డాటర్స్ ఆఫ్ మహారాష్ట్ర-6

(మిగితా భాగాలు ఇక్కడ చూడవచ్చు)
******

51) Sai Paranjapye : ప్రముఖ సినీ, నాటక దర్శకురాలు. Katha, Sparsh, Chashmebaddur, Saaz వంటి హిందీ చిత్రాలు తీశారు. ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. తన కుటుంబ నేపథ్యం, దర్శకత్వం పై ఆసక్తి కలగడం గురించి చెప్పిన అనుభవాలు ఆసక్తికరంగా అనిపించాయి.

52) Jyoti Mhapsekar (1949): ప్రముఖ ఫెమినిస్టు నాటక రచయిత. Mulgi Jhali Ho! (A Daughter is Born) అన్న వీరి నాటకం వివిధ భారతీయ భాషల్లోకి అనువాదమై ఎన్నోసార్లు ప్రదర్శించబడింది. మహిళా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఈవిడ తన అనుభవాలు రాస్తున్నప్పుడు ఇంతవరకూ ఈ పుస్తకంలో చదివిన చాలా పేర్లు అక్కడ కనబడ్డాయి 🙂 ప్రపంచం చిన్నది కాబోలు అనుకున్నా.

53) Sucheta Chapekar (1948): “My life is enriched by dance and my dance by my life and thought” అని చెప్పే సుచేత మహారాష్ట్రలో ప్రముఖ భరత నాట్య కళాకారుల్లో ఒకరు. భరతనాట్యాన్ని మారాఠీ సంగీత నాటకాల్లోకి ప్రవేశపెట్టారు. అలాగే, భరత నాట్యాన్ని హిందుస్తానీ సంగీతంతో కలిపి పరిశోధనలు చేశారు.

54) Mrinal Gore (1928): రాజకీయ, సామాజిక నాయకురాలు. వివిధ సామాజికాంశాలపై జనాల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేశారు. అసెంబ్లీకి ఎన్నికైన రోజుల్లో Anti Inflation Commission అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. Hazare, Khairnar etc stand against corruption, but dissociated from politics. It is not possible to fight this plague eating society, politics, adminstration from outside political process. అన్న వాక్యం చూసినప్పుడు ఇప్పటి వార్తలు గుర్తొచ్చాయి…

55) Prabha Kulkarni (1943): ప్రముఖ వ్యాపారవేత్త. కుల్కర్నీ ఇంజినీరింగ్ పరిశ్రమల నిర్వాహకులలో ఒకరు. Many colleagues here feel that I side with workers. In manufacturing, mutual trust between management and workers is crucial. I respect this relationship and am proud that in my foundry, there isn’t any labour union”. అని చెప్పారు తన అనుభవాలు రాస్తూ.

56) Rupali Repale (1982):
ఈ పుస్తకంలో రాసిన వారిలో అందరికంటే చిన్నవాళ్ళైన ఇద్దరిలో ఒకరు. ఇది రాసేనాటికి ఈవిడ వయస్సు కేవలం పదిహేనేళ్ళే. అప్పటికే ఒక స్విమ్మర్గా వివిధ రికార్డులు సొంతం చేసుకున్నారు. ఇంగ్లీష్ చానెల్ ఈదిన అతి పిన్న వయస్కుల్లో రెండో అమ్మాయి గా పేరు తెచ్చుకుంది. పుస్తకం వచ్చే నాటికి ఒలింపిక్స్ లో పాల్గొనాలని, స్పాన్సర్ల ఇబ్బంది ఎదుర్కుంటోంది (చాన్నాళ్ళ క్రితం ఇలాంటి ఇబ్బందుల మధ్యే అప్పటి sensation కుట్రలీశ్వరన్ స్విమ్మింగ్ మానేసి చదువుల్లో పడి తర్వాత ఎం.ఎస్. చేసి సెటిల్ అయిపోవడం గుర్తొచ్చింది.)

57) Saudamini Deshmukh (1952): మన దేశంలో Jet Engine Propelled Aircraft నడిపిన తొలి మహిళా పైలట్. అలాగే, ఎయిర్బస్ A320 నడిపిన తొలి ఆసియా మహిళ.

58) Sheela Barse (1940): ప్రముఖ జర్నలిస్టు, ఆక్టివిస్టు. పిల్లల కోసం గల చట్టాల గురించి రాసిన రచనలకు అవార్డులు అందుకున్నారు. “A Woman’s right and liberty are important, but when woman becomes mother, doesn’t her child have rights?” అని ఆవిడ అడగ్గానే “కెవ్వ్” అని కేకపెట్టింది మనసు 🙂

59) Shanta Dani (1918): అంబేద్కర్ ప్రభావంలో మహారాష్ట్ర దళిత ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. రాజకీయ నాయకురాలు. ఎన్నో సంస్థల నిర్వహణలో కూడా చురుగ్గా పాల్గొన్నారు.

60) Suma Chitnis (1933): ప్రముఖ విద్యావేత్త. Educational Sociology లో చేసిన పరిశోధనలకు పేరుపొందారు.

…మిగిలిన 11 మంది గురించి వచ్చే టపాలో.

Advertisements
Published in: on August 22, 2012 at 8:30 am  Comments (2)  
Tags: ,

The URI to TrackBack this entry is: https://vbsowmya.wordpress.com/2012/08/22/daughtersofmaharashtra-6/trackback/

RSS feed for comments on this post.

2 CommentsLeave a comment

  1. Nice introduction of famous women. Don’t we have similar — women of Andhrapradesh or Telugu velugula Vanitalu. Even not available, you can gather and compile about them. We await.
    Raja.

  2. @gksraja: Volga, Vasantha Kannabhiran and Kalpana Kannabhiran compiled such a book, inspired by this book. Its called “Mahilavaranam”. I wrote a running-commentary like this on that book too, around last month. See the list here: https://vbsowmya.wordpress.com/tag/mahilavaranam/


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: