమ్మేళణ్ లో కవిత చదివిన అతి పిన్న వయస్కురాలు. మూడేళ్ళ వయసునుండే కవిత్వం మొదలుపెట్టిందట. ఈ పుస్తకం వచ్చే నాటికి ఇంకా స్కూల్లో చదువుకుంటోంది ఈ అమ్మాయి!

…. అదండీ ఈ పుస్తకం సంగతి. ఈ సిరీస్ ఇక్కడితో ముగిసింది. Women writing in India: From 600 B.C. to Present” అని సుసీ తారు, కె.లలిత ల సంపాదకత్వంలో వచ్చిన పుస్తకం మొదలుపెట్టాలని ప్రస్తుతం ప్లాను. (వీళ్ళిద్దరి గురించి, ఆ పుస్తకం గురించి మొదట మహిళావరణంలో చదివాను.) చూడాలి కుదురుతుందో లేదొ!

Advertisements
Published in: on August 23, 2012 at 7:00 am  Comments (3)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/08/23/daughtersofmaharashtra-7/trackback/

RSS feed for comments on this post.

3 CommentsLeave a comment

  1. Very informative. Keep up the good work.

  2. చాలా ఓపిగ్గా వ్రాశారు. ధన్యవాదాలండీ.

  3. @Chatakam, జ్యోతిర్మయి : 🙂 Thanks.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: